నేటి రాశి ఫలాలు జూన్ 11, 2025: ఈరోజు ఈ రాశి వారికి ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం.. కొత్త కార్యక్రమాలు సకాలంలో పూర్తి చేస్తారు!-today rasi phalalu june 11th 2025 mesha rasi to meena rasi check horoscope ,రాశి ఫలాలు న్యూస్
తెలుగు న్యూస్  /  రాశి ఫలాలు  /  నేటి రాశి ఫలాలు జూన్ 11, 2025: ఈరోజు ఈ రాశి వారికి ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం.. కొత్త కార్యక్రమాలు సకాలంలో పూర్తి చేస్తారు!

నేటి రాశి ఫలాలు జూన్ 11, 2025: ఈరోజు ఈ రాశి వారికి ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం.. కొత్త కార్యక్రమాలు సకాలంలో పూర్తి చేస్తారు!

HT Telugu Desk HT Telugu

నేటి రాశి ఫలాలు (దిన ఫలాలు) తేదీ 11.06.2025 బుధవారం కోసం పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ అందించారు. మేష రాశి నుంచి మీన రాశి వరకు 12 రాశుల దిన ఫలాలు ఇక్కడ తెలుసుకోండి.

నేటి రాశి ఫలాలు (freepik)

హిందుస్తాన్ టైమ్స్

రాశిఫలాలు (దిన ఫలాలు) : 11.06.2025

ఆయనము: ఉత్తరాయనం, సంవత్సరం: శ్రీ విశ్వావసునామ

మాసం: జ్యేష్ట, వారం : బుధవారం, తిథి : శు. పూర్ణిమ, నక్షత్రం : జ్యేష్ఠ

మేష రాశి

మేష రాశి వారు ఈరోజు పోటీ పరీక్షలలో విజయం సాధిస్తారు. వృత్తి, వ్యాపారాలను విస్తరిస్తారు. రాజకీయ, కళారంగాలలో ఉన్నవారికి అనుకూలమైన కాలం. ప్రయాణాలు లాభసాటిగా సాగుతాయి. ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. నిత్యం “ఓం నమో నారాయణాయ” వత్తులతో అష్టమూలికా తైలాన్ని కలిపి దీపారాధన చేయడం అన్ని విధాలా మంచిది.

వృషభ రాశి

కాంట్రాక్టులు క్రమానుసారం దక్కుతాయి. వృత్తి, వ్యాపారాలలో స్వల్ప లాభాలు పొందుతారు. జీవిత భాగస్వామి నుండి సహాయం, సహకారాలు లభిస్తాయి. భూముల క్రయవిక్రయాలలో లాభాలు కనిపిస్తాయి. దూర ప్రాంతాల నుండి కీలక సమాచారం అందుతుంది. ప్రతి నిత్యం ఇంటి లేదా వ్యాపార ప్రవేశాల వద్ద అష్టమూలికా గుగ్గిలంతో ధూపం వేయడం శుభప్రదం.

మిథున రాశి

మిథున రాశి వారికి భూమి సంబంధిత వివాదాలు పరిష్కారమవుతాయి, నూతన ఒప్పందాలు కుదురుతాయి. సంతానం సాంకేతిక విద్యావకాశాలను పొందుతుంది. నిత్యం మహాతీర్థం పొడితో అభిషేకాలు, పూజలు చేయడం మంచిఫలితాలు ఇస్తుంది. ఇష్టదేవత అనుగ్రహం కలుగుతుంది. కాంట్రాక్టులు, లీజులు, సబ్‌కాంట్రాక్టులు లభిస్తాయి. ఉద్యోగాలలో పదోన్నతులు సాధ్యమవుతాయి.

కర్కాటక రాశి

కర్కాటక రాశి వారికి రాబడి రెండు లేదా మూడు మార్గాల్లో వస్తుంది. దీర్ఘకాలిక రుణాలకు ఊరట లభిస్తుంది. మీలోని ప్రతిభ వెలుగులోకి వస్తుంది. శ్రమకు తగిన ఫలితం దక్కుతుంది. నిత్యం “ఓం నమః శివాయ” వత్తులతో అష్టమూలికా తైలాన్ని కలిపి దీపారాధన చేయడం అన్నివిధాలా మంచిది. ఆస్తి వివాదాలు సద్దుమణిగి, కొత్త ఒప్పందాలు కుదురుతాయి.

సింహ రాశి

ఈ రాశి వారు ఈరోజు ప్రయాణాలలో తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు. నిత్యం సర్వదోష నివారణ చూర్ణంతో సర్వరక్షా చూర్ణాన్ని కలిపి స్నానం చేయడం వలన గ్రహబాధలు తొలగుతాయి. వృత్తి, వ్యాపారాలలో ఆటంకాలు ఎదురైనా, వాటిని అధిగమించి ముందుకు సాగుతారు. రాజకీయ, పారిశ్రామిక రంగాలలో కొంత అనుకూలత కనిపిస్తుంది.

