Today Rasi Phalalu: ఈరోజు రాశి ఫలాలు.. వీరు చెరుకు రసంతో శివుడికి అభిషేకం చేయాలి-today rasi phalalu in telugu check vedik astrological prediction for may 29 2023 ,రాశి ఫలాలు న్యూస్
తెలుగు న్యూస్  /  Rasi Phalalu  /  Today Rasi Phalalu In Telugu Check Vedik Astrological Prediction For May 29 2023

Today Rasi Phalalu: ఈరోజు రాశి ఫలాలు.. వీరు చెరుకు రసంతో శివుడికి అభిషేకం చేయాలి

HT Telugu Desk HT Telugu
May 29, 2023 01:01 AM IST

ఈరోజు రాశి ఫలాలు (దిన ఫలాలు) మే 29, 2023వ తేదీ సోమవారం కోసం పంచాంగ కర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ అందించారు.

ఈరోజు రాశి ఫలాలు
ఈరోజు రాశి ఫలాలు (stock photo)

ఈరోజు రాశి ఫలాలు (దిన ఫలాలు) మే 29, 2023వ తేదీ సోమవారం

ట్రెండింగ్ వార్తలు

సంవత్సరం: శోభకృత్‌ నామ, అయనం: ఉత్తరాయనం, మాసం: జ్యేష్టం

వారం: సోమవారం, తిథి: శు. నవమి నక్షత్రం: ఉత్తర

మేష రాశి ఈరోజు రాశిఫలాలు

మేషరాశి వారికి ఈరోజు మధ్యస్థముగా ఉన్నది. మానసిక ఒత్తిళ్ళు కొంత అధికముగా ఉండును. ఉద్యోగ వ్యాపారాలయందు శ్రమ అధికముగా ఉండును. ఆరోగ్య విషయాల యందు జాగ్రత్తలు వహించాలి. మేషరాశి ఉద్యోగస్తులకు అనుకూల ఫలితాలు ఉన్నప్పటికి ఉద్యోగములో పని ఒత్తిడి పెరుగును. వ్యాపారస్తులకు ఆర్థిక సమస్యలు అధికముగా ఉన్నాయి. ఖర్చులు తగ్గించుకోవాలని సూచన. మేషరాశి వారికి శని యొక్క అనుకూల స్థితి వలన ధనపరమైనటువంటి విషయాల్లో అనుకూల ఫలితాలను పొందెదరు.

మేషరాశివారు ఈరోజు మరింత శుభఫలితాలు పొందాలనుకుంటే శివాష్టకం పఠించడం మంచిది. శివుడికి చెరుకురసంతో అభిషేకం చేయడం వలన ఉన్నత పదవులు, ధనమును పొందెదరు.

వృషభరాశి ఈరోజు ఫలితాలు

వృషభరాశి జాతకులకు ఈ రోజు అనుకూల ఫలితాలు ఉన్నాయి. మానసికంగా ఉల్లాసముగా ఉంటారు. ఖర్చులు పెరుగును. ఉద్యోగస్తులకు వ్యాపారస్తులకు కలసి వచ్చును. వృషభరాశి వారికి దశమము నందు శని ప్రభావంచేత ఆర్థికపరంగా లాభము చేకూరును.

వృషభరాశివారు మరింత శుభఫలితాలు పొందాలనుకుంటే శివుడిని పంచామృతాలతో అభిషేకం చేసుకోవడం మంచిది. పంచాక్షరీ మంత్రంతో 108 సార్లు శివనామస్మరణ చేయడం శుభఫలితాలు కలుగుతాయి.

ఈరోజు మిథునరాశి ఫలితాలు

మిథునరాశి వారికి ఈరోజు మధ్యస్థము నుండి అనుకూల ఫలితాలున్నాయి. ఉద్యోగస్తులకు, వ్యాపారస్తులకు పని ఒత్తిడి, శ్రమ అధికముగా ఉండును. మనస్సు ప్రశాంతంగా ఉంచుకోవడానికి ప్రయత్నించాలని సూచన. మిథున రాశి వారికి జన్మరాశి యందు శుక్రుడు, వాక్‌ స్థానము నందు కుజుని ప్రభావం చేత వివాదాలు ఏర్పడు సూచన. ధనాన్ని కొన్ని ముఖ్యమైన పనుల కోసం ఖర్చు చేసెదరు. బుధ, గురు, రాహువులు లాభములో సంచరించుట చేత మిథున రాశి వారికి కలసివచ్చును.

మిథునరాశి వారికి మరింత శుభఫలితాలు కలగాలంటే శివుడిని తేనెతో అభిషేకం చేయడం మంచిది. శివాష్టకం పఠించండి. గోవులకు అరటిపళ్ళు తినిపించండి.

