హిందుస్తాన్ టైమ్స్
రాశిఫలాలు (దిన ఫలాలు) : 07.07.2025
ఆయనము: ఉత్తరాయనం, సంవత్సరం: శ్రీ విశ్వావసునామ
మాసం: ఆషాడ, వారం : సోమవారం, తిథి : శు. ద్వాదశి, నక్షత్రం : అనూరాధ
మేష రాశి వారి పనులు సకాలంలో పూర్తవుతాయి. వ్యాపారం నిరాటకంగా సాగుతుంది. ఆదాయం పెరుగుతుంది. పాత బాకీలు వసూలవుతాయి. పెట్టుబడులకు ప్రతిఫలాలు పొందుతారు. ఆస్తి తగాదాలు పరిష్కారం అవుతాయి. వ్యాపారులకు అనుకూల సమయం. భాగస్వాములతో సంబంధాలు పెరుగుతాయి. అనుభవజ్ఞుల సలహాలు, సూచనలను తీసుకుంటారు. వివాహాది శుభకార్య ప్రయత్నాలు కలిసివస్తాయి. సాయిబాబా ఆలయాన్ని సందర్శించండి.
వృషభ రాశి వారు సహోద్యోగులతో, అధికారులతో సత్సంబంధాలు కొనసాగిస్తారు. నలుగురిలో గుర్తింపు పొందుతారు. భక్తి పెరుగుతుంది. నలుగురిలో మంచిపేరు సంపాదిస్తారు. ఆరోగ్యంపై శ్రద్ధ చూపుతారు. అనవసరమైన విషయాల జోలికి వెళ్లకుండా కార్యనిర్వహణపై మనసు నిలుపుతారు. వివాహాది శుభకార్యాలకు బంధుమిత్రుల సహకారం లభిస్తుంది. ఆదాయం పెరుగుతుంది. కొత్త వస్తువులు కొనుగోలు చేస్తారు. కోర్టు కేసుల్లో అనుకూల ఫలితాలు ఉంటాయి. శివారాధన శుభప్రదం.
మిథున రాశి విద్యార్థులు చదువులో రాణిస్తారు. కుటుంబంతో సంతోషంగా ఉంటారు. నిర్మాణ కార్యక్రమాలపై మనసు నిలుపుతారు. తలపెట్టిన పనులు సకాలంలో పూర్తవుతాయి. అనవసరమైన ఖర్చులు ముందుకు రావచ్చు. వ్యాపారం సంతృప్తికరంగా కొనసాగుతుంది. ఉద్యోగం స్థిరంగా ఉంటుంది. ఆదాయం పెరుగుతుంది. ఉత్సాహంగా ఉంటూ పనులు చేస్తారు. నలుగురిలో గుర్తింపు పొందుతారు. దుర్గాదేవి ఆలయాన్ని సందర్శించండి.
కర్కాటక రాశి వారికి ప్రయాణాలు అనుకూలిస్తాయి. ఆరోగ్యం స్థిరంగా ఉంటుంది. డబ్బు చేతికి రావడంలో ఇబ్బందులున్నాయి. చెల్లింపుల విషయంలో ఒత్తిడి పెరుగుతుంది. శుభకార్య ప్రయత్నాలలో అందరి సహకారం తీసుకుంటారు. ఇంట్లోకి కొత్త వస్తువులు కొనుగోలు చేస్తారు. ఉత్సాహంతో పనులు చేస్తారు. వ్యవసాయదారులకు, పారిశ్రామికవేత్తలకు అనుకూల సమయం. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. విందులకు హాజరవుతారు. గణపతి ఆరాధన మేలు చేస్తుంది.
సింహ రాశి వారు పనులు సకాలంలో పూర్తవుతాయి. వివాహాది శుభకార్య విషయాలలో అందరి సహకారం లభిస్తుంది. ఆదాయం స్థిరంగా ఉంటుంది. రావలసిన డబ్బు చేతికి అందుతుంది. కొత్త ఉద్యోగంలో చేరతారు. సంతృప్తిగా ఉంటారు. సమాజంలో గుర్తింపు లభిస్తుంది. నలుగురికి సాయం చేస్తారు. వ్యాపార విస్తరణపై మనసు నిలుపుతారు. ఆర్థికంగా స్థిరంగా ఉంటారు. భాగస్వాములతో సత్సంబంధాలు ఉంటాయి. అధికారుల ఆదరణ ఉంటుంది. ఇష్టదైవరాధన చేసుకోండి.
వ్యాపారం లాభసాటిగా కొనసాగుతుంది. వృత్తిపరంగా సంతృప్తిగా ఉంటారు. ఊహించని ఖర్చుల మూలంగా పనుల్లో జాప్యం ఉంటుంది. కొత్త పరిచయాలు ఏర్పడతాయి. ఉద్యోగులకు పనిభారం పెరుగుతుంది. ఆరోగ్యంగా ఉంటారు. తీర్థయాత్రలు, విహారయాత్రలపై మనసు నిలుపుతారు. కళాకారులకు, సాహితీవేత్తలకు మంచి అవకాశాలు వస్తాయి. ఆస్తుల విషయంలో తగాదాలు కొనసాగుతాయి. అధికారులతో అభిప్రాయ భేదాలు రావచ్చు. నవగ్రహాలకు ప్రదక్షిణలు చేయండి.
