ఫిబ్రవరి 28, నేటి రాశి ఫలాలు.. ఈ రాశుల జాతకులకు ఒత్తిడితో కూడిన సమయం-today rasi phalalu february 28th dina phalalu in telugu check your zodiac signs result for daily horoscope ,రాశి ఫలాలు న్యూస్
తెలుగు న్యూస్  /  Rasi Phalalu  /  Today Rasi Phalalu February 28th Dina Phalalu In Telugu Check Your Zodiac Signs Result For Daily Horoscope

ఫిబ్రవరి 28, నేటి రాశి ఫలాలు.. ఈ రాశుల జాతకులకు ఒత్తిడితో కూడిన సమయం

HT Telugu Desk HT Telugu
Feb 28, 2024 12:05 AM IST

Today rasi phalalu: నేటి రాశి ఫలాలు (దిన ఫలాలు) తేదీ28.02.2024 బుధవారం కోసం పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ అందించారు. మేషరాశి నుంచి మీన రాశి వరకు12 రాశుల దిన ఫలాలు ఇక్కడ తెలుసుకోండి.

ఫిబ్రవరి 28వ తేదీ రాశి ఫలాలు
ఫిబ్రవరి 28వ తేదీ రాశి ఫలాలు (freepik)

నేటి రాశి ఫలాలు (దిన ఫలాలు) 28.02.2024

ట్రెండింగ్ వార్తలు

వారం: బుధవారం, తిథి : చవితి,

నక్షత్రం : హస్త, మాసం : మాఘం,

సంవత్సరం: శోభకృత్‌ నామ, అయనం: ఉత్తరాయణం

మేష రాశి

మేష రాశి వారికి ఈరోజు మీకు అన్ని విధాలుగా అనుకూల ఫలితాలున్నాయి. అనుకున్న ముఖ్యమైన పనులు పూర్తి చేసెదరు. పనులయందు ఒత్తిళ్ళు ఇబ్బందిపెట్టును. ఉద్యోగస్తులకు ఈరోజు అనుకూల ఫలితాలుంటాయి. వ్యాపారస్తులకు ఇది కలసి వచ్చేటటువంటి సమయం. విద్యార్థులకు అనుకూలమైన ఫలితాలు కలుగును. మేష రాశి వారు మరింత శుభఫలితాలు పొందటం కోసం విష్ణు సహస్రనామం పారాయణం చేయడం మంచిది. మహావిష్ణువు ఆలయాన్ని దర్శిచండం మంచిది.

వృషభ రాశి

వృషభ రాశి వారికి ఈరోజు మీకు మీకు అనుకూలంగా ఉంది. ఉద్యోగస్తులకు ఉద్యోగంలో ప్రమోషన్లు వంటివి అనుకూలించును. ఖర్చులు అధికముగా ఉండును. ఖర్చులు నియంత్రించుకోవాలని సూచన. విద్యార్థులకు అనుకూలమైనటువంటి రోజు. వ్యాపారస్థులకు ఖర్చులతో కూడినటువంటి సమయం. కృష్ణుని ఆలయాలు దర్శించటం మంచిది. కృష్ణాష్టకం పఠించాలి.

మిథున రాశి

మిథున రాశి వారికి ఈ రోజు మీకు మీకు మధ్యస్థం నుండి అనుకూల ఫలితాలున్నాయి. కుటుంబ విషయాలు, ఆరోగ్య విషయాలపరంగా మధ్యస్థ సమయం. వృత్తి ఉద్యోగ వ్యాపారపరంగా అనుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి. విద్యార్థులకు ఈవారం కలిసివచ్చును. ఉద్యోగస్తులకు ఉద్యోగంలో కొంత భయాందోళనలు కలుగు సూచన. వ్యాపారస్తులకు అనుకూల సమయం. శ్రీమన్నారాయణుడు/ శ్రీమహావిష్ణువుకు సంబంధించిన ఆలయాన్ని దర్శించడం మంచిది. విష్ణుమూర్తి ఆలయాలలో అర్చన జరిపించుకోవాలి.

