డిసెంబరు 8, 2023: నేటి రాశి ఫలాలు.. వీరు కొత్త ప్రయత్నాలకు శ్రీకారం చుడుతారు-today rasi phalalu in telugu 8th december 2023 check your zodiac sign for astrological prediction ,రాశి ఫలాలు న్యూస్
తెలుగు న్యూస్  /  Rasi Phalalu  /  Today Rasi Phalalu In Telugu 8th December 2023 Check Your Zodiac Sign For Astrological Prediction

డిసెంబరు 8, 2023: నేటి రాశి ఫలాలు.. వీరు కొత్త ప్రయత్నాలకు శ్రీకారం చుడుతారు

HT Telugu Desk HT Telugu
Dec 08, 2023 04:05 AM IST

Today Rasi Phalalu: నేటి రాశి ఫలాలు (దిన ఫలాలు) తేదీ 08.12.2023 శుక్రవారం కోసం జ్యోతిష శాస్త్ర నిపుణులు, పంచాంగ కర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ అందించారు. మేష రాశి నుంచి మీన రాశి వరకు 12 రాశుల దిన ఫలాలు ఇక్కడ తెలుసుకోండి.

Today Rasi Phalalu: నేటి రాశి ఫలాలు (దిన ఫలాలు) తేదీ 08.12.2023
Today Rasi Phalalu: నేటి రాశి ఫలాలు (దిన ఫలాలు) తేదీ 08.12.2023 (Pixabay)

నేటి రాశి ఫలాలు (దిన ఫలాలు), తేదీ 08.12.2023

ట్రెండింగ్ వార్తలు

వారం: శుక్రవారం, తిథి: ఏకాదశి,

నక్షత్రం: హస్త, మాసం: కార్తీకం,

సంవత్సరం: శోభకృత్‌ నామ, అయనం: దక్షిణాయనం

మేషరాశి

మేషరాశి వారికి ఈ రోజు మీకు అనుకూల ఫలితాలున్నాయి. కష్టం ఫలిస్తుంది. బంధుత్వాలు బలపడతాయి. పెట్టుబడుల విషయంలో పునరాలోచన మంచిది. ఆప్తుల సలహా పాటించండి. ఒక సమాచారం ఉత్తేజపరుస్తుంది. పనులు మొండిగా పూర్తిచేస్తారు. కొత్త ప్రయత్నాలకు శ్రీకారం చుడతారు. అవకాశాలను అందిపుచ్చుకోండి. ప్రతి విషయం క్షుణ్ణంగా తెలుసుకోవాలి. వేడుకకు సన్నాహాలు సాగిస్తారు. ఈరోజు కృష్ణాష్టకం పఠించడం వల్ల మరింత శుభఫలితాలు కలుగుతాయి.

వృషభరాశి

వృషభరాశివారికి ఈ రోజు మీకు అనుకూలంగా లేదు. ఖర్చులు అధికముగా చేస్తారు. రుణాలు స్వీకరిస్తారు. పనులు ముందుకు సాగవు. సౌమ్యంగా సమస్యలు పరిష్కరించుకోవాలి. పిల్లల విషయంలో మంచి జరుగుతుంది. అనాలోచిత నిర్ణయాలు తగవు. కీలక పత్రాలు అందుకుంటారు. ఆలోచనలు కార్యరూపం దాల్చుతాయి. వివాహ ప్రయత్నాలు తీవ్రంగా సాగిస్తారు. ఈరోజు లక్ష్మీదేవిని పూజించండి. ఈరోజు క్షీరాన్నాన్ని లక్ష్మీదేవికి నివేదించడం వల్ల శుభఫలితాలు కలుగుతాయి. లక్ష్మీస్తోత్రం పఠించండి.

మిథునరాశి

మిథునరాశి వారికి ఈ రోజు మీకు మధ్యస్థంగా ఉన్నది. వ్యాపకాలు అధికమవుతాయి. బాధ్యతగా మెలగాలి. ఆదాయం సంతృప్తికరం. రోజువారీ ఖర్చులే ఉంటాయి. సావకాశంగా పనులు పూర్తిచేస్తారు. ప్రలోభాలకు లొంగవద్దు. కొత్త వ్యక్తులతో జాగ్రత్త. గృహాలంకరణ పట్ల ఆసక్తి పెరుగుతుంది. విలాస వస్తువులు కొనుగోలు చేస్తారు. ద్విచక్రవాహనంపై దూర ప్రయాణం మంచిది కాదు. ఈరోజు లక్ష్మీ అష్టోత్తర శతనామావళితో లక్ష్మీదేవిని పూజించడం మరింత వల్ల శుభఫలితాలు కలుగుతాయి. పంచదార వెన్న కలిపి బాలకృష్ణునికి నివేదించడం వల్ల శుభఫలితాలు కలుగుతాయి.

