నేటి రాశి ఫలాలు జూన్ 17, 2025: ఈరోజు ఈ రాశి వారు ఆపదల నుంచి బయటపడతారు, నవగ్రహ స్తోత్రాలు పఠించండి!-today rasi phalalu june 17th 2025 mesha rasi to meena rasi check horoscope ,రాశి ఫలాలు న్యూస్
తెలుగు న్యూస్  /  రాశి ఫలాలు  /  నేటి రాశి ఫలాలు జూన్ 17, 2025: ఈరోజు ఈ రాశి వారు ఆపదల నుంచి బయటపడతారు, నవగ్రహ స్తోత్రాలు పఠించండి!

నేటి రాశి ఫలాలు జూన్ 17, 2025: ఈరోజు ఈ రాశి వారు ఆపదల నుంచి బయటపడతారు, నవగ్రహ స్తోత్రాలు పఠించండి!

HT Telugu Desk HT Telugu

నేటి రాశి ఫలాలు (దిన ఫలాలు) తేదీ 17.06.2025 మంగళవారం కోసం పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ అందించారు. మేష రాశి నుంచి మీన రాశి వరకు 12 రాశుల దిన ఫలాలు ఇక్కడ తెలుసుకోండి.

నేటి రాశి ఫలాలు

హిందుస్తాన్ టైమ్స్

రాశిఫలాలు (దిన ఫలాలు) : 17.06.2025

ఆయనము: ఉత్తరాయనం, సంవత్సరం: శ్రీ విశ్వావసునామ

మాసం: జ్యేష్ఠ, వారం : మంగళవారం, తిథి : కృ. షష్ఠి, నక్షత్రం : శతభిష

మేష రాశి

మేష రాశి వారికి ఈ రోజు విజయం లభిస్తుంది. ఏకాగ్రతతో నిర్ణయాలు తీసుకుంటారు. లక్ష్యాన్ని సాధించే వరకు ప్రయత్నం ఆపకండి. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. తొందరపాటు చర్యలు వద్దు. ఒత్తిడికి గురికాకండి. అవరోధాలు సృష్టించే వారితో జాగ్రత్త. మిత్రుల సూచనలు మేలు చేస్తాయి. పట్టువిడుపులతో వ్యవహరించండి. సూర్యుడిని ధ్యానించండి.

వృషభ రాశి

వృషభ రాశి వారికి ఈ రోజు శుభకాలం కొనసాగుతోంది. కీలక నిర్ణయాలకు సరైన సమయం. ప్రతి అవకాశాన్నీ సద్వినియోగం చేసుకుంటారు. దైవబలం సహకరిస్తుంది. వ్యాపారంలో లాభాలు ఉంటాయి. ఉద్యోగంలో ప్రశంసలు అందుతాయి. అవసరానికి తగినంత డబ్బు సమకూరుతుంది. రుణ సమస్యలతో జాగ్రత్త. లక్ష్మీదేవిని పూజించండి.

మిథున రాశి

మిథున రాశి వారు ఆర్థిక ప్రగతిని సాధిస్తారు. కృషికి తగిన ఫలితం దక్కుతుంది. ఆలోచనలు కార్యరూపం దాల్చుతాయి. కీలక సమయాల్లో ధైర్యంగా వ్యవహరించండి. వ్యాపార వ్యవహారాల్లో సకాలంలో స్పందించండి. సంభాషణల్లో స్పష్టత అవసరం. కొన్ని పొరపాట్లు సమస్యల్ని సృష్టించే ఆస్కారం ఉంది. ఆపదల నుంచి బయటపడతారు. నవగ్రహ స్తోత్రాలు పఠించండి.

కర్కాటక రాశి

ఈ రాశి వారికి ఈ రోజు సూర్యుడి అనుగ్రహం సంపూర్ణ విజయాన్ని ప్రసాదిస్తుంది. కొత్త పనులు ఆరంభించడానికి తగిన సమయం. చెడును అతిగా ఊహించుకోవద్దు. ఏదో ఒక రూపంలో సమస్యలు సృష్టించేవారితో జాగ్రత్త. ఆర్థిక వ్యవహారాల్లో మొహమాటానికి తావివ్వకండి. సౌమ్యంగా సంభాషించండి. నవగ్రహ ధ్యాన శ్లోకాలు చదవండి.

సింహ రాశి

సింహ రాశి వారికి ఈ రోజు శుభకాలం కొనసాగుతోంది. ఆత్మవిశ్వాసంతో వ్యవహరించండి. వేగంగా పనులు పూర్తవుతాయి. సమాజంలో గుర్తింపు లభిస్తుంది. ఉద్యోగంలో ఉన్నతస్థితి గోచరిస్తోంది. ఆర్థిక ఫలితాలు అత్యుత్తమంగా ఉంటాయి. గురుబలం రక్షిస్తుంది. అదృష్టయోగం ఉంది. లక్ష్మీనారాయణులను అర్చించండి.

