నేటి రాశి ఫలాలు జూన్ 12, 2025: ఈరోజు ఈ రాశి వారికి పసుపు, ఎరుపు అదృష్ట రంగులు.. హనుమాన్ చాలీసా పఠించండి!-today rasi phalalu june 12th 2025 mesha rasi to meena rasi check horoscope ,రాశి ఫలాలు న్యూస్
తెలుగు న్యూస్  /  రాశి ఫలాలు  /  నేటి రాశి ఫలాలు జూన్ 12, 2025: ఈరోజు ఈ రాశి వారికి పసుపు, ఎరుపు అదృష్ట రంగులు.. హనుమాన్ చాలీసా పఠించండి!

నేటి రాశి ఫలాలు జూన్ 12, 2025: ఈరోజు ఈ రాశి వారికి పసుపు, ఎరుపు అదృష్ట రంగులు.. హనుమాన్ చాలీసా పఠించండి!

HT Telugu Desk HT Telugu

నేటి రాశి ఫలాలు (దిన ఫలాలు) తేదీ 12.06.2025 గురువారం కోసం పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ అందించారు. మేష రాశి నుంచి మీన రాశి వరకు 12 రాశుల దిన ఫలాలు ఇక్కడ తెలుసుకోండి.

నేటి రాశి ఫలాలు (freepik)

హిందుస్తాన్ టైమ్స్

రాశిఫలాలు (దిన ఫలాలు) : 12.06.2025

ఆయనము: ఉత్తరాయనం, సంవత్సరం: శ్రీ విశ్వావసునామ

మాసం: జ్యేష్ట, వారం : గురువారం, తిథి : కృ. పాడ్యమి, నక్షత్రం : మూల

మేష రాశి

మేష రాశి వారు ఈ రోజు కొత్త పనులకు శ్రీకారం చుడతారు. ఆర్థిక విషయాలు సంతృప్తినిస్తాయి. ముఖ్య విషయాలపై చర్చలు సాగిస్తారు. విద్యార్థులకు పోటీ పరీక్షల్లో అనుకూల ఫలితాలు, వాహనయోగం. బంధువుల నుంచి అందిన సమాచారం సంతోషం కలిగిస్తుంది. వ్యాపారాలలో చిక్కులు తొలగి ముందడుగు వేస్తారు. ఉద్యోగాలలో కోరుకున్న మార్పులు సంభవం. రాజకీయ వర్గాల శ్రమ ఫలిస్తుంది. వ్యయప్రయాసలు. గులాబీ, ఆకుపచ్చ రంగులు. సుబ్రహ్మణ్యస్తుతి మంచిది.

వృషభ రాశి

వృషభ రాశి వారు కొత్త పనులకు శ్రీకారం చుట్టి సకాలంలో పూర్తి చేస్తారు. శుభకార్యాలపై కొన్ని నిర్ణయాలు తీసుకుంటారు. భూ వివాదాలు కొంతమేర పరిష్కారమవుతాయి. వేధిస్తున్న కొన్ని సమస్యలు తీరి ఊరట లభిస్తుంది. గృహ నిర్మాణ యత్నాలలో కదలికలు ఉంటాయి. వ్యాపారాలు లాభాల దిశగా సాగుతాయి. ఉద్యోగాలలో చిక్కుల నుంచి బయటపడతారు. రాజకీయ వర్గాల కృషి ఫలిస్తుంది. ఆరోగ్య సమస్యలు, ఒత్తిడులు. ఎరుపు, బంగారు రంగులు. అన్నపూర్ణాష్టకం పఠించండి.

మిథున రాశి

ఈ రాశి వారికి ఈ రోజు కొన్ని పనులు నెమ్మదిగా పూర్తి చేస్తారు. శ్రమపడ్డా ఫలితం అంతగా కనిపించదు. ఆర్థిక లావాదేవీలు నిరాశాజనకంగా ఉంటాయి. నిర్ణయాలలో తొందరపాటు తగదు. కుటుంబంలో బాధ్యతలు పెరుగుతాయి. స్థిరాస్తుల కొనుగోలు ప్రయత్నాలలో ప్రతిబంధకాలు. వ్యాపారాలు సామాన్యంగా లాభిస్తాయి. ఉద్యోగాలలో పని ఒత్తిడులు మరింత పెరుగుతాయి. శుభవార్తలు, ధన, వస్తులాభాలు. ఎరుపు, పసుపు రంగులు. ఆంజనేయ దండకం పఠించండి.

