Today Rasi Phalalu: ఈరోజు ఈ రాశుల వారికి అదృష్టం కలుగుతుంది.. ఏయే రాశులు వారు ఏం చేస్తే మంచి జరుగుతుందో కూడా తెలుసుకోండి
Today Rasi Phalalu: నేటి రాశి ఫలాలు (దిన ఫలాలు) తేదీ 04.01.2025 శనివారం కోసం పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ అందించారు. మేషరాశి నుంచి మీన రాశి వరకు 12 రాశుల దిన ఫలాలు ఇక్కడ తెలుసుకోండి.
రాశిఫలాలు (దిన ఫలాలు) : 04.01.2025
ఆయనము: దక్షిణాయనం, సంవత్సరం: శ్రీ క్రోధినామ
మాసం: పుష్యం, వారం : శనివారం, తిథి : శు. పంచమి, నక్షత్రం : శతిభిష
మేషం
ఈ రాశి వారికి ఈ రోజు గురుబలం రక్షిస్తుంది. ఆర్థికంగా బలపడతారు. పరిస్థితులకు తగినట్టు నిర్ణయాలు తీసుకోవాలి. తొందరపాటు పనికిరాదు. ఉద్యోగులు ఏకాగ్రతతో పనిచేయాలి. వ్యాపార లావాదేవీల్లో లౌక్యం అవసరం. రుణ సమస్యలు ఎదురుకాకుండా జాగ్రత్తపడాలి. ఆధ్యాత్మిక చింతన మనోబలాన్ని ఇస్తుంది. నవగ్రహ స్తోత్రాలు పఠించాలి.
వృషభం
ఈ రాశి వారికి ఈ రోజు ధైర్యంగా నిర్ణయాలు తీసుకోవాలి. కొద్దిపాటి అవరోధాలకే కుంగిపోకూడదు. బొత్తిగా పరిచయం లేని వ్యాపారాలు వద్దు. పక్కదోవ పట్టించే సలహాలతో జాగ్రత్త. అంతరాత్మ ప్రబోధం ప్రకారం నడుచుకోండి. వివాదాలకు దూరంగా ఉండాలి. భాగ్యశుక్రయోగం ఆర్ధికంగా మంచి చేస్తుంది. సూర్యభగవానుడిని ఆరాధించండి.
మిథునం
ఈ రాశి వారికి ఈ రోజు దృఢ సంకల్పంతో ముందడుగు వేయండి. వ్యాపారంలో కలిసొస్తుంది. బుద్ధిబలంతో నిర్ణయాలు తీసుకోండి. పరిస్థితులను బట్టి ఆలోచనా విధానాన్ని మార్చుకోండి. ధనధాన్యాది యోగాలు ఉన్నాయి. ఆత్మీయుల సహకారంతో ఇబ్బందులు అధిగమిస్తారు. పనులు వాయిదా వేయకండి. ఇష్టదైవాన్ని ప్రార్ధించండి.
కర్కాటకం
ఈ రాశి వారికి ఈ రోజు ప్రయత్నాలు సఫలం అవుతాయి. దైవబలం కాపాడుతుంది. సమయానుకూలంగా నిర్ణయాలు తీసుకోండి. అస్థిరమైన ఆలోచనలు ఆందోళనకు దారితీస్తాయి. ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం, వ్యాపార సమస్యలను ఆత్మీయుల సహకారంతో పరిష్కరించుకుంటారు. శ్రీవేంకటేశ్వరుడిని ధ్యానించండి.
సింహం
ఈ రాశి వారు ఈ రోజు మనోబలంతో పనులు ఆరంభించండి. తక్షణ విజయాలు సిద్ధిస్తాయి. చతుర్ధంలో బుధుడు విశేషంగా కరుణిస్తాడు. ప్రతిభను చాటుకునే అవకాశం ఇస్తాడు. భాగస్వామ్య వ్యాపారం మరింత కలిసొస్తుంది. శుక్రగ్రహం పెద్దగా అనుకూలించడం లేదు కాబట్టి, ఆర్ధిక విషయాల్లో అప్రమత్తంగా ఉండాలి. సుబ్రహ్మణ్యేశ్వరుడిని ఉపాసించండి.
