Today Rasi Phalalu: ఈరోజు ఈ రాశుల వారి సమస్యలు తీరుతాయి.. ఏ రాశి వారు ఏం చేస్తే బాగుంటుందో తెలుసుకోండి
Today Rasi Phalalu: నేటి రాశి ఫలాలు (దిన ఫలాలు) తేదీ 06.01.2025 సోమవారం కోసం పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ అందించారు. మేషరాశి నుంచి మీన రాశి వరకు 12 రాశుల దిన ఫలాలు ఇక్కడ తెలుసుకోండి.
రాశిఫలాలు (దిన ఫలాలు) : 06.01.2025
ఆయనము: దక్షిణాయనం, సంవత్సరం: శ్రీ క్రోధినామ
మాసం: పుష్యం, వారం : సోమవారం, తిథి : శు. సప్తమి, నక్షత్రం : ఉత్తర భాద్రపద
మేషం
ఈ రాశి వారికి ఈ రోజు సంఘసేవా కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటారు. కుటుంబ పరమైనటువంటి సర్దుబాట్లు అధికంగా ఉంటాయి. ఇంట్లో కొంతమంది ప్రవర్తన బాగాలేక ప్రశాంతత కొరవడుతుంది. వైద్యుడిని కలిసి రక్త పరీక్షలు చేయించుకుంటారు. అరటినార వత్తులు, అష్టమూలికా తైలంతో నిత్య దీపారాధన చేయండి.
వృషభం
ఈ రాశి వారికి ఈ రోజు రుణ బాధలు అధికంగా ఉంటాయి. రుణాలు తీర్చడం కోసం చేసే ప్రతి ప్రయత్నం అంతంత మాత్రంగానే ఉంటుంది. ఎప్పటికప్పుడు ఆదాయానికి సరిపడా ఖర్చులు ఉంటాయి. వ్యాపారం నిలకడగా సాగుతుంది. లాభాలు రొటేషన్ల రూపంలో ఉంటాయి. సర్వ రక్షా చూర్ణం, సర్పదోష నివారణ చూర్ణం కలిపి స్నానమాచరించండి.
మిథునం
ఈ రాశి వారికి ఈ రోజు నూతన వ్యాపారానికి తగిన పెట్టుబడులను అందుకుంటారు. ఇరుగు-పొరుగు వారితో మాట పట్టింపులు, చిన్న చిన్న గొడవలు ఏర్పడతాయి. ఫుడ్ వ్యాపారస్తులకి క్యాటరింగ్ వ్యాపారస్తులకి అనుకూలంగా ఉంటుంది. కొత్త కార్యక్రమాల పట్ల ఆకర్షితులవుతారు. ఇంట్లో, వ్యాపార ప్రదేశాల్లో సాంబ్రాణి, త్రిశూల్ పొడితో ధూపం వేయడం మంచిది. నరదృష్టి తొలగిపోతుంది.
కర్కాటక
ఈ రాశి వారికి ఈ రోజు తొందరపాటు నిర్ణయాలకు తావివ్వకుండా ఎంతగానో ప్రయత్నిస్తారు. నూతన కార్యక్రమాలను ప్రారంభిస్తారు. చుట్టుపక్కల విషయాలలో అతిగా కలగజేసుకోకుండా మీ గౌరవం దక్కించుకుంటారు. గతంలో జరిగిన పొరపాట్లను సరిదిద్దుకుంటారు. మెడలో కాలభైరవ రూపు ధరించండి. దూర ప్రయాణాలను తాత్కాలికంగా వాయిదా వేస్తారు. దైవ చింతన కలిగి వుంటారు.
సింహం
ఈ రాశి వారికి ఈ రోజు అందరూ ఆశ్చర్యపడే విధంగా మీలో మార్పులు వస్తాయి. ప్రేమ పెళ్లి చేసుకోవాలన్న ఆలోచన కలిగి వుంటారు. ప్రకృతి వైద్యం, ఆయుర్వేద వైద్యం తీసుకుంటారు. సంఘ సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. తోటలు ఆకర్షిస్తాయి. కొన్ని సందర్భా లలో మామిడి, కొబ్బరితోటలు వేయాలని ఆలోచిస్తారు. కొన్ని కార్యక్రమాలను ప్రారంభిస్తారు. ఆహార నియమాలు పాటిస్తారు.
కన్య
ఈ రాశి వారికి ఈ రోజు ఇంట్లో కొన్ని కూరగాయలను పండించుకోవాలన్న ఆలోచనలు వస్తాయి. నూతన కార్యక్రమాలను ప్రారంభిస్తారు. జీవితాశయాన్ని సాధించడం ప్రస్తుతానికి అసాధ్యంగా మారుతుంది. అయినవాళ్లతో ఏకీభవించలేని పరిస్థితులు ఏర్పడతాయి. అయినప్పటికీ మీలో చలనం ఉండదు. జీవిత భాగస్వామితో మాటపట్టింపులు వస్తాయి. పూజలలో ఆరావళి కుంకుమను ఉపయోగించండి.
