హిందుస్తాన్ టైమ్స్
రాశిఫలాలు (దిన ఫలాలు) : 24.06.2025
ఆయనము: ఉత్తరాయనం, సంవత్సరం: శ్రీ విశ్వావసునామ
మాసం: జ్యేష్ఠ, వారం : మంగళవారం, తిథి : కృ. చతుర్దశి, నక్షత్రం : రోహిణి
మేష రాశి వారు ప్రారంభించిన కార్యాలు సకాలంలో పూర్తవుతాయి. పెట్టుబడుల కోసం చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి. వృత్తి, వ్యాపారాలు అనుకూలంగా ఉంటాయి. స్థిర, చరాస్తుల మూలంగా ఆదాయం కలుగుతుంది. వ్యాపార భాగస్వాములతో అవగాహన ఉంటుంది. రోజువారీ కార్యకలాపాలు నిరాటంకంగా సాగుతాయి. వివాహాది శుభకార్య ప్రయత్నాలు ఫలిస్తాయి. వృథా ఖర్చులు ఉండవచ్చు. ఆరోగ్యంగా ఉంటారు. సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన శుభప్రదం.
వృషభ రాశి వారికి స్నేహితుల సహకారం లభిస్తుంది. శుభకార్య ప్రయత్నాలు విజయవంతం అవుతాయి. ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటారు. కొత్త వ్యక్తులతో జాగ్రత్త అవసరం. వివాదాలకు దూరంగా ఉండాలి. ఆదాయ మార్గాలపై మనసు నిలపడం అవసరం. ఉద్యోగులకు మంచి సమయం. పట్టుదలతో బాధ్యతలు నిర్వర్తిస్తారు. అధికారులతో స్నేహంగా ఉంటారు. కుటుంబ సభ్యుల సలహాలు పాటించండి. గణపతి ఆలయాన్ని సందర్శించండి.
మిథున రాశి విద్యార్థులకు అనుకూలం. ఉద్యోగులకు సంతృప్తికరంగా ఉంటుంది. అధికారుల ఆదరణ లభిస్తుంది. నిర్మాణాది కార్యక్రమాలలో పురోగతి ఉంటుంది. సాంస్కృతిక కార్యక్రమాలకు హాజరవుతారు. తలపెట్టిన పనులు అనుకున్న సమయంలో పూర్తవుతాయి. వృత్తి, వ్యాపారాలలో అందరి సహకారం లభిస్తుంది. రావలసిన సొమ్ము చేతికి అందుతుంది. సంతోషంగా ఉంటారు. దుర్గాదేవి స్తోత్రాలు పఠించండి.
కర్కాటక రాశి వారు ప్రారంభించిన పనులు అందరి సహకారంతో ముందుకు సాగుతాయి. ఆరోగ్యంగా ఉంటారు. రావలసిన డబ్బు చేతికి అందుతుంది. ఓపికగా బాధ్యతలు నిర్వర్తిస్తారు. విద్యార్థులకు అనుకూలం. కొత్త దుస్తులు కొనుగోలు చేస్తారు. భూ లావాదేవీలు అనుకూలిస్తాయి. వ్యాపార ఒప్పందాలు లాభసాటిగా ఉంటాయి. ఉత్సాహంతో పనులు చేస్తారు. ఒక శుభవార్త వింటారు. నరసింహ స్వామి ఆరాధన మేలు చేస్తుంది.
సింహ రాశి వారికి పిల్లల చదువు, శుభకార్య ప్రయత్నాలు కలిసివస్తాయి. మంచి సంస్థలలో ఉద్యోగం వచ్చే అవకాశం ఉంది. సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. ఆదాయం స్థిరంగా ఉంటుంది. రావలసిన డబ్బు చేతికి అందుతుంది. వ్యాపార విస్తరణపై మనసు నిలుపుతారు. కష్టానికి తగిన ప్రతిఫలం పొందుతారు. ఉద్యోగులకు పదోన్నతి అవకాశం. రాజకీయ నాయకులకు కార్యకర్తల సహకారం లభిస్తుంది. సూర్యారాధన శుభప్రదం.
వృత్తి, వ్యాపారాలు లాభదాయకంగా కొనసాగుతాయి. న్యాయపరమైన సమస్యలు పరిష్కారం అవుతాయి. బంధుమిత్రుల రాకతో ఖర్చులు పెరుగుతాయి. శుభకార్య ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆరోగ్యంపై దృష్టి పెడతారు. ఇంట్లో అనుకూల వాతావరణం ఉంటుంది. భూములు, వాహనాల కొనుగోలులో జాగ్రత్త వహించాలి. దూర ప్రయాణాలు కొంతవరకు అనుకూలిస్తాయి. ఉద్యోగస్తులకు ఆఫీసులో గుర్తింపు లభిస్తుంది. ఆరోగ్యంగా ఉంటారు. శుభవార్త వింటారు. రామాలయాన్ని సందర్శించండి.
