Today Rasi Phalalu: ఈరోజు రాశి ఫలాలు.. వీరు వాద వివాదాలకు దూరంగా ఉండాలి-today rasi phalalu in telugu check vedik astrological predictions for sun day may 28 2023 ,రాశి ఫలాలు న్యూస్
తెలుగు న్యూస్  /  Rasi Phalalu  /  Today Rasi Phalalu In Telugu Check Vedik Astrological Predictions For Sun Day May 28 2023

Today Rasi Phalalu: ఈరోజు రాశి ఫలాలు.. వీరు వాద వివాదాలకు దూరంగా ఉండాలి

HT Telugu Desk HT Telugu
May 28, 2023 01:45 AM IST

Today Rasi Phalalu: నేటి రాశి ఫలాలు (దిన ఫలాలు) మే 28, 2023వ తేదీ ఆదివారం రోజు కోసం పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ అందించారు.

నేటి రాశిఫలాలు
నేటి రాశిఫలాలు

నేటి రాశి ఫలాలు (దిన ఫలాలు) మే 28, 2023వ తేదీ ఆదివారం రోజు కోసం పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ అందించారు.

ట్రెండింగ్ వార్తలు

సంవత్సరం: శోభకృత నామ, అయనం: ఉత్తరాయనం, మాసం: జ్యేష్ఠం

వారం: ఆదివారం, తిథి: శు. అష్టమి నక్షత్రం: పుబ్బ

మేష రాశి ఈరోజు రాశి ఫలాలు

మేషరాశి వారికి ఈరోజు అనుకూలంగా ఉన్నది. కుటుంబముతో ఆహ్లాదంగా గడుపుతారు. వాదనలకు దూరంగా ఉండండి. మేషరాశికి జన్మస్థానము నందు బుధ, గురు, రాహువులు, వాక్‌ స్థానం నందు రవి ప్రభావం చేత గొడవలకు దూరంగా ఉండాలని సూచన. పనులుయందు ఆటంకములు, చికాకులు కలుగును. కుటుంబ విషయాల్లో జాగ్రత్త వహించాలి. అనారోగ్య సూచనలు అధికముగా ఉన్నాయి.

మేషరాశి వారు ఈ రోజు మరింత శుభ ఫలితాలు పొందడం కోసం సుబ్రహ్మణ్యుని పూజించడం, సూర్యభగవానుని ఆరాధించడం వల్ల శుభఫలితాలు కలుగుతాయి. సూర్యాష్టకం చదువుకోవడం వల్ల శుభఫలితాలు కలుగుతాయి.

వృషభ రాశి ఈరోజు ఫలితాలు

వృషభ రాశి జాతకులకు ఈ రోజు మధ్యస్థ ఫలితాలు ఉన్నాయి. జన్మరాశి యందు రవి ప్రభావం చేత అనారోగ్య సూచనలు అధికము. వ్యయ స్థానము నందు బుధ, గురు, రాహువుల ప్రభావం చేత ఖర్చులు అధికముగా ఉండును. ఖర్చులు నియంత్రించుకోవాలని సూచన. శారీరక శ్రమ, ఒత్తిడి అధికముగా ఉండును. కుటుంబ సభ్యులతో వాదనకు దూరంగా ఉండాలి. పనుల యందు ఆలస్యము అలసట ఏర్పడును. విశ్రాంతి కోసం ప్రయత్నించెదరు.

వృషభ రాశి వారు ఆదివారం రోజు నవ గ్రహాలకు అధిపతి అయినటువంటి సూర్యుణ్ణి ఆరాధించడం వలన శుభఫలితాలు కలుగుతాయి. ఆదిత్య హృదయాన్ని పారాయణ చేయడం మంచిది. వృషభ రాశి వారు ఈరోజు కృష్ణాష్టకం పఠించడం వల్ల మరింత శుభఫలితాలు కలుగుతాయి.

