నేటి రాశి ఫలాలు జూన్ 28, 2025: ఈ రాశి వారు ఆర్భాటాలకు విపరీతంగా ఖర్చు చేస్తారు.. పనులు, బాధ్యతలు స్వయంగా చూసుకోవాలి!-today rasi phalalu june 28th 2025 mesha rasi to meena rasi check horoscope ,రాశి ఫలాలు న్యూస్
తెలుగు న్యూస్  /  రాశి ఫలాలు  /  నేటి రాశి ఫలాలు జూన్ 28, 2025: ఈ రాశి వారు ఆర్భాటాలకు విపరీతంగా ఖర్చు చేస్తారు.. పనులు, బాధ్యతలు స్వయంగా చూసుకోవాలి!

నేటి రాశి ఫలాలు జూన్ 28, 2025: ఈ రాశి వారు ఆర్భాటాలకు విపరీతంగా ఖర్చు చేస్తారు.. పనులు, బాధ్యతలు స్వయంగా చూసుకోవాలి!

HT Telugu Desk HT Telugu

నేటి రాశి ఫలాలు (దిన ఫలాలు) తేదీ 28.06.2025 శనివారం కోసం పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ అందించారు. మేష రాశి నుంచి మీన రాశి వరకు 12 రాశుల దిన ఫలాలు ఇక్కడ తెలుసుకోండి.

నేటి రాశి ఫలాలు

హిందుస్తాన్ టైమ్స్

రాశిఫలాలు (దిన ఫలాలు) : 28.06.2025

ఆయనము: ఉత్తరాయనం, సంవత్సరం: శ్రీ విశ్వావసునామ

మాసం: ఆషాడ, వారం : శనివారం, తిథి : శు. తదియ, నక్షత్రం : పుష్యమి

మేష రాశి

మేష రాశి వారు సంతోషకరమైన వార్త వింటారు. అన్నివిధాలా ప్రోత్సాహకరం. అవకాశాలను అందిపుచ్చుకుంటారు. మీ చిత్తశుద్ధి ప్రశంసనీయమవుతుంది. ఆర్భాటాలకు ఖర్చు చేస్తారు. అర్దాంతరంగా ముగించిన పనులు పూర్తి చేస్తారు. అప్రమత్తంగా ఉండాలి. ఆంతరంగిక విషయాలు వెల్లడించవద్దు. అందరితోనూ మితంగా సంభాషించండి. కొత్త పరిచయాలు ఏర్పడతాయి. పిల్లల విద్యాయత్నం ఫలిస్తుంది. శుభకార్యానికి హాజరవుతారు.

వృషభ రాశి

వృషభ రాశి వారు ప్రతికూలతలను ధైర్యంగా ఎదుర్కొంటారు. మీపై వచ్చిన అభియోగాలు తొలగిపోగలవు. మీ వ్యక్తిత్వమే మిమ్ములను కాపాడుతుంది. కొత్త పనులు చేపడతారు. ఖర్చులు విపరీతం. అవసరాలు వాయిదా వేసుకుంటారు. చెల్లింపుల్లో జాప్యం తగదు. బాధ్యతలు స్వయంగా చూసుకోండి. లావాదేవీలతో తీరిక ఉండదు. ఆకాలభోజనం, విశ్రాంతి లోపం. కొన్ని ఇబ్బందుల నుంచి బయటపడతారు. ఎవరినీ అతిగా నమ్మవద్దు.

మిధున రాశి

మిధున రాశి వారు లావాదేవీల్లో అప్రమత్తంగా ఉండాలి. తొందరపాటు నిర్ణయం తగదు. పెద్దలను సంప్రదించండి. మీదైన రంగంలో ఒత్తిడికి గురికావద్దు. మనస్సుకు నచ్చిన వారితో కాలక్షేపం చేయండి. ఆదాయం బాగున్నా సంతృప్తి ఉండదు. ఖర్చులు అధికం. నగదు డ్రా చేసేటపుడు జాగ్రత్త. ప్రతీ విషయం క్షుణ్ణంగా పరిశీలించుకోండి. పనులు మొక్కుబడిగా పూర్తిచేస్తారు. మీ అలక్ష్యం సమస్యకు దారితీస్తుంది.

