నేటి రాశి ఫలాలు జూన్ 19, 2025: ఈరోజు ఈ రాశి వారికి శుభవార్తలు.. పసుపు, ఎరుపు రంగులు ధరించండి.. దేవీ స్తోత్రాలు పఠించండి!-today rasi phalalu june 19th 2025 mesha rasi to meena rasi check horoscope ,రాశి ఫలాలు న్యూస్
తెలుగు న్యూస్  /  రాశి ఫలాలు  /  నేటి రాశి ఫలాలు జూన్ 19, 2025: ఈరోజు ఈ రాశి వారికి శుభవార్తలు.. పసుపు, ఎరుపు రంగులు ధరించండి.. దేవీ స్తోత్రాలు పఠించండి!

నేటి రాశి ఫలాలు జూన్ 19, 2025: ఈరోజు ఈ రాశి వారికి శుభవార్తలు.. పసుపు, ఎరుపు రంగులు ధరించండి.. దేవీ స్తోత్రాలు పఠించండి!

HT Telugu Desk HT Telugu

నేటి రాశి ఫలాలు (దిన ఫలాలు) తేదీ 19.06.2025 గురువారం కోసం పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ అందించారు. మేష రాశి నుంచి మీన రాశి వరకు 12 రాశుల దిన ఫలాలు ఇక్కడ తెలుసుకోండి.

నేటి రాశి ఫలాలు (freepik)

హిందుస్తాన్ టైమ్స్

రాశిఫలాలు (దిన ఫలాలు) : 19.06.2025

ఆయనము: ఉత్తరాయనం, సంవత్సరం: శ్రీ విశ్వావసునామ

మాసం: జ్యేష్ట, వారం : గురువారం, తిథి : కృ. అష్టమి, నక్షత్రం : ఉత్తరాభాద్ర

మేష రాశి

మేష రాశి వారి పనులు క్రమేపీ పుంజుకుంటాయి. విద్యార్థులు సత్తా చాటుకుంటారు. సన్నిహితుల సాయంతో ముందుకు సాగుతారు. భూములు, వాహనాలు కొంటారు. అందరిలోనూ గుర్తింపు పొందుతారు. నూతన వ్యక్తుల పరిచయం. ఆస్తి వ్యవహారాల్లో ఒప్పందాలు చేసుకుంటారు. వ్యాపారాలు పుంజుకుంటాయి. ఉద్యోగాలలో అనుకూల పరిస్థితులు. పారిశ్రామిక వర్గాలకు నూతనోత్సాహం. శ్రమ పెరుగుతుంది. నీలం, ఆకుపచ్చ రంగులు ధరించండి. కనకదుర్గాదేవి స్తోత్రాలు పఠించండి.

వృషభ రాశి

రాశి వారికి ఈ రోజు వ్యవహారాల్లో విజయం సాధిస్తారు. పలుకుబడి పెరుగుతుంది. ఆస్తి వ్యవహారాల్లో సమస్యలు తీరతాయి. గృహ నిర్మాణ యత్నాలు అనుకూలిస్తాయి. నిరుద్యోగులకు ఇంటర్వ్యూలు అందుతాయి. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపారాల్లో నూతన పెట్టుబడులు సమకూరతాయి. ఉద్యోగాల్లో అనుకూల పరిస్థితులు. కళారంగం వారికి సత్కారాలు జరుగుతాయి. కుటుంబ సమస్యలు, ఆరోగ్య భంగం కలగవచ్చు. తెలుపు, నేరేడు రంగులు ధరించండి. గణేశాష్టకం పఠించండి.

మిధున రాశి

మిధున రాశి వారికి ఈ రోజు మొదట్లో కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి. ఆర్థికంగా గతం కంటే మెరుగ్గా ఉంటుంది. గత అనుభవాలను దృష్టిలో ఉంచుకొని నిర్ణయాల్లో తగు జాగ్రత్తలు తీసుకుంటారు. పరపతి పెరుగుతుంది. వాహనాలు, ఆభరణాల కొనుగోలు చేస్తారు. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగాల్లో అనుకూల పరిస్థితులు నెలకొంటాయి. కళారంగం వారి ఆశయాలు నెరవేరతాయి. వ్యయ ప్రయాసలు, అనారోగ్యం కలగవచ్చు. గులాబీ, తెలుపు రంగులు ధరించండి. హయగ్రీవ స్తోత్రాలు పఠించండి.

