నేటి రాశి ఫలాలు 26.12.2023: ఈ జాతకులు రహస్య వ్యూహాలు అమలుచేస్తారు
Today Horoscope Telugu: నేటి రాశి ఫలాలు తేదీ 26.12.2023 మంగళవారం కోసం పంచాంగకర్త చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ అందించారు. మేష రాశి నుంచి మీన రాశి వరకు 12 రాశుల దిన ఫలాలు ఇక్కడ తెలుసుకోండి.
నేటి రాశి ఫలాలు (దిన ఫలాలు), తేదీ 26.12.2023
వారం: మంగళవారం, తిథి : శు. పౌర్ణమి,
నక్షత్రం : మృగశిర, మాసం: మార్గశిరం,
సంవత్సరం: శోభకృత్ నామ, అయనం: దక్షిణాయనం
మేషరాశి
మేషరాశి వారికి ఈ రోజు మీకు మధ్యస్థ ఫలితాలు ఉన్నాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాలను శ్రద్ధగా నిర్వహిస్తారు. దూరప్రాంత ప్రయాణాలు, అకాల భోజనం చికాకు కలిగిస్తాయి. వ్యాపారంలో స్తబ్దత ఏర్పడుతుంది. మీ ప్రమేయం లేకుండానే మిమ్మల్ని వివాదాలలోకి లాగబడే ప్రయత్నాలు సాగుతాయి. విలువైన పత్రాలు స్వర్ణాభరణాల పట్ల జాగ్రత్తలు పాటించండి. సుబ్రహ్మణ్యేశ్వరునికి అభిషేకం చేసుకోవడం మంచిది. సుబ్రహ్మణ్య అష్టకం పఠించండి. సుబ్రహ్మణ్యుని ఆలయంలో నువ్వుల నూనెతో దీపాలను వెలిగించాలి.
వృషభ రాశి
వృషభరాశి వారికి ఈ రోజు మీకు మధ్యస్థ ఫలితాలు ఉన్నాయి. ప్రయాసతో గానీ పనులు సానుకూలపడవు. ఖర్చులు అధికంగా ఉన్నప్పటికీ సర్దుబాట్లను చేయగలుగుతారు. వస్త్ర వ్యాపారులు జాగ్రత్తగా మెలగాలి. ప్రింటింగ్, స్టేషనరీ వ్యాపారులకు అనుకూలం. సెంటిమెంట్ వస్తువుల పట్ల జాగ్రత్త పాటించాలి. భూమికి సంబంధించిన క్రయ విక్రయాలు యథాతథం. రాహుకాల సమయంలో అమ్మవారి వద్ద నువ్వుల నూనెతో దీపాలను వెలిగించడం మంచిది ఈరోజు అమ్మవారికి కుంకుమార్చన చేయడం మంచిది.
మిథున రాశి
మిథునరాశివారికి ఈ రోజు మీకు అనుకూలంగా ఉన్నది. మీ ప్రణాళికలు, ఆలోచనలు నిర్ధిష్టమైన రూపం సంతరించుకుంటాయి. కుటుంబ సుఖసంతోషాలకు అధిక ప్రాధాన్యమిస్తారు. వృత్తి ఉద్యోగాలపరంగా పురోభివృద్ధి సాధిస్తారు. ఆదాయ పరిధిని విస్తృతపరుచుకుని సంపదను పెంచుకోవాలనుకుంటారు. పనిఒత్తిడి, అధిక ప్రయాణాల వల్ల నిద్రాహారాలు సమయానుకూలంగా ఉండవు. మరింత శుభఫలితాలు పొందాలంటే సుబ్రహ్మణ్యేశ్వరునికి అభిషేకం చేసుకోవడం మంచిది. సుబ్రహ్మణ్య అష్టకం పఠించండి. సుబ్రహ్మణ్యుని ఆలయంలో నువ్వుల నూనెతో దీపాలను వెలిగించాలి.
కర్కాటక రాశి
కర్కాటక రాశి వారికి ఈ రోజు మీకు మధ్యస్థ ఫలితాలు ఉన్నాయి. ఆదాయాన్ని మించిన ఖర్చులుంటాయి. కొత్త పెట్టుబడులను పెద్ద మొత్తాలలో పెడతారు. ఓ రకమైన ఆత్మన్యూనతా భావం కలిగి ఉంటారు. నలుగురిలో ఉన్నప్పటికి మిమ్మల్ని మీరు ఒంటరిగానే భావిస్తారు. దీర్ఘ కాలికంగా పరిష్కారం కాని అంశాలను అదృష్టానికి వదలివేస్తారు. శుభవార్తలు వింటారు. మరింత శుభ ఫలితాలు పొందాలంటే బుుణ విమోచన అంగారక స్తోత్రాన్ని పఠించండి. విఘ్నేశ్వరుడిని పూజించండి. రాహుకాల సమయంలో దుర్గాదేవిని పూజించండి.
