Today Rasi Phalalu: ఈరోజు ఈ రాశుల వారికి కలిసి వస్తుంది.. ధనంతో పాటు ఉద్యోగ, వివాహ విషయాల్లో శుభాలతో పాటు ఎన్నో
Today Rasi Phalalu: నేటి రాశి ఫలాలు (దిన ఫలాలు) తేదీ 13.01.2025 సోమవారం కోసం పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ అందించారు. మేషరాశి నుంచి మీన రాశి వరకు 12 రాశుల దిన ఫలాలు ఇక్కడ తెలుసుకోండి.
రాశిఫలాలు (దిన ఫలాలు) : 13.01.2025
సంబంధిత ఫోటోలు
Feb 15, 2025, 01:09 PMBudhaditya Yoga: కుంభరాశిలో సూర్యుని రాక, బుద్ధాదిత్య రాజ యోగం- ఈ 4 రాశుల వారికి గోల్డెన్ డేస్ మొదలు, ఉద్యోగ అవకాశాలు!
Feb 15, 2025, 08:07 AMShani Transit: శని సంచారం, 2025లో డబ్బుల వర్షం కురుస్తుంది.. ఈ మూడు రాశుల వారికి సంతోషం
Feb 15, 2025, 05:35 AMఇక విజయానికి కేరాఫ్ అడ్రెస్ ఈ 3 రాశులు- డబ్బులే, డబ్బులు..
Feb 14, 2025, 08:05 AMGuru Transit: మిథున రాశిలో గురువు సంచారం.. ఈ 3 రాశులకు అదృష్టం, ధనం, సంతోషంతో పాటు ఎన్నో
Feb 14, 2025, 06:15 AMఇక ఈ రాశుల వారికి డబ్బుకు లోటు ఉండదు! జీవితంలో అపార సంతోషం..
Feb 13, 2025, 08:09 AMRahu Transit: రాహువు కుంభ రాశి సంచారం.. ఈ రాశులకు ఆకస్మిక ధన లాభం, సంతోషంతో పాటు ఎన్నో
ఆయనము: దక్షిణాయనం, సంవత్సరం: శ్రీ క్రోధినామ
మాసం: పుష్యం, వారం : సోమవారం, తిథి : శు. పౌర్ణమి, నక్షత్రం : ఆరుద్ర
మేషం
ఈ రాశి వారికి ఈ రోజు గ్రహసంచారములు నుంచి ప్రయోజనమివ్వగలవు. వృత్తి, ఉద్యోగాలలో మీదైన తరహాలో వ్యవహరించుకొంటారు. కుటుంబ వ్యవహారాల్లో ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటారు. వద్దు అనుకున్నా కొన్ని ప్రయాణాలు చేయవలసిరావచ్చును. వాహన, గృహోపకరణ మార్పులు చేయవలసి రావచ్చు. సంతానపు వ్యవహారాలలో సమాధానపరచుకోలేని సమస్యలు గోచరించు సూచనలు ఉన్నాయి.
వృషభం
ఈ రాశి వారికి ఈ రోజు ఉత్సాహంగా వ్యవహరించుకొంటున్నా చిన్నచిన్న ఆటంకాలు చూడవలసిరావచ్చు. అధికారులతో గతంలోని సమస్యల్ని గురించి చర్చలు చేయగల్గుతారు. స్తిరాస్తి, బంగారం విషయాల్లో పెట్టుబడులు ఉంచగలరు. ఆధ్యాత్మిక వ్యవహారాల్లో పాలుపంచుకుంటారు. సంతానమునకు గుర్తింపులు ఉత్సాహపరచగలవు. ఖర్చులను నియంత్రించుకోవలసివుంటుంది.
మిథునం
ఈ రాశి వారికి ఈ రోజు ఆరోగ్య, ఆర్థిక వ్యవహారాల్లో జాగ్రత్తలు అవసరం. ఏకపక్ష నిర్ణయాలకు దూరంగా ఉంటూ కుటుంబ వ్యక్తులతో కలసి వ్యవహరించుకోవాలి. వివాహ, ఉద్యోగయత్నాలను పట్టుదలతో సాగించుకోవాలి. అధికారులతోను, పెద్దలతోను సంయమనంతో నడవాలి. విద్యార్థులు పోటీ పరీక్షల్లో ప్రతిభను చూపగలరు.
కర్కాటకం
ఈ రాశి వారికి ఈ రోజు ఇంటా బయటా ఒత్తిడిని ఏర్పరచు అంశాలు ఉంటాయి. ప్రవర్తనలలో జాగ్రత్తలు అవసరం. రిస్కు తక్కువగా ఉండే పనులను చేపట్టుకోండి. ఆర్థిక వ్యవహారాలకు దూరంగా ఉండుట మంచిది. పనులు ప్రారంభంలో ఆటంకాలు పొందినా చివరకు పూర్తిచేసుకోగలుగుతారు. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలలో బాధ్యతగానే వ్యవహరించుకోండి.
