మే 9, నేటి రాశి ఫలాలు..ఈరోజు మీరు ఎదుటివారితో ఏం మాట్లాడినా తప్పే అవుతుంది-today rasi phalalu in telugu may 9th 2024 check your zodiac signs result for daily horoscope ,రాశి ఫలాలు న్యూస్
తెలుగు న్యూస్  /  రాశి ఫలాలు  /  మే 9, నేటి రాశి ఫలాలు..ఈరోజు మీరు ఎదుటివారితో ఏం మాట్లాడినా తప్పే అవుతుంది

మే 9, నేటి రాశి ఫలాలు..ఈరోజు మీరు ఎదుటివారితో ఏం మాట్లాడినా తప్పే అవుతుంది

HT Telugu Desk HT Telugu
May 09, 2024 12:01 AM IST

Today rasi phalalu: నేటి రాశి ఫలాలు (దిన ఫలాలు) తేదీ09.05.2024 గురువారం కోసం పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ అందించారు. మేషరాశి నుంచి మీన రాశి వరకు12 రాశుల దిన ఫలాలు ఇక్కడ తెలుసుకోండి.

మే 9వ తేదీ నేటి రాశి ఫలాలు
మే 9వ తేదీ నేటి రాశి ఫలాలు (freepik )

నేటి రాశి ఫలాలు (దిన ఫలాలు) 09.05.2024

వారం: గురువారం, తిథి : పాడ్యమి, విదియ

నక్షత్రం : కృత్తిక, మాసం : వైశాఖము,

సంవత్సరం: శ్రీ క్రోధి నామ, అయనం: ఉత్తరాయణం

మేష రాశి

మేషరాశి వారికి ఈరోజు మీకు అనుకూలంగా ఉన్నది. మీ ప్రయత్నాలకు సన్నిహితుల నుంచి సహకారం లభిస్తుంది. కొన్ని సమస్యలు చిన్నవే అయినా మనశ్శాంతి దూరం చేస్తాయి. ప్రయాణాలలో మెళకువ అవసరం. వస్త్ర, బంగారు, వెండి, లోహ వ్యాపారస్తులకు పురోభివృద్ధి కానవస్తుంది. శివపార్వతుల అర్థనారీశ్వరుని రూపానికి ప్రతీక అయినటువంటి దక్షిణామూర్తిని చూడడం, దక్షిణామూర్తి స్తోత్రాలను పఠించడం చేత సమస్యలు తొలగి శుభఫలితాలు కలుగుతాయి.

వృషభ రాశి

నేటి రాశి ఫలాల ప్రకారం వృషభ రాశి వారికి ఈరోజు అనుకూలంగా లేదు. ఉద్యోగస్తులు అధికారుల తీరును గమనించి మెలగవలసి ఉంటుంది. రావలసినధనం వాయిదా పడడంతో అందోళన చెందుతారు. విద్యార్థులకు తోటివారి వల్ల సమస్యలను ఎదుర్కొంటారు. ఇచ్చిపుచ్చుకునే వ్యవహారాల్లో మెళకువ వహించండి. కోర్టు వ్యవహారాలు వాయిదా పడుట మంచిది. ఈరోజు మరింత శుభఫలితాలు పొందడం కోసం దత్తాత్రేయుని పూజించాలి. శ్రీగురుచరిత్ర పఠించడం దత్తాత్రేయ స్తోత్రాన్ని పఠించడం వలన శుభఫలితాలు కలుగుతాయి.

మిథున రాశి

మిథున రాశి వారికి ఈ రోజు మీకు అనుకూలంగా లేదు. మీ లక్ష్యసాధనకు నిరంతరం కృషి పట్టుదల అవసరమని గమనించండి. కుటుంబీకుల ఆరోగ్యం విషయంలో మెళకువ వహించండి. స్థిరాస్తి క్రయవిక్రయాలకు సంబంధించిన వ్యవహారాల్లో మెళకువ అవసరం. దంపతుల మధ్య కలహాలు తలెత్తుతాయి. పట్టువిడుపు ధోరణితో మీ సమస్యలు పరిష్కారమవుతాయి. ఈరోజు మరింత శుభఫలితాలు పొందడం కోసం దత్తాత్రేయుని పూజించాలి. బ్రాహ్మణులకు గాని ముత్తైదువులకు గాని తాంబూలం, శనగలను దానమివ్వడం మంచిది. శనగలతో చేసిన ప్రసాదాన్ని నివేదన చేసి అది ప్రసాదంగా పంచిపెట్టాలి.

