Today Rasi Phalalu: ఈరోజు ఈ రాశుల వారు ఈ చిన్న మార్పులు చేసుకుంటే మాత్రం తిరుగే ఉండదు.. కలిసి వస్తుంది-today rasi phalalu january 3rd 2025 check your zodiac sign and see what happens ,రాశి ఫలాలు న్యూస్
తెలుగు న్యూస్  /  రాశి ఫలాలు  /  Today Rasi Phalalu: ఈరోజు ఈ రాశుల వారు ఈ చిన్న మార్పులు చేసుకుంటే మాత్రం తిరుగే ఉండదు.. కలిసి వస్తుంది

Today Rasi Phalalu: ఈరోజు ఈ రాశుల వారు ఈ చిన్న మార్పులు చేసుకుంటే మాత్రం తిరుగే ఉండదు.. కలిసి వస్తుంది

HT Telugu Desk HT Telugu
Jan 03, 2025 04:00 AM IST

Today Rasi Phalalu: నేటి రాశి ఫలాలు (దిన ఫలాలు) తేదీ 03.01.2025 శుక్రవారం కోసం పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ అందించారు. మేషరాశి నుంచి మీన రాశి వరకు 12 రాశుల దిన ఫలాలు ఇక్కడ తెలుసుకోండి.

ఆగస్ట్ 19 నేటి రాశి ఫలాలు
ఆగస్ట్ 19 నేటి రాశి ఫలాలు

రాశిఫలాలు (దిన ఫలాలు) : 03.01.2025

yearly horoscope entry point

ఆయనము: దక్షిణాయనం, సంవత్సరం: శ్రీ క్రోధినామ

మాసం: పుష్యం, వారం : శుక్రవారం, తిథి : శు. చవితి, నక్షత్రం : ధనిష్ఠ

మేషం:

ఈ రాశి వారికి ఈ రోజు గ్రహ సంచారాలు మధ్యమంగా ఉపకరిస్తాయి. పట్టుదలతో సాగాల్సి వుంటుంది. తెలియని ఖర్చులచే చిన్నతరహా సర్దుబాట్లు అవసరమవుతాయి. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలలో ఒత్తిడి, శ్రమ ఎక్కువ ఉంటాయి. ఇతరుల సలహాల స్వీకరణలందు జాగ్రత్తలు తప్పనిసరి చేయండి. నూతన వ్యాపార, వ్యవహారాలను చేపట్టుకోగల్గుతారు. నిరుద్యోగులు, విద్యార్థులు టార్గెట్ విధానాల్ని చేపట్టుకోవాలి.

వృషభం:

ఈ రాశి వారికి ఈ రోజు కుటుంబ వ్యవహారాలలో అదనపు మార్పులు, శ్రమలు వంటి వాటిచే మానసిక ఒత్తిడులకు గురికాగల సూచనలున్నాయి. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో మీదైన తరహాలో సాగగల్గుతారు. ఇతరులకు సహకరించవలసి రావచ్చును. ఉద్యోగులకు బాధ్యతల మార్పువంటివి ఉంటాయి. ఉద్యోగ మార్పులు, నిరుద్యోగుల ప్రయత్నాలు ఉపకరించగలవు. షార్ట్ జర్నీస్ చేయవలసిరావచ్చును.

మిథునం:

రాశి వారికి ఈ రోజు వాగ్విషయాల్లో జాగ్రత్తలు తప్పనిసరి చేస్తూ ప్రయత్నాలను వేగవంతం చేసుకోండి. ఆర్థికంగా బలపడడానికి అవకాశాలు ఏర్పడతాయి. మనోధైర్యములు చూపుకొని పెద్ద పనులను చేపట్టుకోగల్గుతారు. కుటుంబ వ్యక్తుల సహకారాలు పెరుగుతాయి. ఆరోగ్యపరంగా చిన్నతరహా జాగ్ర త్తలు తప్పనిసరి చేయండి.

కర్కాటకం:

ఈ రాశి వారికి ఈ రోజు గ్రహసంచారాలు ఒత్తిడిని ఏర్పరచేవైనా సాధారణంగా కొనసాగుతాయి. తెలియని వ్యక్తులచే సహకారాలు పొందుతారు. ఋణము నిచ్చుటకు పెట్టుబడులకు దూరంగా ఉండండి. వ్యాపార వ్యవహారాలు ఊహించుకొన్నట్లుగా పూర్తిచేసుకుంటారు. పెట్టుబడులపై ఆసక్తిని చూపుతారు. కుటుంబ వ్యక్తుల ఆలోచనల్ని పరిగణనలోకి తీసుకోండి. అవివాహితులకు, నిరుద్యోగులకు నుంచి వార్తలుంటాయి.

సింహం:

ఈ రాశి వారికి ఈ రోజు సామాన్యంగా వుండి ఉత్తరార్ధమున ఉత్సాహకర సంఘటనలు ఉంటాయి. ఒత్తిడికి గురిచేసిన అంశాలను దూరం చేసుకొంటారు. పెట్టుబడులను ఉపసంహరించుకొనుట ఉంటాయి. కుటుంబ వ్యవహారాల్లో సర్దుకుపోవలసి వుంటుంది. కుటుంబ వ్యక్తుల ఆరోగ్య విషయాలు చికాకుపరుస్తాయి. మానసిక ఇబ్బందులు. ఇతరుల నెదుర్కోలేకపోవుట. ప్రయాణాల్ని వాయిదా వేసుకొంటారు.

