నవంబరు 16, 2023: నేటి రాశి ఫలాలు.. వీరికి అన్నింటా ప్రతికూలతే ఎదురవుతుంది
Today Rasi Phalalu: నేటి రాశి ఫలాలు తేదీ నవంబరు 16, 2023 గురువారం కోసం పంచాంగకర్త, జ్యోతిష శాస్త్ర నిపుణులు బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి అందించారు. మేష రాశి నుంచి మీన రాశి వరకు 12 రాశుల నేటి దిన ఫలాలు ఇక్కడ తెలుసుకోండి.

నేటి రాశి ఫలాలు (దిన ఫలాలు) 16.11.2023
వారం: గురువారం, తిథి: తదియ,
నక్షత్రం: మూల, మాసం: కార్తీకం,
సంవత్సరం: శోభకృత్ నామ, అయనం: దక్షిణాయనం
మేషరాశి
మేషరాశి వారికి ఈ రోజు మీకు అంత అనుకూలంగా లేదు. వృత్తి వ్యాపారాలలో చేదు అనుభవాలు, ప్రతి పనిలో ఆటంకములు కలుగును. గృహమందు శుభకార్యములు, భూ, భవన లాభములు కలుగును. కుటుంబ సభ్యుల మధ్య సర్దుబాటు జరుగును. అనారోగ్య సమస్యలు ఇబ్బందిపెట్టును. దక్షిణామూర్తి స్తోత్రాలను పఠించడం చేత శుభఫలితాలు కలుగుతాయి.
వృషభరాశి
వృషభరాశి జాతకులకు నేటి రాశి ఫలాలు అనుకూలంగా ఉన్నాయి. కుటుంబపరంగా, ఉద్యోగ వ్యాపారపరంగా మధ్యస్థ ఫలితములు ఉండును. ధనలాభము, కుటుంబ సౌఖ్యము, కీర్తి కలుగును. విద్యార్థులకు అనుకూలమైనటువంటి సమయం. స్త్రీలకు మధ్యస్థ సమయం. ఈరోజు మరింత శుభఫలితాలు పొందడం కోసం దత్తాత్రేయుని పూజించాలి. శ్రీగురుచరిత్ర, దత్తాత్రేయ స్తోత్రాన్ని పఠించడం వలన శుభఫలితాలు కలుగుతాయి.
మిథునరాశి
మిథున రాశి జాతకులకు నేటి దిన ఫలాలు ఈ రోజు మీకు అనుకూలంగా లేదు. సంతానమునకు, తల్లిదండ్రులకు చికాకులు కలుగును. చేయవలసిన పనులు పూర్తికావు. సంఘంలో గౌరవం కలుగును. ఉద్యోగస్తులకు ఈ సంవత్సరం మధ్యస్థ ఫలితములు ఉన్నవి. కుటుంబమునందు సమస్యలు, బంధువులతో ఎడబాటు, ఖర్చులు అధికముగా అవ్వడం వంటివి జరుగును. ఈరోజు మరింత శుభఫలితాలు పొందడం కోసం దత్తాత్రేయుని పూజించాలి. శనగలతో చేసిన ప్రసాదాన్ని నివేదన చేసి అది ప్రసాదంగా పంచిపెట్టాలి.
కర్కాటక రాశి
కర్కాటక రాశి వారికి నేటి రాశి ఫలాలు మధ్యస్తంగా ఉన్నాయి. మానసిక అశాంతి, శారీరకంగా అలసట. వస్తు, వస్త్ర, గృహ లాభములు పొందుదురు. మిమ్మల్ని అందరూ గౌరవిస్తారు. మీకు మంచి గుర్తింపు వస్తుంది. దక్షిణామూర్తి స్తోత్రాలను పఠించడం చేత శుభఫలితాలు కలుగుతాయి.
సింహరాశి
సింహరాశి వారికి ఈరోజు మీకు అనుకూలంగా ఉన్నది. సంపద తిరిగి వస్తుంది. అనుకున్న పనులు విజయవంతంగా పూర్తిచేస్తారు. సంఘంలో గౌరవం ఉండును. వ్యాపారస్తులకు లాభములు కలుగును. ఆరోగ్య విషయములందు జాగ్రత్త వహించవలెను. ఈరోజు మరింత శుభఫలితాలు పొందడం కోసం దత్తాత్రేయుని పూజించాలి. శ్రీగురుచరిత్ర, దత్తాత్రేయ స్తోత్రాన్ని పఠించడం వలన శుభఫలితాలు కలుగుతాయి.