తుల
ఈ రాశి వారికి ఈ రోజు కోర్టు వ్యవహారాలు, తీర్పులు వాయిదాల రూపంలో ఉంటాయి. కొంతమంది పట్ల కోపంతో ఉంటారు. నూతన కార్యక్రమాలను ప్రారంభిస్తారు. స్నేహితుల సహకారం లభిస్తుంది. సొంత కాళ్ల మీద నిలబడే ప్రయత్నాలు ఫలిస్తాయి. వ్యాపారులకు ఆర్థికంగా బాగుంటుంది. వ్యాపారంలో కొత్త విభాగాలను ప్రవేశపెడతారు. ఆరోగ్య సమస్యలు ఎదురవుతాయి. లక్ష్మీతామర వత్తులు, అష్టమూలికా తైలంతో దీపారాధన చేయండి.
వృశ్చికం
ఈ రాశి వారికి ఈ రోజు కొంతమంది వల్ల నిరాశ ఎదురవుతుంది. విదేశాల్లో ఉన్నవారికి సొంత ఇంటి కల నెరవేరుతుంది. విదేశీ అవకాశాల కోసం చేసే ప్రయత్నాలు కలిసి వస్తాయి. బ్యాంకు ఉద్యోగస్తులకు బాగుంటుంది. స్త్రీ సంతానం పట్ల మక్కువ కలిగి వుంటారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలు, సంఘసేవా కార్యక్రమాల పట్ల ఆకర్షణ కలిగి వుంటారు. శ్రీ ఆంజనేయ స్వామివారి ఆలయంలో హనుమాన్ సింధూరంతో అర్చన జరిపించి నుదుట ఆ బొట్టు ధరించండి.
ధనుస్సు
ఈ రాశి వారు ఈ రోజు కొత్త బాధ్యతలను స్వీకరిస్తారు. ప్రయోజనాలని అందుకుంటారు. విలువైన సమాచారం తెలుసుకుంటారు. ప్రత్యర్థి వర్గం మీద గెలుపు కోసం చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి. వృత్తి, వ్యాపారాలలో అభివృద్ధిని సాధించగలుగుతారు. పూజల్లో నాగబంధం కుంకుమను ఉపయోగించండి. కోపతాపాలను విడిచిపెట్టి కొత్త విషయాలను గ్రహించే ప్రయత్నాలు చేస్తారు. కొంతమంది వ్యక్తుల పట్ల మీకున్న అభిప్రాయం మారుతుంది.
మకరం
ఈ రాశి వారికి ఈ రోజు కొత్త కార్యకర్తలను చేర్చుకుంటారు. నూతన కార్యక్రమాలను స్నేహితులతో ప్రారంభిస్తారు. సహ ఉద్యోగులు, సహచర బృందం అనుకూలంగా ఉంటారు. మీరు చెప్పిన పనులు చేసి పెడతారు. ప్రయోజనాలను మాత్రం ఆశించరు. దూర ప్రాంత ప్రయాణాలు కలిసి వస్తాయి. వీసా, స్టాంపింగ్ వ్యవహారాలు అనుకూలం. అరటినార వత్తులు, అష్టమూలికా తైలంతో దీపారాధన చేయండి.
కుంభం
ఈ రాశి వారికి ఈ రోజు కొత్త కార్యక్రమాల నిమిత్తం దూరపు ప్రయాణాలు అనుకూలిస్తాయి. కొత్త ప్రదేశాలకు వెళ్లాలన్న ఆలోచనలు ఫలిస్తాయి. మానసిక ఉత్సాహం, ధైర్యం కలిగి వుంటారు. అష్టమూలికా తైలం, లక్ష్మీతామర వత్తులతో దీపారాధన చేయండి. కొన్ని పనులను పూర్తి చేయాలన్న ఆలోచనలు కలిగి వుంటారు. స్నేహితులకు సహాయ, సహకారాలు అందిస్తారు. రిజిస్ట్రేషన్ వ్యవహారాలు అనుకూలంగా మారుతాయి.
మీనం
ఈ రాశి వారికి ఈ రోజు పోటీ పరీక్షల్లో విజయం సాధిస్తారు. నూతన ఉద్యోగం కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. జీవిత భాగస్వామితో కలిసి వుండాలన్న ఆలోచనలు ఏర్పడతాయి. తల్లితరపు బంధువులతో చిన్న గొడవలు సంభవిస్తాయి. మీరు చేసిన సహాయ సహకారాలు, త్యాగాలు కొంత మందికి కనిపించవు. డ్రైవింగ్ విషయంలో జాగ్రత్త. చేతికి కుబేర కంకణం ధరించండి. లక్ష్మీ కటాక్షం ఏర్పడుతుంది.
టాపిక్