హిందుస్తాన్ టైమ్స్
రాశిఫలాలు (దిన ఫలాలు) : 23.06.2025
ఆయనము: ఉత్తరాయనం, సంవత్సరం: శ్రీ విశ్వావసునామ
మాసం: జ్యేష్ఠ, వారం : సోమవారం, తిథి : కృ. త్రయోదశి, నక్షత్రం : కృత్తిక
మేష రాశి వారికి ఈ రోజు జీవిత భగస్వామి నుండి ఆస్తి లాభం, ధనలాభం పొందుతారు. ఉద్యోగాలలో స్థానచలనం ఉంటుంది. శత్రువులు సమస్యలు సృష్టించినా అధిగమిస్తారు. నిత్యం హనుమాన్ సింధూరం ధరించడం వలన మనోధైర్యం, ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. నూతన మిత్రులు పరిచయమైనా తన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. వస్తులాభం.
వృషభ రాశి వారికి ఈ రోజు సేవా కార్యక్రమాలలో చురుకుగా పాల్గొంటారు. నాగసింధూరం నుదిటిన ధరించడం వలన నరదృష్టి తొలగి, జనాకర్షణ ఏర్పడుతుంది. వృత్తి, వ్యాపారాలు అభివృద్ధి చెందుతాయి. రాజకీయ, కళా, పారిశ్రామిక రంగాలలోని వారికి కొంత అనుకూలంగా ఉంటుంది. పనులు నిదానంగా పూర్తి చేస్తారు. కాంట్రాక్టులు దక్కుతాయి.
మిథున రాశి వారికి ఈ రోజు ఉద్యోగాలలో బాధ్యతలు పెరిగినా సమర్థవంతంగా నిర్వహిస్తారు. నిత్యం లక్ష్మీదేవికి ఆరావళి కుంకుమ, సుగంధ సిద్ధ గంధాక్షితలతో పూజ చేయడం అన్ని విధాలా మంచిది. దైనందిన జీవితంలో మార్పులు గోచరిస్తున్నాయి. బంధుత్వ అపేక్షల కన్నా ధనానికే ఎక్కువ ప్రాముఖ్యతనిస్తున్న వర్గం వలన మానసిక ప్రశాంతత లోపిస్తుంది.
కర్కాటక రాశి వారికి ఈ రోజు ఆర్థిక స్థితి బాగుంటుంది. నిశ్చింతగా వ్యవహరిస్తారు. విందు, వినోద కార్యక్రమాలలో చురుకుగా పాల్గొంటారు. దైవదర్శనం చేసుకుంటారు. వ్రాతపూర్వక ఒప్పందాలలో, ఆర్థిక వ్యవహారాలలో మధ్యవర్తిగా వ్యవహరించక పోవడం ఉత్తమం. లక్ష్మీ తామరవత్తులు అష్టమూలిక తైలంతో కలిపి దీపారాధన చేయడం వలన లక్ష్మీ కటాక్షం కలుగుతుంది.
ఈ రాశి వారికి ఈ రోజు ఆర్థికంగా అభివృద్ధి బాగుంటుంది. కుటుంబంలో శుభకార్యాల ప్రస్తావన వుంటుంది. స్థిరాస్తి వివాదాలు తీరి లాభం పొందుతారు. ఆరోగ్యం పట్ల చాలా జాగ్రత్తలు అవసరం. తెల్లజిల్లేడు వత్తులతో అష్టమూలిక తైలంతో దీపారాధన చేయడం వలన విఘ్నేశ్వరుని అనుగ్రహం లభిస్తుంది. నూతన మిత్రులు పరిచయమై కొత్త కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు.
కన్య రాశి వారికి ఈ రోజు సంఘంలో గౌరవ, ప్రతిష్ఠలు పెరుగుతాయి. సోదరుల నుండి కీలక సమాచారం అందుకుంటారు. నిత్యం సర్వదోష నివారణ చూర్ణంతో సర్వరక్షా చూర్ణం కలిపి స్నానం చేయడం వలన గ్రహ దోషాలు తొలగుతాయి. అప్రయత్న కార్యసిద్ధి పొందుతారు. దూరప్రాంతాల నుండి వచ్చిన ఆహ్వానాలు ఆశ్చర్యపరుస్తాయి. వస్త్ర లాభం.