కర్కాటక రాశి

కర్కాటక రాశి వారికి ఈ రోజు మీకు అనుకూలంగా లేదు. ప్రైవేటు సంస్థలలోని వారి నిర్లక్ష్యం, మతిమరుపు వల్ల యాజమాన్యం కోపతాపాలకు గురికావలసి వస్తుంది. నేడు చేద్దామన్న పనులు రేపటికి వాయిదావేస్తారు. ఆలయాలను సందర్శిస్తారు. ప్రింటింగ్‌ రంగాల్లో వారు పనివారితో ఇబ్బందులు తలెత్తుతాయి. హోటల్‌, క్యాటరింగ్‌ రంగాలవారికి లాభదాయకం. శివపార్వతులు అర్థనారీశ్వరుని రూపానికి ప్రతీక అయినటువంటి దక్షిణామూర్తిని చూడడం మరియు దక్షిణామూర్తి స్తోత్రాలను పఠించడం చేత సమస్యలు తొలగి శుభఫలితాలు కలుగుతాయి.

సింహ రాశి

సింహ రాశి వారికి ఈ రోజు మీకు అనుకూలంగా లేదు. ఆర్థికంగా ఎదగాలనే మీ ఆశయం నిదానంగా ఫలిస్తుంది. ప్రింటింగ్‌ రంగాల్లో వారు పనివారితో ఇబ్బందులు తలెత్తుతాయి. స్త్రీలు కలుపుగోలుగా వ్యవహరించి అందరినీ ఆకట్టుకుంటారు. రావలసిన ధనం అందడంతో మీలో పలు ఆలోచనలు చోటు చేసుకుంటాయి. ఆప్తుల బదిలీ అందోళన కలిగిస్తుంది. ఈరోజు మరింత శుభఫలితాలు పొందడం కోసం దత్తాత్రేయుని పూజించాలి. శ్రీగురుచరిత్ర పఠించడం, దత్తాత్రేయ స్తోత్రాన్ని పఠించడం వలన శుభఫలితాలు కలుగుతాయి.

కన్యా రాశి

కన్యా రాశి వారికి ఈ రోజు మీకు మధ్యస్థ ఫలితాలున్నాయి. కొన్ని కార్యక్రమాలు అప్రయత్నంగా పూర్తిచేస్తారు. ఆలయాలను సందర్శిస్తారు. నిరుద్యోగులకు నూతన అవకాశాలు అఖిస్తాయి. గృహ నిర్మాణాలు, మరమ్మత్తులు సంతృప్తికరంగా సాగుతాయి. ఒక్కొసారి మీ జీవిత భాగస్వామి మనస్తత్వం అర్థం చేసుకోవడం కష్టమవుతుంది. విదేశీ ప్రయత్నాల్లో స్వల్ప ఆటంకాలు ఎదుర్కొంటారు. కన్యా రాశి వారు మరింత శుభఫలితాలు పొందడం కోసం బృహస్పతి అనుగ్రహం కోసం బ్రాహ్మణులకు గాని ముత్తైదువులకు గాని శనగలను దానమివ్వడం మంచిది. శనగలతో చేసిన ప్రసాదాన్ని నివేదన చేసి అది ప్రసాదంగా పంచిపెట్టాలి.

తులా రాశి

తులా రాశి వారికి ఈ రోజు మీకు మధ్యస్థ ఫలితాలున్నాయి. మీ ఉన్నతిని చాటుకోవాలనే తాపత్రయంతో ధనం విచ్చలవిడిగా ఖర్చుచేస్తారు. రియల్‌ ఎస్టేట్‌ రంగాల వారికి నూతన వెంచర్ల విషయంలో పునరాలోచన అవసరం. పెద్దల సలహాను పాటించి మీ గౌరవాన్ని నిలబెట్టుకుంటారు. మంచి గుర్తింపు, రాణింపు లభిస్తుంది. ఎప్పటి సమస్యలు అప్పుడే పరిష్కరించడం మంచిది. శివపార్వతులు అర్థనారీశ్వరుని రూపానికి ప్రతీక అయినటువంటి దక్షిణామూర్తిని చూడడం, దక్షిణామూర్తి స్తోత్రాలను పఠించడం చేత సమస్యలు తొలగి శుభఫలితాలు కలుగుతాయి.

