Today Rasi Phalalu: కొత్త సంవత్సరం మొదటి రోజు ఈ రాశుల వారికి మంచి ఫలితాలు.. ఏ రాశి వారు ఏం చేస్తే బాగుంటుందో తెలుసుకోండి-today rasi phalalu january 1st 2025 check remedies for your zodiac sign and follow those ,రాశి ఫలాలు న్యూస్
తెలుగు న్యూస్  /  రాశి ఫలాలు  /  Today Rasi Phalalu: కొత్త సంవత్సరం మొదటి రోజు ఈ రాశుల వారికి మంచి ఫలితాలు.. ఏ రాశి వారు ఏం చేస్తే బాగుంటుందో తెలుసుకోండి

Today Rasi Phalalu: కొత్త సంవత్సరం మొదటి రోజు ఈ రాశుల వారికి మంచి ఫలితాలు.. ఏ రాశి వారు ఏం చేస్తే బాగుంటుందో తెలుసుకోండి

HT Telugu Desk HT Telugu
Jan 01, 2025 08:07 AM IST

Today Rasi Phalalu: నేటి రాశి ఫలాలు (దిన ఫలాలు) తేదీ 01.01.2025 బుధవారం కోసం పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ అందించారు. మేషరాశి నుంచి మీన రాశి వరకు 12 రాశుల దిన ఫలాలు ఇక్కడ తెలుసుకోండి.

Today Rasi Phalalu:కొత్త సంవత్సరం మొదటి రోజు ఈ రాశుల వారికి మంచి ఫలితాలు
Today Rasi Phalalu:కొత్త సంవత్సరం మొదటి రోజు ఈ రాశుల వారికి మంచి ఫలితాలు (pinterest)

రాశిఫలాలు (దిన ఫలాలు) : 01.01.2025

yearly horoscope entry point

ఆయనము: దక్షిణాయనం, సంవత్సరం: శ్రీ క్రోధినామ

మాసం: పుష్యం, వారం : బుధవారం, తిథి : శు. విదియ, నక్షత్రం : ఉత్తర ఆషాడ

మేషం

ఈ రాశి వారు ఈ రోజు అనుకున్న పనులు పూర్తి చేస్తారు. ఆత్మీయుల నుంచి ఆహ్వానాలు, మీ నిర్ణయాలపై కుటుంబసభ్యులు సంతోషిస్తారు. ఆస్తుల వ్యవహారాలలో చికాకులు తొలగుతాయి. వాహనాలు కొనుగోలు చేస్తారు. ఒక కోర్టు వ్యవహారంలో కదలికలు ఉంటాయి. ప్రముఖుల పరిచయం. వ్యాపారాలు వృద్ధి చెందుతాయి. ఉద్యోగాలలో అనుకూల మార్పులు ఉండవచ్చు. పారిశ్రామికవర్గాలకు మరింత అనుకూల పరిస్థితి. సుబ్రహ్మణ్యాష్టకం పఠించండి.

వృషభం

ఈ రాశి వారికి ఈ రోజు ఆర్థిక పరిస్థితి కొంత నయంగా కనిపిస్తుంది. ఆత్మీయుల నుంచి కీలక సమాచారం రాగలదు. ఆస్తుల వ్యవహారాలలో పరిష్కారానికి చొరవ చూపుతారు. నిరుద్యోగులకు శ్రమానంతరం ఫలితం కనిపిస్తుంది. స్వల్ప అనారోగ్యం. గృహం కొనుగోలు, నిర్మాణాలలో కొన్ని ప్రతిబంధకాలు. వ్యాపారాలు కొంతమేర లాభిస్తాయి. ఉద్యోగాలలో ఒత్తిడులు, కళారంగం వారికి ఒత్తిడులు. ఆంజనేయస్వామిని పూజించండి.

మిధునం

ఈ రాశి వారు ఈ రోజు కొత్త పనులు చేపడతారు. ఆస్తి వివాదాలు పరిష్కరించుకుంటారు. కొన్ని సమస్యల నుంచి గట్టెక్కుతారు. పలుకుబడి కలిగిన వ్యక్తులు పరిచయమవుతారు. ఇళ్లు, వాహనాలు కొనుగోలు చేస్తారు. వ్యాపారాల విస్తరణలో ఆటంకాలు తొలగుతాయి. విద్యార్థులు కోరుకున్న అవకాశాలు సాధిస్తారు. ఉద్యోగాలలో హోదాలు పెరుగుతాయి. పారిశ్రామికవర్గాలకు మరింత అనుకూలస్థితి. విష్ణుసహస్రనామ పారాయణ చేయండి.

కర్కాటకం

ఈ రాశి వారికి ఈ రోజు ఖర్చులు పెరిగి కొత్త రుణాల కోసం యత్నిస్తారు. అనుకున్నదొకటి జరిగేది వేరొకటిగా ఉంటుంది. కొన్ని నిర్ణయాలు మార్చుకుంటారు. ఆస్తి వివాదాలు కొంత ఇబ్బంది కలిగిస్తాయి. వ్యాపారాలు నెమ్మదిగా సాగుతాయి. నిరుద్యోగులకు శ్రమాధిక్యం. ఉద్యోగాలలో కొంత అసంతృప్తి. రాజకీయవర్గాలకు ఒత్తిడులు పెరుగుతాయి. సుబ్రహ్మణ్యాష్టకం పఠించండి.