కర్కాటక రాశి

కర్కాటక రాశివారికి ఈరోజు మీకు మధ్యస్థముగా ఉన్నది. ఖర్చులు సామాన్యంగా ఉంటాయి. కొన్ని సమస్యలు తొలగుతాయి. గృహం ప్రశాంతంగా ఉంటుంది. ఉల్లాసంగా గడుపుతారు. పొగిదే వ్యక్తులో జాగ్రత్తగా. ఒక సంఘటన ఆలోచింపచేస్తుంది. అయినవారితో సంప్రదింపులు జరుపుతారు. ఎదుటివారి ఆంతర్యం గ్రహించండి. తొందరపాటు నిర్ణయాలు తగవు. లక్ష్మీ అష్టకాన్ని పఠించండి. విష్ణు హస్రనామం పఠించండి. అష్టలక్ష్మీ స్తోత్రాన్ని పఠించడం వల్ల శుభఫలితాలు కలుగుతాయి.

సింహ రాశి

సింహరాశి వారికి ఈరోజు మీకు అనుకూలంగా లేదు. ఖర్చులు విపరీతంగా ఉంటాయి. విలాసాలకు వ్యయం చేస్తారు. పెట్టుబడులకు అనుకూలం. ఊహించని సంఘటనలు ఎదురవుతాయి. పెద్దలతో సంప్రదింపులు జరుపుతారు. కొత్త యత్నాలకు శ్రీకారం చుడతారు. సాయం ఆశించవద్దు. చిన్ననాటి పరిచయస్తులు తారసపడతారు. గత సంఘటనలు మంచి అనుభూతినిస్తాయి. మరింత శుభఫలితాలు పొందాలంటే మహాలక్షి అష్టకాన్ని పఠించడం వల్ల శుభఫలితాలు కలుగుతాయి. ఈరోజు కృష్ణాష్టకం పఠించడం వల్ల మరింత శుభఫలితాలు కలుగుతాయి.

కన్యారాశి

కన్యారాశి వారికి ఈ రోజు మీకు అనుకూలంగా ఉంది. అన్ని రంగాల వారికి బాగుంటుంది. మీ నమ్మకం ఫలిస్తుంది. సంప్రదింపులకు అనుకూల సమయం. మీ ఇష్టాయిష్టాలను లౌక్యంగా తెలియచేయండి. ఆలోచనల్లో మార్చు వస్తుంది. పొదుపు ధనాన్ని ముందుగానే వెనక్కితీసుకుంటారు. కల్యాణవేదికలు అన్వేషిస్తారు. ప్రతి విషయం స్వయంగా తెలుసుకోవాలి. పనులు ఆలస్యంగానైనా అనుకున్న విధంగా పూర్తిచేస్తారు. ఈరోజు లక్ష్మీదేవిని పూజించండి. ఈరోజు క్షీరాన్నాన్ని లక్ష్మీదేవికి నివేదించడం వల్ల శుభఫలితాలు కలుగుతాయి. లక్ష్మీస్తోత్రం పఠించండి.

తులా రాశి

తులారాశి వారికి నేటి రాశి ఫలాలు మధ్యస్తంగా ఉన్నాయి. కార్యసాధనకు ఓర్చు ప్రధానం. ఆశావాద దృక్పథంతో మెలగండి. పరిస్థితులు నిదానంగా చక్కబడతాయి. వ్యవహార ఒప్పందాల్లో జాగ్రత్త అవసరం. ప్రలోభాలకు లొంగవద్దు. అనుభవజ్ఞుల సలహా పాటించండి. పిల్లల విషయంలో శుభపరిణామాలు ఉన్నాయి. ఖర్చులు అదుపులో ఉండవు. అవసరాలు వాయిదా వేసుకుంటారు. ఆత్మీయుల ఆహ్వానం ఉత్సాహాన్నిస్తుంది. పనులు మొండిగా పూర్తిచేస్తారు. శనికి తైలాభిషేకం చేసుకోవడం మంచిది. దశరథ ప్రోక్త శని స్తోత్రాన్ని పఠించాలి. లింగాష్టకాన్ని పఠించండి.

వృశ్చిక రాశి

వృశ్చిక రాశి వారికి ఈ రోజు మీకు మధ్యస్థము ఉన్నది. మీ నమ్మకం వమ్ము కాదు. కొన్ని విషయాలు అనుకున్నట్టే జరుగుతాయి. పరిచయస్తుల ధనసహాయం అర్ధిస్తారు. సకాలంలో పనులు పూర్తిచేస్తారు. కొన్ని విషయాలు చూసీ చూడనట్లు వదిలేయండి. శుభకార్యానికి సన్నాహాలు సాగిస్తారు. బంధుత్వాలు బలపడతాయి. కీలక సమావేశాల్లో పాల్గొంటారు. లక్ష్మీ అష్టకాన్ని పఠించండి. విష్ణు సహస్రనామం పఠించండి. అష్ట లక్ష్మీ స్తోత్రాన్ని పఠించడం వల్ల శుభఫలితాలు కలుగుతాయి.

