హిందుస్తాన్ టైమ్స్
రాశిఫలాలు (దిన ఫలాలు) : 02.07.2025
ఆయనము: ఉత్తరాయనం, సంవత్సరం: శ్రీ విశ్వావసునామ
మాసం: ఆషాడ, వారం : బుధవారం, తిథి : శు. సప్తమి, నక్షత్రం : ఉత్తర
మేష రాశి వారికి శుభప్రదమైన కాలం. ఆర్థిక ఫలితాలు బావుంటాయి. ఆత్మీయుల సూచనలను పరిగణనలోకి తీసుకోండి. ఉద్యోగులు ఊహించని ప్రయోజనాలను పొందుతారు. గతంలోని సమస్యలు తొలగిపోతాయి. వ్యాపారంలో కొద్దిపాటి అవరోధాలు ఉన్నాయి. బుద్ధిచతురతతో వాటి నుంచి తప్పించుకోవాలి. శ్రీ మహావిష్ణువును ధ్యానించండి.
వృషభ రాశి వారికి శుభకాలం గోచరిస్తోంది. గురుబలం వల్ల అదృష్టయోగం తోడవుతుంది. వ్యాపారంలో తోటివారి ప్రోత్సాహం లభిస్తుంది. మొహమాటం కారణంగా ఆర్థిక సమస్యల్లో చిక్కుకునే ప్రమాదం ఉంది. వ్యయాలను అదుపులో ఉంచుకోండి. వివాదాస్పద చర్చల జోలికి వెళ్లకండి. మనోబలంతో ఒత్తిడిని జయించండి. శ్రీ మహాలక్ష్మిని ధ్యానించండి.
మిథున రాశి వారికి విజయాలు సిద్ధిస్తాయి. లక్ష్య సాధనలో మిత్రుల తోడ్పాటు లభిస్తుంది. ఆస్తుల కొనుగోలు దిశగా అడుగులు వేస్తారు. ఆధ్యాత్మికత మనోబలాన్ని ప్రసాదిస్తుంది. ఆవేశానికి గురికావద్దు. కుటుంబ సభ్యులతో సంప్రదించి నిర్ణయాలు తీసుకోండి. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో సమయస్పూర్తి అవసరం. ఆరోగ్యం పట్ల శ్రద్ధ పెరగాలి. సూర్యుడిని ధ్యానించండి.
కర్కాటక రాశి వారు ఏకాగ్రతతో బాధ్యతలు నిర్వర్తించాలి. మనోబలం ముందుకు నడిపిస్తుంది. గ్రహదోషం అధికంగా ఉంది, కాబట్టి జాగ్రత్తగా వ్యవహరించండి. కాలాన్ని వృథా చేసుకోకండి. అనవసర విషయాల్లో తలదూర్చకండి. కొన్నిసార్లు మౌనమే ఉత్తమం. అవరోధాలు ఎదురైనా నిరాశ వద్దు. ఆత్మీయుల సలహాలు తీసుకోండి. నవగ్రహ శ్లోకాలు పఠించండి.
సింహ రాశి వారికి శుభప్రదమైన సమయం. అన్ని పనులు నిర్విఘ్నంగా పూర్తవుతాయి. అధికార యోగం గోచరిస్తోంది. విజయావకాశాలు మెండుగా ఉన్నాయి. ప్రతిభకు గుర్తింపు లభిస్తుంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో అడుగు ముందుకు వేస్తారు. భాగ్య శుక్రయోగం వల్ల పట్టిందల్లా బంగారం అవుతుంది. శ్రీ లక్ష్మిని పూజించండి.
ఉద్యోగ ఫలితాలు అత్యుత్తమం. ఉన్నత స్థితి గోచరిస్తోంది. పదవీ లాభం సూచితం. సమాజానికి ఉపయోగపడే పనులు చేస్తారు. ఆర్థిక పరిస్థితి అనుకూలిస్తుంది. అందివచ్చిన సంపదను సద్వినియోగం చేసుకోండి. చంచలత్వం పనికిరాదు. ఆరోగ్యం స్థిరంగా ఉంటుంది. ఈశ్వరుడిని ధ్యానించండి.