నేటి కర్కాటకరాశి ఫలితాలు

కర్కాటక రాశివారికి ఈ రోజు అనుకూలంగా ఉంది. ఉద్యోగ వ్యాపారాల్లో పని ఒత్తిళ్ళు అధికముగా ఉండును. మానసికంగా ఉల్లాసంగా ఉండెదరు. ఖర్చులు నియంత్రించుకోవాలి. ఆరోగ్య విషయముల యందు కుటుంబ వ్యవహారముల యందు జాగ్రత్తలు వహించాలి. రాజకీయ ఒత్తిళ్ళు అధికముగా ఉండును. అష్టమ శని ప్రభావం చేత ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు వహించాలి. స్త్రీలు ఆరోగ్య విషయాలయందు జాగ్రత్తలు వహించాలని సూచన. విద్యార్థులకు మధ్యస్థ సమయము.

కర్కాటక రాశి వారికి మరింత శుభఫలితాలు కలగాలంటే పాలతో శివుడిని అభిషేకం చేసుకోవడం మంచిది. శివారాధన, పంచాక్షరీ జపం వలన శుభ ఫలితాలు కలుగుతాయి.

ఈరోజు సింహరాశి ఫలితాలు

సింహరాశి వారికి ఈరోజు అనుకూల ఫలితాలు ఉన్నాయి. ఆహ్లాదంగా ఉండెదరు. ఉద్యోగస్తులకు పని ప్రభావము అధికముగా ఉ౦డును. వ్యాపారస్తులకు అనుకూలంగా ఉంది. అనుకున్న పనులు పూర్తి చేసెదరు. వృత్తి ఉద్యోగ వ్యాపారాలు కలసివచ్చును. ఖర్చులు అధికముగా జరుగు సూచన. నూతన వస్తువుల కోసం ధనాన్ని అధికముగా ఖర్చు చేస్తారు. ఆర్థిక పరమైన నిర్ణయాలు అనుకూలించును. విద్యార్థులకు అనుకూలమైన సమయము.

సింహరాశి జాతకులు మరింత శుభఫలితాలు పొందడానికి చెరుకురసంతో శివుడికి అభిషేకం చేసుకోవడం మంచిది.

కన్యారాశి ఈరోజు ఫలితములు

కన్యారాశి జాతకులకు ఈరోజు మధ్యస్థముగా ఉన్నది. పని ఒత్తిడి అధికముగా ఉండును. ఉద్యోగస్తులకు, వ్యాపారస్తులకు శ్రమ అధికము. ఉల్లాసముగా గడిపెదరు. అనుకున్న పనులు పూర్తి చేసెదరు. అష్టమస్థానము నందు బుధ, గురు, రాహువుల సంచారం వలన ఆరోగ్య విషయాల యందు, కుటుంబ వ్యవహారాల యందు జాగ్రత్తలు వహించాలి. స్త్రీ సౌఖ్యం కలుగును. కన్యారాశి వారికి మిగతా గ్రహాల అనుకూల స్థితి వలన అనుకున్న ప్రతీ పని పూర్తి చేసెదరు.

కన్యారాశి వారికి మరింత శుభఫలితాలు కలగాలంటే పంచామృతాలతో శివుడికి అభిషేకం చేయాలి. శివ అష్టోత్తర శతనామావళి పఠించండి.

ఈరోజు తులారాశి ఫలాలు

తులారాశి వారికి ఈరోజు మధ్యస్థముగా ఉన్నది. ఉద్యోగస్తులకు పని ఒత్తిడి అధికముగా ఉండును. వ్యాపారస్తులకు శ్రమ అధికము. వివాదాలకు దూరంగా ఉండాలని సూచన. అష్టమ రవి ప్రభావం చేత ఉద్యోగంలో శ్రమ అధికముగా ఉండును. దశమంలో కుజుడు, భాగ్యములో శుక్రుని అనుకూల ప్రభావం చేత సమస్యలు అధిగమించి ముందుకు వెళ్ళుదరు. కుటుంబ విషయాల యందు ఆరోగ్య విషయాల యందు జాగ్రత్తలు వహించాలి.

తులారాశి వారికి మరింత శుభఫలితాలు కలగాలంటే శివాష్టకం పఠించండి. ఈశ్వరుణ్ణి పళ్ళ రసాలతో అభిషేకం చేయడం మంచిది.

వృశ్చిక రాశి ఈరోజు ఫలితాలు

వృశ్చిక రాశి వారికి ఈరోజు మధ్యస్థం నుండి అనుకూల ఫలితాలు ఉన్నాయి. వృశ్చిక రాశి ఉద్యోగస్తులకు పని ఒత్తిడి అధికముగా ఉండును. వ్యాపారస్తులకు అనుకూలమైనటువంటి రోజు. శారీరక శ్రమ అధికముగా ఉండును. అష్టమ స్థానము నందు శుక్రుడు, కళత్ర స్థానం నందు రవి ప్రభావం చేత ఆరోగ్య విషయాలయందు జాగ్రత్తలు వహించాలి. కుటుంబ విషయాల యందు శ్రమ అధికముగా ఉండును. స్త్రీలకు మధ్యస్థ సమయము. విద్యార్థులకు అనుకూల సమయము. వివాదాలకు దూరంగా ఉండాలని సూచన.