సింహం

ఈ రాశి వారికి ఈ రోజు ఏ పని చేపట్టినా విజయం సాధిస్తారు. విద్యార్థుల ప్రతిభ వెలుగులోకి వస్తుంది. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. దీర్ఘకాలిక సమస్యలు కొన్ని పరిష్కరించుకుంటారు. వాహనయోగం, సోదరులతో ఆస్తి వ్యవహారాలు కొలిక్కి వస్తాయి. నూతన ఉద్యోగ ప్రాప్తి, వ్యాపారాలు గతం కంటే మెరుగ్గా ఉంటాయి. ఉద్యోగాలలో అనుకూల వాతావరణం, ఇంక్రిమెంట్లు దక్కుతాయి. రాజకీయవర్గాల యత్నాలు సఫలం. దుర్గాదేవి స్తోత్రాలు పఠించండి.

కన్య

ఈ రాశి వారికి ఈ రోజు అవసరాలకు తగినంతగా డబ్బు సమకూరుతుంది. రుణభారాలు తొలగుతాయి. ముఖ్యమైన వ్యవహారాలు సాఫీగా పూర్తి చేస్తారు. ఆలోచనలు కార్యరూపంలో పెడతారు. ఒక సమాచారం నిరుద్యోగులకు ఊరటనిస్తుంది. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగాలలో హోదాలు పెరుగుతాయి. కళారంగం వారికి ఉత్సాహవంతంగా ఉంటుంది. హనుమాన్ చాలీసా పఠించండి.

తుల

తుల రాశి వారికి ఈ రోజు నూతన ఉద్యోగాలు పొందుతారు. ముఖ్య వ్యవహారాలు విజయవంతంగా సాగుతాయి. ఆప్తులు, బంధువులతో ఆనందంగా గడుపుతారు. పలుకుబడి మరింత పెరుగుతుంది. ఆస్తుల విషయంలో కొత్త ఒప్పందాలు. అరుదైన ఆహ్వానాలు అందుతాయి. విద్యార్థులు కోరుకున్న అవకాశాలు సాధిస్తారు. వ్యాపారాలు లాభిస్తాయి. ఉద్యోగాలలో కీలకపోస్టులు రావచ్చు. పారిశ్రామికవర్గాలకు మరింత అనుకూలస్థితి. గణేశ స్తోత్రాలు పఠించండి.

వృశ్చికం

ఈ రాశి వారికి ఈ రోజు చేపట్టిన పనులు స్వయంగా పూర్తి చేస్తారు. అనుకున్న లక్ష్యాలు సాధించే దిశగా కదులుతారు. కొత్త కాంట్రాక్టులు దక్కుతాయి. ఆర్థిక పరిస్థితిని చక్కదిద్దుకుని ఉత్సాహంగా గడుపుతారు. ఉద్యోగాలలో కొత్త పోస్టులు వచ్చే అవకాశం. వ్యాపారాలు లాభదాయకంగా ఉంటాయి. రాజకీయ వర్గాలకు అన్ని విధాలా కలసివచ్చే సమయం. హయగ్రీవస్తోత్రాలు పఠించండి.

ధనుస్సు

ఈ రాశి వారికి ఈ రోజు ముఖ్యమైన పనులు నెమ్మదిగా కొనసాగుతాయి. ఆర్థికంగా మునుపటి కంటే మెరుగ్గా ఉంటుంది. ఉద్యోగ యత్నాలు అనుకూలిస్తాయి. ఎప్పుడో చేజారిన పత్రాలు తిరిగి లభ్యమవుతాయి. వ్యాపారాలలో పెట్టుబడులకు తగినంతగా లాభాలు ఆర్జిస్తారు. ఉద్యోగాలలో మీ అంచనాల మేరకు మార్పులు ఉండవచ్చు. కళారంగం వారి ఆశలు నెరవేరతాయి. దేవీస్తోత్రాలు పఠించండి.

మకరం

ఈ రాశి వారికి ఈ రోజు ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. ఆశ్చర్యకరమైన రీతిలో సమస్యల నుంచి బయట పడతారు. కొత్త వ్యక్తుల పరిచయం. అందరిలోనూ విశేష గౌరవమర్యాదలు లభిస్తాయి. వాహనాలు, భూములు కొనుగోలు చేస్తారు. వ్యాపారాలు లాభాల దిశగా సాగుతాయి. ఉద్యోగాలలో చిక్కులు తొలగుతాయి. రాజకీయవర్గాలకు విదేశీ పర్యటనలు. వేంకటేశ్వరస్తుతి మంచిది.

కుంభం

కుంభ రాశి వారికి ఈ రోజు ముఖ్యమైన పనుల్లో విజయం. ఆస్తుల వ్యవహారాలు కొలిక్కి వస్తాయి. ఆర్థికంగా గతం కంటే మెరుగ్గా ఉంటుంది. వాహనాలు, భూములు కొనుగోలు చేసే సమయం. విద్యార్థులకు అనుకోని అవకాశాలు. కొన్ని వివాదాలను నేర్పుగా పరిష్కరించుకుంటారు. వ్యాపారాలు మరింత లాభిస్తాయి. ఉద్యోగాలలో మీ హోదాలు పెరుగుతాయి. పారిశ్రామికవర్గాలకు విదేశీ పర్యటనలు. గణేశాష్టకం పఠించండి.

మీనం

ఈ రాశి వారికి ఈ రోజు కొన్ని పనులు సజావుగా సాగుతాయి. ఆర్థికంగా ఆశాజనకంగా ఉంటుంది. విద్యార్థులకు ఊహించని అవకాశాలు. వివాహయత్నాలు సానుకూలం కాగలవు. భూములు, వాహనాలు కొంటారు. వ్యాపారాలలో లాభాలు అనుకున్న మేరకు పొందుతారు ఉద్యోగాలలో ఊహించని మార్పులు సంభవం. రాజకీయవర్గాలకు ఆహ్వానాలు. ఆంజనేయ దండకం పఠించండి.

బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ, మొబైల్‌ : 9494981000
బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ, మొబైల్‌ : 9494981000
Whats_app_banner