నేటి రాశి ఫలాలు జూలై 04, 2025: ఈరోజు ఈ రాశి వారి వ్యాపారం లాభసాటిగా ఉంటుంది.. ఆంజనేయ స్వామి ఆలయాన్ని సందర్శించండి!-today rasi phalalu july 4th 2025 mesha rasi to meena rasi check horoscope ,రాశి ఫలాలు న్యూస్
తెలుగు న్యూస్  /  రాశి ఫలాలు  /  నేటి రాశి ఫలాలు జూలై 04, 2025: ఈరోజు ఈ రాశి వారి వ్యాపారం లాభసాటిగా ఉంటుంది.. ఆంజనేయ స్వామి ఆలయాన్ని సందర్శించండి!

నేటి రాశి ఫలాలు జూలై 04, 2025: ఈరోజు ఈ రాశి వారి వ్యాపారం లాభసాటిగా ఉంటుంది.. ఆంజనేయ స్వామి ఆలయాన్ని సందర్శించండి!

HT Telugu Desk HT Telugu

నేటి రాశి ఫలాలు (దిన ఫలాలు) తేదీ 04.07.2025 శుక్రవారం కోసం పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ అందించారు. మేష రాశి నుంచి మీన రాశి వరకు 12 రాశుల దిన ఫలాలు ఇక్కడ తెలుసుకోండి.

నేటి రాశి ఫలాలు

హిందుస్తాన్ టైమ్స్

రాశిఫలాలు (దిన ఫలాలు) : 04.07.2025

ఆయనము: ఉత్తరాయనం, సంవత్సరం: శ్రీ విశ్వావసునామ

మాసం: ఆషాడ, వారం : శుక్రవారం, తిథి : శు. నవమి, నక్షత్రం : చిత్త

మేష రాశి

మేష రాశి వారికి వాహనం మూలంగా ఖర్చులు ఉంటాయి. భూముల విషయంలో జాగ్రత్త అవసరం. నలుగురికి ఉపయోగపడే పనులు చేస్తారు. బంధుమిత్రులతో అభిప్రాయ భేదాలు తలెత్తవచ్చు. కొత్త పరిచయాలతో జాగ్రత్త అవసరం. పట్టుదలతో పనులు చేస్తారు. అనవసరమైన ఆలోచనలను పక్కన పెట్టి, కార్యనిర్వహణపై మనసు నిలపండి. నరసింహస్వామి ఆలయాన్ని సందర్శించండి.

వృషభ రాశి

వృషభ రాశి వారికి ఉద్యోగంలో బదిలీలు ఉంటాయి. కుటుంబంతో సంతోషంగా ఉంటారు. అప్పుగా ఇచ్చిన డబ్బు తిరిగి అందడంలో ఆలస్యం జరుగుతుంది. ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం. ప్రభుత్వ పనులు నెరవేరుతాయి. బంధుమిత్రులతో సత్సంబంధాలు ఉంటాయి. వ్యాపారం లాభసాటిగా కొనసాగుతుంది. కొత్త పరిచయాలతో కార్యసాఫల్యం ఉంది. వేంకటేశ్వరస్వామి ఆలయాన్ని సందర్శించండి.

మిథున రాశి

ఉద్యోగులకు సానుకూల వాతావరణం ఉంటుంది. గతంలో కన్నా ఈ రాశివారికి ఈ రోజు బాగుంటుంది. విందులు, వినోదాలకు హాజరవుతారు. వ్యాపారులు కొత్త ఒప్పందాలు చేసుకునే అవకాశాలు ఉన్నాయి. ఆర్థిక ఇబ్బందులు ఉన్నా, చివరి నిమిషంలో అనుకూల ఫలితాలు సాధిస్తారు. ఆస్తి వివాదాలు ఓ కొలిక్కి వస్తాయి. దుర్గాదేవి ఆరాధన వల్ల మేలు కలుగుతుంది.

కర్కాటక రాశి

కర్కాటక రాశి వారు ఆరోగ్యంగా ఉంటారు. ఉత్సాహంతో పనులు చేస్తారు. ప్రయాణాల వల్ల లాభం పొందుతారు. విద్యార్థులు శ్రమకు తగిన ఫలితాలు పొందుతారు. ఉద్యోగులకు పని భారం పెరుగుతుంది. వ్యాపార భాగస్వాముల మధ్య అవగాహన పెరుగుతుంది. సంగీత, సాహిత్య కళాకారులకు అనుకూలంగా ఉంటుంది. కావలసిన వస్తువులు కొంటారు. రామాలయాన్ని సందర్శించండి.

సింహ రాశి

సింహ రాశి వారి ఆదాయం స్థిరంగా ఉంటుంది. కుటుంబ సభ్యులతో విందులు, వినోదాల్లో పాల్గొంటారు. సరైన సమయంలో సరైన నిర్ణయాలు తీసుకుంటారు. కష్టానికి తగిన ప్రతిఫలం ఉంటుంది. బంధుమిత్రులతో వివాదాలు తలెత్తవచ్చు. ఉద్యోగులకు తోటి వారితో అభిప్రాయ భేదాలు తలెత్తవచ్చు. వ్యాపారం లాభసాటిగా ఉంటుంది. ఆంజనేయస్వామి ఆలయాన్ని సందర్శించండి.

