ఫిబ్రవరి 26, నేటి రాశి ఫలాలు.. ఒత్తిడి ఎక్కువ, వివాదాస్పద అంశాలకు దూరంగా ఉండాలి-today rasi phalalu february 26th 2024 check your zodiac signs result for daily horoscope in telugu ,రాశి ఫలాలు న్యూస్
తెలుగు న్యూస్  /  రాశి ఫలాలు  /  ఫిబ్రవరి 26, నేటి రాశి ఫలాలు.. ఒత్తిడి ఎక్కువ, వివాదాస్పద అంశాలకు దూరంగా ఉండాలి

ఫిబ్రవరి 26, నేటి రాశి ఫలాలు.. ఒత్తిడి ఎక్కువ, వివాదాస్పద అంశాలకు దూరంగా ఉండాలి

HT Telugu Desk HT Telugu
Feb 26, 2024 12:05 AM IST

Today rasi phalalu: నేటి రాశి ఫలాలు (దిన ఫలాలు) తేదీ26.02.2024 సోమవారం కోసం పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ అందించారు. మేషరాశి నుంచి మీన రాశి వరకు12 రాశుల దిన ఫలాలు ఇక్కడ తెలుసుకోండి.

ఫిబ్రవరి 26, నేటి రాశి ఫలాలు
ఫిబ్రవరి 26, నేటి రాశి ఫలాలు (freepik)

నేటి రాశి ఫలాలు (దిన ఫలాలు) 26.02.2024

వారం: సోమవారం, తిథి : విదియ

నక్షత్రం : ఉత్తరఫల్సుణి, మాసం : మాఘం,

సంవత్సరం: శోభకృత్‌ నామ, అయనం: ఉత్తరాయణం

మేష రాశి

మేష రాశి వారికి ఈ రోజు మీకు అనుకూలంగా ఉంది. ప్రారంభించిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. ఉద్యోగస్తులకు ప్రమోషన్లు. అవసరాలకు ధనం అందుబాటులో ఉంటుంది. వ్యాపారస్తులకు పెట్టుబడులు కలసి వస్తాయి. కీర్తి ప్రతిష్టలు లభిస్తాయి. ఆరోగ్య విషయాల్లో జాగ్రత్త వహించాలి. మేష రాశి వారు ఈరోజు మరింత శుభ ఫలితాలు పొందటం కోసం శివపంచాక్షరీ మంత్రంతో శివుడిని అభిషేకించడం, పూజించడం మంచిది.

వృషభ రాశి

నేటి రాశి ఫలాల ప్రకారం వృషభ రాశి వారికి ఈరోజు అనుకూలంగా లేదు. సకాలంలో పని చేస్తే పనులు పూర్తవుతాయి. వివాదాస్పద అంశాలకు దూరంగా ఉండండి. ఆత్మీయుల సలహాలు తీసుకుంటారు. సమయస్ఫూర్తితో ఆటంకాలను ఎదుర్కోవాలి. ఆరోగ్యంపై శ్రద్ద వహించాలి. శత్రువులు ఆటంకాలు కలిగించాలని చూస్తారు. చంద్రశేఖర అష్టకం పఠించడం మంచిది. శివాలయాన్ని దర్శించడం వల్ల ప్రశాంతత లభించును

మిథున రాశి

మిథున రాశి వారికి ఈ రోజు మీకు అనుకూలంగా లేదు. అడుగడుగునా ఇబ్బంది కలిగించే పరిస్థితులున్నాయి. ఆచితూచి వ్యవహరించాలి. ఏ పనైనా ఏకాగ్రతతో పనిచేయాలి. ఒత్తిడికి గురికారాదు. కొన్ని పనులు చేతిదాకా వచ్చి ఆగుతాయి. ప్రణాళికాబద్ధంగా పనిచేయండి. ప్రయాణాలు ఇబ్బంది పెడతాయి. మిథున రాశి వారు మరింత శుభఫలితాలు పొందటం కోసం శివాలయాన్ని దర్శించి పుణ్యనదీ (గంగ, గోదావరి, కృష్ణ కావేరీ) జలాలతో అభిషేకం చేయటం మంచిది.

కర్కాటక రాశి

కర్కాటక రాశి వారికి ఈ రోజు మీకు మధ్యస్థ ఫలితాలున్నాయి. ముఖ్య పనుల్లో ఆచితూచి వ్యవహరించాలి. ఉద్యోగ వ్యాపారాల్లో సమస్యలు రాకుండా జాగ్రత్తలు వహించాలి. ప్రతి పని కుటుంబ సభ్యులతో చర్చించి చేయాలి. మానసిక ఒత్తిళ్ళు ఇబ్బందిపెట్టును. నిరుత్సాహం పనికిరాదు. నిజాయితీగా మీ బాధ్యతలను మీరు నిర్వర్తించండి. బిల్వపత్రాలతో శివయ్యని పూజించండి. బిల్వాష్టకం పఠించడం మంచిది.

సింహ రాశి

సింహ రాశి వారికి ఈ రోజు మీకు అనుకూలంగా లేదు. ఉద్యోగంలో అధికారుల నుంచి బాగా ఒత్తిడి ఉంటుంది. వృత్తి వ్యాపారాల్లో అనుకూల ఫలితాలున్నాయి. ఇతరుల మీద ఆధారపడకుండా కుటుంబ సమస్యను పరిష్కరించుకుంటారు. అనవసర ఖర్చులుంటాయి. ఖర్చులు నియంత్రించుకోవాలని సూచిస్తున్నాను. ఆరోగ్య విషయాల్లో జాగ్రత్తలు వహించాలి. సూర్య నారాయణ మూర్తికి తర్పణాలు వదలండి. లింగాష్టకాన్ని పఠించండి.

