హిందుస్తాన్ టైమ్స్
రాశిఫలాలు (దిన ఫలాలు) : 16.06.2025
ఆయనము: ఉత్తరాయనం, సంవత్సరం: శ్రీ విశ్వావసునామ
మాసం: జ్యేష్ఠ, వారం : సోమవారం, తిథి : కృ. పంచమి, నక్షత్రం : ధనిష్ఠ
మేష రాశి వారు ఉపయుక్తంలేని సంభాషణలు చర్యలకు ఏమాత్రం తావివ్వరు. అవిశ్రాంతంగా శ్రమిస్తారు. గృహం కొనుగోలు చేయాలన్న ఆలోచనలు బలపడతాయి. పనిభారం వలన వత్తిడికి లోనవుతారు. ముఖ్యమైన డైరీ సకాలంలో కనిపించక తాత్కాలికంగా చికాకు పడుతారు. నిత్యం సుబ్రమణ్య పశుపతి కంకణం ధరించండి.
వృషభ రాశి వారికి ఈ రోజు దీర్ఘకాలిక సమస్యలు కొంతవరకు తీరుతాయి. నిత్యం దీపారాధన కుందిలో రెండు చుక్కలు పరిమళ గంధాన్ని వేయాలి. ఇంటా బయటా అనుకూలంగా ఉంటుంది. గృహనిర్మాణ ఆలోచనలు కలిసి వస్తాయి. విందు, వినోదాలు, శుభకార్యాలలో చురుకుగా పాల్గొంటారు. ప్రముఖుల కలయిక, ప్రకృతి వైద్యం, యోగా వంటి సనాతన ఆరోగ్య సూత్రాల పట్ల ఆకర్షితులవుతారు.
మిథున రాశి సంతానానికి నూతన విద్యా, ఉద్యోగావకాశాలు లభిస్తాయి. మిత్రుల నుండి సహాయ వహకారాలు అందుతాయి. లక్ష్మీప్రదమైన ముఖానికి, ఐశ్వర్య ప్రాప్తికి ఈ లక్ష్మి చందనం ధరించడం వలన మేలు జరుగుతుంది. సానుకూల ఫలితాలను సాధిస్తారు. రెండు పడవల మీద ప్రయాణం శ్రేయస్కరం కాదు.
ఈ రాశి వారికి ఈ రోజు ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా వుంటుంది. బాధలు తప్పవు. ప్రయాణాలలో తొందరపాటు నిర్ణయాలు వద్దు. ఆష్టగణపతి పీఠానికి పరిమళ గంధం రాసి, ఆరావళి కుంకును పెట్టి నిత్యం పూజ చేయడం వలన సమస్యలు కొంత వరకు తీరుతాయి. భాగస్వామ్య వ్యాపారాలలో ఆటుపోట్లు ఎదురైనా అధిగమించి ముందుకు సాగుతారు.
సింహ రాశి వారు కీలక నిర్ణయాలలో సొంత ఆలోచనలు శ్రేయస్కరం. నిత్యం హనుమ సింధూరం ఉపయోగించడం వలన మనోధైర్యం, ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. శుభకార్యాలు ఘనంగా చేస్తారు. రెండు, మూడు విధాలుగా ఆర్థిక లాభాలు వుంటాయి. ప్రముఖుల నుండి కీలక సమాచారం అందుకుని ముందుకు సాగుతారు. ఉద్యోగులు పదోన్నతులు పొందుతారు.
ఈ రాశి వారికి ఈ రోజు విలువైన వస్తువులు, ఆభరణాలు కొనుగోలు చేస్తారు. దూరప్రాంతాల నుండి శుభవార్తలు అందుకుంటారు. పోటీపరీక్షలు, ఇంటర్వ్యూలలో విజయం సాధిస్తారు. నిత్యం పాశుపత కంకణం ధరించడం వలన ఉద్యోగ ప్రాప్తిలో ఎదురైన విఘ్నాలు నశిస్తాయి. ఆరోగ్యం పట్ల మెలుకువ అవసరం. ఎంతోకాలంగా దూరంగా ఉన్న బాల్యమిత్రులతో తిరిగి పరిచయం ఏర్పడుతుంది.