ధనూ రాశి

ధనూరాశి వారికి ఈ రోజు మీకు మధ్యస్థ ఫలితాలు ఉన్నాయి. మనోధైర్యంతో వ్యవహరిస్తారు. కొత్త ఆలోచనలు స్ఫురిస్తాయి. ఆదాయం బాగుంటుంది. రుణ సమస్యలు తొలగుతాయి. కొత్త పరిచయాలు ఏర్పడతాయి. సంస్థల స్థాపనకు అనుకూలం. అజ్ఞాత వ్యక్తులు మోసగించే ఆస్కారం ఉంది. ప్రతి విషయం స్వయంగా తెలుసుకోవాలి. పత్రాలు అందుకుంటారు. ఈరోజు మరింత శుభఫలితాలు పొందాలంటే మహాలక్ష్మి అష్టకాన్ని పఠించడం వల్ల శుభఫలితాలు కలుగుతాయి. ఈరోజు కృష్ణాష్టకం పఠించడం వల్ల మరింత శుభఫలితాలు కలుగుతాయి.

మకర రాశి

మకర రాశివారికి ఈ రోజు మీకు అనుకూలంగా లేదు. పెట్టుబడులు కలసిరావు. ఆదాయానికి తగ్గట్టుగా ఖర్చులుంటాయి. సమర్థతకు ఏమంత గుర్తింపు ఉండదు. పెట్టుబడులు కలసిరావు. పట్టుదలతో మెలగండి. త్వరంలో మీ కృషి ఫలిస్తుంది. పనులు హడావుడిగా సాగుతాయి. గృహంలో మార్చుచేర్చులకు అనుకూలం. శుభవార్తలు వింటారు. ఇతరుల విషయాల్లో జోక్యం తగదు. సంప్రదింపులు, సమావేశాల్లో పాల్గొంటారు. ఈరోజు లక్ష్మీదేవిని పూజించండి. ఈరోజు క్షీరాన్నాన్ని లక్ష్మీదేవికి నివేదించడం వల్ల శుభఫలితాలు కలుగుతాయి. లక్ష్మీస్తోత్రం పఠించండి.

కుంభ రాశి

కుంభరాశి వారికి ఈ రోజు మీకు అనుకూలంగా లేదు. ప్రముఖులతో పరిచయాలేర్చడతాయి. సభ్యత్వాలు స్వీకరిస్తారు. వ్యాపకాలు అధికమవుతాయి. వ్యతిరేకులతో జాగ్రత్త. విలాసాలకు విపరీతంగా ఖర్చుచేస్తారు. మీ చొరవతో శుభకార్యం నిశ్చయమవుతుంది. పనులు మందకొడిగా సాగుతాయి. ఎవరినీ అతిగా నమ్మవద్దు. ఒక సమాచారం ఆలోచింపచేస్తుంది. సన్నిహితులతో సంభాషిస్తారు. ఆధ్యాత్మిక త పెరుగుతుంది. ఈరోజు లక్ష్మీ అష్టోత్తర శతనామావళితో లక్ష్మీదేవిని పూజించడం మరింత వల్ల శుభఫలితాలు కలుగుతాయి. పంచదార వెన్న కలిపి బాలకృష్ణునికి నివేదించడం వల్ల శుభఫలితాలు కలుగుతాయి.

మీన రాశి

మీన రాశి వారికి ఈ రోజు మీకు మధ్యస్థంగా ఉన్నది. శుభకార్యాన్ని ఆర్భాటంగా చేస్తారు. మీ ఆతిథ్యం ఆకట్టుకుంటుంది. పెట్టుబడులు కలసిరావు. నిలిపివేసిన పనులు పూర్తిచేస్తారు. కొత్త పరిచయాలు ఏర్పడతాయి. మీ ఆలోచనల్లో మార్పు వస్తుంది. గృహమార్చు అనివార్యం. మీ సాయంతో ఒకరికి మంచి జరుగుతుంది. కొత్త ప్రయత్నాలు ప్రారంభిస్తారు. లక్ష్మీ అష్టకాన్ని పఠించండి. విష్ణు సహస్రనామం పఠించండి. అష్ట లక్ష్మీ స్తోత్రాన్ని పఠించడం వల్ల శుభఫలితాలు కలుగుతాయి.

-బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ

మొబైల్‌: 9494981000

WhatsApp channel

2024 సంవత్సర రాశి ఫలాలు

నూతన సంవత్సర రాశి ఫలాలు, పండగలు, శుభాకాంక్షలు ఇంకా మరెన్నో ఇక్కడ చదవండి.