హిందుస్తాన్ టైమ్స్
రాశిఫలాలు (దిన ఫలాలు) : 10.06.2025
ఆయనము: ఉత్తరాయనం, సంవత్సరం: శ్రీ విశ్వావసునామ
మాసం: జ్యేష్ఠ, వారం : మంగళవారం, తిథి : శు. చతుర్దశి, నక్షత్రం : అనూరాధ
మేష రాశి వారు ఈ రోజు బంధుమిత్రులతో జాగ్రత్తగా ఉండటం మంచిది. చేసే పనుల్లో ఇబ్బందులు ఉండవచ్చు కాబట్టి, కొత్త పనులను ప్రారంభించడం కొంత ఆలస్యం చేయడం మంచిది. గృహంలో జరిగే మార్పులు మానసిక ఆందోళన కలిగించవచ్చు. ప్రయాణాల్లో అప్రమత్తంగా ఉండాలి. ఆకస్మిక ధన నష్టం ఏర్పడే అవకాశం ఉంది. వృత్తిరీత్యా కొన్ని కొత్త సమస్యలు ఎదురవుతాయి. బంధుమిత్రులతో కలహాలు తలెత్తకుండా సంయమనం పాటించాలి.
శుభవార్తలు వింటారు. ఆకస్మిక ధనలాభంతో ఆనందంగా గడుపుతారు. ప్రయత్నించే పనుల్లో విజయాలు సాధిస్తారు. కీర్తి, ప్రతిష్ఠ పెరుగుతుంది. విందులు, వినోదాల్లో పాల్గొంటారు. కొత్త వస్త్రాలు, వాహనం, ఆభరణాల లాభం లభిస్తుంది. ముఖ్యమైన కార్యక్రమం విజయవంతంగా పూర్తవుతుంది. శుభకార్యాల యోగం ఉంది. బంధుమిత్రులతో కలసి ఆనందంగా గడుపుతారు.
మిధున రాశి వారికి ఈ రోజు ప్రయాణాలు అధికంగా చేయవలసి రావచ్చు. ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం. అనవసర ఖర్చులు ఆందోళన కలిగించవచ్చు. విదేశీ ప్రయాణ యత్నాలు సులభతరం అవుతాయి. ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం. వ్యవసాయ రంగంలోని వారికి లాభాలు లభించవచ్చు. తొందరపాటు వల్ల పనులు విఫలమయ్యే అవకాశం ఉంది. చెడు వ్యక్తుల నుండి దూరంగా ఉండడం మంచిది. ఋణప్రయత్నాలు ఫలించవచ్చు. ఆకస్మిక భయాలు, మానసిక ఉద్వేగాలు కనిపించొచ్చు.
కర్కాటక రాశి వారి ప్రయత్నాలు త్వరగా ఫలించొచ్చు. స్థాన మార్పుల సూచనలు ఉన్నాయి. శుభకార్యాల వల్ల ధన వ్యయం అధికంగా ఉంటుంది. అనారోగ్య సమస్యలు వ్యయాన్ని పెంచుతాయి. ఆరోగ్యంపై శ్రద్ధ తీసుకోవాలి. వృత్తి, ఉద్యోగరంగాల్లో అభివృద్ధి సాధ్యం. కొత్త వ్యక్తులపై పూర్తిగా నమ్మక పెట్టకూడదు. ప్రయత్న కార్యాలు విజయవంతంగా సాగతాయి. చెడు అలవాట్ల నుండి దూరంగా ఉండటం మంచిది.
సింహ రాశి వారికి ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. విదేశీయాన యత్నాలకు మార్గం అనుకూలంగా ఉంటుంది. కుటుంబ కలహాలకు దూరంగా ఉండటం శ్రేయస్కరం. సహనం పాటించడం మేలుగా మారుతుంది. డబ్బును పొదుపుగా వాడతారు. కొత్త కార్యాలకు చక్కని రూపకల్పన చేస్తారు. ఆకస్మిక ధనలాభం కలిగే అవకాశం ఉంది. కుటుంబంలో ఆనందమయ వాతావరణం ఏర్పడుతుంది. బంధుమిత్రులతో విందులు, వినోదాలు జరుపుతారు. శుభవార్తలు విని మానసిక ఉల్లాసం పొందుతారు.
కన్య రాశి వారికి ఈరోజు స్థిరాస్తుల విషయాల్లో జాగ్రత్త అవసరం. నిరుత్సాహంగా గడిపే అవకాశముంది. అపకీర్తి వచ్చే అవకాశం ఉంది కాబట్టి, ఇతరులకు హానికరమైన పనులకు దూరంగా ఉండాలి. పరిశుభ్రతకు ప్రాధాన్యం ఇస్తే అనారోగ్య సమస్యలు తగ్గుతాయి. కోపాన్ని అదుపులో ఉంచాలి. మానసిక ఆందోళనను తొలగించేందుకు ధ్యానం ఉపయుక్తం. శారీరకంగా బలహీనత అనిపించవచ్చు. కుటుంబ పరిస్థితులు ఆశాజనకంగా ఉండకపోవచ్చు. అనవసర ప్రయాణాలు అధికంగా చేయవలసి వస్తుంది.