కన్యారాశి
కన్యారాశి వారికి ఈరోజు మీకు అనుకూలంగా లేదు. తరచుగా ప్రయాణములు, వ్యాపారమునందు మందగతి. నీచులు, దుర్మార్గులతో సహవాసము చేస్తారు. శుభఫలితాలు పొందడం కోసం శనగలను దానమివ్వడం మంచిది. శనగలతో చేసిన ప్రసాదాన్ని నివేదన చేసి అది ప్రసాదంగా పంచిపెట్టాలి.
తులా రాశి
తులారాశి వారికి నేటి రాశి ఫలాలు అనుకూలంగా లేవు. ప్రతి విషయమునందు ప్రతికూలత ఎదురవుతుంది. కుటుంబమునకు దూరమగుట, విద్యా అధికారములందు అపజయము. అనవసరముగా ప్రయాణములు చేయుట వలన అలసట, బంధుమిత్రులతో గొడవలు జరుగును. దక్షిణామూర్తి స్తోత్రాలను పఠించడం చేత సమస్యలు తొలగి శుభఫలితాలు కలుగుతాయి.
వృశ్చికరాశి
వృశ్చికరాశి వారికి ఈ రోజు మీకు అంత అనుకూలంగా లేదు. రక్త సంబంధీకుల అనారోగ్యం, ధన వ్యయం, కుటుంబములో భిన్నాభిప్రాయములు, అకాల భోజనములు కలుగును. ఈరోజు మరింత శుభఫలితాలు పొందడం కోసం దత్తాత్రేయుని పూజించాలి. శ్రీగురుచరిత్ర, దత్తాత్రేయ స్తోత్రాన్ని పఠించడం వలన శుభఫలితాలు కలుగుతాయి.
ధనూ రాశి
ధనూరాశి వారికి నేటి రాశి ఫలాలు అనుకూలంగా ఉన్నాయి. సంసార, సంతాన కారణంగా శుభములు. మిత్రుల నుండి సహకారములు. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాదులయందు వృద్ధి కలుగును. ఈరోజు మరింత శుభఫలితాలు పొందడం కోసం శనగలు దానమివ్వాలి. శనగలతో చేసిన ప్రసాదాన్ని నివేదన చేసి అది ప్రసాదంగా పంచిపెట్టాలి.
మకర రాశి
మకర రాశివారికి నేటి దిన ఫలాలు అనుకూలంగా ఉన్నాయి. బంధుమిత్రులతో సంతోషము, నూతన వస్తు, వస్త్ర, ఆభరణ లాభములు, ధన, ధాన్య వృద్ధి కలుగును. దక్షిణామూర్తిని చూడడం, దక్షిణామూర్తి స్తోత్రాలను పఠించడం చేత సమస్యలు తొలగి శుభ ఫలితాలు కలుగుతాయి.
కుంభ రాశి
కుంభరాశి వారికి ఈ రోజు మీకు అనుకూలంగా లేదు. ఆర్థికపరమైన ఇబ్బందులు, ప్రమాదములు, శత్రుబాధలు. అయితే సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది. ఎక్కువగా శ్రమపడవలసి వస్తుంది. శుభఫలితాలు పొందడం కోసం దత్తాత్రేయుని పూజించాలి. శ్రీగురుచరిత్ర, దత్తాత్రేయ స్తోత్రాన్ని పఠించడం వలన శుభఫలితాలు కలుగుతాయి.
మీన రాశి
మీన రాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంది. కష్టాలు తొలగి కోరికలు ఫలిస్తాయి. బంధుమిత్రులు సహాయము అందిస్తారు. అనారోగ్య తీవ్రత తగ్గుతుంది. ఆర్థికంగా తృప్తికరంగా ఉంటుంది. మానసిక ఆనందము కలుగును. ఈరోజు మరింత శుభఫలితాలు పొందడం కోసం శనగలు దానమివ్వాలి.
-బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ
మొబైల్: 9494981000