నేటి రాశి ఫలాలు జూన్ 21, 2025: ఈరోజు ఈ రాశి వారికి కొత్త ప్రయాణాలు, పరిచయాలు.. రాహు, కేతు శ్లోకాలు వినడం మేలు!-today rasi phalalu june 21st 2025 mesha rasi to meena rasi check horoscope ,రాశి ఫలాలు న్యూస్
తెలుగు న్యూస్  /  రాశి ఫలాలు  /  నేటి రాశి ఫలాలు జూన్ 21, 2025: ఈరోజు ఈ రాశి వారికి కొత్త ప్రయాణాలు, పరిచయాలు.. రాహు, కేతు శ్లోకాలు వినడం మేలు!

నేటి రాశి ఫలాలు జూన్ 21, 2025: ఈరోజు ఈ రాశి వారికి కొత్త ప్రయాణాలు, పరిచయాలు.. రాహు, కేతు శ్లోకాలు వినడం మేలు!

HT Telugu Desk HT Telugu

నేటి రాశి ఫలాలు (దిన ఫలాలు) తేదీ 21.06.2025 శనివారం కోసం పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ అందించారు. మేష రాశి నుంచి మీన రాశి వరకు 12 రాశుల దిన ఫలాలు ఇక్కడ తెలుసుకోండి.

నేటి రాశి ఫలాలు (Canva)

హిందుస్తాన్ టైమ్స్

రాశిఫలాలు (దిన ఫలాలు) : 21.06.2025

ఆయనము: ఉత్తరాయనం, సంవత్సరం: శ్రీ విశ్వావసునామ

మాసం: జ్యేష్ట, వారం : శనివారం, తిథి : కృ. ఏకాదశి, నక్షత్రం : అశ్విని

మేష రాశి

మేష రాశి వారికి ధైర్య, సాహసాలు పెరుగుతాయి. నిర్ణయ సామర్థ్యం పెరుగుతుంది. ఆత్మీయులైన ఇతరులకు సహకరిస్తారు. ప్రశాంతత తక్కువగా ఉంటుంది. ఆలోచనలు ముందుకు వెళతాయి. సంతానము డైనమిక్‌గా ఉంటుంది. కుటుంబంలో వ్యక్తులతో విభేదాలు రాకుండా మాట్లాడేటప్పుడు జాగ్రత్త వహించాలి. ఖర్చులు అధికం.

ఆశించిన పనులలో విజయాన్ని సాధిస్తారు. శత్రువుల మీద విజయం సాధిస్తారు. ఉన్నత ఆలోచనలతో లక్ష్యాలు సాధించేందుకు ధైర్యంగా ముందడుగు వేస్తారు. సృజనాత్మకత అనుకూలంగా ఉంటుంది. ఆదిత్య హృదయం పఠించండి. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవాలయ సందర్శన మేలు.

వృషభ రాశి

వృషభ రాశి వారికి గృహ వాతావరణం, కుటుంబంలోని సౌకర్యాలు, తల్లి, వాహన, విద్యా విషయాల మీద శ్రద్ధ తీసుకుంటారు. వృత్తిపరమైన సమయాల్లో శ్రద్ధ లోపిస్తుంది. విద్యార్థులు విద్య మీద, వ్రాత నైపుణ్యాల మీద ఆసక్తి పెంచుకోవాలి. వ్యక్తుల సహకారం ఆశించిన స్థాయిలో లేకపోవడం వల్ల కొంత అశాంతి. ఆర్థిక విషయాలు అనుకూలంగా ఉంటాయి. ఆర్థిక విషయాల్లో అనుకూలత కొరకు జాగ్రత్తగా ముందుకు వెళ్లాలి. సూర్యనారాయణ స్వామి ఆరాధన, లక్ష్మీ నారాయణ స్తోత్రాలు, అష్టోత్తరం మేలు.

