హిందుస్తాన్ టైమ్స్
రాశిఫలాలు (దిన ఫలాలు) : 06.07.2025
ఆయనము: ఉత్తరాయనం, సంవత్సరం: శ్రీ విశ్వావసునామ
మాసం: ఆషాడ, వారం : ఆదివారం, తిథి : శు. ఏకాదశి, నక్షత్రం : విశాఖ
మేష రాశి వారికి ఈ రోజు నూతన విషయాలు తెలుసుకుంటారు. వివాదాలకు, కోపతాపాలకు దూరంగా ఉండటం అన్ని విధాలా మంచిది. ఇతరుల విషయంలో జోక్యం తగదు. మహాతీర్థం పొడితో చేసే అభిషేకాలు, స్వశక్తితో ముఖ్యమైన వ్యవహారాలు పూర్తి చేస్తారు. రాజకీయ, కళా, పారిశ్రామిక, క్రీడా రంగాలలోని వారికి సన్మానాలు, సత్కారాలు పొందుతారు.
వృషభ రాశి వారికి ఈ రోజు ఆర్థిక పరిస్థితి సంతృప్తికరంగా ఉంటుంది. ఆరోగ్య సమస్యలు ఎదురై చికాకులు పెడతాయి. ఇతరుల విషయాలలో జోక్యం తగదు. వృత్తి వ్యాపారాలలో ఆటంకాలు ఎదురైనా సన్నిహితుల సాయంతో కొంతవరకు తొలగుతాయి. కాంట్రాక్టులు లాభిస్తాయి. నిత్యం దైవ కార్యక్రమాలలో ప్రధను తాంబూలం ఉపయోగించదగినది.
మిథున రాశి వారికి ఈ రోజు ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి. క్రయ, విక్రయాలలో లాభాలు పొందుతారు. చేపట్టిన పనులలో ఆటంకాలు ఎదురై చికాకులు పెడతాయి. నిత్యం అరటినార వత్తులు అష్టమూలికా తైలంతో కలిపి దీపారాధన చేయటం అన్ని విధాలా మంచిది. వృత్తి సంబంధమైన వ్యవహారాలలో ఒత్తిడి అధికం అవడం వల్ల శరీరం అలసటకు గురౌతుంది.
ఈ రాశి వారికి ఈరోజు దూరప్రాంతాలలో వున్న బంధువుల నుండి శుభవార్తలు వింటారు. మీ గురించి చెడుగా ప్రచారం చేసే వ్యక్తుల నుండి దూరంగా ఉండటం మంచిది. ఆర్థికపరమైన సమస్యలు పెద్దల సహకారం వల్ల సానుకూలంగా పరిష్కరించబడతాయి. ఆరోగ్యం పట్ల తగ్గు శ్రద్ధ తీసుకోవడం మంచిది. అలంకార వస్తు, సామాగ్రి కొనుగోలు చేస్తారు. క్రయ, విక్రయాలలో ప్రోత్సాహం లభిస్తుంది.
సింహ రాశి వారికి ఈ రోజు జీవిత భాగస్వామి అభిప్రాయాలకు ఎక్కువగా ప్రాధాన్యత ఇవ్వవలసిన స్థితి వస్తుంది. నిత్యం లక్ష్మీ తామర వత్తులు అష్టమూలికా తైలంతో దీపారాధన చేయటం వలన ఆర్థికాభివృద్ధి కలుగుతుంది. వృత్తి, ఉద్యోగాలలో, వ్యాపారంలో పలుమార్పులు చేసి లాభపడతారు. చాలా కాలం పరిష్కారం కాని సమస్యలు కొంత మేర మీకు అనుకూలమౌతాయి.
కన్య రాశి వారికి ఈ రోజు ఆర్థిక పరిస్థితి బాగుంటుంది. దూరప్రాంత ప్రయాణాలు కలిసి వస్తాయి. కళా, సాహిత్య, క్రీడా రంగానికి సంబంధించిన విషయాలు కలిసి వస్తాయి. విందులు, వినోదాలలో పాల్గొంటారు. లక్ష్మీప్రదమైన ముఖానికి, ఐశ్వర్యప్రాప్తికి ఈ లక్ష్మీచందనం ధరించడం వలన మేలు జరుగుతుంది. ఉద్యోగాలలో మీపై అధికారుల వత్తిడి అధికం అవుతుంది. ఆత్మీయులతో కలిసి పుణ్యక్షేత్రాలను సందర్శిస్తారు.