కన్య రాశి

కన్య రాశి వారికి ఈ రోజు అన్ని విధాలుగా పైచేయి ఉంటుంది. వివాహం, ఉద్యోగ యత్నాలు ఫలిస్తాయి. వృత్తి, వ్యాపారాలను విస్తరిస్తారు. గృహ నిర్మాణ ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. పెట్టుబడులకు తగిన లాభాలు పొందుతారు. ఇంటా బయట అనుకూలత ఉంటుంది. ఇతరుల విషయాలలో జోక్యం వద్దు. నిత్యం కుబేర కంకణం ధరించడం అన్ని విధాలా మేలు కలిగిస్తుంది.

తుల రాశి

తుల రాశి వారు కొత్త కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. ముఖ్యమైన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. వివాదాలు, కోపతాపాలకు దూరంగా ఉండటం మంచిది. ఆర్థిక వ్యవహారాలలో ఆటుపోట్లు ఎదురైనా మీరు వాటిని అధిగమిస్తారు. పనులు కొంచెం నిదానంగా సాగుతాయి. లక్ష్మీ కటాక్షం కోసం ఐశ్వర్య నాగినిను ఉపయోగించడం శుభప్రదం.

వృశ్చిక రాశి

“తన శాంతమే తనకు రక్ష” అన్న నానుడిని గుర్తుంచుకోండి. అనవసరమైన వివాదాలు కాలహరణానికి కారణమవుతాయి. చెల్లించాల్సిన ఋణాల కోసం ఒత్తిడి పెరుగుతుంది. విద్యారంగంలో ప్రోత్సాహకర ఫలితాలు ఉంటాయి. నిత్యం దీపారాధన కుందిలో పరిమళ గంధం రెండు చుక్కలు వేయడం శుభప్రదం.

ధనుస్సు రాశి

ధనుస్సు రాశి వారు ఈ రోజు ఒక్క క్షణం కూడా వృథా చేయకుండా, సమయాన్ని సద్వినియోగం చేసుకుంటారు. గృహనిర్మాణంలో సఫలత దక్కుతుంది. సభలు, సమావేశాల్లో చురుకుగా పాల్గొంటారు. నిత్య యజ్ఞభస్మం ధరించడం వలన యజ్ఞ ఫలితాన్ని పొందుతారు. దీర్ఘకాలిక సమస్యలు తొలగి ఊరట లభిస్తుంది. కాంట్రాక్టులు, అవకాశాలు లభిస్తాయి.

మకర రాశి

మకర రాశి వారికి ఈ రోజు శుభకార్యాలు అనుకూలిస్తాయి. వృత్తిపరంగా కనబరచే ఓర్పు మంచి ఫలితాలు ఇస్తుంది. జీవిత భాగస్వామితో అభిప్రాయ భేదాలు కలగవచ్చు. వాటిని తెలివిగా అధిగమించాలి. సిద్ధగంధంతో శ్రీ వేంకటేశ్వర స్వామి పూజ చేయడం మంచి ఫలితాన్ని ఇస్తుంది. భాగస్వామ్య వ్యాపారాలు విస్తరిస్తాయి. ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం. కొత్త కార్యక్రమాలు సకాలంలో పూర్తి చేస్తారు.

కుంభ రాశి

కుంభ రాశి వారికి ఆర్థిక లావాదేవీలు సంతృప్తికరంగా ఉంటాయి. జీవిత భాగస్వామి సలహాతో కొత్త కార్యక్రమాలు మొదలవుతాయి. అరటినార వత్తులు, అష్టమూలికా తైలంతో దీపారాధన చేయడం వలన సంతాన సంబంధ పురోగతి ఉంటుంది. ఉద్యోగాల్లో ఇంక్రిమెంట్లు, పదోన్నతులు అందుతాయి. అదృష్టం, శుభ ఫలితాలు సమీపంలో ఉంటాయి.

మీన రాశి

మీన రాశి వారికి ఆర్థికంగా అనుకూలంగా ఉన్నా, కొన్ని చెల్లింపులు ఆలస్యం కావచ్చు. వృత్తి, ఉద్యోగాల పరంగా ప్రత్యేక మార్పులు ఉండకపోవచ్చు. శక్తి కంకణం ధరించడం శుభప్రదం. ఉన్నత విద్య, విదేశీ ఉద్యోగాలకు చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. “కోటి విద్యలు కూటి కోసమే” అన్నట్లు అభివృద్ధికి మీరు ప్రయత్నిస్తారు. వస్తువుల సేకరణ జరుగుతుంది.

పంచాంగ కర్త: బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ -9494981000

పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ
పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ

హెచ్ టీ తెలుగు డెస్క్ టీమ్ సుశిక్షితులైన, సుదీర్ఘ అనుభవం ఉన్న జర్నలిస్టులతో కూడిన బృందం. ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు సహా అన్ని విభాగాలకు ఆయా రంగాల వార్తలు అందించడంలో నైపుణ్యం కలిగిన సబ్ ఎడిటర్లతో కూడిన బృందం. జర్నలిజం విలువలను, ప్రమాణాలను కాపాడుతూ జర్నలిజంపై అత్యంత మక్కువతో పనిచేస్తున్న బృందం. సంపూర్ణ వార్తావిలువలతో కూడిన కథనాలను పాఠకుల ముందుకు తెస్తున్న బృందం.