కర్కాటక రాశి

కర్కాటక రాశి వారికి ఈ రోజు కొత్త పనులు చేపడతారు. ఆర్థిక విషయాలలో పురోగతి ఉంటుంది. రుణబాధల నుంచి బయటపడతారు. వాహనాలు, ఆభరణాలు కొనుగోలు చేస్తారు. వివాహ యత్నాలలో సానుకూల పరిస్థితులు. వ్యాపారాలు మరింత లాభిస్తాయి. ఉద్యోగాలలో అనుకూల మార్పులు ఉంటాయి. రాజకీయ వర్గాలకు కొత్త పదవులు దక్కుతాయి. బంధు విరోధాలు, అనారోగ్యం. పసుపు, ఆకుపచ్చ రంగులు. ఆదిత్య హృదయం పఠించండి.

సింహ రాశి

సింహ రాశి వారు ఏ పని చేపట్టినా విజయవంతంగా పూర్తి చేస్తారు. ఆర్థిక పరిస్థితిలో మెరుగుదల కనిపిస్తుంది. వివాహ యత్నాలు అనుకూలిస్తాయి. భూములు, వాహనాలు కొనుగోలు చేస్తారు. బంధువులతో ఉత్సాహంగా గడుపుతారు. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగాలలో మరింత ఉత్సాహంగా ఉంటుంది. రాజకీయ వర్గాలకు కొత్త ఆశలు చిగురిస్తాయి. ఆరోగ్య భంగం. ఎరుపు, గులాబీ రంగులు. నృసింహ స్తోత్రాలు పఠించండి.

కన్య రాశి

ఈ రాశి వారికి ఈ రోజు ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. ఇంతకాలం పడిన శ్రమ ఫలించే సూచనలు. జీవిత భాగస్వామి ద్వారా ఆస్తి లాభం ఉండవచ్చు. కుటుంబ సమస్యల నుంచి బయటపడతారు. గృహం, వాహనాలు కొనుగోలు చేస్తారు. వ్యాపారాలు విస్తరిస్తారు. పెట్టుబడులు సమకూరతాయి. ఉద్యోగాలలో చిక్కులు అధిగమిస్తారు. రాజకీయ వర్గాలకు మరింత ఉత్సాహవంతంగా ఉంటుంది. దూర ప్రయాణాలు. నీలం, నేరేడు రంగులు. శ్రీకృష్ణ స్తోత్రాలు పఠించండి.

తుల రాశి

తుల రాశి వారు ఆర్థిక విషయాలలో మరింత ప్రగతి కనిపిస్తుంది. నూతన వ్యవహారాలు ప్రారంభించి సకాలంలో పూర్తి చేస్తారు. ఇంటి నిర్మాణ యత్నాలు సానుకూలమవుతాయి. ఒక ఆహ్వానం ఉత్సాహాన్ని ఇస్తుంది. స్థిరాస్తులు కొనుగోలు చేస్తారు. వ్యాపారాల విస్తరణ కార్యక్రమాలు ముమ్మరం చేస్తారు. ఉద్యోగాలలో ఒడిదుడుకులు తొలగుతాయి. కళారంగం వారికి ప్రోత్సాహకరం. ధన వ్యయం. ఆకుపచ్చ, నేరేడు రంగులు. దుర్గాదేవి స్తోత్రాలు పఠించండి.

వృశ్చిక రాశి

ఈ రాశి వారికి ఈ రోజు ఒక వివాదం నుంచి గట్టెక్కి ఉపశమనం లభిస్తుంది. ఆర్థిక లావాదేవీలు కొంత నిరాశాజనకంగా ఉన్నా, అవసరాలకు సొమ్ము సమకూరుతుంది. నిరుద్యోగులకు అనుకూల వాతావరణం. వ్యాపారాలు నూతన పెట్టుబడులతో విస్తరిస్తాయి. ఉద్యోగాలలో మీ ప్రయత్నాలు సఫలం కాగలవు. కళారంగం వారికి నూతన ఉత్సాహం. ధన వ్యయం. పసుపు, ఆకుపచ్చ రంగులు. గణేశస్తోత్రాలు పఠించండి.

