డిసెంబరు 7, 2023: నేటి రాశి ఫలాలు.. వీరు ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది-today rasi phalalu in telugu 7th december 2023 check your zodiac sign for astrological prediction ,రాశి ఫలాలు న్యూస్
తెలుగు న్యూస్  /  Rasi Phalalu  /  Today Rasi Phalalu In Telugu 7th December 2023 Check Your Zodiac Sign For Astrological Prediction

డిసెంబరు 7, 2023: నేటి రాశి ఫలాలు.. వీరు ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది

HT Telugu Desk HT Telugu
Dec 07, 2023 04:05 AM IST

Today Rasi Phalalu: నేటి రాశి ఫలాలు (దిన ఫలాలు) తేదీ 07.12.2023 గురువారం కోసం జ్యోతిష శాస్త్ర నిపుణులు, పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ అందించారు. మేష రాశి నుంచి మీన రాశి వరకు నేటి దిన ఫలాలు ఇక్కడ తెలుసుకోండి.

Today Rasi Phalalu: నేటి రాశి ఫలాలు (దిన ఫలాలు) తేదీ 07.12.2023 గురువారం
Today Rasi Phalalu: నేటి రాశి ఫలాలు (దిన ఫలాలు) తేదీ 07.12.2023 గురువారం (Pixabay)

నేటి రాశి ఫలాలు (దిన ఫలాలు), తేదీ 07.12.2023

ట్రెండింగ్ వార్తలు

వారం: గురువారం, తిథి: దశమి,

నక్షత్రం: హస్త పూర్తి, మాసం: కార్తీకం,

సంవత్సరం: శోభకృత్‌ నామ, అయనం: దక్షిణాయనం

మేషరాశి

మేషరాశి వారికి ఈ రోజు మీకు అంత అనుకూలంగా లేదు. స్త్రీలతో అభిప్రాయ భేదములు రాకుండా వ్యవహరించాలి. కమ్యూనికేషన్‌ బాగుంటుంది. దూర ప్రదేశాల నుంచి వచ్చే కొన్ని విషయాలు మీకు ఆలోచన కలిగిస్తాయి. ప్రయాణాలు సామాన్యంగా ఉటాయి. విద్యార్థులు పోటీ పరీక్షల్లో నెగ్గుతారు. శారీరక శ్రద్ధ పెరుగుతుంది. చిన్ననాటి మిత్రులను కలుస్తారు. సమావేశంలో మీ గుర్తింపు, గౌరవం పెరుగుతుంది. భాగస్వామి సహకారం ఉంటుంది. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. దీర్హకాలిక అనారోగ్యంపై కొంత శ్రద్ధ వహించాలి. దక్షిణామూర్తి స్తోత్రాలను పఠించడం చేత శుభఫలితాలు కలుగుతాయి.

వృషభరాశి

వృషభరాశి వారికి నేటి రాశి ఫలాలు మధ్యస్థంగా ఉన్నాయి. మీ వృత్తిలో కొంత అభివృద్ధి ఉంటుంది. ఆశించిన గౌరవం పెరుగుతుంది. విద్యార్థులకు సైంటిఫిక్‌గా కొత్త ఆలోచనలు వస్తాయి. స్త్రీ సంతానానికి విద్యాపరంగా అభివృద్ధికరంగా ఉంటుంది. వారు ఎంచుకున్న రంగాల్లో నూతన అవకాశాలు లభిస్తాయి. వ్యవసాయం, భూమికి సంబంధించిన పెట్టుబడి పెట్టడానికి తీవ్రంగా ఆలోచిస్తారు. కళారంగంలో ఉండే వారికి రాణింపు శ్రమకు తగిన విలువ లభిస్తుంది. కుటుంబ సభ్యులలో ఒకరికి వృత్తిపరంగా నూతన అవకాశములు లభిస్తాయి. శ్రీగురుచరిత్ర, దత్తాత్రేయ స్తోత్రాన్ని పఠించడం వలన శుభఫలితాలు కలుగుతాయి.

మిథునరాశి

మిథున రాశి వారికి నేటి దిన ఫలాలు మధ్యస్థంగా ఉన్నాయి. విద్యార్థులు చేసే ప్రయత్నాలు ఆశాజనకంగా ఉంటాయి. ఆదాయము సంతృప్తికరం. రావలసిన రుణాలు అందుకుంటారు. మీ ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. సామాజిక సేవ చేస్తారు. వ్యక్తులు తమ రంగాలలో పోటీలలో నెగ్గేందుకు తీవ్రంగా కృషిచేస్తారు. విదేశీ వృత్తికి అవకాశాలపై చర్చలు చేస్తారు. ఈరోజు మరింత శుభఫలితాలు పొందడం కోసం దత్తాత్రేయుని పూజించాలి.