తుల రాశి వారికి ఈ రోజు చేపట్టిన పనులలో విజయం సాధిస్తారు. ఆర్థిక పరిస్థితి సంతృప్తికరంగా వుంటుంది. రుణబాధల నుండి విముక్తి పొందుతారు. ఎరుపు, పసుపు వత్తులతో అష్టమూలిక తైలంతో కలిపి అమ్మవారికి దీపారాధన చేయడం వలన మంచి ఫలితాలు పొందుతారు. వివాదాలకు దూరంగా వుండండి. ఆరోగ్యం పట్ల చాలా జాగ్రత్తలు అవసరం. కుటుంబ సభ్యుల నుండి సహాయ సహకారాలు అందుతాయి.
వృశ్చిక రాశి సంతానానికి సాంకేతిక విద్యావకాశాలు పొందుతారు. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల పరంగా పురోభివృద్ధిని సాధిస్తారు. ఊహించని ఒడిదుడుకులను ఎదుర్కొంటారు. మీలో ధైర్యానికి మీరే ఆశ్చర్యపోతారు. పూజలలో సుగంధ సిద్ధ గంధాక్షితాలను ఉపయోగించండి. ధనాదాయ మార్గాలను మెరుగుపరచుకోవడానికి అవిశ్రాంతంగా శ్రమిస్తారు. పనులు సకాలంలో పూర్తి చేస్తారు.
ధనస్సు రాశి వారికి ఈ రోజు స్థిరాస్తి వివాదాలు తీరి నూతన ఒప్పందాలు కుదురుతాయి. నాగబంధాన్ని ఉపయోగించండి. వాహన స్థలాలు, కొనుగోలు యత్నాలు ఫలిస్తాయి. ఆర్థిక పరిస్థితి సంతృప్తికరంగా వుంటుంది. పారిశ్రామిక విద్యారంగాలలోని వారికి అనుకూలంగా ఉంటుంది. షేర్లు, భూముల క్రయవిక్రయాలలో లాభాలు అందుకుంటారు. వస్తువులు కొనుగోలు చేస్తారు.
మకర రాశి వారికి ఈ రోజు ముఖ్యమైన వ్యవహారాలలో బంధువుల సహాయం పొందుతారు. ఆత్మస్థైర్యంతో ముందుకు సాగుతారు. సాంకేతిక విద్యలపై ఆసక్తి చూపుతారు. పాత మిత్రులను కలిసి ఆనందంగా గడుపుతారు. నిత్యం యజ్ఞభస్మాన్ని ధరించడం వలన యజ్ఞం చేసిన ఫలితం దక్కుతుంది. ఆర్థిక పరిస్థితి అనుకున్న విధంగా వుంటుంది. కుటుంబ సభ్యులతో కలిసి ఆనందంగా వుంటారు. కాంట్రాక్టులు దక్కుతాయి.
కుంభ రాశి వారికి ఈరోజు చేపట్టిన పనులలో విజయం సాధిస్తారు. సన్నిహితుల సహాయంతో నూతన వ్యాపారాలు చేపట్టి సకాలంలో పూర్తి చేస్తారు. శత్రువులు సైతం మిత్రులుగా మారతారు. విద్యా, పారిశ్రామిక, సాంకేతిక రంగాలలోని వారికి ప్రభుత్వ నుండి ఆహ్వానాలు అందుతాయి. అభిషేకాలలో జువ్వాది పొడిని ఉపయోగించండి. మంచి ఫలితాలు వుంటాయి. వృత్తి, వ్యాపారాలలో స్వల్ప లాభాలు పొందుతారు.
మీన రాశి వారికి ఈ రోజు వాహనాలు, భూములు క్రయవిక్రయాలలో లాభాలు పొందుతారు. కొత్త కార్యక్రమాలు ప్రారంభిస్తారు. మిత్రుల నుండి విలువైన సమాచారం అందుకుంటారు. ప్రముఖుల నుండి ఆహ్వానాలు అందుతాయి. కీలక నిర్ణయాలలో తొందరపాటు వద్దు. నిత్యం కుబేర కంకణం ధరించండి. చర్చాగోష్టులలో చురుకుగా పాల్గొంటారు. ఇంతకాలం ఎదురు చూస్తున్న ఒక అవకాశం వెతుక్కుంటూ రాగలదు.
పంచాంగ కర్త: బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ - 9494981000
టాపిక్