నేటి రాశి ఫలాలు జూన్ 20, 2025: ఈరోజు ఈ రాశి వారికి వస్త్ర ప్రాప్తి, వస్తు లాభం.. నగదు చెల్లింపుల్లో జాగ్రత్త!-today rasi phalalu june 20th 2025 mesha rasi to meena rasi check horoscope ,రాశి ఫలాలు న్యూస్
తెలుగు న్యూస్  /  రాశి ఫలాలు  /  నేటి రాశి ఫలాలు జూన్ 20, 2025: ఈరోజు ఈ రాశి వారికి వస్త్ర ప్రాప్తి, వస్తు లాభం.. నగదు చెల్లింపుల్లో జాగ్రత్త!

నేటి రాశి ఫలాలు జూన్ 20, 2025: ఈరోజు ఈ రాశి వారికి వస్త్ర ప్రాప్తి, వస్తు లాభం.. నగదు చెల్లింపుల్లో జాగ్రత్త!

HT Telugu Desk HT Telugu

నేటి రాశి ఫలాలు (దిన ఫలాలు) తేదీ 20.06.2025 శుక్రవారం కోసం పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ అందించారు. మేష రాశి నుంచి మీన రాశి వరకు 12 రాశుల దిన ఫలాలు ఇక్కడ తెలుసుకోండి.

నేటి రాశి ఫలాలు

హిందుస్తాన్ టైమ్స్

రాశిఫలాలు (దిన ఫలాలు) : 20.06.2025

ఆయనము: ఉత్తరాయనం, సంవత్సరం: శ్రీ విశ్వావసునామ

మాసం: జ్యేష్ట, వారం : శుక్రవారం, తిథి : కృ. నవమి/దశమి, నక్షత్రం : రేవతి

మేష రాశి

మేష రాశి వారికి ఈ రోజు తలపెట్టిన కార్యం నెరవేరుతుంది. ఖర్చులు విపరీతం. కష్టసమయంలో ఆప్తులు ఆదుకుంటారు. చెల్లింపుల్లో జాప్యం తగదు. పనులు మందకొడిగా సాగుతాయి. పిల్లలకు ఉన్నత విద్యావకాశం లభిస్తుంది. దూరపు బంధువులతో సంభాషిస్తారు. ఒక సమాచారం ఆలోచింపచేస్తుంది. ఆందోళన కలిగించిన సమస్య సద్దుమణుగుతుంది. ఆధ్యాత్మికత పెంపొందుతుంది. ఆలయాలు, కొత్త ప్రదేశాలు సందర్శిస్తారు.

వృషభ రాశి

వృషభ రాశి వారికి ఈ రోజు శ్రమించిన కొద్దీ మంచి ఫలితాలు ఉంటాయి. ఆశావహ దృక్పథంతో మెలగండి. ఒత్తిళ్లకు గురికావద్దు. పరిస్థితులు నిదానంగా చక్కబడతాయి. పెద్దల హితవు కార్యోన్ముఖులను చేస్తుంది. దృఢసంకల్పంతో యత్నాలు సాగిస్తారు. సన్నిహితులతో తరచూ సంభాషిస్తారు. చెల్లింపుల్లో అలక్ష్యం తగదు. మీ నిర్లక్ష్యం ఇబ్బందులకు దారి తీస్తుంది. పనులు, బాధ్యతలు స్వయంగా చూసుకోండి. పత్రాల్లో సవరణలు సాధ్యపడతాయి.

మిథున రాశి

మిథున రాశి ఆర్థిక స్థితి నిరాశాజనకం. నిస్తేజానికి లోనవుతారు. చిన్నచిన్న ఒత్తిళ్లున్నా మనోధైర్యం కోల్పోవద్దు. రావలసిన ధనం ఆలస్యంగా అందుతుంది. కుటుంబీకులు మీ అశక్తతను అర్థం చేసుకుంటారు. చేపట్టిన పనులు అస్తవ్యస్తంగా సాగుతాయి. లావాదేవీల్లో అప్రమత్తంగా ఉండాలి. తొందరపాటు నిర్ణయం తగదు. పెద్దల సలహా తీసుకోండి. వేడుకకు హాజరవుతారు. ఇంటిని నిర్లక్ష్యంగా వదిలివెళ్లకండి. నగదు, ఆభరణాలు జాగ్రత్త.