మిథున రాశి

మిథున రాశి వారికి జీవిత భాగస్వామి అనుబంధం, వాహన విషయాలు, సంతాన సంబంధ అంశాలు, సృజనాత్మకత అనుకూలంగా ఉంటాయి. ధైర్య, సాహసాలు పెరుగుతాయి. శక్తి సామర్థ్యాలతో కొత్త నిర్ణయాలు తీసుకుంటారు. తోబుట్టువులతో కలిసి చర్చలు. మార్పుల ప్రభావాల వల్ల ఖర్చులు అధికంగా ఉంటాయి. ఉన్నత విద్య కోసం ప్రయత్నించే విద్యార్థులకు అనుకూలంగా ఉంటుంది. వ్యాపార వ్యవహారాలు కొంతవరకు ముందుకు సాగుతాయి. ఆదిత్య హృదయం, విష్ణు సహస్రనామం, దేవాలయ సందర్శన మేలు.

కర్కాటక రాశి

కర్కాటక రాశి వారు గత కాలంగా ఉన్న మానసిక ఒత్తిడిని అధిగమిస్తారు. మాట్లాడేటప్పుడు అధిక ఉద్వేగాలు, కోపాన్ని అధిగమించాలి. కుటుంబ విషయాల మీద శ్రద్ధ పెరుగుతుంది. ఆర్థిక విషయాల్లో నిర్ణయాలు తీసుకుంటారు. ఆరోగ్యం విషయంలోనూ శ్రద్ధ తీసుకుంటూ, నిద్రలేమి, ఒత్తిడి, అధిక ఖర్చులు నియంత్రించుకుంటూ ముందుకు వెళ్లాలి. శత్రు, రోగ, రుణముల కొరకు ఖర్చులు చేస్తారు. జీవితంలో మార్పులు. సమగ్రహ ఆరాధన, హనుమాన్ చాలీసా మేలు.

సింహ రాశి

సింహ రాశి వారు ఆర్థిక, వృత్తి, వాహన, గృహ విషయాలు ఆశాజనకంగా ఉంటాయి. నాయకత్వ లక్షణాలు, కొత్త నిర్ణయాలు, వ్యాపార విస్తరణ కొరకు ఆలోచనలు. ఈ అంశాల్లో అష్టమ శని ప్రభావం, ఆచితూచి వ్యవహరించాలి. వ్యాపార వ్యవహారాలు, నూతన పరిచయాలు, జీవిత భాగస్వామితో అబద్ధాలు రాకుండా జాగ్రత్త పడాలి. వైరాగ్య ఆలోచనలను అధిగమించాలి. కొత్త ప్రయాణాలు, పరిచయాలు. రాహు, కేతు శ్లోకాలు వినడం, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన మేలు.

కన్యా రాశి

కన్యా రాశి వారు తండ్రి ఆరోగ్యంపై శ్రద్ధ తీసుకుంటారు. తండ్రి తరపు బంధువులతో వివాదాలు రాకుండా జాగ్రత్త. నూతన వృత్తి కోసం ప్రయత్నం చేస్తే మాసం మధ్య నుండి అనుకూలత. స్థిరాస్తుల కొరకు పెట్టుబడి. పాత రుణములను తీరుస్తారు. తోబుట్టువులతో ఆర్థిక విషయాల్లో విభేదాలు రాకుండా జాగ్రత్త వహించాలి. శ్రీ దత్త శరణం మమ, సూర్యనారాయణ స్వామి ఆరాధన, కుజ గ్రహ శ్లోకాలు మేలు.

తులా రాశి

జీవిత భాగస్వామితో గతం కంటే కొంత అనుకూలత. కుజుని దశా మార్పు వల్ల వృత్తి, కుటుంబ, ఆర్థిక అంశాల్లో గతంలో ఎదురైన చికాకులు అధిగమిస్తారు. మాట విలువ పెరుగుతుంది. ఆరోగ్యం అనుకూలంగా ఉంటుంది. నూతన శక్తి, ఉత్సాహంతో ముందుకు వెళతారు. బాధల విషయంలో వైరాగ్యాన్ని అధిగమించాలి. విమర్శలు అధిగమించాలి. ఆరోగ్యం, సంతానము, దూరప్రాంత విద్యకు శ్రద్ధ అవసరం. ఆదిత్య హృదయ పారాయణ, సూర్యనారాయణ స్వామి ఆరాధన మేలు.

