హిందుస్తాన్ టైమ్స్
రాశిఫలాలు (దిన ఫలాలు) : 05.07.2025
ఆయనము: ఉత్తరాయనం, సంవత్సరం: శ్రీ విశ్వావసునామ
మాసం: ఆషాడ, వారం : శనివారం, తిథి : శు. దశమి, నక్షత్రం : స్వాతి
మేష రాశి వారు ఈ రోజు భూముల, షేర్ల క్రయ విక్రయాలలో లాభాలు పొందుతారు. ప్రయాణాలలో నూతన పరిచయాలు పెరుగుతాయి. విందు, వినోదాలు, శుభకార్యాలలో చురుకుగా పాల్గొంటారు. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. కుటుంబ సభ్యులతో కలిసి ఉల్లాసంగా గడుపుతారు. నిత్యం మహాపాశుపత కంకణం ధరించడం వలన మేలు జరుగుతుంది.
వృషభ రాశి వారికి ఈ రోజు స్థిరాస్తి వివాదాలు పరిష్కార దశకు చేరుకుంటాయి. ఋణాలు తీరి ఊరట చెందుతారు. సంఘంలో కీర్తి, ప్రతిష్టలు పెరుగుతాయి. ముఖ్యమైన వ్యవహారాలలో తొందరపడకండి. వాహనాల విషయాలలో నిర్లక్ష్యం తగదు. కీలక విషయాలలో జాగ్రత్తగా వ్యవహరించడం మంచిది. నిత్యం లక్ష్మీ తామర వత్తులను అష్టమూలికా తైలంతో కలిపి దీపారాధన చేయండి.
మిథున రాశి వారు తొందరపడకండి. కోపతాపాలకు, వివాదాలకు దూరంగా ఉండండి. నిత్యం పాశుపత కంకణం ధరించడం అన్ని విధాలా మంచిది. ఆస్తి వివాదాలు ఎదురై చికాకు కలిగించినా అధిగమించి ముందుకు సాగుతారు. ముఖ్యమైన వ్యవహారాలలో సన్నిహితుల సలహాలు తీసుకుంటారు. జీవిత భాగస్వామి నుండి ధన, వస్తు లాభాలు పొందుతారు.
కర్కాటక రాశి వారికి ఈ రోజు ఆరోగ్యం, వాహనాల విషయాలలో నిర్లక్ష్యం తగదు. వృత్తి, వ్యాపారాలలో స్వల్ప లాభాలు పొందుతారు. బంధువుల నుండి కీలక సమాచారం అందుకుంటారు. నానారకాల అరిష్టాలు, శత్రు బాధకు, బాధలు నశించడానికి త్రిశూల్ ఉపయోగించండి. ఉద్యోగాలలో బాధ్యతలు పెరిగినా సమర్థవంతంగా నిర్వహిస్తారు.
సింహ రాశి వారికి ఈ రోజు అనుకోని అవకాశాలు లభిస్తాయి. వాటిని సద్వినియోగం చేసుకోండి. నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. స్థిరాస్తి వివాదాలు తీరి, నూతన ఒప్పందాలు కుదురుతాయి. నల్ల వత్తులను అష్టమూలికా తైలంతో కలిపి దీపారాధన చేయడం వలన శనేశ్వరుని అనుగ్రహం కలుగుతుంది. పాత మిత్రుల నుండి విలువైన సమాచారం అందుకుంటారు.
కన్య రాశి వారు ఈరోజు క్రయ, విక్రయాలలో లాభాలు పొందుతారు. అనుకున్న విధంగా పనులు పూర్తి చేస్తారు. పలుకుబడి పెరుగుతుంది. స్థిరాస్తి వివాదాలు తీరి లబ్ధి పొందుతారు. నిత్యం యజ్ఞభస్మాన్ని ధరించడం వలన యజ్ఞ ఫలితం లభిస్తుంది. కాంట్రాక్టులు, సబ్‌కాంట్రాక్టులలో ఉన్న లోపాలను, ప్రమాదాలను గుర్తించి వాటిలో కొన్నింటికి దూరంగా ఉంటారు.