కర్కాటక రాశి

కర్కాటక రాశి వారికి ఈ రోజు ఆర్థిక వ్యవహారాల్లో చిక్కులు తొలగుతాయి. నిరుద్యోగులకు ఇంటర్వ్యూల్లో విజయం. స్థిరాస్తిపై వివాదాలు కొలిక్కి వస్తాయి. వ్యాపార లావాదేవీలు ఆశాజనకంగా ఉంటాయి. ఉద్యోగాల్లో గతం నుంచి నెలకొన్న ఇబ్బందులు తొలగుతాయి. పారిశ్రామిక వేత్తలకు ఊహించని అవకాశాలు. ధన వ్యయం, ఆరోగ్య భంగం. గులాబీ, లేత ఎరుపు రంగులు ధరించండి. నవగ్రహ స్తోత్రాలు పఠించండి.

సింహ రాశి

సింహ రాశి వారి ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. ఆసక్తికర సమాచారం అందుతుంది. నిరుద్యోగుల కలలు ఫలిస్తాయి. ఆస్తి వ్యవహారాల్లో అగ్రిమెంట్లు చేసుకుంటారు. గృహ నిర్మాణ యత్నాలు కార్యరూపం దాలుస్తాయి. ఉత్సవాలకు హాజరవుతారు. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగాల్లో ప్రోత్సాహకరంగా ఉంటుంది. కళారంగం వారి ఆశయాలు నెరవేరతాయి. వ్యయ ప్రయాసలు ఉండొచ్చు. గులాబీ, నేరేడు రంగులు ధరించండి. నృసింహ స్తోత్రాలు పఠించండి.

కన్య రాశి

కన్య రాశి వారికి ఈ రోజు ముఖ్యమైన పనుల్లో ప్రతిబంధకాలు ఏర్పడతాయి. కుటుంబ సభ్యులతో విభేదాలు నెలకొంటాయి. విద్యార్థులు, నిరుద్యోగులకు శ్రమ అధికంగా ఉంటుంది. ఆర్థిక విషయాలు నిరుత్సాహపరుస్తాయి. శ్రమ మరింత పెరుగుతుంది. ఆరోగ్యం మందగిస్తుంది. తీర్థయాత్రలు చేస్తారు. వ్యాపారాల్లో కొద్దిపాటి లాభాలు. ఉద్యోగాల్లో మార్పులు ఉండవచ్చు. పారిశ్రామిక వర్గాల యత్నాలు ముందుకు సాగవు. శుభవార్తలు. వాహనయోగం. ఎరుపు, లేత గులాబీ రంగులు ధరించండి. కనకధారా స్తోత్రం పఠించండి.

తులా రాశి

తులా రాశి వారు అనుకున్న ఆదాయం సమకూరుతుంది. పనులు చకచకా పూర్తి చేస్తారు. విద్యార్థులు సత్తా చాటుకుంటారు. పరపతి పెరుగుతుంది. ఆస్తి వ్యవహారాల్లో చికాకులు తొలగుతాయి. ఉద్యోగ ప్రయత్నాలు సానుకూలమవుతాయి. వ్యాపారాలు లాభాల బాట పడతాయి. ఉద్యోగాలు ప్రగతిపథంలో సాగుతాయి. కళారంగం వారికి ఉత్సాహవంతంగా ఉంటుంది. ధన వ్యయం, ఆరోగ్య భంగం. పసుపు, గులాబీ రంగులు ధరించండి. విష్ణు సహస్రనామ పారాయణ చేయండి.

వృశ్చిక రాశి

వృశ్చిక రాశి వారికి ఈ రోజు ముఖ్యమైన వ్యవహారాలు క్రమేపీ అనుకూలిస్తాయి. ఆస్తి విషయాల్లో అగ్రిమెంట్లు చేసుకుంటారు. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. విద్యార్థులు, నిరుద్యోగుల ఆశలు ఫలిస్తాయి. వివాహ యత్నాలు కలసివస్తాయి. వ్యాపారాల్లో లాభాలు. ఉద్యోగాల్లో ఒడిదుడుకులు తొలగుతాయి. రాజకీయ వర్గాలకు ఆకస్మిక విదేశీ పర్యటనలు. ధన వ్యయం. పసుపు, నేరేడు రంగులు ధరించండి. శివాష్టకం పఠించండి.