వృశ్చికరాశి వారికి మరింత శుభఫలితాలు కలగాలంటే పంచాక్షరీ మంత్రంతో 18 సార్లు శివనామస్మరణ చేయాలి. శివ అష్టోత్తర శతనామావళి పఠించండి.

ధనూరాశి ఈరోజు ఫలాలు

ధనూరాశి వారికి ఈరోజు అనుకూలంగా ఉంది. ఆహ్లాదంగా గడిపెదరు. అనుకున్న పనులు పూర్తి చేసెదరు. శుభవార్త వింటారు. మానసికంగా ఉల్లాసంగా ఉండెదరు. ఉద్యోగ ప్రయత్నాలు అనుకూలించును. ధన లాభము కలుగును. ఉద్యోగస్తులకు అనుకూలమైనటువంటి రోజు. వ్యాపారస్తులకు మధ్యస్థ సమయము.

ధనూరాశివారికి మరింత శుభఫలితాలు కలగాలంటే శివాష్టకాన్ని పఠించండి. బిల్వాష్టకము పఠించి శివారాధన చేయడం మంచిది.

మకరరాశి ఫలితాలు ఈరోజు

మకర రాశి జాతకులకు ఈరోజు అనుకూలముగా ఉన్నది. ఉద్యోగములో శ్రమ అధికముగా ఉండును. వ్యాపారస్తులకు అనుకూలం. వివాదాలకు దూరంగా ఉండాలని సూచన. కళత్ర స్థానమునందు కుజుని ప్రభావంచేత కుటుంబములో సమస్యలు, ఘర్షణలు అధికమగును. వివాదాలకు దూరంగా ఉండాలని సూచన. వ్యాపారస్తులకు కష్టకాలము. విద్యార్థులకు చెడు ఫలితాలు అధికముగా ఉన్నాయి. మకరరాశి వారికి ఏలినాటి శని ప్రభావంచేత ధన విషయమునందు జాగ్రత్తలు వహించాలి.

మకరరాశివారు మరింత శుభఫలితాలు పొందాలనుకుంటే పంచామృతాలతో శివుడిని అభిషేకం చేసుకోవడం మంచిది. శివ అష్టోతర శతనామావళి పఠించండి.

కుంభరాశి ఈరోజు జాతకం

కుంభ రాశి వారికి ఈరోజు మధ్యస్థ ఫలితాలు ఉంటాయి. ఉద్యోగస్తులకు వ్యాపారస్తులకు శ్రమ అధికముగా ఉండును. మనోధైర్యముతో ముందుకు వెళ్ళెదరు. అనుకున్న పనులు పూర్తి చేసెదరు. చర్చలకు దూరంగా ఉండాలని సూచన. ప్రయాణములు అనుకూలించును. ఏలినాటి శని ప్రభావంచేత శారీరక శ్రమ, ధన వ్యయము ఏర్పడును. బంధుమిత్రులతో ఆనందముగా గడిపెదరు. ఉద్యోగస్తులకు మధ్యస్థ సమయము. వ్యాపారస్తులకు ఖర్చులతో కూడియున్నటువంటి సమయము.

కుంభరాశి వారికి మరింత శుభఫలితాలు కలగాలంటే బిల్వాష్టకం పఠించండి. విశ్వనాథాష్టకం పఠించండి. పంచామృతాలతో శివుడిని అభిషేకం చేసుకోవడం వలన శుభఫలితాలు కలుగుతాయి.

మీన రాశి ఫలితాలు ఈరోజు

మీన రాశి వారికి ఈ రోజు మధ్యస్థం నుండి అనుకూల ఫలితాలు ఉన్నాయి. శారీరక శ్రమ అధికము. ఉద్యోగస్తులకు పని ఒత్తిళ్ళు అధికముగా ఉందును. మానసికంగా ఉల్లాసంగా ఉండెదరు. ఆరోగ్యము అనుకూలించును. ఖర్చులు చేయడానికి అనుకూలంగా లేనటువంటి సమయము. ఆరోగ్య విషయూాల యందు జాగ్రత్తలు వహించాలి. రాజకీయ ఒత్తిళ్ళు అధికముగా ఉండును. ఉద్యోగస్తులకు మథ్యస్థ సమయము. వ్యాపారస్తులకు ఆర్థిక సమస్యలు అధికముగా ఉండును. విద్యార్థులకు మధ్యస్థ సమయము.

మరింత శుభఫలితాలు పొందడానికి బిల్వ పత్రాలతో శివ అష్టోత్తర శతనామావళితో ఈశ్వరుణ్ణి పూజించండి. విశ్వనాథాష్టకం పఠించండి.

- బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ

మొబైల్‌ 9494981000

WhatsApp channel

టాపిక్