ఈ రాశి వారికి ఈ రోజు ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రమే ఉన్నా, అవసరాలకు డబ్బు అందుతుంది. తెల్ల జిల్లేడు వత్తులతో అష్టమూలికా తైలంతో దీపారాధన చేయడం వలన విఘ్నేశ్వరుని అనుగ్రహం లభిస్తుంది. ఉద్యోగపరంగా మీ శక్తి, సామర్థ్యాలు, కృషి ప్రశంసకు నోచుకుంటాయి. వాస్తవ విషయాల కోసం, అబద్ధాలను నిజం చేసే యత్నాలు మానుకోకపోతే ఉన్నత స్థానంలో ఉన్న వారితో ఘర్షణకు దారితీస్తాయి.
వృశ్చిక రాశి వారికి ఈ రోజు సంతాన పురోగతి బాగుంటుంది. జ్యేష్ఠ సంతాన విషయంలో, విద్యా సంబంధిత విషయంలో ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తారు. విద్యా సంబంధిత విషయాలకు ప్రైవేట్ వ్యక్తులను ఆశ్రయిస్తారు. వీసా, పాస్‌పోర్టు, గ్రీన్‌కార్డ్ వంటి ఇతర దేశాలలో అవసరమైన అన్ని విషయాలు లభిస్తాయి. నిత్యం సర్వదోష నివారణ కంకణం ధరించండి. కొత్త అవకాశాలు వస్తాయి, కాని నిర్ణయాలు తీసుకోకండి.
ఈ రాశి వారికి ఈ రోజు ఉన్నదానితో సంతృప్తి చెందాలని నిర్ణయించుకుంటారు. వంశపారంపర్య విషయ, వ్యవహారాలను అభివృద్ధి చేస్తారు. అంతర్గత విషయాలను అంతర్గతంగా ఉంచకపోతే, అవి బయటకు వెళ్ళే ప్రమాదం ఉంటుంది. ఈ విషయంలో కట్టుదిట్టంగా వ్యవహరించండి. నిత్యం దైవ కార్యక్రమాలలో ప్రధమ తాంబూలం ఉపయోగించదగినది. పలుకుబడి పెరుగుతుంది. స్థిరాస్తి వివాదాలు తీరి, నూతన ఒప్పందాలు కుదురుతాయి.
మకర రాశి వారు ఈ రోజు అధికారస్థానంలో ఉన్న వారు ప్రతి చిన్న విషయానికీ మీపై ఆధారపడతారు. నమ్మకం లేకపోయినా, నమ్మి కొన్ని ముఖ్య కార్యక్రమాలను ఇతరులకు అప్పగిస్తారు. మీరు సలహాదారులపై, అనుచర వర్గంపై అధికంగా ఆధారపడుతున్నట్లు కనిపిస్తారు. మీకు తెలిసినట్లే, మీరు ఎవరి మీదా ఆధారపడలేరని గుర్తించండి. శుభకార్యాల విషయంలో అనిశ్చితి తొలగిపోతుంది. పుకార్లను నమ్మకండి.
ఈ రాశి వారికి ఈరోజు సభలు, సమావేశాలలో చురుకుగా పాల్గొంటారు. నిత్యం అరటినార వత్తులు, అష్టమూలికా తైలంతో దీపారాధన చేయడం అన్నివిధాలా మంచిది. కొన్ని అప్పులు చేయవలసి రావచ్చు, అవి అభివృద్ధి కొరకు మాత్రమే ఖర్చు చేస్తారు. ఇంటా బయటా అనుకూల వాతావరణం ఉంటుంది. నూతన పెట్టుబడులకు అనుకూలమైన సమయం. శుభకార్యాలు ఘనంగా నిర్వహిస్తారు. నూతన ఆభరణాలు కొనుగోలు చేస్తారు.
మీన రాశి వారికి ఈ రోజు ప్రత్యర్థులు సైతం మిత్రులుగా మారి సాయం చేస్తారు. నిత్యం సిద్ధగంధంతో శ్రీ వేంకటేశ్వరస్వామివారిని పూజించడం మంచిది. సాహసం చేయలేని సందర్భంలో, నిర్ణయాలు తీసుకోలేని ఆత్మీయ వర్గం వల్ల, భాగస్వాముల వల్ల కొన్ని ప్రయోజనాలను కోల్పోతారు. మీరు స్వయంగా ఆలోచించి కొనుగోలు చేసిన ఆస్తుల విలువ బాగా పెరుగుతుంది. ప్రయాణాలు లాభిస్తాయి.
పంచాంగ కర్త: బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ - 9494981000