వృశ్చిక రాశి

వృశ్చిక రాశి వారికి ఈరోజు మీకు అనుకూలంగా లేదు. గృహానికి కావలసిన వస్తువులను సమకూర్చుకుంటారు. విద్యార్థులు అధిక ఉత్సాహం ప్రదర్శించడం వల్ల సమస్యలకు లోనవుతారు. కోర్టు వ్యవహారాల్లో ప్లీడర్లకు ఊహించని చికాకులు ఎదురవుతాయి. కొత్త పరిచయాలేర్పడతాయి. ఈరోజు మరింత శుభఫలితాలు పొందడం కోసం దత్తాత్రేయుని పూజించాలి. శ్రీగురుచరిత్ర పఠించడం దత్తాత్రేయ స్తోత్రాన్ని పఠించడం వలన శుభఫలితాలు కలుగుతాయి.

ధనూ రాశి

నేటి రాశి ఫలాల ప్రకారం ధనూ రాశి వారికి ఈరోజు అంత అనుకూలంగా లేదు. అవకాశవాదులు అధికం కావటం వల్ల ఊహించని ఒత్తిడికి లోనవుతారు. బంధువుల మధ్య అపోహలు తొలగిపోయి ఆప్యాయతలు మరింత బలపడతాయి. స్త్రీలకు పనివారలతో చికాకులు తప్పవు. పాతమిత్రుల నుండి అవమానాలు, లేఖలు అందుకుంటారు. ఎదుటివారితో ఎలా మాట్లాడినా తప్పుగానే భావిస్తారు. ఈరోజు మరింత శుభఫలితాలు పొందడం కోసం బృహస్పతి అనుగ్రహం కోసం శనగలు దానమివ్వాలి. బ్రాహ్మణులకు గాని ముత్తైదువులకు గాని తాంబూలం శనగలను దానమివ్వడం మంచిది. శనగలతో చేసిన ప్రసాదాన్ని నివేదన చేసి అది ప్రసాదంగా పంచిపెట్టాలి.

మకర రాశి

మకర రాశి వారికి ఈరోజు మీకు అనుకూలంగా లేదు. వాహనం ఇతరులకు ఇచ్చి ఇబ్బందులను ఎదుర్కొంటారు. సోదరీ సోదరుల మధ్య సమస్యలు తలెత్తుతాయి. పత్రిక, మార్కెట్‌ రంగాల వారికి మార్పులు అనుకూలిస్తాయి. ఆత్మీయులను విమర్శించుట వలన చికాకులను ఎదుర్కొంటారు. వస్త్ర, బంగారం, వెండి వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. శివపార్వతులు అర్థనారీశ్వరుని రూపానికి ప్రతీక అయినటువంటి దక్షిణామూర్తిని చూడడం, దక్షిణామూర్తి స్తోత్రాలను పఠించడం చేత సమస్యలు తొలగి శుభఫలితాలు కలుగుతాయి.

కుంభ రాశి

కుంభ రాశి వారికి ఈరోజు మీకు అనుకూలంగా లేదు. ఉద్యోగ వ్యాపారులకు అధికారుల నుంది ఒత్తిడి, చికాకులు అధికమవుతాయి. రావలసిన ధనం చేతికందుతుంది. వచ్చిన సొమ్మును పొదుపు పథకాల వైపు మళ్ళించండి. గత విషయాలు జ్ఞప్తికి వస్తాయి. నమ్మకం పట్టుదలతో ప్రయత్నాలు సాధించండి. సత్ఫలితాలు పొందుతారు. కుటుంబీకులతో ముభావంగా ఉంటారు. ఈరోజు మరింత శుభఫలితాలు పొందడం కోసం దత్తాత్రేయుని పూజించాలి. శ్రీగురుచరిత్ర పఠించడం దత్తాత్రేయ స్తోత్రాన్ని పఠించడం వలన శుభఫలితాలు కలుగుతాయి.

మీన రాశి

మీన రాశి వారికి ఈ రోజు మీకు అనుకూలంగా లేదు. ప్రతి విషయంలోను ఆత్మనిగ్రహం అవసరమని గమనించండి. స్త్రీలు వాక్చాతుర్యంతో అందరినీ ఆకట్టుకుంటారు. ఒక్కోసారి మంచి చేసినా విమర్శలు తప్పవు. దూర ప్రయాణాల్లో వస్తువులు జారవిడుచుకునే అవకాశం ఉంది. జాగ్రత్త వహించండి. ఈరోజు మరింత శుభఫలితాలు పొందడం కోసం ఈరోజు బృహస్పతి అనుగ్రహం కోసం శనగలు దానమివ్వాలి. శనగలతో చేసిన ప్రసాదాన్ని నివేదన చేసి అది ప్రసాదంగా పంచిపెట్టాలి.

బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ

మొబైల్‌ : 9494981000

పంచాంగకర్త, ఆధ్యాత్మిక వేత్త చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ
పంచాంగకర్త, ఆధ్యాత్మిక వేత్త చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ
Whats_app_banner