కర్కాటక రాశి

నేటి రాశి ఫలాల ప్రకారం కర్కాటక రాశి వారికి ఈ రోజు మీకు అంత అనుకూలంగా లేదు. అనారోగ్య సమస్యలు, వృత్తి సమస్యలు, కుటుంబ సమస్యలు ఇబ్బందిపెట్టు సూచన. ఉద్యోగస్తులకు పని ఒత్తిళ్ళు అధికంగా ఉండును. వ్యాపారస్తులకు కొంత కష్టకాలం. విద్యార్థులకు ఈరోజు మధ్యస్థ ఫలితాలు గోచరిస్తున్నాయి. కుటుంబ విషయాలు, ఆరోగ్య విషయూలయందు జాగ్రత్తలు వహించాలి. రామాలయాలను దర్శించండి. రామకోటి వంటివి రాయటం మంచిది. తారకమంత్రం పఠించండి.

సింహ రాశి

సింహ రాశి వారికి ఈ రోజు మీకు మధ్యస్థ ఫలితాలున్నాయి. గొడవలకు, అవేశపూరిత నిర్ణయాలకు దూరంగా ఉండాలని సూచన. ఉద్యోగ పరమైనటువంటి విషయాల్లో వాదనలకు దూరంగా ఉండండి. శత్రువర్గంపై విజయాన్ని పొందెదరు. కోర్టు వ్యవహారాలు అనుకూలించును. ఆరోగ్యవిషయాల్లో జాగ్రత్తలు వహించాలి. ప్రయాణం చేసేటప్పుడు జాగ్రత్తలు తప్పనిసరి. సూర్య నమస్కారం చేయటం మంచిది. గురు దక్షిణామూర్తిని పూజించండి.

కన్యా రాశి

కన్యా రాశి వారికి ఈ రోజు మీకు అనుకూలంగా ఉంది. మీరు చేసే ప్రయత్నాలన్నీ సత్ఫలితాలు ఇచ్చే సూచనలు అధికముగా ఉన్నాయి. మానసికంగా ప్రశాంతంగా ఉండెదరు. ధనలాభము, కీర్తి కలుగును. పనులయందు ప్రయాణముల యందు ఒత్తిళ్ళు ఏర్పడును. ఆరోగ్య విషయాల యందు జాగ్రత్తలు వహించడం మంచిది. ఆదిత్య హృదయ పారాయణం చేయండి. విష్ణుమూర్తి అష్టోత్తర నామాలను పఠించండి.

తులా రాశి

నేటి రాశి ఫలాల ప్రకారం తులా రాశి వారికి ఈ రోజు అనుకూల ఫలితాలున్నాయి. కుటుంబ సౌఖ్యం, ఆనందం పొందెదరు. విష్ణు సహస్రనామ పారాయణ చేయడం, నిర్ధిష్టమైన ప్రణాళికతో ముందుకు వెళ్ళి విజయాలను పొందెదరు. ఆర్థిక సమస్యల నుండి బయటపడెదరు. ఉద్యోగస్తులకు సత్ఫలితాలు కలుగును. వ్యాపారస్తులకు ఈవారం అనుకూలంగా ఉంది. విద్యార్థులకు శుభఫలితాలు ఏర్పడును. తులా రాశి వారు మరింత శుభఫలితాలు పొందటం కోసం విష్ణుమూర్తికి సంబంధించిన అలయాల్లో అర్చన వంటివి చేయాలి. మహావిష్ణువు అష్టోత్తర శతనామావళి పఠించండి.

వృశ్చిక రాశి

వృశ్చిక రాశి వారికి ఈరోజు మీకు మధ్యస్థం నుండి అనుకూల ఫలితాలున్నాయి. వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో పురోగతి లభించును. బంధుమిత్రులతో సోదరీమణులతో ఆనందముగా గడిపెదరు. శారరీక శ్రమ కలుగును. ప్రయాణాల కోసం ప్రణాళికలు రచించెదరు. ఉద్యోగస్తులకు పనులయందు ఒత్తిళ్ళు కొంత అధికముగా ఉండును. వ్యాపారస్తులకు మధ్యస్థ సమయం. విద్యార్థులకు మధ్యస్థ ఫలితాలు ఏర్పడును. వృశ్చిక రాశి వారు మరింత శుభఫలితాలు పొందటం కోసం గణపతి అష్టోత్తరం పఠించాలి. వినాయకుని ఆలయాన్ని దర్శించాలి.