కన్య రాశి

కన్య రాశి వారికి ఇంటా బయటా అనుకూల వాతావరణం. ఆలస్యంగా అయినా, అనుకున్న పనులు నెరవేరుతాయి. వ్యాపార లావాదేవీలు సానుకూలంగా ఉంటాయి. శుభకార్య ప్రయత్నాలు ముందుకు సాగుతాయి. విద్యార్థులు చదువులో రాణిస్తారు. ఉన్నత విద్య ప్రయత్నాలు కొనసాగుతాయి. దూర ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది. బంధుమిత్రులతో పనులు నెరవేరుతాయి. కొత్త ఒప్పందాల విషయంలో ఏమరుపాటు తగదు. శివ ఆరాధన శుభప్రదం.

తుల రాశి

తుల రాశి విద్యార్థులకు అనుకూలం. మంచి సంస్థల్లో అవకాశాలు వస్తాయి. స్నేహితులు, బంధుమిత్రులతో పనులు నెరవేరుతాయి. అనుకోని ఖర్చులు ముందుకు రావచ్చు. వ్యాపార విస్తరణ పనులు వాయిదా వేయడం మంచిది. పలుకుబడి పెరుగుతుంది. సహోద్యోగుల సహకారం లభిస్తుంది. పై అధికారులతో విభేదాలు తలెత్తవచ్చు. సుబ్రహ్మణ్యస్వామి ఆరాధన వల్ల మేలు కలుగుతుంది.

వృశ్చిక రాశి

వృశ్చిక రాశి వారు బంధుమిత్రులతో స్నేహంగా ఉంటారు. అనుకున్న పనులు నెరవేరుతాయి. పలుకుబడి పెరుగుతుంది. కార్యసాఫల్యం ఉంది. భూ లావాదేవీలు కలిసివస్తాయి. కుటుంబంతో సంతోషంగా గడుపుతారు. కుటుంబ పెద్దల సహకారం లభిస్తుంది. ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. న్యాయపరమైన చిక్కులను అధిగమిస్తారు. దుర్గాదేవి ఆలయాన్ని సందర్శించండి.

ధనుస్సు రాశి

దూర ప్రయాణాలు అనుకూలిస్తాయి. అలసట లేకుండా పనులపై మనసు నిలుపుతారు. ఆటంకాలు ఎదురైనా పట్టుదలతో పనులు పూర్తి చేస్తారు. వ్యాపారం లాభసాటిగా కొనసాగుతుంది. విద్యార్థులకు శ్రమ పెరుగుతుంది. ఉద్యోగులు వివాదాలకు దూరంగా ఉండటం మంచిది. అధికారులతో స్నేహంగా ఉండడానికి ప్రయత్నిస్తారు. ఆరోగ్యంపై శ్రద్ధ వహిస్తారు. శివ ఆరాధన శుభప్రదం.

మకర రాశి

మకర రాశి వారు ప్రారంభించిన పనులు సకాలంలో పూర్తవుతాయి. ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. వృత్తి, వ్యాపారాలు లాభసాటిగా కొనసాగుతాయి. ఆర్థిక లావాదేవీల్లో ఏమరుపాటు తగదు. వ్యాపారులు న్యాయ సమస్యలను అధిగమిస్తారు. రావలసిన డబ్బు ఆలస్యంగా అందుతుంది. వివాహాది శుభకార్య ప్రయత్నాలు ఫలిస్తాయి. దత్తాత్రేయస్వామి ఆలయాన్ని సందర్శించండి.

కుంభ రాశి

కుంభ రాశి వారి పనులు అనుకున్న విధంగా పూర్తవుతాయి. విదేశీయాన ప్రయత్నాలు ముందుకు సాగుతాయి. ఉద్యోగులకు అధికారుల అండదండలు లభిస్తాయి. బంధువులు, స్నేహితుల సహకారంతో లక్ష్యాన్ని సాధిస్తారు. పలుకుబడి పెరుగుతుంది. కోర్టు కేసుల్లో విజయం చేకూరుతుంది. ఆస్తి తగాదాలు కొంతవరకు పరిష్కారం అవుతాయి. సూర్య ఆరాధన వల్ల మేలు కలుగుతుంది.

మీన రాశి

మీన రాశి వారి వృత్తి, వ్యాపారాలు సజావుగా సాగుతాయి. ఆదాయం పెరుగుతుంది. ఊహించని ఖర్చులు ముందుకు రావచ్చు. ఉద్యోగులకు పనిభారం పెరుగుతుంది. అధికారుల ఆదరణ లభిస్తుంది. వ్యాపారులకు అదృష్టం కలిసివస్తుంది. భాగస్వాములతో సఖ్యత పెరుగుతుంది. వ్యాపార విస్తరణ ప్రయత్నాలు సఫలం అవుతాయి. విద్యార్థులకు అనుకూల సమయం. లక్ష్మీదేవి ఆరాధన శుభప్రదం.

పంచాంగ కర్త: బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ -9494981000

పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ
పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ

హెచ్ టీ తెలుగు డెస్క్ టీమ్ సుశిక్షితులైన, సుదీర్ఘ అనుభవం ఉన్న జర్నలిస్టులతో కూడిన బృందం. ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు సహా అన్ని విభాగాలకు ఆయా రంగాల వార్తలు అందించడంలో నైపుణ్యం కలిగిన సబ్ ఎడిటర్లతో కూడిన బృందం. జర్నలిజం విలువలను, ప్రమాణాలను కాపాడుతూ జర్నలిజంపై అత్యంత మక్కువతో పనిచేస్తున్న బృందం. సంపూర్ణ వార్తావిలువలతో కూడిన కథనాలను పాఠకుల ముందుకు తెస్తున్న బృందం.