పిల్లల వల్ల కొన్ని సమస్యలు ఎదురవవచ్చు. కలలో చూసిన కొన్ని పనులు నిజంగా పూర్తవుతాయి. అనారోగ్య సమస్యలు తగ్గుతాయి. ప్రయాణాలు లాభదాయకంగా ఉంటాయి. కొత్త వ్యక్తుల పరిచయమవుతారు. బుణప్రయత్నాలు సులభంగా ఫలిస్తాయి. కుటుంబంలో అనారోగ్య సమస్యలు ఉండొచ్చు. బంధుమిత్రులతో విబేధాలు తలెత్తకుండా జాగ్రత్తగా మెలగాలి. వ్యవహారాల్లో కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి. వృత్తి రంగంలో స్థాన మార్పు కలిగే అవకాశం ఉంది.
ఈ రోజు వృత్తిరీత్యా అనుకూల స్థాన మార్పు సంభవిస్తుంది. ఆర్థిక ఇబ్బందులు కలగవచ్చు. కలహాలకు దూరంగా ఉండటం మేలుకలిగించుతుంది. అనారోగ్య సమస్యల నివారణకు ఔషధ సేవ అవసరం. స్థిరాస్తుల విషయంలో తొందర నిర్ణయాలు మంచివికావు. రాజకీయ రంగంలో ఉన్నవారికి విజయ యోగం. అన్ని ప్రయత్నాలు విజయవంతం కావచ్చు. శుభకార్యాలు సులభంగా నెరవేరతాయి. ఆరోగ్యంగా ఉంటారు. ఇతరులకు సహాయం చేయడం వల్ల గౌరవం పొందుతారు.
ధనుస్సు రాశి వారికి అనారోగ్య సమస్యలు చికాకు కలిగించవచ్చు. స్థాన మార్పు సూచనలు కనిపిస్తాయి. కొత్త వ్యక్తులతో పరిచయమవుతారు. కుటుంబంలో సంతృప్తికరత లోపించవచ్చు. గృహంలో మార్పుల ఆకాంక్ష కలుగుతుంది. ఆర్థిక ఇబ్బందులు క్రమంగా తగ్గుతాయి. ఇతరుల విమర్శలు ఎదురవుతాయి. నిర్ణయాలు తీసుకోవడంలో అయోమయం కనిపిస్తుంది. ఆకస్మిక ధన వ్యయం సంభవిస్తుంది. బంధుమిత్రులతో జాగ్రత్తగా ఉండాలి. ఋణప్రయత్నాలు చేస్తారు.
శుభకార్యాలు సులభంగా నెరవేరతాయి. బంధుమిత్రులతో ఆనందంగా గడుపుతారు. ప్రయాణాల ద్వారా లాభం పొందుతారు. శ్రమకు తగిన ఫలితం లభిస్తుంది. ఆర్థికంగా స్థిరంగా ఉంటారు. గౌరవం, మర్యాద లభిస్తుంది. మానసిక ఆందోళన ఉంటేనూ, రోజంతా సాఫీగా సాగుతుంది. ఆకస్మిక ధన నష్టం సంభవించవచ్చు. అధికారులతో జాగ్రత్తగా మెలగడం మంచిది. అనవసర భయాలను తృణీకరించాలి. విరోధాలు తలెత్తకుండా ఉండాలి.
కళారంగం, మీడియా రంగాలకు చెందిన కుంభ రాశి వారికి మంచి అవకాశాలు లభిస్తాయి. దేహ శుభ్రత, అలంకరణకు ప్రాధాన్యం ఇస్తారు. కుటుంబం ఆనందంగా ఉంటుంది. బంధుమిత్రుల సందర్శన ఉంటుంది. పేరు, ప్రతిష్ఠలు పెరుగుతాయి. కొత్త వస్తువులు, ఆభరణాలు లభిస్తాయి. ఆకస్మిక ధనలాభం యోగం ఉంది. సంఘంలో గౌరవం పొందుతారు. స్త్రీలకు సౌభాగ్యం పెరుగుతుంది. కొంతమంది ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొనవచ్చు. వృత్తి, ఉద్యోగరంగాల్లో అపార్ధాలు సంభవించవచ్చు.
ఈ రోజు ముఖ్యమైన సమాచారాన్ని అందుకుంటారు. ఆకస్మిక ధన లాభయోగం ఉంది. ప్రయత్నాలు విజయవంతం అవుతాయి. బంధుమిత్రులతో కలిసివుంటారు. క్రీడా, రాజకీయ రంగాలవారికి ఉత్సాహం అధికంగా ఉంటుంది. స్త్రీలు ఆనందంగా గడుపుతారు. అకాల భోజనం వల్ల ఆరోగ్య సమస్యలు కలగవచ్చు. పిల్లల జిడ్డుదనంతో సమస్యలు ఎదురవవచ్చు. చెడు అలవాట్లకు దూరంగా ఉండాలి. కోపాన్ని అదుపులో ఉంచితే శ్రేయస్సు పొందుతారు. కొత్త పనులు ప్రారంభించడం మంచిది కాదు.
పంచాంగ కర్త: బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ - 9494981000
టాపిక్