హిందుస్తాన్ టైమ్స్
రాశిఫలాలు (దిన ఫలాలు) : 01.07.2025
ఆయనము: ఉత్తరాయనం, సంవత్సరం: శ్రీ విశ్వావసునామ
మాసం: ఆషాడ, వారం : మంగళవారం, తిథి : శు. షష్టి, నక్షత్రం : పుబ్బ
మేష రాశి వారికి వ్యక్తిగత గౌరవం, స్థాయి పెరగడం, ఇతరులపై సరైన అవగాహన దృక్పథం కలిగి వారి అభిమానం పొందుతారు. ఉన్నత విద్యా విషయాలలోనూ ముందంజ వేస్తారు.
వృషభ రాశి వారికి ఇతరులతో స్నేహపూర్వకమైన ధోరణి అవసరం. తలనొప్పి, కంటి సమస్యలతో వైద్యుని సంప్రదిస్తారు. మిశ్రమ ఫలితాలు ఉంటాయి.
మిథున రాశి వారు స్నేహితులు, బంధువులు, తోబుట్టువులతో కలిసి పుణ్యక్షేత్రాలను సందర్శించడానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. దూర ప్రయాణాలు చేస్తారు. మీ మనస్సు ఆహ్లాదకరమైన ప్రదేశంలో ఎక్కువగా ఉండాలని కోరుకుంటుంది.
కర్కాటక రాశి వారు వృత్తి వ్యాపారాలలో కొత్త సవాళ్లను ఎదుర్కొంటారు. ప్రభుత్వ ప్రోత్సాహకాలు, పారితోషికాలు లభిస్తాయి. కుటుంబ వ్యవహారాలలో ఆశించిన ఫలితాలు, న్యాయపరమైన చిక్కులు వచ్చే అవకాశం ఉంది.
సింహ రాశి వారికి ఆకస్మిక ధనలాభాలు మంచి ఫలితాలను ఇస్తాయి. వృత్తిపరమైన రంగంలో పేరు ప్రఖ్యాతులు పెరుగుతాయి. వృత్తి ఉద్యోగాలలో అధికారుల నుండి ఊహించని సహకారాన్ని పొందుతారు.
కన్య రాశి వారికి స్థానచలన సూచనలు గలవు. అధికారుల అండదండలు ఉంటాయి. కుటుంబం సుఖ సంతోషాలతో ఉంటుంది. సంతానం ఉన్నత ఉద్యోగాలలో స్థిరపడతారు. వారిని మరిన్ని విజయాలు వరిస్తాయి.
ఊపిరితిత్తులు, ఛాతీ సమస్యలు, అధిక రక్తపోటు వలన ఇబ్బందులు రావచ్చు. భూ స్థిరాస్తులు మార్పు చేయడం వలన లాభ పడతారు.
వృశ్చిక రాశి వారికి ఉద్యోగ వృత్తి విషయాల్లో ముందంజ, సమాజ గౌరవం కలుగుతుంది. అధికారం వస్తుంది. మీ సలహా కోసం ప్రజలు వేచి ఉంటారు. మీరు సంప్రదాయ పరిరక్షకులుగా కీర్తింపబడతారు.
ఉన్నత విద్యావకాశాలు వస్తాయి. మీ పరిజ్ఞానాన్ని ఉపయోగించి సాంకేతికపరమైన సంస్థలను నెలకొల్పి ఆదాయ మార్గాల కోసం అన్వేషిస్తారు. కొంతమేరకు వనరుల వృద్ధి, ఆదాయ వృద్ధి కలుగుతుంది.
ఇతరులను అధిగమించి, పోటీ పరీక్షలలో రాణించి విజయాన్ని వరిస్తారు. ఈ రాశి వారు ఈ మాసంలో ఏదో ఒక విధంగా రాణించి లాభపడతారు. సంపద కూడా పెరుగుతుంది. సంతోషంగా మరియు ఆరోగ్యంగా ఉంటారు.
కుంభ రాశి వారు దూరప్రాంతాలకు వెళ్లారు. అలాగే విదేశీ మారక ద్రవ్యాన్ని పొందగలుగుతారు. స్థానచలనం అవకాశముంది.
ఆర్థిక స్థితి పెరుగుతుంది. శత్రువులు మీకు హాని చేయలేరు. ధైర్యంగా ముందుకు దూసుకుపోతారు. సోదరవర్గం నుంచి సహకారం అందుతుంది. వృత్తి వ్యాపారాలకు సంబంధించిన ప్రయత్నాలు సానుకూల ఫలితాలను ఇచ్చి ఇతరులకు ఆకర్షణగా నిలుస్తారు.
పంచాంగ కర్త: బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ - 9494981000
టాపిక్