Today Rasi Phalalu: ఈరోజు ఈ రాశుల వారి సమస్యలు తీరిపోతాయి.. విద్యార్థులకు కలిసి వస్తుంది.. వస్తు, వాహన లాభంతో పాటు ఎన్నో
Today Rasi Phalalu: నేటి రాశి ఫలాలు (దిన ఫలాలు) తేదీ 29.12.2024 శనివారం కోసం పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ అందించారు. మేషరాశి నుంచి మీన రాశి వరకు 12 రాశుల దిన ఫలాలు ఇక్కడ తెలుసుకోండి.
రాశిఫలాలు (దిన ఫలాలు) : 29.12.2024
ఆయనము: దక్షిణాయనం, సంవత్సరం: శ్రీ క్రోధినామ
మాసం: మార్గశిరం, వారం : ఆదివారం, తిథి : కృ. చతుర్దశి, నక్షత్రం : జ్యేష్ట
మేష రాశి
ఖర్చులు ఊహించిన దానికన్నా ఎక్కువగా ఉంటాయి. ఆరోగ్యపరమైన విషయాలలో వ్యక్తిగత శ్రద్ధ అవసరము. మానసిక ప్రశాంతత తక్కువగా ఉంటుంది. ఉద్వేగాలను, కఠినమైన మాటలను, కోపాన్ని నియంత్రించుకోవాలి. కుటుంబ సంబంధమైన ప్రయాణములు, భాగస్వామ్య వ్యవహారాలలో అపార్థాలు రాకుండా జాగ్రత్త వహించాలి. విద్యార్థులకు అనుకూలంగా ఉంటుంది. కమ్యూనికేషన్ బాగుంటుంది. జ్ఞాపక శక్తిని పెంచుకునే విధంగా కృషి చేస్తారు. వ్రాత నైపుణ్యాలు బాగుంటాయి. కొత్త పెట్టుబడుల గురించి ఆలోచన చేస్తారు. విద్యార్థులకు విద్యాపరమైన ప్రయాణాలకు అవకాశం ఉంది. ఇంటిలోని పెద్దలతో అభిప్రాయభేదాలు రాకుండా జాగ్రత్తగా వ్యవహరించాలి. వ్యాధి నిరోధక శక్తి పెరిగి, శత్రువులపై విజయం సాధించి, బాకీలను చెల్లిస్తారు.
వృషభరాశి
గురువుల ఆశీస్సులు లభిస్తాయి. ఆకస్మిక వైరాగ్యం ప్రశాంతత తగ్గిస్తుంది. సంతాన వృద్ధిపరంగా ముందుకు సాగుతారు. మీ ఆలోచనా విధానం బాగుంటుంది. నిర్ణయ సామర్థ్యం పెరుగుతుంది. ఉద్వేగాలకు లోనై కుటుంబ సంబంధమైన ముఖ్యమైన కార్యక్రమాలలో ఇబ్బందులకు గురవుతారు. ఆ విషయంలో జాగ్రత్త అవసరము. చివరికి వాటన్నిటిని అధిగమిస్తూ కుటుంబ కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఆరోగ్యం విషయంలో, ముఖ్యంగా సంతానము, కంటి ఆరోగ్య శ్రద్ధ అవసరము. ఇష్టమైన కార్యక్రమాల్ని నిర్వహిస్తారు. గవర్నమెంట్ ఉద్యోగులతో విభేదాలు రాకుండా జాగ్రత్త వహించాలి. కుటుంబంలో వాతావరణం అనుకూలంగా ఉంటుంది. నూతన నిర్మాణాల కొరకు ఆలోచన అధికం చేస్తారు.