కన్యా రాశి

ఆర్థిక ఫలితాలు అనుకూలం. జీవిత ఆశయం నెరవేరుతుంది. అవసరాలకు డబ్బు అందుతుంది. ఏ విషయంలోనూ వెనకడుగు వేయకండి. దైవబలం సదా కాపాడుతుంది. ఆత్మవిశ్వాసం అవసరం. ఇతరుల విషయాల్లో జోక్యం చేసుకోవద్దు. వ్యాపారంలో ఇబ్బందులు తొలగిపోతాయి. మహాగణపతిని ధ్యానించండి.

తులా రాశి

తులా రాశి వారికి ఈ రోజు శుభకాలం నడుస్తోంది. ప్రయత్నాలు విజయవంతం అవుతాయి. ఆశయాలకు ఓ రూపం ఇచ్చే ప్రయత్నం చేస్తారు. వృత్తి, ఉద్యోగాల్లో మంచి పేరు తెచ్చుకుంటారు. వ్యాపారంలో మరింత శ్రద్ధ అవసరం. భూ లాభం సూచితం. కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు. మానసిక ప్రశాంతతను పొందుతారు. లక్ష్మీదేవిని అర్చించండి.

వృశ్చిక రాశి

వృశ్చిక రాశి వారికి దైవబలం రక్షిస్తుంది. ఆత్మవిశ్వాసంతో పనులు ప్రారంభిస్తారు. ఇది పరీక్షాకాలం. అపార్థాలు, అసూయలు ఇబ్బంది పెడతాయి. తగిన స్పష్టత వచ్చాకే ముఖ్య నిర్ణయాలు తీసుకోండి. వ్యక్తిగత విషయాలను ఇతరులతో చర్చించకండి. పట్టువిడుపులతో వ్యవహరించండి. పూచీకత్తు వ్యవహారాలకు దూరంగా ఉండండి. నవగ్రహ శ్లోకాలు చదవండి.

ధనుస్సు రాశి

ఈ రాశి వారికి ఈ రోజు ప్రారంభించిన పనుల్లో విజయాలు సాధిస్తారు. దీర్ఘకాలిక కృషి ఫలిస్తుంది. ఉద్యోగంలో కలిసొస్తుంది. వ్యాపార లాభాలు సూచితం. కీర్తి లభిస్తుంది. జీవితాన్ని మలుపుతిప్పే సంఘటన జరుగుతుంది. కుటుంబ సభ్యుల ఎదుగుదల సంతోషాన్ని కలిగిస్తుంది. కనకధారా స్తోత్రం పారాయణం చేయండి.

మకర రాశి

మకర రాశి వారికి వ్యాపార ప్రయోజనాలు సూచితం. ఆశయాలు ఒక్కొక్కటిగా నెరవేరతాయి. నిర్ణయాలు సత్ఫలితాలను ఇస్తాయి. వ్యాపార విస్తరణకు సరైన సమయం. గృహ, వాహనాది యోగాలు ఉన్నాయి. అనుకున్న పనులను ప్రశాంతంగా పూర్తి చేయండి. వివాదాలకు దూరంగా ఉండండి. లక్ష్మీ అష్టోత్తరం పఠించండి.

కుంభ రాశి

కుంభ రాశి వారికి ఈ రోజు గురుగ్రహం అనుగ్రహిస్తుంది. ముఖ్యమైన పనులను సకాలంలో పూర్తి చేస్తారు. నిర్ణయాలను చిత్తశుద్ధితో అమలు చేయండి. పొదుపు మదుపు దిశగా నిధులు మళ్లించండి. స్థిరాస్తుల విషయంలో జాగ్రత్తగా వ్యవహరించాలి. చంచలత్వం పనికిరాదు. కాలం మిశ్రమంగా ఉంది. ఆరోగ్యం పట్ల మరింత శ్రద్ధ అవసరం. నవగ్రహాల్ని ధ్యానించండి.

మీన రాశి

మీన రాశి వారికి ఫలితాలు అనుకూలంగా ఉంటాయి. కాలం అన్ని విధాలుగా సహకరిస్తుంది. గతంలో ఆగిపోయిన పనులను మళ్లీ ప్రారంభిస్తారు. ముఖ్య నిర్ణయాల విషయంలో దీర్ఘకాలిక ప్రణాళిక అవసరం. వ్యాపార లాభాలు ఉన్నాయి. పెట్టుబడులు రాబడిని అందిస్తాయి. గౌరవాన్ని పొందుతారు. అదృష్టం వరిస్తుంది. లక్ష్మీదేవిని ఆరాధించండి.

పంచాంగ కర్త: బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ - 9494981000

హెచ్ టీ తెలుగు డెస్క్ టీమ్ సుశిక్షితులైన, సుదీర్ఘ అనుభవం ఉన్న జర్నలిస్టులతో కూడిన బృందం. ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు సహా అన్ని విభాగాలకు ఆయా రంగాల వార్తలు అందించడంలో నైపుణ్యం కలిగిన సబ్ ఎడిటర్లతో కూడిన బృందం. జర్నలిజం విలువలను, ప్రమాణాలను కాపాడుతూ జర్నలిజంపై అత్యంత మక్కువతో పనిచేస్తున్న బృందం. సంపూర్ణ వార్తావిలువలతో కూడిన కథనాలను పాఠకుల ముందుకు తెస్తున్న బృందం.