కర్కాటక రాశి

కర్కాటక రాశి వారికి ఈ రోజు కార్యం సిద్ధిస్తుంది. బాధ్యతలను సక్రమంగా నిర్వహిస్తారు. ముఖ్యమైన విషయాల్లో లౌక్యంగా మెలగండి. ఏ విషయాన్ని తేలికగా తీసుకోవద్దు. పరిచయస్తులకు సాయం అందిస్తారు. ప్రభుత్వ కార్యాలయాల్లో పనులు సానుకూలమవుతాయి. అనవసర విషయాల్లో జోక్యం తగదు. కొత్త యత్నాలు మొదలెడతారు. కలిసివచ్చిన అవకాశాన్ని తక్షణం అందిపుచ్చుకోండి. అనుమానాలు, అపోహలకు తావివ్వవద్దు.

సింహ రాశి

సింహ రాశి వారికి విశేష ఫలితాలున్నాయి. అనుకున్న కార్యం సాధిస్తారు. పనులు, బాధ్యతలు అప్పగించవద్దు. మీ చొరవతో శుభకార్యం నిశ్చయమవుతుంది. వాహనం కొనుగోలు చేస్తారు. కీలక పత్రాలు జాగ్రత్త. పిల్లల చదువులపై దృష్టి పెడతారు. ఒక ఆహ్వానం ఆలోచింప చేస్తుంది. ప్రియతముల గురించి ఆందోళన చెందుతారు. మీ ప్రతిపాదనలకు స్పందన లభిస్తుంది. ఆందోళన కలిగించిన సమస్య సద్దుమణుగుతుంది.

కన్య రాశి

కన్య రాశి వారికి ఈ రోజు వేడుకను ఘనంగా చేస్తారు. మీ ఆతిథ్యం ఆకట్టుకుంటుంది. పరస్పరం కానుకలు ఇచ్చిపుచ్చుకుంటారు. ఊహించిన ఖర్చులే ఉంటాయి. ఒత్తిళ్లకు గురికావద్దు. ప్రణాళికాబద్ధంగా పనులు పూర్తి చేస్తారు. పరిచయస్తుల రాక ఇబ్బంది కలిగిస్తుంది. మీ సాయంతో ఒకరికి మంచి జరుగుతుంది. లావాదేవీల్లో మెలకువ వహించండి. ప్రలోభాలకు గురికావద్దు. అనుభవజ్ఞులను సంప్రదించండి. ముఖ్యమైన పత్రాలు అందుకుంటారు.

తుల రాశి

ఈ రాశి వారికి ఈ రోజు మీ తప్పిదాలు సరిదిద్దుకోండి. ఇతరులను నిందించవద్దు. దృఢసంకల్పంతో యత్నాలు సాగించండి. ధన సహాయం తగదు. మీ అభిప్రాయాలను సున్నితంగా తెలియజేయండి. బంధుమిత్రులతో తరుచూ సంభాషిస్తారు. ఒక సమాచారం ఉత్తేజపరుస్తుంది. కష్టమనుకున్న పనులు తేలికగా పూర్తవుతాయి. వ్యవహారాల్లో ఆచితూచి అడుగేయండి. ఒంటెద్దు పోకడ తగదు. కీలక పత్రాలు అందుకుంటారు. ఆరోగ్యం జాగ్రత్త.

వృశ్చిక రాశి

వృశ్చిక రాశి వారికి ఈ రోజు ప్రతికూలతలు అధికం. లక్ష్య సాధనకు మరింత శ్రమించాలి. ఆశావహ దృక్పథంతో మెలగండి. అపజయాలకు కుంగిపోవద్దు. అనవసర ఖర్చులు తగ్గించుకుంటారు. పనుల్లో ఒత్తిడి, జాప్యం అధికం. సన్నిహితులతో కాలక్షేపం చేస్తారు. ఆందోళన కలిగించిన సమస్య సద్దుమణుగుతుంది. యత్నాలను కుటుంబీకులు ప్రోత్సహిస్తారు. కనిపించకుండా పోయిన వస్తువులు లభ్యమవుతాయి. పిల్లలకు ఉన్నత విద్యావకాశం లభిస్తుంది.

