నేటి రాశి ఫలాలు జూన్ 18, 2025: ఈరోజు ఈ రాశుల వారికి నూతన ఉపాధులు, ఉద్యోగాలు.. ప్రయాణాలు సౌకర్యవంతంగా సాగుతాయి!-today rasi phalalu june 18th 2025 mesha rasi to meena rasi check horoscope ,రాశి ఫలాలు న్యూస్
తెలుగు న్యూస్  /  రాశి ఫలాలు  /  నేటి రాశి ఫలాలు జూన్ 18, 2025: ఈరోజు ఈ రాశుల వారికి నూతన ఉపాధులు, ఉద్యోగాలు.. ప్రయాణాలు సౌకర్యవంతంగా సాగుతాయి!

నేటి రాశి ఫలాలు జూన్ 18, 2025: ఈరోజు ఈ రాశుల వారికి నూతన ఉపాధులు, ఉద్యోగాలు.. ప్రయాణాలు సౌకర్యవంతంగా సాగుతాయి!

HT Telugu Desk HT Telugu

నేటి రాశి ఫలాలు (దిన ఫలాలు) తేదీ 18.06.2025 బుధవారం కోసం పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ అందించారు. మేష రాశి నుంచి మీన రాశి వరకు 12 రాశుల దిన ఫలాలు ఇక్కడ తెలుసుకోండి.

నేటి రాశి ఫలాలు (Canva)

హిందుస్తాన్ టైమ్స్

రాశిఫలాలు (దిన ఫలాలు) : 18.06.2025

ఆయనము: ఉత్తరాయనం, సంవత్సరం: శ్రీ విశ్వావసునామ

మాసం: జ్యేష్ట, వారం : బుధవారం, తిథి : కృ. సప్తమి, నక్షత్రం : పూర్వాభాధ్ర

మేష రాశి

మేష రాశి వారికి ఈ రోజు కుటుంబ వ్యక్తుల సహాయ సహకారాలతో చేపట్టిన అన్ని పనులను పూర్తి చేసుకోగలుగుతారు. సంతానపు వ్యవహారాలు కొన్ని చికాకుపరుస్తాయి. ఆలోచనలను ఆత్మీయులతో పంచుకోవాలి. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలు సాధారణంగా సాగుతాయి. చెల్లింపులను పూర్తిచేసుకోగలుగుతారు. ఆదాయాలు, ఆరోగ్యం పరవాలేనివిగా ఉంటాయి. విద్యార్థులకు రోజులు ఉపకరించగలవు.

వృషభ రాశి

వృషభ రాశి వారు ప్రయత్నాలను ఉత్సాహంగా నిర్వహించుకోగలరు. అవకాశాలు కలసివస్తాయి. వృత్తి, ఉద్యోగాలలో మీ నిర్ణయాలు గుర్తింపునేర్పరచగలవు. నూతన పనులకు శ్రీకారం చుట్టగలరు. రావలసినవి వసూలగుట, ఇతరులకు సహకరించుట ఉంటాయి. భూ, గృహ క్రయవిక్రయాలు కోరువారికి అనుకూలతలుంటాయి. వివాహ, ఉద్యోగ ప్రయత్నాలు అనుకూలిస్తాయి.

మిథున రాశి

మిథున రాశి వారికి ఈ రోజు గ్రహసంచారాలు మిశ్రమంగా ఉపకరిస్తాయి. పని చిన్నదైనా ఏకాగ్రత, పట్టుదల అవసరమవుతాయి. కుటుంబంలో సహకారాలు పెరుగుతాయి. ఆర్థికంగా ముందు జాగ్రత్తలు తప్పనిసరి. కుటుంబ వ్యవహారాల్లో కీలక అంశాలు చర్చలకు రాగలవు. నూతన వ్యాపారాల్లో పెట్టుబడులు ఉంచగలరు. వివాహ, ఉద్యోగ యత్నాలు ఓర్పు, పట్టుదలతో సాగాలి.

కర్కాటక రాశి

కర్కాటక రాశి వారికి ఈ రోజు ఆధ్యాత్మికతతో కూడిన ప్రయాణాలు చేపట్టుకొని పూర్తిచేసుకుంటారు. గతంలో ఆగిపోయిన పనులు పూర్తవవచ్చు. ఆదాయాలను బట్టి ఖర్చులు చేసుకోవాలి. ఆరోగ్య విషయంలో మంచి మార్పులు ఉంటాయి. ఎగ్రిమెంట్లు, ఒప్పందాల విషయంలో జాగ్రత్తలు అవసరం. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలు సాధారణతతో సాగుతాయి. విద్యార్థులకు ప్రవేశాలు అనుకూలిస్తాయి.

సింహ రాశి

సింహ రాశి వారి ఆరోగ్యాన్ని పెద్దపీట వేసి జాగ్రత్తలకు ప్రాధాన్యత ఇవ్వండి. సమయపాలన, ఆహార విరామాదుల్లో నియమం పాటించాలి. ఖర్చులు పెరగడం, చేయతలపెట్టిన పనులకు ఆటంకాలు ఏర్పడటం, ఆత్మీయులను దూరంగా ఉంచడం జరుగుతుంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలు సాధారణంగా సాగుతాయి. నిరుద్యోగులకు జీవనోపాధి సిద్ధించగలదు.