ధనుస్సు రాశి

ధనుస్సు రాశి వారు ముఖ్యమైన పనులు చకచకా పూర్తి కాగలవు. సమాజంలో మీ పట్ల ఆదరాభిమానాలు పెరుగుతాయి. రావలసిన సొమ్ము సమయానికి అందుకుంటారు. ఇంటా బయటా ప్రోత్సాహకరంగా ఉంటుంది. వ్యాపారాలు గతం కంటే మెరుగుపడి లాభాలు అందుతాయి. ఉద్యోగాలలో బాధ్యతలు సమర్థవంతంగా నిర్వహిస్తారు. పారిశ్రామిక వర్గాల కృషి ఫలించే సూచనలు. ఆరోగ్య భంగం. బంగారు, ఎరుపు రంగులు. శ్రీరామరక్షాస్తోత్రాలు పఠించండి.

మకర రాశి

ఈ రాశి వారికి ఈ రోజు ముఖ్యమైన వ్యవహారాల్లో విజయం. ఆప్తులు మరింత దగ్గరవుతారు. తగిన ఆలోచనలతో సమస్యలు పరిష్కరించుకుంటారు. స్థిరాస్తి వృద్ధి. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. కొన్ని రుణాలు సైతం తీరుస్తారు. నిరుద్యోగులు ఇంటర్వ్యూలు అందుకుంటారు. వ్యాపారాలు వుంజుకుంటాయి. ఉద్యోగాలలో చిక్కులు తొలగుతాయి. పారిశ్రామిక వర్గాలకు విదేశీ పర్యటనలు. కుటుంబంలో సమస్యలు. ఎరుపు, నేరేడు రంగులు. శ్రీరామరక్షాస్తోత్రాలు పఠించండి.

కుంభ రాశి

అనుకున్న వ్యవహారాలు సకాలంలో పూర్తి చేస్తారు. ఆర్థిక పరిస్థితి గతం కంటే మెరుగ్గా ఉంటుంది. అందరిలోనూ గౌరవ మర్యాదలు పొందుతారు. వాహనాలు, ఆభరణాలు కొనుగోలు చేస్తారు. ఆశయాలు సిద్ధిస్తాయి. వ్యాపారాలు మరింత పుంజుకుంటాయి. ఉద్యోగాలలో అనుకోని హోదాలు దక్కే సూచనలు. కళారంగం వారి యత్నాలు కొలిక్కి వస్తాయి. అనారోగ్యం. కుటుంబ సభ్యుల నుంచి ఒత్తిడులు. నేరేడు, పసుపు రంగులు. సుబ్రహ్మణ్యేశ్వరుని పూజించండి.

మీన రాశి

మీన రాశి వారికి ఈ రోజు ముఖ్యమైన వ్యవహారాలు ఆటంకాలు అధిగమించి పూర్తి చేస్తారు. రావలసిన బాకీలు అంది అవసరాలు తీరతాయి. విద్యార్థులు పట్టుదలతో అనుకున్నది సాధిస్తారు. వ్యాపారాలలో ఆశించిన లాభాలు. ఉద్యోగాలలో పనిభారం తగ్గే సూచనలు. పారిశ్రామిక వర్గాలకు అవకాశాలు మరింత పెరుగుతాయి. అనుకోని ప్రయాణాలు. సోదరుల నుంచి ఒత్తిడులు తప్పవు. పసుపు, ఎరుపు రంగులు. హనుమాన్ చాలీసా పఠించండి.

పంచాంగ కర్త: బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ - 9494981000

పంచాంగకర్త చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ
పంచాంగకర్త చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ

హెచ్ టీ తెలుగు డెస్క్ టీమ్ సుశిక్షితులైన, సుదీర్ఘ అనుభవం ఉన్న జర్నలిస్టులతో కూడిన బృందం. ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు సహా అన్ని విభాగాలకు ఆయా రంగాల వార్తలు అందించడంలో నైపుణ్యం కలిగిన సబ్ ఎడిటర్లతో కూడిన బృందం. జర్నలిజం విలువలను, ప్రమాణాలను కాపాడుతూ జర్నలిజంపై అత్యంత మక్కువతో పనిచేస్తున్న బృందం. సంపూర్ణ వార్తావిలువలతో కూడిన కథనాలను పాఠకుల ముందుకు తెస్తున్న బృందం.