ధనుస్సు రాశి

ధనుస్సు రాశి వారు ప్రతికూలతలను అధిగమిస్తారు. అవకాశాలు కలిసివస్తాయి. లౌక్యంగా పనులు చక్కబెట్టుకుంటారు. ఆదాయం బాగుంటుంది. విలాసాలకు ఖర్చు చేస్తారు. తెగిపోయిన బంధుత్వాలు బలపడతాయి. ఇతరుల విషయాల్లో జోక్యం తగదు. మీ గౌరవానికి భంగం కలుగకుండా మెలగండి. నోటీసులు అందుకుంటారు. సోదరుల మధ్య కొత్త విషయాలు ప్రస్తావనకు వస్తాయి. ఎదుటివారి ఆంతర్యం గ్రహించండి.

మకర రాశి

ఈ రాశి వారికి ఈ రోజు కార్యక్రమాలు నిరాటంకంగా సాగుతాయి. మీ కష్టం ఫలిస్తుంది. వస్త్రప్రాప్తి, వస్తు లాభం ఉన్నాయి. సమర్థతను చాటుకుంటారు. వ్యవహారాలు మీ సమక్షంలో సాగుతాయి. నిలిపివేసిన పనులు పునః ప్రారంభిస్తారు. సభ్యత్వాలు స్వీకరిస్తారు. ఆదాయానికి తగ్గట్టుగా ప్రణాళికలు వేసుకుంటారు. అంచనాలు ఫలిస్తాయి. కొంత మొత్తం పొదుపు చేస్తారు. నగదు చెల్లింపుల్లో జాగ్రత్త. ఎవరినీ అతిగా నమ్మవద్దు.

కుంభ రాశి

కుంభ రాశి వారికి సర్వత్రా అనుకూలమే. ఏ కార్యం తలపెట్టినా విజయవంతమవుతుంది. కీలక అంశాలపై పట్టు సాధిస్తారు. ఆదాయం బాగుంటుంది. విలాస వస్తువులు కొనుగోలు చేస్తారు. పత్రాల్లో సవరణలు అనుకూలిస్తాయి. ప్రణాళికాబద్ధంగా పనులు పూర్తి చేస్తారు. ఊహించని సంఘటన ఎదురవుతుంది. పెద్దల చొరవతో సమస్య సద్దుమణుగుతుంది. శుభకార్యం తలపెడతారు. సన్మాన, సంస్మరణ కార్యక్రమాల్లో పాల్గొంటారు.

మీన రాశి

ఈ రాశి వారికి ఈ రోజు ప్రతిభా పాటవాలు వెలుగులోకి వస్తాయి. సమస్యలను నిబ్బరంగా ఎదుర్కొంటారు. మీ కార్యదీక్ష ప్రశంసనీయమవుతుంది. ఆదాయ వ్యయాలకు పొంతన ఉండదు. నగదు చెల్లింపుల్లో జాగ్రత్త. బ్యాంకు వివరాలు వెల్లడించవద్దు. కొత్త వ్యక్తులు మోసగించే ఆస్కారం ఉంది. పెద్దలతో సంప్రదింపులు జరుపుతారు. మీ అభిప్రాయాలకు స్పందన లభిస్తుంది. వివాదాస్పద విషయాల్లో మీ ప్రమేయం లేకుండా చూసుకోండి.

పంచాంగ కర్త: బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ - 9494981000

పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ
పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ

హెచ్ టీ తెలుగు డెస్క్ టీమ్ సుశిక్షితులైన, సుదీర్ఘ అనుభవం ఉన్న జర్నలిస్టులతో కూడిన బృందం. ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు సహా అన్ని విభాగాలకు ఆయా రంగాల వార్తలు అందించడంలో నైపుణ్యం కలిగిన సబ్ ఎడిటర్లతో కూడిన బృందం. జర్నలిజం విలువలను, ప్రమాణాలను కాపాడుతూ జర్నలిజంపై అత్యంత మక్కువతో పనిచేస్తున్న బృందం. సంపూర్ణ వార్తావిలువలతో కూడిన కథనాలను పాఠకుల ముందుకు తెస్తున్న బృందం.