Today Rasi Phalalu: ఈరోజు ఈ రాశుల వారికి సంపద కలుగుతుంది.. కొత్త పనులు మొదలు పెడతారు-today rasi phalalu january 5th these rasis will get wealth and may start new things check your zodiac sign also ,రాశి ఫలాలు న్యూస్
తెలుగు న్యూస్  /  రాశి ఫలాలు  /  Today Rasi Phalalu: ఈరోజు ఈ రాశుల వారికి సంపద కలుగుతుంది.. కొత్త పనులు మొదలు పెడతారు

Today Rasi Phalalu: ఈరోజు ఈ రాశుల వారికి సంపద కలుగుతుంది.. కొత్త పనులు మొదలు పెడతారు

HT Telugu Desk HT Telugu
Jan 05, 2025 04:00 AM IST

Today Rasi Phalalu: నేటి రాశి ఫలాలు (దిన ఫలాలు) తేదీ 05.01.2025 ఆదివారం కోసం పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ అందించారు. మేషరాశి నుంచి మీన రాశి వరకు 12 రాశుల దిన ఫలాలు ఇక్కడ తెలుసుకోండి.

Today Rasi Phalalu: ఈరోజు ఈ రాశుల వారికి సంపద కలుగుతుంది
Today Rasi Phalalu: ఈరోజు ఈ రాశుల వారికి సంపద కలుగుతుంది (freepik)

రాశిఫలాలు (దిన ఫలాలు) : 05.01.2025

yearly horoscope entry point

ఆయనము: దక్షిణాయనం, సంవత్సరం: శ్రీ క్రోధినామ

మాసం: పుష్యం, వారం : ఆదివారం, తిథి : శు. షష్టి, నక్షత్రం : పూర్వ భాద్రపద

మేషం

ఈ రాశి వారికి ఈ రోజు ఆటుపోట్లను అధిగమిస్తారు. సంప్రదింపులతో తీరిక ఉండదు. ఒత్తిడి పెరగకుండా చూసుకోండి. ఏ విషయంలోనూ రాజీపడొద్దు. మీ అభిప్రాయాలను స్పష్టంగా తెలియజేయండి. రావలసిన ధనం అందుతుంది. ఆర్భాటాలకు విపరీతంగా ఖర్చు చేస్తారు. శ్రమతో కూడిన ఫలితాలున్నాయి. చేపట్టిన పనులు మధ్యలో ఆపివేయొద్దు. అవగాహన లేని విషయాల్లో జోక్యం తగదు. ఆత్మీయులతో సంభాషిస్తారు.

వృషభం

ఈ రాశి వారికి ఈ రోజు కార్యసాధనకు మరింత శ్రమించాలి. ఆశావహ దృక్పథంతో మెలగండి. యత్నాలు విరమించుకోవద్దు. పరిస్థితులు నిదానంగా చక్కబడతాయి. చేపట్టిన పనులు సావకాశంగా పూర్తి చేస్తారు. ఒక అవసరానికి ఉంచిన ధనం మరో దానికి ఖర్చుచేస్తారు. కొత్త వ్యక్తులతో జాగ్రత్త. అందరితోనూ మితంగా సంభాషించండి. పత్రాల రెన్యువల్లో ఏకాగ్రత వహించండి. కీలక సమావేశాల్లో పాల్గొంటారు.

మిధునం

ఈ రాశి వారికి ఈ రోజు దృఢసంకలంతో అడుగు ముందుకేయండి. సాయం ఆశించవద్దు. మీ సమర్థతపై నమ్మకం పెంచుకోండి, స్వయం కృషితోనే లక్ష్యం సాధిస్తారు. ఆదాయం నిరాశాజనకం. సన్నిహితులతో సంభాషణ ఉపశమనం కలిగిస్తుంది. పనులు వేగవంతమవుతాయి. కొత్త సమస్యలు ఎదురయ్యే సూచనలున్నాయి. అనవసర జోక్యం తగదు. నోటీసులు అందుకుంటారు. పెద్దలతో సంప్రదింపులు జరుపుతారు.

కర్కాటకం

రాశి వారికి ఈ రోజు సంప్రదింపులు ఫలిస్తాయి. చాకచక్యంగా వ్యవహరిస్తారు. ప్రముఖులకు సన్నిహితులవుతారు. సభ్యత్వాల స్వీకరణకు అనుకూల సమయం. వ్యతిరేకులతో జాగ్రత్త. అందరినీ కలుపుకుపోయేందుకు యత్నించండి. మీ సాయంతో ఒకరికి మంచి జరుగుతుంది. దూరపు బంధుత్వాలు బలపడతాయి. దుబారా ఖర్చులు అదుపులో ఉండవు. ఆర్భాటాలకు వ్యయం చేస్తారు.

సింహం

రాశి వారికి ఈ రోజు ఆటుపోట్లను దైర్యంగా ఎదుర్కొంటారు. అవకాశాలు కలిసివస్తాయి. ఉత్సాహంగా యత్నాలు సాగిస్తారు. ఆర్థిక లావాదేవీల్లో ఏకాగ్రత వహించండి. చెల్లింపుల్లో జాగ్రత్త వహించండి. బాధ్యతలు స్వయంగా చూసుకోవాలి. చేస్తున్న పనులు మధ్యలో నిలిపివేయొద్దు. ఒకరి వద్ద మరొకరి ప్రస్తావన తగదు. మీ మాటలు చేరవేసే వ్యక్తులున్నారని గమనించండి. ఇంటి విషయాలపై మరింత శ్రద్ధ వహించాలి.