ఈరోజు మిథున రాశి ఫలితాలు

మిథున రాశి వారికి ఈరోజు అనుకూలంగా ఉన్నది. ఆనందోత్సాహాలతో ఉంటారు. కుటుంబముతో ఆనందముగా గడుపుతారు. ఖర్చులు అధికమగు సూచన. ఆరోగ్య విషయాల్లో జాగ్రత్తలు వహించండి. ఖర్చులు అధికమగును. మిథున రాశి వారికి జన్మరాశి యందు శుక్రుడు, వాక్‌ స్థానము నందు కుజుని ప్రభావం చేత వివాదాలు ఏర్పడు సూచన. ధనాన్ని కొన్ని ముఖ్యమైన పనుల కోసం ఖర్చు చేసెదరు. బుధ, గురు, రాహువులు లాభములో సంచరించుట చేత మిథున రాశి వారికి కలసివచ్చును.

మిథున రాశి జాతకులు మరింత శుభఫలితాలు పొందాలనుకుంటే ఆదివారం రోజు సూర్యాష్టకం పఠించడం, మహా విష్ణువును పూజించడం వల్ల మరింత శుభ ఫలితాలు కలుగుతాయి.

కర్కాటక రాశి ఫలితాలు

కర్కాటక రాశి వారికి ఈ రోజు మథ్యస్థముగా ఉన్నది. జన్మరాశి యందు కుజుని ప్రభావం చేత శారీరక శ్రమ అధికముగా ఉ౦డును. అయినప్పటికి లాభ స్థానమునందు రవి, దశమ స్థానము నందు బుధ గురు, రాహువుల ప్రభావం చేత వృత్తి ఉద్యోగ వ్యాపారాలు కలసివచ్చును. ఖర్చులు నియంత్రించుకోవాలని సూచన. ఆరోగ్య విషయాల్లో జాగ్రత్త వహించాలి. వివాదాలకు దూరంగా ఉండాలని సూచన. ధన వ్యయము అధికముగా ఉండును.

కర్కాటక రాశి వారు మరింత శుభఫలితాలు పొందాలనుకుంటే నవగ్రహ పీడాహర స్తోత్రం పఠించాలి. అరుణం పఠించడం లేదా వినడం మంచిది.

ఈరోజు సింహ రాశి ఫలితాలు

సింహ రాశివారికి ఈరోజు రాశి ఫలాలు మథ్యస్థంగా ఉన్నాయి. సింహరాశి వారు వివాదాలకు దూరంగా ఉండాలని సూచన. విశ్రాంతి తీసుకునే ప్రయత్నం చేయాలని సూచన. లాభ స్థానములో శుక్రుడు, దశమ స్థానములో రవి ప్రభావంచేత, భాగ్య స్థానములో బుధ, గురు, రాహువుల ప్రభావం చేత సింహరాశి వారికి చేసే ప్రతి పని అనుకూలించును. వృత్తి ఉద్యోగ వ్యాపారాలు కలసివచ్చును. నూతన వస్తువులను కొనడానికి ప్రయత్నం చేసెదరు.

సింహ రాశి వారు మరింత శుభఫలితాలు పొందాలనుకుంటే ఆదిత్య హృదయాన్ని పారాయణ చేయాలి. నవగ్రహ పీడాహర స్తోత్రం పఠించడం మంచిది.

కన్య రాశి ఈరోజు ఫలితాలు

కన్యా రాశి వారికి ఈరోజు రాశి ఫలాలు అనుకూలముగా ఉన్నవి. ప్రయాణములు కలసివచ్చును. ఖర్చులు అధికముగా ఉండును. నూతనముగా వస్తువులు కొనడానికి ప్రయత్నం చేసెదరు. కన్యా రాశి వారికి లాభస్థానములో కుజుడు, రాజ్య స్థానములో శుక్రుడు, భాగ్య స్థానములో రవి అనుకూల ప్రభావం చేత ధనలాభము, వస్తు లాభము, కీర్తి కలుగును. అనుకున్న పనులు పూర్తి చేసెదరు.