వృశ్చిక రాశి

వృశ్చిక రాశి వారు అనవసర ఖర్చులను అధిగమించే విధంగా ప్రణాళికలు వేస్తారు. వృత్తిలో కీలక నిర్ణయాలు తీసుకుంటారు. ధైర్యంగా ముందుకు వెళతారు. భాగస్వామి ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం. అధికారులతో, ఉన్నత స్థాయి వ్యక్తులతో, వ్యాపార విషయాల్లో శ్రద్ధ అవసరం. కంటి ఆరోగ్యం, డ్రైవింగ్ విషయంలోనూ జాగ్రత్త అవసరం. శ్రీ రాజమాతయే నమః అని భాగస్వామితో జపించాలి. నవగ్రహ ఆరాధన, దేవాలయ సందర్శన మేలు.

ధనస్సు రాశి

నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు. జీవిత భాగస్వామితో అనుకూలత. ఆర్థిక, కుటుంబ, వ్యాపార వ్యవహారాలు ఆశించిన విధంగా ఉంటాయి. ఒత్తిడిని అధిగమిస్తారు. ధైర్యం, నిర్ణయ సామర్థ్యం బాగుంటుంది. ఉన్నత స్థాయి వ్యక్తుల సహకారం. ప్రియమైన వ్యక్తులతో అభిప్రాయ బేధాలు సరిదిద్దుతారు. పనుల నెరవేర్పులో శ్రమ అవసరం. గణేశ శ్లోకాలు, గణపతి దేవాలయ సందర్శన మేలు.

మకర రాశి

మకర రాశి వారికి కొన్ని నెలలుగా గృహ, వాహన, స్థిరాస్తి, వృత్తిపరమైన ఒత్తిడిని అధిగమించడానికి స్వల్ప అవకాశాలు. దోష నివారణకు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ప్రార్థన అవసరం. ప్రయాణ ఖర్చులు. మాట్లాడేటప్పుడు అపార్థాలకు లోనుకాకుండా జాగ్రత్తలు. దుర్గా శ్లోకములు, శ్రీ గణేశాయ నమః మేలు.

కుంభ రాశి

అభిప్రాయ బేధాలు రాకుండా ఆచితూచి వ్యవహరించాలి. తొందరపాటు నిర్ణయాలు పనికిరావు. కోపం, అవేశం నియంత్రించుకోవాలి. తల్లిదండ్రుల ఆరోగ్యం, కమ్యూనికేషన్ విషయంలో శ్రద్ధ. దగ్గర ప్రయాణాలు అధికం. ఆర్థిక, కుటుంబ, మైత్రి సంబంధాలు జాగ్రత్తగా గమనించాలి. నూతన వాహన, స్థిరాస్తుల కోసం చర్చలు. దుర్గాదేవి, గణపతి ఆరాధన ఫలితాన్నిస్తుంది.

మీన రాశి

మీన రాశి వారి శక్తి సామర్థ్యాలు, నిర్ణయ సామర్థ్యం పెరుగుతుంది. వృత్తి, వ్యాపారాల్లో అభివృద్ధి. ఉన్నతస్థాయి వ్యక్తుల సహకారం. రోగనిరోధక శక్తి పెరుగుతుంది. విదేశీ ప్రయాణావకాశం. విద్యార్థులకు అనుకూల సమయం. ఆర్థిక, ఉన్నత విద్య, కుటుంబ విషయాలలో అపార్థాలు తొలగిపోతాయి. పెద్దల ఆరోగ్యం, వృత్తిపై శ్రద్ధ. దుర్గాదేవి ఆరాధన మంచి ఫలితాలను ఇస్తుంది.

పంచాంగ కర్త: బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ - 9494981000

బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ, మొబైల్‌ : 9494981000
బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ, మొబైల్‌ : 9494981000

హెచ్ టీ తెలుగు డెస్క్ టీమ్ సుశిక్షితులైన, సుదీర్ఘ అనుభవం ఉన్న జర్నలిస్టులతో కూడిన బృందం. ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు సహా అన్ని విభాగాలకు ఆయా రంగాల వార్తలు అందించడంలో నైపుణ్యం కలిగిన సబ్ ఎడిటర్లతో కూడిన బృందం. జర్నలిజం విలువలను, ప్రమాణాలను కాపాడుతూ జర్నలిజంపై అత్యంత మక్కువతో పనిచేస్తున్న బృందం. సంపూర్ణ వార్తావిలువలతో కూడిన కథనాలను పాఠకుల ముందుకు తెస్తున్న బృందం.