మే 5, నేటి రాశి ఫలాలు.. అజాగ్రత్త వల్ల పత్రాలు, విలువైన వస్తువులు చేజారిపోతాయి-today rasi phalalu in telugu may 5th 2024 check your zodiac signs result for daily horoscope ,రాశి ఫలాలు న్యూస్
తెలుగు న్యూస్  /  రాశి ఫలాలు  /  మే 5, నేటి రాశి ఫలాలు.. అజాగ్రత్త వల్ల పత్రాలు, విలువైన వస్తువులు చేజారిపోతాయి

మే 5, నేటి రాశి ఫలాలు.. అజాగ్రత్త వల్ల పత్రాలు, విలువైన వస్తువులు చేజారిపోతాయి

HT Telugu Desk HT Telugu
May 05, 2024 12:01 AM IST

Today rasi phalalu: నేటి రాశి ఫలాలు (దిన ఫలాలు) తేదీ05.05.2024 ఆదివారం కోసం పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ అందించారు. మేషరాశి నుంచి మీన రాశి వరకు12 రాశుల దిన ఫలాలు ఇక్కడ తెలుసుకోండి.

మే 5వ తేదీ నేటి రాశి ఫలాలు
మే 5వ తేదీ నేటి రాశి ఫలాలు (pinterest)

నేటి రాశి ఫలాలు (దిన ఫలాలు) 05.05. 2024

వారం: ఆదివారం, తిథి : ద్వాదశి,

నక్షత్రం : ఉత్తరాభాద్ర, మాసం : చైత్రము,

సంవత్సరం: శ్రీ క్రోధి నామ, అయనం: ఉత్తరాయణం

మేష రాశి

మేష రాశి వారికి ఈ రోజు మీకు అనుకూలంగా లేదు. స్త్రీలు అనవసర విషయాలకు దూరంగా ఉండటం మంచిది. వ్యవహార సానుకూలతకు బాగా శ్రమిస్తారు. మీ పనులు మందకొడిగా సాగుతాయి. గృహ నిర్మాణాలు, మరమ్మత్తులు, మార్పులు చేర్పులకు అనుకూలం. దుబారా ఖర్చులు అధికమవుతాయి. ఖర్చులు తగ్గించుకోవాలని సూచన. విద్యార్థులు కష్టపడవలసిన సమయం. మరింత శుభఫలితాలు పొందాలనుకుంటే ఆదివారం రోజు సూర్యాష్టకం పఠించడం, మహావిష్ణువును పూజించడం వల్ల మరింత శుభ ఫలితాలు కలుగుతాయి.

వృషభ రాశి

నేటి రాశి ఫలాల ప్రకారం వృషభ రాశి వారికి ఈ రోజు మధ్యస్థ ఫలితాలున్నాయి. వృత్తి, వ్యాపారాల్లో మెరుగైన ఫలితాలు సాధిస్తారు. ప్రముఖులతో తరచు సభలు, సమావేశాలలో చురుకుగా పాల్గొంటారు. స్త్రీలకు అలంకారాలు, విలాస వస్తువుల పట్ల మక్కువ పెరుగుతుంది. ఉపాధ్యాయులు విశ్రాంతికై చేయు ప్రయత్నాలు ఫలిస్తాయి. మత్స్య, కోళ్ళ వ్యాపారస్తులకు లాభదాయకంగా ఉంటుంది. వృషభ రాశి వారు ఈరోజు క్రిష్టాష్టకం పఠించడం వల్ల వృషభ రాశి వారికి మరింత శుభఫలితాలు కలుగుతాయి.

మిథున రాశి

మిథున రాశి వారికి ఈ రోజు మీకు అంత అనుకూలంగా లేదు. ఆర్థిక, వ్యాపార విషయాలు రహస్యంగా ఉంచండి. శ్రీమతి సలహా పాటించడం వల్ల ఒక సమస్య నుండి బయటపడతారు. మీ అజాగ్రత్త వల్ల పత్రాలు, విలువైన వస్తువులు చేజారిపోయే ఆస్కారం ఉంది. నిరుద్యోగులు స్వయం ఉపాధి పథకాల్లో నిలదొక్కుకుంటారు. మొండి బాకీలు సైతం వసూలు కాగలవు. మిథున రాశి వారు మరింత శుభ ఫలితాలు పొందాలనుకుంటే ఆదివారం రోజు సూర్యాష్టకం పఠించడం, మహావిష్ణువును పూజించడం వల్ల మరింత శుభ ఫలితాలు కలుగుతాయి.