ధనూ రాశి

ధనూ రాశి వారికి ఈరోజు మీకు అనుకూల ఫలితాలున్నాయి. ధనలాభం, సౌఖ్యం కలుగును. గొడవలకు దూరంగా ఉండాలని సూచన. మాతృ వర్గీయులతో స్నేహము అధికమగును. కుటుంబ సభ్యులతో ఆహ్లాదకరంగా గడిపెదరు. కుటుంబ సౌఖ్యం, సంతాన సౌఖ్యం, ఆనందము పొందెదరు. ఉద్యోగస్తులకు అనుకూలమైన రోజు. వ్యాపారస్తులకు శుభ ఫలితాలు కలుగును. విద్యార్థులకు ఈరోజు కలసివచ్చును. వినాయకుని పూజించడం, సంకటనాశన గణపతి స్తోత్రాన్ని పఠించాలి.

మకర రాశి

మకర రాశి వారికి ఈరోజు మీకు మధ్యస్థ ఫలితాలున్నాయి. ఆరోగ్య సమస్యలు వేధించును. శారీరక సమస్యలు, మానసిక వేదన అధికముగా ఉండును. ఆరోగ్య విషయాల్లో శ్రద్ద వహించడం మంచిది. వాదనలకు దూరంగా ఉండాలని సూచన. ఉద్యోగస్తులకు ఈరోజు పని ఒత్తిళ్ళు, చికాకులు అధికముగా ఉండును. వ్యాపారస్థులకు అంత అనుకూలంగా లేదు. ఖర్చులు నియంత్రిచుకోవాలని సూచన. విష్ణు సహస్రనామం పారాయణం చేయడం మంచిది. మహావిష్ణువు ఆలయాన్ని దర్శిచండం మంచిది.

కుంభ రాశి

కుంభ రాశి వారికి ఈరోజు ఒత్తిళ్ళతో కూడియున్నటువంటి రోజు. పనులయందు ఒత్తిళ్ళు, చికాకులు అధికమగును. పనులయందు ఆలస్యము మరియు బద్దకం వంటివి ఏర్పడును. ఆరోగ్య విషయాలయందు శ్రద్ద వహించాలి. అనవసర మాటలు పడే స్థితి ఏర్పడును. ఖర్చులు అధికమగును. అప్పు చేయవద్దు, అప్పు ఇవ్వవద్దు అని సూచన. ఉద్యోగస్తులకు మధ్యస్థ సమయం. వ్యాపారస్తులకు కష్టకాలం. విద్యార్థులకు మధ్యస్థ సమయం. ఆదిత్య హృదయం పారాయణం చేయండి. విష్ణుమూర్తి అష్టోత్తర నామాలను పఠించండి.

మీన రాశి

మీన రాశి వారికి ఈ రోజు మీకు మధ్యస్థం నుండి అనుకూల ఫలితాలున్నాయి. ఆరోగ్య సమస్యలు, పనుల యందు ఒత్తిళ్ళు కలుగు సూచన. కుటుంబ సౌఖ్యం, శారీరక సౌఖ్యం, ఆనందం పొందెదరు. ఏలినాటి శని ప్రభావం వలన ఖర్చులు, అప్పుల బాధ పెరుగు సూచన. ఎవ్వరికీ అప్పు ఇవ్వద్దు అని సూచన. నూతన వ్యాపారం, స్పెక్యులేషన్‌, పెట్టుబడులకు అనుకూలంగా లేదు. మీన రాశి వారు మరింత శుభఫలితాలు పొందటం కోసం రామాలయాలను దర్శించండి. రామకోటి వంటివి రాయటం మంచిది. తారకమంత్రం పఠించండి.

బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ

మొబైల్‌ : 9494981000

చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ
చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ
WhatsApp channel