కర్కాటక రాశి

మీ ఓర్పు, నేర్పులకు పరీక్షాసమయం. కార్యసాధనకు మరింత శ్రమించాలి. అనుమానాలు, అపోహలకు తావివ్వవద్దు. మీ కృషి నిదానంగా ఫలిస్తుంది. చేపట్టిన పనుల్లో ఒత్తిడి, చికాకులు అధికం. పొదుపునకు అవకాశం లేదు. అందరితోనూ మితంగా సంభాషించండి. మీ మాటలు జారవేసే వ్యక్తులున్నారని గమనించండి. మీ పిల్లల భవిష్యత్తుపై దృష్టిపెడతారు. ఆత్మీయుల ఆహ్వానం అందుకుంటారు.

సింహ రాశి

సింహ రాశి వారికి గ్రహాల సంచారం అనుకూలంగా ఉంది. లక్ష్యం సాధిస్తారు. ఏకాగ్రత తగ్గకుండా శ్రమించండి. యత్నాలను సన్నిహితులు ప్రోత్సహిస్తారు. పనులు అనుకున్న విధంగా పూర్తి చేస్తారు. రుణ విముక్తులై తాకట్టు విడిపించుకుంటారు. లావాదేవీల్లో అప్రమత్తంగా ఉండాలి. ఒత్తిళ్లకు గురికావద్దు. ఆరోగ్యం జాగ్రత్త. ప్రముఖులతో సంప్రదింపులు జరుపుతారు. ఆందోళన కలిగించిన సమస్య సద్దుమణుగుతుంది.

కన్య రాశి

కన్య రాశి వారు వ్యవహారాల్లో ఆచితూచి అడుగేయండి. అనాలోచిత నిర్ణయాలు తగవు. పెద్దల సలహా పాటించండి. భేషజాలకు పోవద్దు. చేపట్టిన పనుల్లో శ్రమ, చికాకులు అధికం. నగదు చెల్లింపుల్లో జాగ్రత్త. ప్రతీ విషయం క్షుణ్ణంగా పరిశీలించుకోండి. అనవసర జోక్యం తగదు. కొత్త యత్నాలు మొదలెడతారు. మీ కృషి నిదానంగా ఫలిస్తుంది. మీ చొరవతో ఒకరికి మేలు జరుగుతుంది. కొత్త పరిచయాలు ఏర్పడతాయి.

తుల రాశి

తుల రాశి వారు కార్యసాధనలో సఫలీకృతులు అవుతారు. దూరపు బంధుత్వాలు బలపడతాయి. ఖర్చులు అధికం, ప్రయోజనకరం. ఆప్తులకు సాయం చేస్తారు. తలపెట్టిన పనుల్లో శ్రమ పెరగకుండా చూసుకోండి. బాధ్యతలు అప్పగించవద్దు. కొత్త వ్యక్తులతో మితంగా సంభాషించండి. మీ నుంచి విషయసేకరణకు కొందరు యత్నిస్తారు. ఆర్థిక వివరాలు గోప్యంగా ఉంచండి. ముఖ్యమైన పత్రాలు అందుకుంటారు.

వృశ్చిక రాశి

వృశ్చిక రాశి వారు లక్ష్య సాధనకు మరింత శ్రమించాలి. ఇబ్బందులు ఎదురైనా యత్నాలు సాగించండి. మనోదైర్యంతో శ్రమిస్తే విజయం తథ్యం. ఆపత్సమయంలో ఆప్తులు ఆదుకుంటారు. వృథా ఖర్చులు తగ్గించుకుంటారు. కీలక వ్యవహారాల్లో అప్రమత్తంగా ఉండాలి. మీ అభిప్రాయాలను స్పష్టంగా తెలియజేయండి. మొహమాటాలు, భేషజాలకు పోవద్దు. మీరు తీసుకునే నిర్ణయంపైనే పిల్లల భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది.