కర్కాటక రాశి

కర్కాటక రాశి వారికి ఈ రోజు మీకు మధ్యస్థ నుండి అనుకూలం. కొబ్బరి, పండ్లు, పూల వ్యాపారస్తులకు సమస్యలు తలెత్తినా లాభదాయకంగా ఉంటుంది. స్త్రీలు కుటుంబం, ఆరోగ్య విషయాల్లో జాగ్రత్తలు వహించాలి. ధనమును అధికముగా ఖర్చు చేస్తారు. మీ శక్తి సామర్థ్యాలపై నమ్మకం ఉంచి శ్రమించండి. సంగీత, సాహిత్య కార్యక్రమాల పట్ల ఏకాగ్రత వహిస్తారు. కర్కాటక రాశివారు మరింత శుభఫలితాలు పొందాలనుకుంటే నవగ్రహ పీడాహర స్తోత్రం పఠించాలి. అరుణం పఠించడం లేదా వినడం మంచిది.

సింహ రాశి

సింహ రాశి వారికి ఈరోజు మీకు అనుకూలంగా లేదు. రావలసిన ధనం అందటంతో పొదుపు దిశగా మీ ఆలోచనలుంటాయి. బంధువుల రాకపోకలు అధికమవుతాయి. విదేశాలు వెళ్ళటానికి చేసే ప్రయత్నాలు వాయిదాపడతాయి. ప్రింటింగ్‌ పనివారలకు శ్రమకు తగిన ప్రతిఫలం లభిస్తుంది. ఆరోగ్య విషయాల్లో జాగ్రత్తలు వహించాలి. సింహ రాశి వారికి మరింత శుభఫలితాలు పొందాలనుకుంటే ఆదిత్య హృదయాన్ని పారాయణ చేయాలి. నవగ్రహ పీడాహర స్తోత్రం పఠించడం మంచిది.

కన్యా రాశి

కన్యా రాశి వారికి ఈ రోజు మీకు మధ్యస్థ ఫలితాలున్నాయి. నిరుద్యోగులు ఇంటర్వ్యూలలో విజయం సాధిస్తారు. అవగాహన లేని విషయాల్లో అనుభవజ్ఞుల సలహా పాటించండి. స్త్రీల కోరికలు, అవసరాలు నెరవేరుతాయి. రాజకీయ నాయకులు సభా సమావేశాల్లో పాల్గొంటారు. క్రయ విక్రయాలు జోరుగా సాగుతాయి. దూర ప్రయాణాల్లో ఒత్తిడి, చికాకులను ఎదుర్కొంటారు. మరింత శుభ ఫలితాలు పొందడం కోసం విష్ణు సహస్ర నామ పారాయణ చేయడం, ఆదిత్య హృదయం పారాయణ చేయడం మంచిది.

తులా రాశి

తులా రాశి వారికి ఈ రోజు మీకు అనుకూలంగా లేదు. తలపెట్టిన పనులు నిదానంగా సాగుతాయి. విద్యార్థులకు వాహనం నడుపుతున్నప్పుడు ఏకాగ్రత ముఖ్యం. ఉమ్మడి వ్యవహారాలు, ఆర్థిక లావాదేవీలు అనుకూలిస్తాయి. బేకరీ, స్వీట్లు, పూల, పండ్లు వ్యాపారులకు పురోభివృద్ధి కనిపిస్తుంది. ప్రైవేటు ఫైనాన్సులో పొదుపు చేయటం మంచిది కాదని గమనించండి. తులా రాశి వారు మరింత శుభ ఫలితాలు పొందాలనుకుంటే ఆదివారం రోజు నవగ్రహ పీడాహర స్తోత్రం పఠించడం మంచిది. ఆదిత్య హృదయం పారాయణ చేయడం వలన శుభఫలితాలు కలుగుతాయి.

వృశ్చిక రాశి

వృశ్చిక రాశి వారికి ఈ రోజు మీకు అనుకూలంగా లేదు. రాజకీయ నాయకులకు ప్రయాణాలలో మెళకువ అవసరం. బంధువుల రాకతో ఊహించని ఖర్చులు అధికమవుతాయి. స్త్రీలకు అకాల భోజనం వల్ల ఆరోగ్యం మందగిస్తుంది. మీ సంతానం అత్యుత్సాహాన్ని అదుపులో ఉంచడం మంచిది. ఆరోగ్యపరంగా జాగ్రత్తలు తీసుకోవాలి. స్త్రీలకు కుటుంబ సమస్యలు ఇబ్బందిపెట్టును. వృశ్చికరాశివారు మరింత శుభఫలితాలు పొందాలనుకుంటే ఆదిత్య హృదయాన్ని పఠించడం, నవగ్రహ ఆలయాల్లో పూజలు వంటివి చేయడం వలన మరింత శుభఫలితాలు కలుగుతాయి.