తుల రాశి వారికి మనోబలం ఇనుమడిస్తుంది. చేపట్టిన పనులు విజయవంతంగా పూర్తవుతాయి. కొత్త నిర్ణయాలు ఉత్తమ ఫలితాలను అందిస్తాయి. శాంత స్వభావం అవసరం. ఆలోచనలకే పరిమితం కాకుండా వాటిని ఆచరణలో పెట్టండి. గౌరవ, పురస్కారాలు అందుకుంటారు. వ్యాపారాన్ని విస్తరిస్తారు. కొన్ని సందర్భాల్లో మిశ్రమ ఫలితాలు ఉంటాయి. శ్రీ మహాలక్ష్మిని ఉపాసించండి.
చక్కని ప్రణాళికతో ముందుకెళ్తారు. ముఖ్య కార్యక్రమాలను నిర్విఘ్నంగా పూర్తి చేస్తారు. సహనం అవసరం. వివాదాలకు ఆస్కారం ఇవ్వకండి. ఒకట్రెండు ఎదురు దెబ్బలు తగిలినా, అంతిమ విజయం మీదే. వ్యాపారాన్ని చాకచక్యంగా నిర్వహించండి. కొత్త నిర్ణయాల్లో దూకుడు పనికిరాదు. ఆర్థిక వ్యవహారాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి. నవగ్రహ శ్లోకాలు పఠించండి.
ధనుస్సు రాశి వారు మనోబలంతో విజయాలు లభిస్తాయి. దైవానుగ్రహం పరిపూర్ణం. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో మేలైన ఫలితాలను సాధిస్తారు. ముఖ్య వ్యవహారాల్లో ఏకాగ్రత అవసరం. పంచమ శుక్రయోగం సంపదలను ప్రసాదిస్తుంది. భూ, గృహ యోగాలు ఉన్నాయి. ఆత్మీయుల ప్రోత్సాహం అందుతుంది. సూర్యుడిని ధ్యానించండి.
మకర రాశి వారికి శుభకాలం కొనసాగుతోంది. కృషికి తగిన ప్రతిఫలం అందుతుంది. గతంలోని దోషాలు తొలగిపోతాయి. వ్యాపార యోగం బలంగా ఉంది. చతుర్ద శుక్రుడు వాహనాది కొత్త వస్తువులను ప్రసాదిస్తాడు. సిరిసంపదలను పెంచుకోడానికి సరైన సమయం. పరిస్థితులను బట్టి మీ ఆలోచనలను మార్చుకోండి. మహాలక్ష్మిని ధ్యానించండి.
దైవబలం ముందుకు నడిపిస్తుంది. కాలం అన్నివిధాలుగా సహకరిస్తుంది. పంచమ బృహస్పతి యోగం శుభ ఫలితాలను ప్రసాదిస్తుంది. వ్యాపార ప్రయాణాలు లాభాలను కురిపిస్తాయి. ఉద్యోగంలో కొత్త అవకాశాలను సృష్టించుకుంటారు. అన్ని సందర్భాల్లోనూ సానుకూలంగా ఆలోచించండి. శుభవార్త వింటారు. ఈశ్వరుడిని ఆరాధించండి.
మీన రాశి వారికి వ్యాపారం లాభదాయకం. ఉన్నత శిఖరాలను అధిరోహిస్తారు. మీరు తీసుకునే ప్రతి నిర్ణయం కీలకమే. నాలుగో రాశిలోని బుధుడు ఉత్తమ ఫలితాలను ప్రసాదిస్తాడు. శుక్రయోగం సంపదలను వృద్ధి చేస్తుంది. ఇంట్లో శుభాలు జరుగుతాయి. రుణ సమస్యల నుంచి బయటపడతారు. మంచి భవిష్యత్తు గోచరిస్తోంది. లక్ష్మీ నారాయణులను ధ్యానించండి.
పంచాంగ కర్త: బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ - 9494981000
టాపిక్