ఈ రాశి వారికి ఈ రోజు కళా, సాహిత్య రంగాలలో ఉన్నవారికి ప్రభుత్వం నుండి కొన్ని అవార్డులు లభిస్తాయి. పెట్టుబడులు, మదుపులు మొదలగునవి అనుకూలిస్తాయి. సంతానం విద్యా విషయంలో కొంత ఆందోళన తప్పదు. నిత్యం సర్వదోష నివారణ చూర్ణముతో సర్వరక్షా చూర్ణము కలిపి స్నానం చేయటం వలన సర్వదోషాలు మరియు గ్రహాల వల్ల కలుగు బాధలు తొలగిపోతాయి.
వృశ్చిక రాశి వారికి ఈ రోజు వాతావరణంలో స్వల్ప మార్పుల వలన ఆరోగ్యం మీద కొంతమేర ప్రభావం ఉంటుంది, జాగ్రత్త వహించండి. నిత్యం నాగబంధాన్ని ఉపయోగించండి. స్వంత విషయమై అధిక ఖర్చులు చేస్తారన్న విమర్శలకు సంఘటనలే సమాధానమును చెబుతాయి. పాస్‌పోర్టు, వీసాలకు సంబంధించిన విషయాలలో సాంకేతిక లోపాలు రాకుండా జాగ్రత్త వహించండి.
ధనుస్సు రాశి వారికి ఈ రోజు ప్రభుత్వ పరమైన రాయితీలు, మినహాయింపులు, బిల్లులకు సంబంధించిన కన్సెషన్లను చట్ట నిబంధనలను క్షుణ్ణంగా పరిశీలించి, చిన్న ఆధారాన్ని పట్టుకొని సానుకూల ఫలితాలను సాధిస్తారు. నిత్యం తెల్ల జిల్లేడు వత్తులతో అష్టమూలికా తైలంతో కలిపి దీపారాధన చేయటం వలన మేలు జరుగుతుంది. క్రయ, విక్రయాలలో లాభాలు పొందుతారు.
ఈ రాశి వారికి ఈ రోజు కుటుంబ సభ్యుల ప్రేమాభిమానాలు మీ సమస్యను కదల్చి వేస్తాయి. ప్రత్యర్థుల రాజకీయ పలుకుబడి మీ విషయంలో పనిచేయదు. ఏది ఏమైనా వివాదాలకు, కోపతాపాలకు దూరంగా ఉండండి. రిజిస్ట్రేషన్స్, ఇన్సూరెన్స్, లైసెన్స్ల పునరుద్ధరణ వంటివి సజావుగా సాగిపోతాయి. నిత్యం నాగ సింధూరం నుదిటిపై ధరించడం వలన నరదృష్టి తొలగిపోయి, జనాకర్షణ ఏర్పడుతుంది.
కుంభ రాశి వారికి ఈ రోజు మొండికేసిన స్థిరాస్తి రిజిస్ట్రేషన్ కాకుండానే స్వాధీనంలోకి రావడం జరుగుతుంది. ఐశ్వర్య నాగిని ఉపయోగించడం వలన మహాలక్ష్మీదేవి అనుగ్రహం, లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. స్త్రీలకు సంబంధించిన వివాదాలలో మీ పేరును లాగబడే అవకాశం ఉంది. చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు ఎదురైనా అధిగమిస్తారు. వృత్తి, ఉద్యోగాలలో కొన్ని అనుకోని మార్పులు వస్తాయి.
మీన రాశి వారికి ఈ రోజు అనవసరమైన పరిశీలనలు ఉండడం చేత ప్రశాంతత తగ్గుతుంది. మీకు న్యాయం చేయవలసిన వారు సంపూర్ణంగా న్యాయం చేయరు. కోర్టు సంబంధిత భూవివాదాలు, స్థిరాస్తులకు సంబంధించిన వివాదాలు ఒక పరిష్కార దశకు చేరుకుంటాయి. అరటినార వత్తులు అష్టమూలికా తైలంతో కలిపి దీపారాధన చేయటం వలన అన్ని విధాలా మంచిది. ఇటు బయటా అనుకూలం.
పంచాంగ కర్త: బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ - 9494981000
టాపిక్