కన్య
ఈ రాశి వారికి ఈ రోజు కొత్త నిర్ణయాలకు సరైన సమయం. ఉద్యోగంలో పదోన్నతి ఉంది. సమాజంలో గుర్తింపును పొందుతారు. భూ గృహ, వాహన యోగాలున్నాయి. పంచమ శుక్రయోగం అదృష్టాన్ని అందిస్తుంది. మిత్రుల సూచనలు ఉపయోగకరం. ఏకాగ్రతకు భంగం కలిగించేవారితో జాగ్రత్త. అనవసర వివాదాలు వద్దు. విష్ణు సహస్రనామం పఠించండి.
తుల
ఈ రాశి వారికి ఈ రోజు ఆశయం నెరవేరుతుంది. అనుకూల ఫలితాలు ఉన్నాయి. ప్రజా జీవితంలో ఉన్నవారికి పదవీయోగం ఉంది. రెండో రాశిలో ఉన్న బుధుడు ఊహించని శుభాలను ప్రసాదిస్తాడు. ధన, ధాన్య యోగాలున్నాయి. మీ చొరవ వల్ల మిత్రులకు మంచి జరుగుతుంది. కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు. శ్రీమహాలక్ష్మిని పూజించండి.
వృశ్చికం
ఈ రాశి వారికి ఈ రోజు శుభప్రదమైన కాలం. ప్రయత్నాలు కొనసాగించండి. అన్ని విధాలుగా లాభపడతారు. ఆర్థిక పరిస్థితుల్ని దృష్టిలో ఉంచుకుని ఖర్చు చేయండి. ఉద్యోగులకు అధికారుల ప్రశంసలు లభిస్తాయి. వృత్తిపరంగా కొత్త నైపుణ్యాలు పెంచుకుంటారు. ప్రయాణాలు చేస్తారు. వ్యాపారంలో పోటీ తీవ్రం అవుతుంది. పరమేశ్వరుడిని ఆరాధించండి.
ధనుస్సు
ఈ రాశి వారికి ఈ రోజు ఐశ్వర్యయోగం సూచితం. సమయానికి డబ్బు సమకూరుతుంది. ముఖ్యమైన పనులు వాయిదా వేయకండి. మిశ్రమకాలం నడుస్తోంది. మరింత ఆత్మవిశ్వాసం అవసరం. మిత్రుల సూచనలు పాటించండి. కుటుంబ సహకారం అందుతుంది. ప్రయాణాల్లో జాగ్రత్త వివాదాలకు దూరంగా ఉండాలి. శివాలయాన్ని సందర్శించండి.
మకరం
ఈ రాశి వారికి ఈ రోజు ఉత్తమ ఫలితాలు ఉన్నాయి. బుద్ధిబలంతో నిర్ణయాలు తీసుకుంటారు. వ్యాపారాన్ని విస్తరిస్తారు. కొత్త ప్రయత్నాలు సఫలం అవుతాయి. ఆర్ధికంగా లాభపడతారు. జన్మశుక్రయోగం శుభాలను అందిస్తుంది. ఉద్యోగులు మరింత అప్రమత్తతతో వ్యవహరించాలి. ఆరోగ్యం గురించి ఆలోచించాల్సిన సమయం. సూర్యభగవానుడిని ప్రార్ధించండి.
కుంభం
ఈ రాశి వారికి ఈ రోజు ప్రతి ప్రయత్నం విజయవంతం అవుతుంది. అందివచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. అధికార లాభం ఉంది. ఉద్యోగంలో ఉన్నతి సాధిస్తారు. కృషి ఫలిస్తుంది. సమాజం మీ ప్రతిభను గుర్తిస్తుంది. భూ, గృహ, వాహనాది యోగాలున్నాయి. మనోబలంతో నిర్ణయాలు తీసుకోండి. చంచలత్వం నష్టం కలిగిస్తుంది. ఇష్టదైవాన్ని స్మరించండి.
మీనం
ఈ రాశి వారికి ఈ రోజు ఆర్దికంగా బలపడతారు. కృషికి తగిన గుర్తింపు లభిస్తుంది. అధికారుల ప్రశంసలు అందుకుంటారు. భవిష్యత్తు గురించి ఆలోచిస్తారు. వస్తు, వాహన యోగం ఉంది. ఏకాదశంలో సంచరిస్తున్న శుక్రుడు అన్ని విధాలుగా మేలు చేస్తాడు. మిత్రుల సహకారం లభిస్తుంది. వ్యాపారంలో తగిన జాగ్రత్తలు అవసరం. విష్ణుమూర్తిని ధ్యానించండి.