కన్యా రాశి

కన్యా రాశి వారికి ఈ రోజు మీకు మధ్యస్థ ఫలితాలున్నాయి. ఉద్యోగస్తులకు పని ఒత్తిళ్ళు ఉన్నప్పటికి శ్రమ ఫలించును. వృత్తి వ్యాపారాల్లో కొత్త నిర్ణయాలు తీసుకుంటారు. వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆదాయంతో పాటు అనవసర ఖర్చులు కూడా బాగా పెరుగుతాయి. ఆరోగ్యం అనుకూలించును. విద్యార్థులకు మంచి సమయం. పంచామృతాలతో శివాభిషేకం చేసుకోవడం మంచిది. శివపురాణం పఠించండి.

తులా రాశి

నేటి రాశి ఫలాల ప్రకారం తులా రాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంది. వృత్తి వ్యాపారపరంగా సత్ఫలితాలున్నాయి. ఉద్యోగంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. అవసరాలకు సరిపడు ధనం అందుతుంది. శ్రమ ఫలించి కొన్ని ముఖ్యమైన పనులు పూర్తి చేస్తారు. సన్నిహితుల సహకారంతో ఒక వ్యక్తిగత సమస్య పరిష్కారం అవుతంది. ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండాలి. శివాష్టకం పఠించండి. శివాలయంలో ప్రదక్షిణలు చేయటం, శివారాధన మంచిది.

వృశ్చిక రాశి

వృశ్చిక రాశి వారికి ఈరోజు మీకు అనుకూలంగా లేదు. ఉద్యోగంలో పని ఒత్తిళ్ళు అధికముగా ఉంటాయి. వృత్తి వ్యాపారాల్లో ఆశించిన లాభాలుంటాయి. బంధుమిత్రుల నుంచి సహాయ సహకారాలు లభిస్తాయి. రాదనుకున్న డబ్బు అనుకోకుండా చేతికి వస్తుంది. నిరుద్యోగులు శుభవార్త వింటారు. సకాలంలో ముఖ్యమైన పనులు పూర్తిచేస్తారు. పంచాక్షరీ మంత్రంతో 18 సార్లు శివనామస్మరణ చేయాలి. శివ అష్టోత్తర శతనామావళి పఠించండి.

ధనూ రాశి

ధనూ రాశి వారికి ఈరోజు మీకు అనుకూలంగా ఉంది. వృత్తి ఉద్యోగ వ్యాపారపరంగా అనుకూల ఫలితాలున్నాయి. పెళ్ళి ప్రయత్నాలు ఫలిస్తాయి. అవసరమైన పనులు పూర్తిచేస్తారు. శుభవార్తలు వింటారు. కోర్టు కేసులో విజయం సాధిస్తారు. విద్యార్థులకు అనుకూలమైన రోజు. ఇంటా బయటా బాగా ఒత్తిడి ఉంటుంది. ఆరోగ్యపరంగా అనుకూలం. శివారాధన చేయాలి. బిల్వాష్టకము పఠించటం మంచిది.

మకర రాశి

మకర రాశి వారికి ఈరోజు మీకు అనుకూలంగా లేదు. కుటుంబములో పెద్దల సహాయ సహకారాలు లభిస్తాయి. ఎంతో కష్టపడి ముఖ్యమైన పనులు పూర్తిచేస్తారు. ఆరోగ్యం అనుకూలం. ఖర్చులు పెరుగుతాయి. ఉద్యోగంలో సామాన్య మార్పులుంటాయి. పంచామృతంతో శివుడిని అభిషేకం చేసుకోవడం మంచిది. శివ అష్టోతర శతనామావళి పఠించండి.

కుంభ రాశి

కుంభ రాశి వారికి ఈరోజు మీకు మధ్యస్థ ఫలితాలున్నాయి. ఉద్యోగస్తులు బాగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవటం మంచిది. కొన్ని ముఖ్యమైన పనులను పట్టుదలగా పూర్తిచేస్తారు. వృత్తి వ్యాపారపరంగా లాభాలున్నాయి. ఉద్యోగంలో శ్రద్ద వహించాలి. ఆరోగ్యం అనుకూలించును. పెళ్ళి ప్రయత్నాలు సఫలం అవుతాయి. కుంభ రాశి వారు మరింత శుభఫలితాలు పొందటం కోసం బిల్వాష్టకం పఠించండి. శివారాధన చేయండి.

మీన రాశి

మీన రాశి వారికి ఈ రోజు మీకు అనుకూలంగా ఉంది. వృత్తి వ్యాపారపరంగా శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. ఉద్యోగానికి సంబంధించి ఒక శుభవార్త వింటారు. మిత్రుల సహాయ సహకారాలతో ఒక వ్యక్తిగత సమస్యను పరిష్మరించుకుంటారు. ధన లాభం ఉన్నప్పటికి ఖర్చులు కూడా బాగా పెరుగుతాయి. కుటుంబ సభ్యుల ద్వారా లాభం పొందుతారు. మీన రాశి వారు మరింత శుభఫలితాలు పొందటం కోసం బిల్వ పత్రాలతో శివ అష్టోత్తర శతనామావళితో ఈశ్వరుడిని పూజించండి. విశ్వనాథాష్టకం పఠించండి.

బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ

మొబైల్‌ : 9494981000

పంచాంగకర్త చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ
పంచాంగకర్త చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ
WhatsApp channel