మిధున రాశి
నూతన వృత్తులకు అవకాశం లభిస్తుంది. సంఘములో గౌరవం కీర్తి ప్రతిష్ఠలు. నూతనపరిచయాలు, భాగస్వామికి గౌరవం రుణాలు చెల్లిస్తారు. ఆగిపోయిన పనులు ముందుకు సాగుతాయి. ఇతరుల సహకారంతో అనుకున్న పనులను పెద్ద శ్రమ లేకుండా సాధించుకుంటారు. శ్రమకు తగిన సన్మానాలు పొందుతారు. మీ శక్తి మీద మీకు నమ్మకం పెరుగుతుంది. రోగ నిరోధక శక్తితో పాటు శత్రువులపై విజయం సాధిస్తారు. ఉన్నత అధికారులతో, ప్రభుత్వ రంగంలో ఉండే వ్యక్తులతో నిదానంగా వ్యవహరించి పనులు ముందుకు తీసుకువెళ్లాలి. గౌరవం తగ్గకుండా చూసుకోండి. ముఖ్యమైన పనులలో ఆటంకాలు మానసిక ఒత్తిడిని పెంచుతాయి. ఆకస్మికమైన ఖర్చులు మాట నిలబెట్టుకోలేని వాగ్దానాలు ఇబ్బందులకు గురిచేస్తాయి.
కర్కాటక రాశి
వారం ప్రారంభంలో మాట్లాడే మాటల వల్ల అభిప్రాయ బేధాలు రాకుండా జాగ్రత్త పడాలి. కంటికి సంబంధించిన విషయాల్లో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. ఉన్నత విద్య కోసం చేసే ప్రయత్నాలు అనుకూలంగా ఉంటాయి. గృహ, వాహనపరమైన లాభాలు. వృత్తిపరమైన అభివృద్ధి, సోదరిసహకారం, కమ్యూనికేషన్ బాగుంటుంది. వాహన సంబంధ అంశాలలో కొన్ని ఆటంకాలు, ప్రయాణాలు లాభిస్తాయి. కుటుంబపరమైన విషయాల్లో బంధువుల కొరకు ఖర్చులు చేస్తారు. శిరోవేదన, శారీరక శ్రమ నిద్రలేమి, కొంత ఇబ్బందిని కలిగిస్తాయి. ఆరోగ్యం పట్ల శ్రద్ద పెంచడం మేలు. తల్లితండ్రుల సహకారంతో నిర్ణయాలు తీసుకుంటారు. ఉన్నత అధికారుల సహకారంతో అనుకున్న పనులు సకాలంలో పూర్తి చేస్తారు. పౌరుషంగా నిర్ణయాలు తీసుకుంటారు.
సింహ రాశి
రాజకీయంగా పలుకుబడి కలిగి ఉన్నత అధికారుల సలహాలతో కొంత కాలముగా ఆగి ఉన్న పనులను మొదలుపెడతారు. ఆత్మీయుల సహకారము తోడ్పడుతూ అనుకున్న పనులు సాధించ కుంటారు. నిర్ణయ సామర్థ్యం బాగుంటుంది. పరాక్రమం పెరుగుతుంది. సంతృప్తి పెంరుగుతుంది. చమత్కారంగా మాట్లాడతారు. వ్యాధి నిరోధకశక్తి పెరుగుతుంది. విద్యార్థులకు అనుకూలంగా ఉంటుంది. కానీ, విద్య పట్ల శ్రద్ధ పెంచుకోవాలి. సమయస్పూర్తిగా వ్యవహరిస్తూ పనులు సాధించుకుంటారు. బంధువుల్ని, ప్రియమైన వ్యక్తుల్ని కలుస్తారు. విందు వినోదాల్లో పాల్గొంటారు. సంతానమునకు అభివృద్ధి, ఆత్మీయులు సహకరిస్తారు. ఉద్వేగములు అధికంగా ఉంటాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాలు ముందుకు సాగుతాయి.