తులా రాశి వారి ఆర్థిక పరిస్థితి అనుకూలంగా ఉంటుంది. మాటల వరకే మీ కోపాన్ని పరిమితం చేసి లాభపడగలుగుతారు. సరికొత్త నిర్ణయాలు తీసుకుంటారు. అమలు పరచడానికి కావలసిన సహచర సిబ్బందిని సమకూర్చుకుంటారు. విలాసవంతమైన వస్తువులను కొనుగోలు చేస్తారు. మానసిక వేదనకు ఏ మాత్రం తావివ్వరు. నానారకాల ఆరిష్టాలు, శత్రుబాధలు, బాధలు నశించడానికి త్రిశూల్ ఉపయోగించండి.
ఈ రాశి వారికి ఈ రోజు శుభకార్యాలు ఘనంగా చేస్తారు. ఆర్థికాభివృద్ధి కొరకు లక్ష్మీకటాక్షాన్ని ఉపయోగించండి. ఇది చాలా మంచిది. కుటుంబ సభ్యులను కలిసి ఆనందంగా గడుపుతారు. సన్నిహితులతో ఏర్పడిన మాట పట్టింపులు పరిష్కరించుకుంటారు. మీరు కుదుర్చుకునే అగ్రిమెంట్లు కలిసివస్తాయి. ఆదాయ, వ్యయాలలో సమతుల్యత ఏర్పడుతుంది. చాలా వరకు మీ అంచనాలు నిజమవుతాయి.
ధనస్సు రాశి వారు ఇంటర్వ్యూలలో విజయం సాధిస్తారు. ప్రతి నిత్యం ఇంట్లో కానీ, వ్యాపార ప్రదేశాలలో కానీ ఇష్టమూలికా గుగ్గిలంతో 'దైవికం' అనే పొడితో ధూపం వేయండి. కుటుంబ పురోభివృద్ధి బాగుంటుంది. ఉన్నతాధికారుల మెప్పును అందుకోగలుగుతారు. కీర్తి, ప్రతిష్ఠలు పెరుగుతాయి. కొనుగోలు, అమ్మకాలు సాగిస్తారు. మారుతున్న కాలానికి అనుగుణంగా మీరు ప్రవర్తించ లేకపోతారు. నూతన వస్తువులు కొనుగోలు చేస్తారు.
ఈ రాశి వారికి ఈ రోజు అత్యంత ఆప్తులని మీరు భావించే వారితో అభిప్రాయ భేదాలు చోటు చేసుకుంటాయి. మీ శక్తి సామర్థ్యాలు మీకన్నా ఇతరులకు ఎక్కువగా ఉపయోగపడతాయి. ఆర్థికాభివృద్ధి కొరకు లక్ష్మీ కటాక్షాన్ని ఉపయోగించండి. ఇది చాలా మంచిది. సమస్యలను ఒక దారికి తీసుకువస్తారు. ఖర్చు అధికంగా ఉన్న సంతానవరం సంబంధిత పురోభివృద్ధి బాగుంటుంది. మిత్రుల వలన మేలు జరుగుతుంది.
కుంభ రాశి వారికి గుడ్‌విల్ మరింతగా పెంపొందుతుంది. అదృష్టాన్ని ఎక్కువగా నమ్ముతారు. అలాగని చేతులు కట్టుకుని ఊరికే కూర్చోరు. ప్రింటింగ్, స్టేషనరీ వ్యాపారస్తులకు అనుకూలంగా ఉంటుంది. భాగస్వాములతో అభిప్రాయ భేదాలు చోటు చేసుకుంటాయి. ముఖ్యమైన వ్యవహారాల వలన మానసిక వత్తిడి ఏర్పడుతుంది. లక్ష్మీప్రదమైన ముఖానికి, ఐశ్వర్యప్రాప్తికి ఈ లక్ష్మి చందనం ధరించడం వలన మేలు జరుగుతుంది.
ఈ రాశి వారికి ఈ రోజు వాహనాలు నడిపేటప్పుడు జాగ్రత్తలు పాటించండి. దైవ దర్శనం చేసుకుంటారు. అన్నదమ్ములతో ఏర్పడిన అంతర్గత విభేదాలు తలనొప్పిగా మారతాయి. తెల్లజిల్లేడు వత్తులతో అష్టమూలికా తైలంతో దీపారాధన చేయడం వలన విఘ్నేశ్వరుని అనుగ్రహం లభిస్తుంది. ఆర్థిక లావాదేవీలు కొంత ఊరట కలిగిస్తాయి. దీర్ఘకాలిక రుణాలు తీరుస్తారు. సభలు, సమావేశాల్లో దురుకుగా పాల్గొంటారు.
పంచాంగ కర్త: బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ - 9494981000
టాపిక్