కన్యా రాశి

కన్యా రాశి వారికి ఈ రోజు ఆరోగ్యపరంగా తప్పనిసరి జాగ్రత్తలు తీసుకుంటూ ప్రయత్నాలను ముమ్మరం చేయండి. కుటుంబ వ్యవహారాల్లో విమర్శలు ఎదురుకాకుండా చూసుకోవాలి. వృత్తి, ఉద్యోగాలు మీ అభీష్టానికి అనుకూలంగా సాగగలవు. వ్యాపార వ్యవహారాల్లో అగ్రిమెంట్లలో పునఃపరిశీలనలు అవసరం. ప్రభుత్వ అనుమతులు వంటివి సిద్ధమవుతాయి.

తులా రాశి

తులా రాశి వారికి గ్రహ సంచారములు అనుకూలం. ఫలితాలు మిశ్రమంగా ఉన్నా భవిష్యత్తుకు బాటలు పడగలవు. అధికారులతో సంయమనంతో ఉండాలి. గతంతో ముడిపడిన వ్యవహారాలను చేపట్టుతారు. కుటుంబంలో సన్నిహితులు పెరుగుతారు. ఉద్యోగులకు గుర్తింపులు, కొందరికి ప్రమోషన్లు ఉండవచ్చు. భూ, గృహ క్రయవిక్రయాల్లో ఉత్సాహం చూపగలరు. నూతన వస్తు, సేవల వంటి అవకాశాలు ఏర్పడతాయి. ముఖ్యమైన పనులు చేపట్టడానికి అనువైన సమయం.

వృశ్చిక రాశి

వృశ్చిక రాశి వారికి ఈ రోజు గ్రహసంచారాల్లో దశమ కుజుడు ప్రయోజనాలు ఇచ్చినా అన్నిటిలోనూ జాగ్రత్తలు అవసరం. ఇంటా బయటా ప్రతికూల ప్రభావాలు ఎక్కువగా ఉంటాయి. డాక్యుమెంట్లు నింపేటప్పుడు చిన్న అంశాలకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలి. బంధుమిత్రులచే చిన్నతరహా ఉపకారాలు ఉంటాయి. సహకారాలకై ఇతరులను ఆశించకండి. కోపావేశాలు ప్రదర్శించడానికి ఇది సరైన సమయం కాదు. విద్యార్థులు పట్టుదలతో ముందుకు సాగాలి.

ధనుస్సు రాశి

ధనుస్సు రాశి వారికి అవకాశాలు కలసివస్తాయి. ఆనందాలు పంచుకోగలుగుతారు. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో కొత్త అవకాశాలు చేజిక్కించుకుంటారు. నిరుద్యోగులు ఆశించినవి పొందగలరు. ఆర్థికంగా, గౌరవపరంగా మంచి ఫలితాలు వస్తాయి. సంతానంలో ఒకరికి ఉద్యోగ లేదా వివాహ సిద్ధి ఉండవచ్చు. గతంలో రావలసినవి వసూలవుతాయి.

మకర రాశి

ఈ రాశి వారికి ఈ రోజు గత పొరపాట్లను సవరించుకునేందుకు సరైన సమయం. అవకాశాలు కలసివస్తాయి. ఆరోగ్యంలో క్రమంగా మంచి మార్పులు కనిపిస్తాయి. కుటుంబ వ్యవహారాల్లో కఠిన నిర్ణయాలు తీసుకుంటారు. వ్యాపార వ్యవహారాల్లో నూతన ఒప్పందాలు చేస్తారు. వాహన, యంత్రాల వాడకంలో జాగ్రత్తలు అవసరం. ప్రయాణాలు సౌకర్యవంతంగా సాగుతాయి.

కుంభ రాశి

కుంభ రాశి వారికి సప్తమంలో కుజ, కేతువులు కుటుంబ వ్యక్తుల ఆరోగ్యంపై జాగ్రత్తలు అవసరమని సూచిస్తాయి. గర్భవతులు అధిక జాగ్రత్తలు తీసుకోవాలి. గౌరవం, కీర్తి పెరుగుతాయి. ఆర్థికంగా ముఖ్యమైన ఒప్పందాలు చేస్తారు. అవివాహితులకు నిర్ణయాలలో తాత్కాలిక ఆలస్యం ఉపకరించగలదు. నూతన ఉపాధులు, ఉద్యోగాలు సిద్ధించగలవు.

మీన రాశి

మీన రాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు. కుటుంబంలో ఏకవాక్యత ఉంటుంది. గతంలో నిలిచిన పనులను పూర్తిచేసుకోగలుగుతారు. శారీరక, మానసిక సౌఖ్యాలు అంతంత మాత్రంగా ఉంటాయి. ఉపాధి, ఉద్యోగాల్లో ప్రతిబంధకాలను తొలగించగలుగుతారు. వ్యాపార వ్యవహారాలు మీరనుకున్నట్టుగా సాగవచ్చు.

పంచాంగ కర్త: బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ - 9494981000

పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ
పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ

హెచ్ టీ తెలుగు డెస్క్ టీమ్ సుశిక్షితులైన, సుదీర్ఘ అనుభవం ఉన్న జర్నలిస్టులతో కూడిన బృందం. ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు సహా అన్ని విభాగాలకు ఆయా రంగాల వార్తలు అందించడంలో నైపుణ్యం కలిగిన సబ్ ఎడిటర్లతో కూడిన బృందం. జర్నలిజం విలువలను, ప్రమాణాలను కాపాడుతూ జర్నలిజంపై అత్యంత మక్కువతో పనిచేస్తున్న బృందం. సంపూర్ణ వార్తావిలువలతో కూడిన కథనాలను పాఠకుల ముందుకు తెస్తున్న బృందం.