తుల రాశి వారు ప్రారంభించిన పనులు సకాలంలో పూర్తవుతాయి. శుభకార్యాలు చేస్తారు. అందరి సహకారం లభిస్తుంది. నలుగురిలో గుర్తింపు పొందుతారు. స్నేహితులను కలుసుకుంటారు. ఆరోగ్యంపై దృష్టి పెడతారు. దూర ప్రయాణాలు వాయిదా పడతాయి. ఉద్యోగులకు పదోన్నతి అవకాశం. వ్యాపారం లాభసాటిగా కొనసాగుతుంది. రావలసిన డబ్బు అందుతుంది. ఒప్పందాలు అనుకూలిస్తాయి. దుర్గాదేవి ఆలయాన్ని సందర్శించండి.
వృశ్చిక రాశి వారికి ఆర్థిక పరిస్థితి సంతృప్తికరంగా ఉంటుంది. ఆదాయం క్రమేణా పెరుగుతుంది. ఆస్తి తగాదాలు పరిష్కారం అవుతాయి. వ్యాపార ఒప్పందాలు ఫలిస్తాయి. భాగస్వాములతో చర్చించి అనుకూల నిర్ణయాలు తీసుకుంటారు. విద్యార్థులు శ్రమకు తగిన ఫలితాలు పొందుతారు. ఉద్యోగులకు పనిభారం పెరగవచ్చు. పై అధికారులతో స్నేహంగా ఉండటం అవసరం. నలుగురిలో మంచిపేరు సంపాదిస్తారు. ఆంజనేయ స్వామి ఆరాధన మేలు చేస్తుంది.
ధనుస్సు రాశి వారికి ప్రయాణాలు కలిసివస్తాయి. ఆరోగ్యంగా ఉంటూ ఉత్సాహంగా పనులు చేస్తారు. ఉద్యోగ ప్రయత్నాలు కలిసివస్తాయి. వ్యాపారులకు భాగస్వాములతో సత్సంబంధాలు నెలకొంటాయి. మంచి నిర్ణయాలు తీసుకుంటారు. కోర్టు వ్యవహారాలు అనుకూలంగా ఉంటాయి. ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. కొత్త ఒప్పందాల విషయంలో జాగ్రత్త పాటించండి. కష్టానికి తగిన ప్రతిఫలం ఉంటుంది. లక్ష్మీదేవి ఆలయాన్ని సందర్శించండి.
మకర రాశి వారు శుభకార్యాలు చేస్తారు. ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. తలపెట్టిన పనులు పూర్తవుతాయి. ఆధ్యాత్మిక, సాంస్కృతిక కార్యక్రమాలకు హాజరవుతారు. కుటుంబంతో సంతోషంగా కాలం గడుపుతారు. పెద్దల సలహా పాటిస్తారు. బంధుమిత్రులతో పనులు నెరవేరుతాయి. విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. నలుగురిలో గుర్తింపు పొందుతారు. ఆస్తుల విషయంలో సోదరవర్గంతో విభేదాలు రావచ్చు. శివారాధన శుభప్రదం.
కుంభ రాశి వారికి ఈ రోజు తలపెట్టిన ఏ పనీ ముందుకు సాగదు. మీ ప్రవర్తన కారణంగా మిత్రులు శత్రువులుగా మారుతారు. సంయమనం పాటించడం అవసరం. అధికారుల నుంచి ఒత్తిడి అధికం అవుతుంది. మొత్తంగా ఈ రాశి వారికి ఈ రోజు కాస్త ఇబ్బందికరంగానే ఉంటుంది. పరిస్థితులు కొంత సద్దుమణుగుతాయి. కొత్త పరిచయాలతో కార్యసిద్ధి ఉంది. రావలసిన డబ్బు ఆలస్యంగా చేతికి అందుతుంది. వేంకటేశ్వర స్వామి ఆలయాన్ని సందర్శించండి.
రోజువారీ వ్యాపారం లాభసాటిగా కొనసాగుతుంది. పనులు సకాలంలో పూర్తవుతాయి. ప్రయాణాలు అనుకూలిస్తాయి. ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆదాయం పెరుగుతుంది. శుభకార్య ప్రయత్నాలలో పెద్దల సహకారం లభిస్తుంది. పాత మిత్రులను కలుసుకుంటారు. ఉద్యోగులకు పదోన్నతి అవకాశం. ఆరోగ్యంగా ఉంటారు. కోర్టు కేసుల్లో అనుకూల ఫలితాలు ఉంటాయి. సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన మేలు చేస్తుంది.
పంచాంగ కర్త: బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ - 9494981000
టాపిక్