కన్యా రాశి వారు మరింత శుభ ఫలితాలు పొందాలనుకుంటే ఈరోజు సూర్యాష్టకాన్ని పఠించాలి. విష్ణు సహస్ర నామాన్ని పారాయణ చేయడం మంచిది.

ఈరోజు తులా రాశి ఫలాలు

తులా రాశి వారికి ఈరోజు అనుకూలంగా ఉంది. కుటుంబ సభ్యులతో చర్చలకు వాగ్వివివాదాలకు దూరంగా ఉండాలని సూచన. ఖర్చులు నియంత్రించుకోవాలి. కళత్ర స్థానము నందు బుధ, గురు, రాహువుల ప్రభావం చేత కుటుంబము నందు సమస్యలు, వాదనలు అధికమగును. గొడవలకు దూరంగా ఉండాలని సూచన. ఉద్యోగంలో శ్రమ అధికముగా ఉండును. అష్టమ రవి ప్రభావం చేత ఉద్యోగంలో శ్రమ అధికముగా ఉండును.

తులారాశి వారు మరింత శుభఫలితాలు పొందాలనుకుంటే నేడు ఆదివారం రోజు నవగ్రహ పీడాహర స్తోత్రం పఠించడం మంచిది. ఆదిత్య హృదయం పారాయణ చేయడం వలన శుభఫలితాలు కలుగుతాయి.

వృశ్చిక రాశి ఈరోజు ఫలితాలు

వృశ్చిక రాశి ఈరోజు ఫలితాలు మధ్యస్థంగా ఉన్నాయి. ఆరోగ్య విషయాల్లో జాగ్రత్తలు వహించాలి. మానసికంగా ఉల్లాసముగా ఉండెదరు. అష్టమ స్థానము నందు శుక్రుడు, కళత్ర స్థానమందు రవి ప్రభావం చేత ఆరోగ్య విషయాల యందు జాగ్రత్తలు వహించాలి. కుటుంబ విషయాల యందు శ్రమ అధికముగా ఉండును. స్త్రీలకు మధ్యస్థ సమయము. ప్రయాణములు అధికముగా ఉండును. చర్చలకు దూరంగా ఉండటం మంచిది. విశ్రాంతి కోసం ప్రయత్నించాలి.

వృశ్చిక రాశి వారు మరింత శుభఫలితాలు పొందాలనుకుంటే ఆదిత్య హృదయాన్ని పఠించడం, నవగ్రహ ఆలయాల్లో పూజలు వంటివి చేయడం వలన మరింత శుభఫలితాలు కలుగుతాయి.

ధను రాశి ఈరోజు ఫలితాలు

ధనూరాశి వారికి ఈరోజు మధ్యస్థ ఫలితాలు ఉన్నాయి. కుటుంబ సభ్యులతో వాదనలకు దూరంగా ఉండాలని సూచన. ప్రయాణాలు అనుకూలించును. ధనాన్ని అవసరార్థం ఖర్చు చేసెదరు. అష్టమ కుజుని ప్రభావంచేత కుటుంబములో మానసిక ఘర్షణలు, వాదనలు ఏర్పడు సూచన. ఏడో స్థానమునందు శుక్రుడు, ఐదో స్థానమందు బుధ, గురు, రాహువుల ప్రభావంచేత అనుకున్న పనులు పూర్తి చేసెదరు. మానసికంగా ఉల్లాసంగా ఉండెదరు.

ధనూరాశి వారు మరింత శుభఫలితాలు పొందాలనుకుంటే సూర్యాష్ట్రకాన్ని పఠించాలి. నవధాన్యాలను దానం ఇవ్వడం మంచిది. క్షీరాన్నాన్ని ఆలయాల్లో ప్రసాదంగా పంచడం మంచిది.