సింహం
ఈ రాశి వారికి ఈ రోజు వ్యక్తిగత వ్యవహారాలన్నీ ఊహించుకొన్నట్లు సాగుతాయి. ఆర్థిక పరిస్థితులు ఆశించినట్లు సాగుతాయి. సొంత ఆలోచనలతోనే పని ఒత్తిడులు తగ్గించుకోగలుగుతారు. నిరాశ, నిరుత్సాహం కలిగించువారికి దూరంగా ఉండండి. వాహన, యంత్రాదులతో జాగ్రత్తలు తప్పనిసరి. బంధు, స్నేహవర్గంలోని బేలతనమును చూస్తారు. సంతానపు, ఉద్యోగ, వివాహ విషయాల్లో శుభాలు ఏర్పడతాయి.
కన్య
ఈ రాశి వారికి ఈ రోజు ఉత్సాహంగా వ్యవహరించుకొని చేపట్టిన పనులను పూర్తిచేసుకుంటారు. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలకై మీరు చేయు కృషి ఫలిస్తుంది. ఆదాయ, వ్యయాలు అనుకూలం. నూతనమయిన ఆలోచనలను కార్యరూపంలో పెట్ట గలుగుతారు. సోదరులతో ఉన్న సమస్యలను దూరం చేసుకొనేందుకు అనువైన సమయం. ప్రయత్నం చేయండి.
తుల
ఈ రాశి వారికి ఈ రోజు చిన్నతరహా ఒత్తిడి వున్నా వృద్ధికై చేయు ప్రయత్నములు అనుకూలిస్తాయి. బంధు, స్నేహ వర్గంతో ఉత్సాహాలు పంచుకుంటారు. అనారోగ్యభావనలు చికాకుపరుస్తాయి. స్తిరాస్తి విషయాల్లో కలిగిన ఇబ్బందులు దూరం చేసుకొంటారు. వ్యాపార, వ్యవహారాలలో ఉత్సాహంగా సాగుతారు. సేవా కార్యక్రమాలకు సహకరిస్తారు.
వృశ్చికం
ఈ రాశి వారికి ఈ రోజు నూతన పనులకు శ్రీకారం చుడతారు. అవకాశాలు కలిసివస్తాయి. సమాజంలో ప్రముఖులతో పరిచయాలు ఉంటాయి. వ్యాపారాలు, వ్యవహారాల్లో స్వబుద్ధితో వ్యవహరించుకోండి. విద్యార్థులకు, నిరుద్యోగులకు ప్రయోజనాలు ఏర్పడతాయి. ఋణదాతలకు అందుబాటులో ఉండుట, అభినందనలు తెలియచేయుట తప్పనిసరి చేయండి.
ధనుస్సు
ఈ రాశి వారికి ఈ రోజు ముఖ్యమనుకొన్న పనులను సమయ సందర్భాలను బట్టి చేపట్టుకోవాలి. శ్రమ మీది, ఫలితం వేరొకరిదన్నట్లు ఉంటుంది. జాగ్రత్తలు పాటించుకోవాలి. బంధుమిత్రులతో వ్యవహారాలను జరుపుతారు. కుటుంబ వ్యక్తులచే సహకారాలు, ఉత్సాహాలు ఉంటాయి. పని ఒత్తిడిని తగ్గించుకుంటారు. ప్రయాణ యత్నాలను సాగించుకొంటారు. విద్యార్థులు, నిరుద్యోగులు పట్టుదలలతో సాగాల్సి వుంటుంది.
మకరం
ఈ రాశి వారికి ఈ రోజు అనుకొన్న పనులను నిదానంగా పూర్తిచేసుకుంటారు. పలుకుబడిగల వ్యక్తుల పరిచయాలు సిద్ధిస్తాయి. వాహన, యంత్రాదులలో మార్పు చేర్పులకు యోచనలు చేస్తారు. ఇంటా- బైటా మీ తరహా ఆలోచనల్ని అమలుచేసుకొంటారు. ఉద్యోగ, వ్యాపారాలకై చేయు యత్నాలలో చిక్కుల్ని దూరం చేసుకుంటారు. ఆర్థికంగా బాగుంటుంది.
కుంభం
ఈ రాశి వారికి ఈ రోజు చిన్నతరహా ఉత్సాహాలు ఏర్పడతాయి. ఆర్థికంగా గతంకంటే అనుకూలతలు చూడగలరు. ప్రయత్న కార్యాలను అనుకూలింపచేసుకొంటారు. బంధుమిత్రులనుండి శుభకార్య ఆహ్వానాలు ఉంటాయి. కుటుంబ సభ్యులతో ఉత్సాహంగా వ్యవహరించుకొంటారు. అధికారులు, ప్రముఖులతో సమావేశాలు ఉంటాయి. వ్యాపార వ్యవహారాల్లో నూతన అగ్రిమెంట్లు చేసుకో గలరు.
మీనం
ఈ రాశి వారికి ఈ రోజు ఆరోగ్య, ఆర్థిక విషయాలు గతంకంటే అనుకూలం. అనుకొన్న పనుల్ని సకాలంలో పూర్తి చేసుకుంటారు. అధికారులతో ఉత్తర ప్రత్యుత్తరాలు నిర్వహిస్తారు. కీలకం, ముఖ్యమైన సమా చారం సేకరిస్తారు. చేస్తున్న పనులకు దిద్దుబాట్లు అవసరంలేకుండా జాగ్రత్తపడండి. వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో ఉత్సాహంనిచ్చు సంఘటనలు ఉంటాయి.
టాపిక్