ధనుస్సు రాశి

కుటుంబ సభ్యులతో ఉల్లాసంగా గడుపుతారు. దేవాలయాలు సందర్శిస్తారు. పనులు విజయవంతంగా సాగుతాయి. ఇంట్లో విందు వినోదాలు. ఇంటర్వ్యూలకు హాజరవుతారు. దాపరికాలు లేకుండా అభిప్రాయాలు నిర్భయంగా వెల్లడిస్తారు. వ్యాపార లావాదేవీలు ఆశాజనకంగా ఉంటాయి. ఉద్యోగాల్లో ప్రగతి కనిపిస్తుంది. రాజకీయ వర్గాలకు పదవీ యోగం, ప్రయాణాలు. అనారోగ్యం కలగవచ్చు. గులాబీ, లేత పసుపు రంగులు ధరించండి. కనకధారా స్తోత్రాలు పఠించండి.

మకర రాశి

మకర రాశి వారికి ఈ రోజు పరిస్థితులు అనుకూలిస్తాయి. విలువైన వస్తువులు సేకరిస్తారు. కాంట్రాక్టర్లకు అనుకూల కాలం. కొన్ని ఇబ్బందుల నుంచి గట్టెక్కుతారు. ఇంటి నిర్మాణ యత్నాలు కలసివస్తాయి. ముఖ్యమైన సమావేశాల్లో పాల్గొంటారు. కొత్త విషయాలు తెలుస్తాయి. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగాల్లో ముందుకు సాగుతారు. కళాకారులకు పురస్కారాలు. వృథా ఖర్చులు. బంధు విరోధాలు. ఆకుపచ్చ, నేరేడు రంగులు ధరించండి. అంగారక స్తోత్రాలు పఠించండి.

కుంభ రాశి

రాశి వారికి ఈ రోజు పరపతి పెరుగుతుంది. వ్యవహారాల్లో విజయం. శుభ వర్తమానాలు. ఆదాయం పెరిగి అప్పులు తీరతాయి. ఆశయాల సాధనలో కుటుంబ సభ్యులు సహకరిస్తారు. వాహనయోగం. నిరుద్యోగులకు ఆశలు చిగురిస్తాయి. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వ్యాపారాలు మరింతగా పుంజుకుంటాయి. ఉద్యోగాల్లో అనుకూల స్థితి. కళాకారులకు పురస్కారాలు. వివాదాలు, ఆరోగ్య, కుటుంబ సమస్యలు. ఎరుపు, లేత పసుపు రంగులు ధరించండి. దుర్గాదేవిని పూజించండి.

మీన రాశి

మీన రాశి వారికి ఈ రోజు పరిచయాలు పెరుగుతాయి. రావలసిన సొమ్ము అందుతుంది. పనులు సకాలంలో పూర్తి చేస్తారు. మిత్రులతో వివాదాలు తీరతాయి. దేవాలయాలు సందర్శిస్తారు. విద్యార్థులు, నిరుద్యోగులకు శుభవార్తలు. వ్యాపారులకు లాభాలు తథ్యం. ఉద్యోగాల్లో చిక్కులు తొలగుతాయి. కళాకారులకు అవార్డులు. ధన వ్యయం. సోదరులతో స్వల్ప వివాదాలు. పసుపు, ఎరుపు రంగులు ధరించండి. దేవీ స్తోత్రాలు పఠించండి.

పంచాంగ కర్త: బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ 9494981000

పంచాంగకర్త చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ
పంచాంగకర్త చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ

హెచ్ టీ తెలుగు డెస్క్ టీమ్ సుశిక్షితులైన, సుదీర్ఘ అనుభవం ఉన్న జర్నలిస్టులతో కూడిన బృందం. ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు సహా అన్ని విభాగాలకు ఆయా రంగాల వార్తలు అందించడంలో నైపుణ్యం కలిగిన సబ్ ఎడిటర్లతో కూడిన బృందం. జర్నలిజం విలువలను, ప్రమాణాలను కాపాడుతూ జర్నలిజంపై అత్యంత మక్కువతో పనిచేస్తున్న బృందం. సంపూర్ణ వార్తావిలువలతో కూడిన కథనాలను పాఠకుల ముందుకు తెస్తున్న బృందం.