కన్య:

ఈ రాశి వారికి ఈ రోజు గ్రహ సంచారాలు మధ్యమముగా ఉపకరిస్తాయి. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో మీదైన తరహాలో సాగవలసివుంటుంది. కుటుంబంలో వ్యక్తిగత విషయాలకై ఖర్చులు ఎక్కువ చేయవలసిరావచ్చు. విద్యార్థులు కాంపిటేటివ్స్ తో రాణించగలుగుతారు. వ్యాపారాల్లో నూతన అగ్రిమెంట్స్ పూర్తికాగలవు. వివాహ ప్రయత్నాలలో, సమాచార సేకరణలో జాగ్రత్తలు తప్పనిసరి చేసుకోవాలి.

తుల:

ఈ రాశి వారికి ఈ రోజు వృత్తి, వ్యాపారాల్లో బిజీతనములుంటాయి. ఆర్థికంగా పరవాలేని స్థితులేర్పడతాయి. ఇంటా-బయటా సహకారాలు, గౌరవాలు చూడగల్గుతారు. ఆధ్యాత్మికతలపై దృష్టిపెట్టలేకపోతారు. భూ విరాళాలిచ్చు సూచనలున్నాయి. విద్యార్థులు, నిరుద్యోగులు లక్ష్యసాధనపై దృష్టిసారించగలుగుతారు. సంతానానికి బహుమతులు ఇవ్వగలరు. ఆరోగ్య విషయంలో మంచి మార్పులు చూస్తారు.

వృశ్చికం:

ఈ రాశి వారికి ఈ రోజు ఊహించుకొన్న పనులను ఉత్సాహంగా పూర్తి చేసుకోగలుగుతారు. కుటుంబంలో దాపరికాలు లేకుండా సరళ సంభాషణలతో సాగగలుగుతారు. ఖర్చులకు తగినట్లు సర్దుబాట్లు జరుగుతాయి. విద్యార్థులకు వ్యాసంగాలు సంతృప్తినిస్తాయి. స్థిరాస్తులపై పెట్టుబడులుంచి, ఆసక్తిని చూపుతారు.

ధనుస్సు:

రాశి వారికి ఈ రోజు కుటుంబ వ్యక్తుల అభిప్రాయాలకు విలువనిచ్చి ఏకాభిప్రాయాలను ఏర్పరచుకోగలరు. ప్రయాణాలను విరమించుకుంటారు. వృత్తి, వ్యాపార, ఉద్యోగాలలో సామాన్య సంతృప్తిని పొందుతారు. అభిప్రాయ సేకరణల విషయంలో జాగ్రత్తలు అవసరం. ఒప్పందాలను కొంతకాలం వాయిదా వేసుకొనుట మంచిది. వివాహ, ఉద్యోగ యత్నాల్లో నిరాశలు ఏర్పరచుకోకుండా సాగాల్సివుంటుంది.

మకరం:

రాశి వారికి ఈ రోజు వ్యక్తిగత చొరవతో ముఖ్యమైన పనుల్ని పూర్తిచేసుకొంటారు. ముఖ్యంగా కుటుంబ సభ్యుల ప్రవర్తనల్లో మార్పులు ఆశించి పనిచేయగలరు. ఆర్థిక సమర్థతలు ఉంటాయి. ఉద్యోగ, వ్యాపారాల్లో అనుకూల స్థితుల్ని చూడగలరు. యంత్ర, వాహన మార్పులకు ప్రాధాన్యతనిచ్చుకుంటారు. సోదర వృద్ధిని ఆహ్వానించగల్గుతారు. నిరుద్యోగులు పట్టుదలలతో సాగాల్సి వుంటుంది.

కుంభం:

ఈ రాశి వారికి ఈ రోజు చెల్లింపులపై దృష్టి నుంచి అదనపు ఖర్చులను చేపట్టుకోండి. ఇతరులను సహాయాలు ఆశించకుండా కార్యదీక్షలు చూపుకోండి. సంతానమునకు సహకరించవలసిరావచ్చును. ఉపాధి పథకాలు ఆకర్షించగలవు. వ్యాపారాలు ఉత్సాహాన్నిస్తాయి. ఉద్యోగులకు అదనపు బాధ్యతలు ఉంటాయి.

మీనం:

ఈ రాశి వారికి ఈ రోజు కొత్త పనులు చేపట్టి పూర్తిచేసుకోగలుగుతారు. కోరుకొన్న అవకాశాలకై ఉద్యో గులు, వ్యాపారాలు నిర్వహించుకొనుటకు ప్రయత్నాలను వేగవంతం చేసుకోగల్గుతారు. ఆర్థికంగా ముందు జాగ్రత్తలు తప్పనిసరి చేయండి. పని ఒత్తిడి ఏర్పడకుండా ప్రణాళికాబద్ధముగా వ్యవహరించుకోవలసివుంటుంది. విద్యార్థులు ఏకాగ్రతలు చూపుకోవాలి. కొన్ని తప్పనిసరి ప్రయాణాలను చేయ వలసిరావచ్చును.

బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ, మొబైల్‌ : 9494981000
బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ, మొబైల్‌ : 9494981000
Whats_app_banner