నేటి రాశి ఫలాలు జూలై 03, 2025: ఈరోజు ఈ రాశి వారు కొత్త వ్యక్తులతో జాగ్రత్తగా ఉండాలి.. సన్మాన, కార్యక్రమాల్లో పాల్గొంటారు-today rasi phalalu july 3rd 2025 mesha rasi to meena rasi check horoscope ,రాశి ఫలాలు న్యూస్
తెలుగు న్యూస్  /  రాశి ఫలాలు  /  నేటి రాశి ఫలాలు జూలై 03, 2025: ఈరోజు ఈ రాశి వారు కొత్త వ్యక్తులతో జాగ్రత్తగా ఉండాలి.. సన్మాన, కార్యక్రమాల్లో పాల్గొంటారు

నేటి రాశి ఫలాలు జూలై 03, 2025: ఈరోజు ఈ రాశి వారు కొత్త వ్యక్తులతో జాగ్రత్తగా ఉండాలి.. సన్మాన, కార్యక్రమాల్లో పాల్గొంటారు

HT Telugu Desk HT Telugu

నేటి రాశి ఫలాలు (దిన ఫలాలు) తేదీ 03.07.2025 గురువారం కోసం పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ అందించారు. మేష రాశి నుంచి మీన రాశి వరకు 12 రాశుల దిన ఫలాలు ఇక్కడ తెలుసుకోండి.

నేటి రాశి ఫలాలు

హిందుస్తాన్ టైమ్స్

రాశిఫలాలు (దిన ఫలాలు) : 03.07.2025

ఆయనము: ఉత్తరాయనం, సంవత్సరం: శ్రీ విశ్వావసునామ

మాసం: ఆషాడ, వారం : గురువారం, తిథి : శు. అష్టమి, నక్షత్రం : హస్త

మేష రాశి

మేష రాశి వారి కృషి స్పూర్తిదాయకంగా ఉంటుంది. లావాదేవీలు ఫలిస్తాయి. సముచిత నిర్ణయాలు తీసుకుంటారు. పెద్ద ఖర్చులు అయ్యే అవకాశం ఉంది, చెల్లింపుల్లో జాప్యం తగదు. కొత్త యత్నాలు మొదలుపెట్టతారు. సన్నిహితులతో మాట్లాడతారు. ఒక సమాచారం ఆలోచన రేపుతుంది. నిపుణులను సంప్రదిస్తారు. పెద్దల సహాయంతో సమస్య పరిష్కారం అవుతుంది. పిల్లల విద్యలో మంచి ఫలితం. దూరప్రయాణానికి అవకాశం ఉంటుంది.

వృషభ రాశి

వృషభ రాశి వారు మనోధైర్యంతో ముందడుగు వేస్తారు. అవకాశాలను తక్షణమే అందిపుచ్చుకోవాలి. అనుమానాలకు తావివ్వకండి. పొదుపు అలవర్చుకుంటారు, ఖర్చులు పెరుగుతాయి. ప్రారంభంలో కొన్ని ఆటంకాలు వస్తాయి. అనవసర విషయాల్లో జోక్యం వహించకండి. గౌరవాన్ని కాపాడుకోవాలి. స్థిరాస్తి వ్యవహారాలపై దృష్టి పెట్టండి. మీ ప్రతిపాదనలకు ఆమోదం లభిస్తుంది. పూర్వ విద్యార్థుల సమావేశంలో పాల్గొంటారు.

మిథున రాశి

మిథున రాశి వారు పనులు పూర్తిచేయడానికి మరింత శ్రమ అవసరం. ఒత్తిడి పెరగకుండా చూసుకోండి. అవకాశాలు తప్పినా నిరుత్సాహపడకండి, కృషి త్వరలో ఫలిస్తుంది. కొందరి రాక వల్ల చికాకు కలుగుతుంది. ఫైనాన్స్, చిట్స్ విషయాలకు దూరంగా ఉండండి. గత అనుభవాలను గుర్తుంచుకోండి. సన్నిహితులతో తరచుగా మాట్లాడతారు. పిల్లల విద్యలో ఫలితం. వాహన సంబంధ సమస్యలు రావచ్చు.

కర్కాటక రాశి

గ్రహస్థితి ఆశాజనకంగా ఉండదు, అప్రమత్తంగా ఉండాలి. అనాలోచిత నిర్ణయాలు తీసుకోకండి, పెద్దల సలహా తీసుకోండి. పనుల్లో జాప్యం, చికాకులు ఉంటాయి. కొంతమేరకు ధనం అందుతుంది. ఖర్చులను తగ్గించుకోవాలి. పొగిడే వారితో జాగ్రత్తగా ఉండాలి. దూరపు బంధుత్వాలు బలపడతాయి. ఆహార నియమాలను పాటించాలి. ఉల్లాసంగా గడిపే అవకాశముంటుంది.

సింహ రాశి

సింహ రాశి వారు ఓర్పుతో శ్రమిస్తే కార్యం సఫలమవుతుంది. సలహాలు, సాయం ఆశించకండి. జీవిత భాగస్వామి ప్రోత్సాహంతో కొత్త పనులు మొదలుపెట్టతారు. పెద్దల ఆశీస్సులు లభిస్తాయి. ఆత్మీయులకు సహాయం చేస్తారు. లావాదేవీల్లో జాగ్రత్తగా ఉండాలి. ప్రలోభాలకు లోనవ్వకండి. పత్రాల రిన్యువల్ లో జాప్యం తగదు. పాత పరిచయులు కలుస్తారు. పిల్లల విద్యలో మంచి ఫలితం ఉంటుంది.