కన్య

రాశి వారికి ఈ రోజు సర్వత్రా ప్రోత్సాహకరం. ఆప్తుల వ్యాఖ్యలు కార్యోన్ముఖులను చేస్తాయి. నిర్దిష్ట ప్రణాళికలతో యత్నాలు సాగిస్తారు. పనులు చురుకుగా సాగుతాయి. ముందు చూపుతో తీసుకున్న నిర్ణయం సత్ఫలితమిస్తుంది. సన్నిహితులతో కాలక్షేపం చేస్తారు. ఎదుటివారి అభిప్రాయాలకు విలువ ఇవ్వండి. వాస్తుదోష నివారణ చర్యలు చేపడతారు. విలువైన వస్తువులు జాగ్రత్త.

తుల

ఈ రాశి వారికి ఈ రోజు అవిశ్రాంతంగా శ్రమిస్తారు. లావాదేవీలు కొలిక్కివస్తాయి. విజ్ఞతతో సమస్యలు పరిష్కరించుకుంటారు. రావలసిన ధనం అందుతుంది. ఇచ్చిన మాట నిలబెట్టుకుంటారు. యత్నాలు ప్రోత్సాహకరంగా సాగుతాయి. దూరపు బంధువులతో సంభాషిస్తారు. ఇంటి విషయాలపై దృష్టి పెడతారు. పనులు వేగవంతమవుతాయి. ఏకాగ్రత తగ్గకుండా చూసుకోండి. వేడుకకు హాజరవుతారు.

వృశ్చికం

ఈ రాశి వారికి ఈ రోజు ఆర్థికంగా నిలదొక్కుకుంటారు. రుణసమస్యలు తొలగి తాకట్టు విడిపించుకుంటారు. ప్రణాళికలు వేసుకుంటారు. పరిచయాలు, బంధుత్వాలు బలపడతాయి. ఒత్తిడి పెరగకుండా చూసుకోండి. అతిగా శ్రమించవద్దు. ఆరోగ్యం జాగ్రత్త, ఫోన్ సందేశాలను పట్టించుకోవద్దు. మీ శ్రీమతికి అన్ని విషయాలు తెలియజేయండి. ఒక సమాచారం ఆలోచింపచేస్తుంది. ఆత్మీయులతో సంభాషిస్తారు. పుణ్యకార్యంలో పాల్గొంటారు.

మకరం

ఈ రాశి వారికి ఈ రోజు ప్రణాళికాబద్ధంగా శ్రమించండి. అనాలోచిత నిర్ణయాలు నష్టం కలిగిస్తాయి. చాకచక్యంగా పనులు చక్కబెట్టుకోవాలి. ఆధిపత్యం ప్రదర్శించవద్దు. ఎదుటి వారి తీరును గమనించి మెలగండి. రాబోయే ఆదాయానికి తగ్గట్టుగా ఖర్చులుంటాయి. మీ గౌరవానికి భంగం కలగకుండా మెలగండి. సన్నిహితుల వ్యాఖ్యలు మీపై సత్ప్రభావం చూపుతాయి.

ధనుస్సు

ఈ రాశి వారికి ఈ రోజు వ్యవహారానుకూలత ఉంది. ఓర్పుతో యత్నాలు సాగించండి. ఆశలొదిలేసుకున్న ధనం అందుతుంది. రోజువారీ ఖర్చులే ఉంటాయి. పనులు త్వరితగతిన సాగుతాయి. ఎవరినీ తక్కువ అంచనా వేయొద్దు. ఒకరి వద్ద మరొకరి ప్రస్తావన తగదు. గృహ మరమ్మతులు చేపడతారు. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. దూరపు బంధువులతో సంభాషిస్తారు.

కుంభం

ఈ రాశి వారికి ఈ రోజు కార్యసాధనకు మరింత శ్రమించాలి. సాయం ఆశించవద్దు. మీ సమర్థతపై నమ్మకం పెంచుకోండి. పరిస్థితులు నిదానంగా చక్కబడతాయి. ఆదాయ వ్యయాలకు పొంతన ఉండదు. భేషజాలకు పోవద్దు. పనులు అర్దాంతంగా ముగిస్తారు. ఒక సమాచారం ఉపశమనం కలిగిస్తుంది. ఆప్తులను కలుసుకుంటారు. పత్రాల రెన్యువల్ అలక్ష్యం తగదు.

మీనం

ఈ రాశి వారికి ఈ రోజు కీలక అంశాలపై పట్టు సాధిస్తారు. ప్రతికూలతను అనుకూలంగా మలుచుకుంటారు. ప్రతిభాపాటవాలు వెలుగులోకి వస్తాయి. పలుకుబడి కలిగిన వ్యక్తులతో పరిచయాలేర్పడతాయి. కొత్త పనులకు ప్రణాళికలు వేసుకుంటారు. ఖర్చులు అదుపులో ఉండవు. ఆర్భాటాలకు విపరీతంగా వ్యయం చేస్తారు. ప్రలోభాలకు లొంగవద్దు. సన్నిహితుల సలహా పాటించండి.

పంచాంగకర్త చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ
పంచాంగకర్త చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ
Whats_app_banner