మకర రాశి ఫలితాలు ఈ రోజు

మకర రాశి వారికి ఈరోజు మధ్యస్థం నుండి అనుకూల ఫలితాలున్నాయి. కుటుంబ సభ్యులతో వాదనలకు దూరంగా ఉండాలని సూచన. ఖర్చులు అధికమగును. నూతన వస్తువులను కొనడానికి ప్రయత్నం చేసెదరు. ఆరోగ్య విషయంలో మార్చు కలుగును. చతుర్ధ స్థానమునందు బుధ, గురు, రాహువుల అనుకూలత వలన పంచమ స్థానము నందు రవి అనుకూలత వలన అనుకున్న పనులు అనుకున్న విధముగా పూర్తి చేసెదరు. కళత్ర స్థానము నందు కుజుని ప్రభావం చేత కుటుంబములో సమస్యలు, ఘర్షణలు అధికమగును.

మకరరాశి వారు మరింత శుభఫలితాలు పొందాలనుకుంటే నవగ్రహ శాంతి చేసుకోవడం మంచిది. ఈ రోజు నవగ్రహ ఆలయాలను దర్శించడం మంచిది. సూర్యాష్టకాన్ని పఠించండి.

కుంభ రాశి ఈరోజు జాతకం

కుంభరాశి వారికి ఈ రోజు రాశి ఫలితాలు మథ్యస్థంగా ఉన్నాయి. కుటుంబములో కలతలు వేధించును. చర్చలకు దూరంగా ఉండాలని సూచన. ధనవ్యయం అధికముగా ఉండును. ప్రయాణములు నుకూలించును. ఆరో స్థానము నందు కుజుడు, ఐదో స్థానము నందు శుక్రుడు, తృతీయ స్థానము నందు రాహువు అనుకూల స్థితి వలన అనుకున్న ప్రతీ పని అనుకున్న విధంగా పూర్తి చేసెదరు. ప్రయాణములు అనుకూలించును. ఏలినాటి శని ప్రభావం చేత శారీరక శ్రమ, ధన వ్యయము ఏర్పడును. మానసిక ఒత్తిళ్ళు కలుగు సూచన.

కుంభరాశి వారికి మరింత శుభ ఫలితాలు పొందాలనుకుంటే ఆదిత్య హృదయాన్ని పారాయణ చేయాలి. నవగ్రహ పీడాహర స్తోత్రాన్ని పఠించండి. నువ్వులతో చేసిన ప్రసాదాన్ని ఆలయాల్లో పంచి పెట్టండి.

మీన రాశి ఫలితాలు ఈ రోజు

మీనరాశి వారికి ఈ రోజు మథ్యస్థం నుండి అనుకూల ఫలితాలున్నాయి. కుటుంబముతో వాగ్వివివాదాలకు దూరంగా ఉండాలి. ఆరోగ్య విషయంలో జాగ్రత్త వహించాలి. విశ్రాంతి తీసుకోవడానికి ప్రయత్నించండి. ఏలినాటి శని ప్రభావం, వాక్‌ స్థానము నందు బుధ, గురు, రాహువుల ప్రభావం చేత వాదనలకు దూరంగా ఉండాలి. కుటుంబ సభ్యులతో, ఉద్యోగ వ్యాపారాల్లో చర్చలకు, వివాదాలకు దూరంగా ఉండటం మంచిది. ముఖ్యమైన వస్తువుల కోసం ఖర్చు చేయు సూచన.

మీన రాశి జాతకులు మరింత శుభఫలితాలు పొందాలనుకుంటే ఆదిత్య హృదయం పారాయణ చేయడం మంచిది. నవగ్రహ ఆలయాలను దర్శించి నవగ్రహ పీడాహర స్తోత్రాన్ని పఠించండి.

-బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ

మొబైల్‌ 9494981000

WhatsApp channel