కర్కాటక రాశి

కర్కాటక రాశి వారికి ఈ రోజు వృత్తిపరంగా అనుకూలంగా ఉంటుంది. అధికారుల మెప్పు పొందడానికి, స్థాన చలనానికి కొంత అవకాశాలు ఉన్నాయి. సామాజిక సేవతో గుర్తింపు గౌరవాన్ని పొందుతారు. ఆకస్మిక ప్రయాణాలు ఉన్నప్పటికి అనుకోని ఖర్చులు, ఆధ్యాత్మిక ప్రదేశాల సందర్శన మానసిక తృప్తి ఆనందాన్నిస్తుంది. సంతానానికి విద్యాపరంగా ఖర్చులు అధికంగా ఉంటాయి. మనసు ప్రశాంతంగా ఉంటుంది. ముఖ్యమైన చిన్నపాటి ప్రయాణాలకు కూడా అవకాశముంది. పెట్టుబడులు పెట్టుట కొరకై ఆలోచనలు చేస్తారు. విదేశీ విద్య కొరకు చేసే ప్రయత్నం కొంత వరకు అనుకూలం. దక్షిణామూర్తి స్తోత్రాలను పఠించడం చేత శుభఫలితాలు కలుగుతాయి.

సింహరాశి

సింహరాశి వారికి ఈరోజు రాశి ఫలాలు అనుకూలంగా లేవు. ఆకస్మిక ఖర్చులు చికాకు కలిగించును. ఆరోగ్య విషయంలో జాగ్రత్త. ముఖ్య ప్రయాణాలు, నిర్ణయాలు కొంత వాయిదా వేయడం మంచిది. ఇతరులతో గొడవలు రాకుండా చూసుకోవాలి. తండ్రికి సాంఘికంగా గుర్తింపు పలుకుబడి పెరుగుతుంది. మీ సలహాల కోసం ఇతరులు మిమ్మల్ని సంప్రదిస్తారు. వృత్తిపరంగా భాగస్వామితో కలసి నిర్ణయాలు తీసుకుంటారు. ఈరోజు మరింత శుభఫలితాలు పొందడం కోసం దత్తాత్రేయుని పూజించాలి. శ్రీగురుచరిత్ర పఠించడం, దత్తాత్రేయ స్తోత్రాన్ని పఠించడం వలన శుభఫలితాలు కలుగుతాయి.

కన్యారాశి

కన్యారాశి వారికి ఈరోజు మీకు అనుకూలంగా లేదు. ముఖ్య పనుల్లో కొంత ఆటంకాలు విసుగునిస్తాయి. ఆరోగ్య విషయంలో శ్రద్ధ వహించాలి. భూమికి సంబంధించిన అంశాలలో కొన్ని చికాకులు. శ్రమతో పనులు సాధిస్తారు. సంఘంలో గుర్తింపు పెరుగుతుంది. మీ శ్రమకు తగిన రివార్డులు, కృషిశీలత పెంచుకుంటారు. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. కుటుంబముతో ఆనందముగా గడుపుతారు. భాగస్వామికి వృత్తిపరంగా గౌరవము, గుర్తింపు లభిస్తాయి. దూర ప్రదేశాల నుండి ఆహ్వానాన్ని అందుకుంటారు. శనగలతో చేసిన ప్రసాదాన్ని నివేదన చేసి అది ప్రసాదంగా పంచిపెట్టడం శ్రేయస్కరం.

తులా రాశి

తులారాశి వారికి ఈ రోజు మీకు అనుకూలంగా లేదు. వృత్తిపరమైన భాగస్వాములతో అభిప్రాయభేదాలు రాకుండా చూసుకోవాలి. పనులు, ప్రయాణాలు వాయిదాపడతాయి. నూతన వ్యక్తుల కొరకు ఆకస్మిక ఖర్చులు చేస్తారు. గృహ అవసరమైన వస్తువుల కొనుగోలు కోసం ఆలోచనలు చేస్తారు. దీర్హకాలిక పెట్టుబడులకై కుటుంబములో స్త్రీలతో కలసి ఆలోచిస్తారు. ఆరోగ్యముపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. వాహన, గృహ సంబంధపరమైన చర్చలు ముందుకు సాగుతాయి. దక్షిణామూర్తి స్తోత్రాలను పఠించడం చేత సమస్యలు తొలగి శుభఫలితాలు కలుగుతాయి.

వృశ్చిక రాశి

వృశ్చిక రాశి వారికి ఈ రోజు మీకు వృత్తిపరంగా అభివృద్ధి ఉంటుంది. కుటుంబ కార్యాలలో పాల్గొంటారు. దూరప్రదేశాల్లో నూతన ఉపాధి అవకాశం. ఆత్మీయులు సహకరిస్తారు. మనస్సు ప్రశాంతంగా ఉంటుంది. శత్రువులపై విజయం సాధిస్తారు. విద్యాపరమైన పోటీలలో నెగ్గడానికి తీవ్రంగా కృషిచేస్తారు. నిరుద్యోగులకు వృత్తిలో కొత్త అవకాశాలు. అధికారలో వుండే ముఖ్య స్త్రీలు సహకరిస్తారు. విదేశీ సంబంధ అవకాశాలు వచ్చినప్పటికీ పూర్తిగా నిర్ణయం తీసుకోరు. బంధువర్గాన్ని కలుస్తారు. ఈరోజు మరింత శుభఫలితాలు పొందడం కోసం దత్తాత్రేయుని పూజించాలి.