కన్యా రాశి

ఏకాగ్రత తగ్గకుండా చూసుకోవాలి. ప్రలోభాలకు లోనవ్వకండి. మీ నిర్ణయం కుటుంబ భవిష్యత్తును నిర్ణయిస్తుంది. పనులు వాయిదా వేసుకోవచ్చు. ఖర్చులు అదుపులో ఉండకపోవచ్చు. ఆప్తుల సహాయం లభిస్తుంది. రుణ సమస్య పరిష్కారం అవుతుంది. జీవిత భాగస్వామి ప్రోత్సాహంతో కొత్త పనులకు శ్రీకారం చుడతారు. అవకాశాలను వెంటనే అందిపుచ్చుకోవాలి. విమర్శలను పట్టించుకోవాల్సిన అవసరం లేదు.

తుల రాశి

మీ రంగంలో మంచి ఫలితాలు లభిస్తాయి. ఓర్పుతో శ్రమిస్తే లక్ష్యం చేరుకుంటారు. మీ కార్యదీక్ష ప్రముఖులను ఆకట్టుకుంటుంది. పదవులు చేపడతారు. వ్యాపకాలు విస్తరిస్తాయి. పాత బంధుత్వాలు బలపడతాయి. పనులు సకాలంలో పూర్తి చేస్తారు. ఖర్చులు అధికం అవుతాయి. పొగిడే వారితో జాగ్రత్తగా ఉండాలి. ఏ విషయాన్ని తేలికగా తీసుకోవద్దు. మీ ప్రమేయంతో ఇతరులకు ఉపయోగం కలుగుతుంది.

వృశ్చిక రాశి

వృశ్చిక రాశి వారికి సాధారణ స్థితి ఉంటుంది. నిరంతరం శ్రమిస్తే సమస్యలు తొలగిపోతాయి. కొన్ని అవాంఛిత సంఘటనలు కలుగవచ్చు. ఆత్మీయుల సహాయం అవసరమవుతుంది. మీ ఆత్మవిశ్వాసం తో ముందుకు సాగాలి. చిన్న సమస్యలను పెద్దవిగా భావించకండి. వివాదాస్పద అంశాలకు దూరంగా ఉండండి. ఆర్థిక పరంగా పెద్దగా లాభనష్టాలు లేవు.

ధనుస్సు రాశి

ధనుస్సు రాశి వారికి గ్రహస్థితి సాధారణంగానే ఉంటుంది. అవకాశాలు తప్పినా నిరుత్సాహపడకండి. కష్టం వేరే వారికి ఉపయోగపడొచ్చు. దృఢ సంకల్పంతో ప్రయత్నించాలి. పరిస్థితులు క్రమంగా చక్కబడతాయి. పనుల్లో ఒత్తిడి, శ్రమ అధికం అవుతుంది. ఆత్మీయులతో తరచుగా సంభాషిస్తారు. అవసరాలు కష్టంగా నెరవేరతాయి. ఖర్చులు అధికంగా ఉంటాయి.

మకర రాశి

మకర రాశి వారు శ్రమను తగ్గించకుండా పనిచేయాలి. సంకల్ప బలంతో లక్ష్యాన్ని సాధిస్తారు. ముందస్తు ప్రణాళికతో ముందుకు సాగాలి. పనులు వేగంగా పూర్తవుతాయి. ఒక సమాచారం ఆలోచన రేపుతుంది. పెద్దలతో సంప్రదింపులు జరుగుతాయి. ఎదుటివారి అభిప్రాయాలను గౌరవించండి. కొత్త వ్యక్తులతో జాగ్రత్త. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. సన్మాన, సంస్కరణ కార్యక్రమాల్లో పాల్గొంటారు.

కుంభ రాశి

ప్రణాళికలు సిద్ధం చేసుకుంటారు. కొన్ని విషయాలు ఊహించినట్టే జరుగుతాయి. పరిస్థితులకు అనుగుణంగా ఉండాలి. పరిచయులు ధన సహాయం అడగొచ్చు, కొంత సాయం చేయాలి. ఆత్మీయులతో మాట్లాడుతారు. పనులు నెమ్మదిగా సాగుతాయి. ఆలోచనలు ఎక్కువ అవుతాయి. స్థిమితం పాటించడానికి ప్రయత్నించాలి. కొత్త పరిచయాలు ఏర్పడతాయి.

మీన రాశి

మీన రాశి వారికి సర్వత్రా అనుకూల పరిస్థితులు ఉంటాయి. ప్రయత్నించకుండా కొన్ని అవకాశాలు వస్తాయి. ప్రతిభ వెలుగులోకి వస్తుంది. మధ్యలో ఆపిన పనులు పూర్తి చేస్తారు. ఖర్చులు తగ్గిస్తారు. అందరితో సత్సంబంధాలు ఏర్పడతాయి. చిన్ననాటి స్నేహితులతో మాట్లాడతారు. పొరుగువారి నుంచి సమస్యలు వచ్చినా పెద్దల జోక్యంతో పరిష్కారం అవుతుంది.

పంచాంగ కర్త: బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ - 9494981000

పంచాంగకర్త చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ
పంచాంగకర్త చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ

హెచ్ టీ తెలుగు డెస్క్ టీమ్ సుశిక్షితులైన, సుదీర్ఘ అనుభవం ఉన్న జర్నలిస్టులతో కూడిన బృందం. ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు సహా అన్ని విభాగాలకు ఆయా రంగాల వార్తలు అందించడంలో నైపుణ్యం కలిగిన సబ్ ఎడిటర్లతో కూడిన బృందం. జర్నలిజం విలువలను, ప్రమాణాలను కాపాడుతూ జర్నలిజంపై అత్యంత మక్కువతో పనిచేస్తున్న బృందం. సంపూర్ణ వార్తావిలువలతో కూడిన కథనాలను పాఠకుల ముందుకు తెస్తున్న బృందం.