సింహరాశి
సింహరాశి వారికి ఈ రోజు మీకు అనుకూలంగా ఉన్నది. పని పంపిణీ సక్రమంగా చేసుకోగలుగుతారు. కుటుంబ వ్యవహారాల ప్రభావం ఆఫీసు మీద, ఆఫీసులోని పనుల ఒత్తిడి ప్రభావం ఇంటి పనుల మీద పడకుండా చూసుకుంటారు. అరమరికలు లేకుండా ఎదుటివారితో మీ మనోభావాలను పంచుకుంటారు. ఆధ్యాత్మిక ప్రసంగాలు మనస్సుని ఆకట్టుకుంటాయి. మరింత శుభఫలితాలు పొందాలంటే సుబ్రహ్మణ్యేశ్వరునికి అభిషేకం చేసుకోవడం మంచిది. సుబ్రహ్మణ్య అష్టకం పఠించండి. సుబ్రహ్మణ్యుని ఆలయంలో నువ్వుల నూనెతో దీపాలను వెలిగించాలి.
కన్యారాశి
కన్యారాశి వారికి ఈ రోజు మీకు అనుకూలంగా ఉంది. మీ పనితీరు మెరుగ్గా ఉంటుంది. సామాజిక సేవా కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటారు. గుప్తదానాలు చేస్తారు. రహస్య చర్చలు సాగిస్తారు. ముఖ్యమైన ఆర్థిక పత్రాలు సకాలంలో కనబడక తాత్మాలికంగా ఇబ్బంది పడతారు. మీకు మేలు చేకూర్చే అంశాలలో కొంత జాప్యం జరిగినప్పటికి తుది ఫలితాలు మెరుగ్గా ఉంటాయి. మరింత శుభఫలితాలు పొందాలంటే విఘ్నేశ్వరుని పూజించాలి. సంకటనాశన గణపతి స్తోత్రం పఠించాలి. వినాయకుడి ఆలయంలో నువ్వుల నూనెతో దీపాలను వెలిగించడం మంచిది.
తులారాశి
తులారాశి వారికి ఈరోజు మీకు మధ్యస్థ ఫలితాలు ఉన్నాయి. అనేక అంశాలు ఉన్నప్పటికి ఆరోగ్య సమస్యలు, ఆలోచనలు అధికమవటం, ఒత్తిడి మొదలైన కారణాల వల్ల మానసిక సౌఖ్యం లోపిస్తుంది. ఆర్థిక లోటుపాట్లను తీర్చుకోవడానికి అధికంగా శ్రమించాల్సి వస్తుంది. రహస్య వ్యూహాలు అవలంభిస్తారు. కుటుంబ సభ్యులతో కలసి విహారయాత్రలు చేస్తారు. వాగ్వివాదం వల్ల కలిగే నష్టాలను తెలుసుకుంటారు. మరింత శుభ ఫలితాలు పొందాలంటే బుుణ విమోచన అంగారక స్తోత్రాన్ని పఠించండి. విఘ్నేశ్వరున్ని పూజించండి. రాహుకాల సమయంలో దుర్గా దేవిని పూజించండి.
వృశ్చిక రాశి
వృశ్చిక రాశి వారికి ఈ రోజు మీకు మధ్యస్థ ఫలితాలు ఉన్నాయి. మానసిక ప్రశాంతతను సాధించడానికి ఆధ్యాత్మిక కార్యక్రమాల పైన దృష్టి కేంద్రీకరిస్తారు. ఆర్థికపరమైనటువంటి ఒడిదుడుకులు ఏర్పడినప్పటికి దైవానుగ్రహం రక్షిస్తుంది. అర్థం లేని వివాదాలు కలహ కారణానికి కారణమవుతాయి. చిన్న చిన్న వ్యవహారాలకు కూడా పరపతిని ఉపయోగించవలసి వస్తుంది. సాధ్యమైనంత వరకు ముఖ్యమైన వ్యవహారాలను వాయిదా వేసుకోవడం ఉత్తమం. మరింత శుభఫలితాలు పొందాలంటే బుుణ విమోచన అంగారక స్తోత్రాన్ని పఠించండి. విఘ్నేశ్వరున్ని పూజించండి. రాహుకాల సమయంలో దుర్గాదేవిని పూజించండి.