ధనూ రాశి

ధనూ రాశి వారికి ఈరోజు మీకు అంత అనుకూలంగా లేదు. నిరుద్యోగులకు ఇంటర్వ్యూలలో ఏకాగ్రత ముఖ్యం. స్త్రీలకు ఇంటి వాతావరణం చికాకు కలిగిస్తుంది. రుణాల కోసం అన్వేషిస్తారు. మీ కదలికలపై కొంతమంది నిఘా వేశారన్న విషయాన్ని గమనించండి. వాహనం ఇతరులకు ఇచ్చి ఇబ్బందులను ఎదుర్కొంటారు. చేపట్టిన ఉపాధి పథకాలకు మంచి స్పందన లభిస్తుంది. ధనూ రాశివారు మరింత శుభఫలితాలు పొందాలనుకుంటే సూర్యాష్టకాన్ని పఠించాలి. నవధాన్యాలను దానం ఇవ్వడం మంచిది. క్షీరానాన్ని ఆలయాల్లో ప్రసాదంగా పంచడం మంచిది.

మకర రాశి

నేటి రాశి ఫలాల ప్రకారం మకర రాశి వారికి ఈ రోజు అనుకూలంగా లేదు. భార్యాభర్తల మధ్య విభేదాలు తలెత్తవచ్చు. దీర్ఘకాలిక సమస్యలకు మంచి పరిష్కార మార్గం గోచరిస్తుంది. స్త్రీలకు గృహ ఉపకరణాల పట్ల మక్కున పెరుగుతుంది. పాత మిత్రుల కలయికతో గత విషయాలు గుర్తుకు వస్తాయి. స్వయంకృషితో రాణిస్తారన్న విషయం గ్రహించండి. కొత్త వ్యక్తులను దరిచేరనీయకండి. మకర రాశి వారు మరింత శుభఫలితాలు పొందాలనుకుంటే నవగ్రహ శాంతి చేసుకోవడం మంచిది. ఈ రోజు నవగ్రహ ఆలయాలను దర్శించడం మంచిది. సూర్యాష్టకాన్ని పఠించండి.

కుంభ రాశి

కుంభ రాశి వారికి ఈ రోజు మీకు మధ్యస్థ ఫలితాలున్నాయి. మధ్యలో నిలిచిన పనులు మళ్ళీ ప్రారంభమవుతాయి. మీ అలవాట్లు అదుపులో ఉంచుకోవడం శ్రేయస్కరం. దూర ప్రయాణాలు విసుగు కలిగిస్తాయి. రుణం తీర్చి తాకట్టు వస్తువులను విడిపిస్తారు. వస్త్ర, ఫ్యాన్సీ, పచారీ వ్యాపారాలు ఊపందుకుంటాయి. మీ కళత్ర మొండి వైఖరి మీకు చికాకు కలిగిస్తుంది. మరింత శుభఫలితాలు పొందాలనుకుంటే ఆదిత్య హృదయాన్ని పారాయణ చేయాలి. నవగ్రహ పీడాహర స్తోత్రాన్ని పఠించండి. నువ్వులతో చేసిన ప్రసాదాన్ని ఆలయాల్లో పంచి పెట్టండి.

మీన రాశి

మీన రాశి వారికి ఈ రోజు మీకు అనుకూలంగా లేదు. చిరు వ్యాపారులకు లాభదాయకంగా ఉంటుంది. వృత్తిపరంగా ప్రముఖులతో పరిచయాలు పెంచుకుంటారు. కుటుంబీకులకు, బంధువుల నుంచి వ్యతిరేకతలు ఎదురవుతాయి. స్త్రీలపై శకునాలు, చుట్టు పక్కల వారి వ్యాఖ్యలు తీవ్ర ప్రభావం చూపుతాయి. వాణిజ్య ఒప్పందాలు, సంతకాలు, హామీల విషయంలో ఆచితూచి వ్యవహరించాలి. నవగ్రహ స్తోత్రం పారాయణ చేయండి. విష్ణుసహస్రనామ పారాయణ చేయడం వలన శుభఫలితాలు కలుగును.

బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ

మొబైల్‌ : 9494981000

బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ, మొబైల్‌ : 9494981000
బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ, మొబైల్‌ : 9494981000
WhatsApp channel