తుల రాశి వారి పిల్లలు చదువులో రాణిస్తారు. ప్రాథమిక చదువులకు అనుకూలం. శుభకార్య ప్రయత్నాలు ఫలిస్తాయి. దూరపు ప్రయాణాలు వాయిదా పడతాయి. వివాదాలకు దూరంగా ఉంటారు. ఆత్మీయులు, స్నేహితులతో పనులు నెరవేరుతాయి. ఆరోగ్యంపై మనసు నిలుపుతారు. భక్తి పెరుగుతుంది. నలుగురిలో గుర్తింపు లభిస్తుంది. కుటుంబంతో సంతోషంగా కాలం గడుపుతారు. రైతులకు రాబడి పెరుగుతుంది. శ్రమకు తగ్గ ఫలితం పొందుతారు. సుబ్రహ్మణ్యస్వామి ఆరాధన మేలుచేస్తుంది.
రావలసిన డబ్బు చేతికి అందుతుంది. ఆదాయం స్థిరంగా ఉండి, క్రమేణా పెరుగుతుంది. వ్యాపార విస్తరణపై మనసు నిలుపుతారు. భక్తి పెరుగుతుంది. విద్యార్థులకు శ్రమతో కూడిన ఫలితాలు ఉంటాయి. నలుగురిలో గుర్తింపు లభిస్తుంది. బంధుమిత్రుల రాకతో సంతృప్తిగా ఉంటారు. పనులు నెరవేరుతాయి. పనుల్లో బరువు, బాధ్యతలు పెరుగుతాయి. వ్యాపారం లాభసాటిగా కొనసాగుతుంది. కుటుంబంతో సంతోషంగా కాలం గడుపుతారు. రామాలయాన్ని సందర్శించండి.
ధనుస్సు రాశి వారు ఆదాయ మార్గాలపై మనసు నిలుపుతారు. ప్రయాణాలు అనుకూలిస్తాయి. ఆరోగ్యంగా ఉంటారు. ఆత్మీయుల సహకారంతో పనులు నెరవేరుతాయి. భూముల కొనుగోలు విషయంలో వివాదాలు తలెత్తుతాయి. కోర్టు కేసుల్లో అనుకూల ఫలితాలు ఉంటాయి. భక్తి పెరుగుతుంది. కుటుంబపెద్దల సహకారంతో పనులు పూర్తవుతాయి. ఊహించని ఖర్చుల మూలంగా ఇబ్బందులు ఉంటాయి. సహోద్యోగులతో చిన్నపాటి మనస్పర్థలు రావచ్చు. గోమాత సేవ చేసుకోండి.
ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. కొత్త ఉద్యోగంలో చేరతారు. ఆదాయం పెరుగుతుంది. పెద్దల సహకారం లభిస్తుంది. విద్యార్థులు చదువులో రాణిస్తారు. ఉన్నత విద్యా ప్రయత్నాలు ఫలిస్తాయి. వ్యాపారం నిరాటంకంగా కొనసాగుతుంది. రాజకీయ, కోర్టు, ప్రభుత్వ పనుల్లో అనుకూల ఫలితాలు ఉంటాయి. ఆరోగ్యంపై మనసు నిలుపుతారు. అనవసరమైన ఆలోచనలను పక్కన పెట్టి, పనులు పూర్తిచేయడంపై శ్రద్ధ చూపుతారు. నరసింహస్వామి ఆరాధన మేలుచేస్తుంది.
కుంభ రాశి వారి ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాలకు హాజరవుతారు. అనవసరమైన కాలయాపన, ఖర్చులు ఉండవచ్చు. ప్రారంభించిన పనుల్లో శ్రమ అధికంగా ఉంటుంది. ఇంటి వాతావరణం సంతృప్తికరంగా ఉంటుంది. కుటుంబసభ్యుల సహకారం లభిస్తుంది. వివాదాలకు దూరంగా ఉంటారు. సహోద్యోగులు, అధికారులతో అభిప్రాయ భేదాలు రావచ్చు. సంయమనంతో పనులు చేసుకోవడం అవసరం. కళాకారులకు ఆదాయం కలిసి వస్తుంది. శివారాధన శుభప్రదం.
మీన రాశి వారు ఉత్సాహంతో ఉంటారు. ఆరోగ్యంపై మనసు నిలుపుతారు. ప్రయాణాలు కలిసివస్తాయి. శుభకార్యాల వల్ల ఖర్చులు పెరగవచ్చు. బంధుమిత్రుల రాకతో సంతృప్తిగా ఉంటారు. సాహసంతో నిర్ణయాలు తీసుకుంటారు. రావలసిన డబ్బు చేతికి అందుతుంది. తలపెట్టిన పనులు సకాలంలో పూర్తవుతాయి. కళాకారులకు కొత్త అవకాశాలు వస్తాయి. ఆదాయం పెరుగుతుంది. కష్టానికి తగిన ప్రతిఫలం ఉంటుంది. విద్యార్థులకు అనుకూలం. నలుగురిలో గుర్తింపు లభిస్తుంది. హనుమాన్ చాలీసా పఠించండి.
పంచాంగ కర్త: బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ - 9494981000
టాపిక్