ధనుస్సు రాశి
ధనూరాశి వారికి ఈ రోజు మీకు అనుకూలంగా ఉన్నది. రాజకీయ నాయకులతో మిత్రత్వం ఏర్పడుతుంది. వృత్తి ఉద్యోగాలపరంగా సముచితమైన స్థానం సాధించడానికి విశేషమైన కృషి చేస్తారు. ఆర్థికపరమైన అంశాల పైన దృష్టి సారిస్తారు. వ్యక్తిగత రహస్యాలను బహిర్గతం చేస్తున్న వ్యక్తులను కట్టుదిట్టంగా పట్టుకోగలుగుతారు. చిన్నపాటి గాయాలను గ్రహస్థితి సూచిస్తోంది. సంతానానికి ఉన్నత విద్యావకాశాలు కలసివస్తాయి. మరింత శుభఫలితాలు పొందాలంటే సుబ్రహ్మణ్యేశ్వరునికి అభిషేకం చేసుకోవడం మంచిది. సుబ్రహ్మణ్య అష్టకం పఠించండి. సుబ్రహ్మణ్యుని ఆలయంలో నువ్వుల నూనెతో దీపాలను వెలిగించాలి.
మకర రాశి
మకర రాశి వారికి ఈ రోజు మీకు మధ్యస్థ ఫలితాలు ఉన్నాయి. కుటుంబ విషయాల పురోగతి కోసం చేసే ప్రయత్నాలు కలసివస్తాయి. కొత్త రుణాలు చేస్తారు. పాత రుణాలను తీరుస్తారు. నూతన ఉద్యోగావకాశాలను అన్వేషించడంలో సఫలతను సాధిస్తారు. ప్రతి చిన్న విషయాన్నిభూతద్దంలో చూస్తారు. శత్రువర్గం పోటీ అధికమవుతుంది. తొందరపడకుండా నిదానంగా ఆలోచించి నిర్ణయాలను అమలుపరచండి. మకర రాశి వారు మరింత శుభఫలితాలు పొందడం కోసం సాయంకాల సమయంలో అమ్మవారి వద్ద నువ్వుల నూనెతో దీపాలను వెలిగించడం మంచిది. ఈరోజు అమ్మవారికి కుంకుమార్చన చేయడం మంచిది.
కుంభ రాశి
కుంభరాశి వారికి ఈ రోజు మీకు అనుకూలంగా లేదు. శక్తికిమించి శ్రమిస్తారు. క్రమశిక్షణను ప్రాధాన్యమిస్తారు. ఆర్థికపరమైన అంశాలు సంతృప్తికరంగా ఉంటాయి. ఓ పొరపాటు సమాచారం విని అదే నిజమని భ్రమపడతారు. వ్యాపార వ్యవహారాలు సున్నితమైన అంశాలతో ముడిపడి ఉంటాయి. దూర ప్రాంత ప్రయాణాల తేదీలను ఖరారు చేసుకుంటారు. కుంభరాశి వారు మరింత శుభ ఫలితాలు పొందాలంటే విఘ్నేశ్వరుని పూజించాలి. సంకట నాశన గణపతి స్తోత్రం పఠించాలి. వినాయకుడి ఆలయంలో నువ్వుతో నూనెతో దీపాలను వెలిగించడం మంచిది.
మీన రాశి
మీన రాశి వారికి ఈ రోజు మీకు మధ్యస్థ ఫలితాలు ఉన్నాయి. వాయిదా పడిన పనులను పూర్తిచేస్తారు. వృత్తి ఉద్యోగాలపరంగా చెప్పుకోదగిన మార్చులేవీ ఉండవు. ఆర్థికంగా లాభనష్టాలు రెండూ ఉండవు. మిత్రులతో కలసి వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. రాజకీయపరంగా చర్చలు సాగిస్తారు. తరతమ భేదం లేకుండా అందరినీ కలుపుకుని పనిచేస్తారు. తద్వారా లాభపడతారు. బ్యాంకు రుణాలు చేతికి అందివస్తాయి. మీనరాశి వారు మరింత శుభ ఫలితాలు పొందడం కోసం గురువారం దక్షిణామూర్తిని, దత్తాత్రేయుని పూజించడం మంచిది. బుుణ విమోచన అంగారక స్తోత్రాన్ని పఠించండి. విఘ్నేశ్వరున్ని పూజించండి. రాహుకాల సమయంలో దుర్గాదేవిని పూజించండి.
-బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ
మొబైల్ : 9494981000