ధనూ రాశి

ధనూరాశి వారికి ఈరోజు మీకు మధ్యస్థముగా ఉన్నది. వృత్తిపరంగా శ్రమ అధికం. కొత్త వ్యక్తుల పరిచయాలు ఏర్పడతాయి. ముఖ్య లావాదేవీల్లో ఆత్మీయులు, సేవకులు సహకరిస్తారు. కుటుంబ సభ్యుల ఆరోగ్య విషయంలో ప్రత్యేక శ్రద్ధ వహించాలి. సంతానానికి విదేశీ అవకాశాలు ఉన్నాయి. ప్రయాణాలలో పరిచయం లేని వ్యక్తులతో ఇబ్బంది కాకుండా జాగ్రత్త తీసుకోవాలి. శనగలతో చేసిన ప్రసాదాన్ని నివేదన చేసి అది ప్రసాదంగా పంచిపెట్టాలి.

మకర రాశి

మకర రాశి వారికి ఈ రోజు మీకు అనుకూలంగా లేదు. కొత్త వ్యక్తులతో వ్యవహరించేటప్పుడు, పెట్టుబడులు పెట్టేటప్పుడు జాగ్రత్త అవసరం. తోబుట్టువులతో సమావేశాలు, చర్చలు, చిన్న ప్రయాణాలు చేస్తారు. ఆధ్యాత్మిక చింతన పెంచుకుంటారు. వాహనాలు నడిపేటప్పుడు జాగ్రత్త అవసరం. సమయానికి భుజించాలి. వృత్తిలో విదేశీ ఆదాయాన్ని పొందేందుకు అవకాశముంది. ఆరోగ్య విషయంలో యోగా వంటివి మంచి ఫలితాలు ఇస్తాయి. శ్వాస సంబంధ అనారోగ్యాలు చికాకును కలిగిస్తాయి. దక్షిణామూర్తి స్తోత్రాలను పఠించడం చేత సమస్యలు తొలగి శుభ ఫలితాలు కలుగుతాయి.

కుంభ రాశి

కుంభ రాశి వారికి ఈ రోజు మీకు అనుకూలంగా లేదు. ఇంటిలో వాతావరణం కొంత చికాకుగా ఉంటుంది. సంతానం విషయంలో మీరు ఆశించిన స్థాయిలో ఫలితాలు ఉండవు. ఆందోళన, మానసిక అశాంతికి గురవుతారు. ముఖ్యమైన పనులు, ఆరోగ్య విషయంలో ఆలోచించి నిర్ణయాలు అవసరం. వృత్తిపరంగా పడిన కష్టానికి తగినంత గుర్తింపు రాదు. ఆత్మవిశ్వాసాన్ని పెంచుకోవాలి. ముఖ్యమైన పనులు ముందుకు వెళ్ళకుండా నిరోధించే అవకాశాలున్నాయి. ఈరోజు మరింత శుభఫలితాలు పొందడం కోసం దత్తాత్రేయుని పూజించాలి. శ్రీగురుచరిత్ర పఠించడం దత్తాత్రేయ స్తోత్రాన్ని పఠించడం వలన శుభఫలితాలు కలుగుతాయి.

మీన రాశి

మీన రాశి వారికి నేటి రాశి ఫలాలు మధ్యస్థంగా ఉన్నాయి. రావలసిన ధనం కొంతవరకు అందుతుంది. వాహన గృహ సంబంధిత విషయాలలో ఖర్చులు అధికంగా ఉన్నప్పటికి వస్తువులు కొనుట కొరకు వెనుకాడరు. శుభకార్యాల కొరకు నిర్ణయాలు తీసుకుంటారు. సంఘంలో పలుకుబడి పెరుగుతుంది. కుటుంబ సభ్యులతో కలసి ముఖ్యమైన విషయాలు చర్చిస్తారు. ఇతర వ్యక్తుల సలహాలు, జోక్యం మీకు విసుగు కలిగిస్తుంది. ఈరోజు మరింత శుభఫలితాలు పొందడం కోసం శనగలతో చేసిన ప్రసాదాన్ని నివేదన చేసి అది ప్రసాదంగా పంచిపెట్టాలి.

-బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ

మొబైల్‌: 9494981000

WhatsApp channel

2024 సంవత్సర రాశి ఫలాలు

నూతన సంవత్సర రాశి ఫలాలు, పండగలు, శుభాకాంక్షలు ఇంకా మరెన్నో ఇక్కడ చదవండి.