ధనుస్సు రాశి

ధనుస్సు రాశి వారు ఆచితూచి అడుగేయాల్సిన సమయం. సావకాశంగా ఆలోచించి నిర్ణయం తీసుకోండి. ఆటంకాలు ఎదురైనా యత్నాలు విరమించుకోవద్దు. మీ కృషి త్వరలో ఫలిస్తుంది. ధన సహాయం అర్థించేందుకు మనస్కరించదు. అవసరాలు ఏదో విధంగా నెరవేరుతాయి. ఆత్మీయులతో తరచుగా సంభాషిస్తారు. ఒక సమాచారం ఉత్తేజపరుస్తుంది. ముఖ్యమైన పత్రాలు సమయానికి కనిపించవు. చిన్న విషయానికే చికాకుపడతారు.

మకర రాశి

మకర రాశి వారు సమయస్పూర్తితో వ్యవహరిస్తారు. రుణ సమస్య పరిష్కారమవుతుంది. మానసికంగా కుదుటపడతారు. ఆటుపోట్లు ఎదురైనా లక్ష్యం సాధిస్తారు. పనులు, బాధ్యతలు స్వయంగా చూసుకోండి. ఇతరుల విషయాల్లో జోక్యం తగదు. అందరితోనూ మితంగా సంభాషించండి. మీ వ్యాఖ్యలను కొందరు వక్రీకరిస్తారు. ఏ విషయాన్నీ పెద్దగా పట్టించుకోవద్దు. ఆర్భాటాలకు విపరీతంగా ఖర్చు చేస్తారు.

కుంభ రాశి

కుంభ రాశి వారికి విశేష ఫలితాలున్నాయి. పరిచయస్తుల వ్యాఖ్యలు ఉత్సాహపరుస్తాయి. మనోదైర్యంతో యత్నాలు సాగిస్తారు. మీ కష్టం వృథా కాదు. కొంత మొత్తం పొదుపు చేస్తారు. చేసిన పనులే చేయవలసి వస్తుంది. పిల్లల మొండితనం అసహనం కలిగిస్తుంది. సామరస్యంగా మెలగండి. చిన్ననాటి పరిచయస్తులను కలుసుకుంటారు. వివాహయత్నం ఫలిస్తుంది. గృహ మరమ్మతులు చేపడతారు. పత్రాల్లో సవరణలు అనుకూలిస్తాయి.

మీన రాశి

అవిశ్రాంతంగా శ్రమిస్తారు. మీ కష్టం ఫలిస్తుంది. స్థిరాస్తి ధనం అందుతుంది. ప్రణాళికలు వేసుకుంటారు. అంచనాలు ఫలిస్తాయి. సకాలంలో పనులు పూర్తి చేస్తారు. ఆహ్వానం అందుకుంటారు. దూరపు బంధుత్వాలు బలపడతాయి. ఆలోచనల్లో మార్పు వస్తుంది. ధైర్యంగా అడుగు ముందుకు వేస్తారు. ముఖ్యమైన పత్రాలు అందుకుంటారు. మీ ప్రతిపాదనలకు ఆమోదం లభిస్తుంది. శుభకార్యానికి హాజరవుతారు.

పంచాంగ కర్త: బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ -9494981000

పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ
పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ

హెచ్ టీ తెలుగు డెస్క్ టీమ్ సుశిక్షితులైన, సుదీర్ఘ అనుభవం ఉన్న జర్నలిస్టులతో కూడిన బృందం. ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు సహా అన్ని విభాగాలకు ఆయా రంగాల వార్తలు అందించడంలో నైపుణ్యం కలిగిన సబ్ ఎడిటర్లతో కూడిన బృందం. జర్నలిజం విలువలను, ప్రమాణాలను కాపాడుతూ జర్నలిజంపై అత్యంత మక్కువతో పనిచేస్తున్న బృందం. సంపూర్ణ వార్తావిలువలతో కూడిన కథనాలను పాఠకుల ముందుకు తెస్తున్న బృందం.