కన్యా రాశి
ప్రారంభంలో వృత్తిపరమైన అంశాలు అనుకూలంగా ఉంటాయి. వ్యాపారపరమైన అంశాలలో జాగ్రత్తలు తీసుకోవాలి. తొందరపాటు నిర్ణయాలు తీసుకోకూడదు. భాగస్వామితో కలిసి కుటుంబపరమైన ప్రయాణాలు. ఇబ్బంది పడకుండా జాగ్రత్త వహించాలి. వ్యక్తిగత ఆరోగ్యంపై శ్రద్ధ అవసరము. దూర ప్రదే శంలో ఉండే వ్యక్తులతో మాట్లాడేటప్పుడు జగడములు రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. దూర ప్రదేశాలలో ఉన్నత విద్య కొరకు ప్రయత్నం చేసే విద్యార్థులకు అధిక శ్రమతో కొంత వరకు అనుకూలంగా ఉంటుంది. నూతన బాధ్యతలు పెరుగుతాయి. శ్రమ పెరుగుతుంది. సంతానానికి అభివృద్ది ఉంది. నూతన పెట్టుబడుల కొరకు ఆలోచనలు చేస్తారు. విద్యార్థినులు జ్ఞాపకశక్తిని పెంచుకోవాలి. చదువుపై శ్రద్ధ అవసరం. ఇతరులతో శత్రుత్వములు రాకుండా వ్యవహరించాలి.
తులారాశి
వారం ప్రారంభంలో వారసత్వపు ఆస్తుల చర్చ మీద, భూమికి సంబంధించిన అంశాల పట్ల శ్రద్ధ తీసుకుంటారు. వృత్తిపరంగా అనుకూలంగా ఉంటుంది. ఉన్నతాధికారులు సహకరిస్తారు. కొత్త భాధ్యతలు అప్పచెప్తారు. తోబుట్టువులతో అభిప్రాయ భేదములు రాకుండా జాగ్రత్త తీసుకోవాలి. దూర ప్రదేశములలో ఉండే వ్యక్తుల సహకారంతో పనుల కోసం ప్రణాళికలు ఏర్పరచుకుంటారు. గృహ సంబంధ అంశాల కొరకు, వాహన మార్పుల కొరకు ఆలోచన చేస్తారు. సంబంధం లేని వ్యక్తుల జోక్యం ఉంటుంది. దూర ప్రదేశాల్లో ఉండే వారి సలహాలు, వచ్చే ఆటంకాలు చికాకును కలిగిస్తాయి. వృత్తిపరమైన అభివృద్ధి కొంత శ్రమను తగ్గిస్తుంది. భాగస్వామి ఆరోగ్యం పట్ల శ్రద్ధ అవసరము.
వృశ్చిక రాశి
దీర్ఘకాలిక పెట్టుబడుల విషయంలోనూ, ఇష్టమైన వ్యక్తులతో అభిప్రాయ భేదాలు, ఘర్షణలు రాకుండా జాగ్రత్త వహించాలి. సంఘాల్లో వ్యాపార రంగంలో అనుభవం ఉన్న నూతన వ్యక్తులు పరిచయమవుతారు. క్రింద పని చేసే వ్యక్తుల సహకారాన్నికోరుకుంటారు. సమయానికి వారు అందించటం వల్ల ముఖ్యమైన పనులు కొంతవరకు ముందుకు సాగుతాయి. ఉన్నత విద్య కోసం ప్రయత్నం చేసే విద్యార్థులకు అధిక శ్రమ. ఆకస్మిక మార్పులు, వివాహ సంబంధమైన అంశాలలో తొందరపాటు నిర్ణయాలు తగవు. వృత్తిపరమైన విషయాలలో కొంత నిరాశక్తత, అధిక శ్రమ ఉంటుంది. తండ్రితో చర్చించి నెమ్మదిగా నిర్ణయాలు తీసుకోవడం కొంతవరకు మంచిది. రావలసిన లాభాలు వాయిదా పడటం వల్ల చికాకులు ఎదురవుతాయి.
ధనస్సు రాశి
ఖర్చులు మాత్రమే కాకుండా ఆరోగ్య విషయంలో కూడా కొంతశ్రద్ధ తీసుకోవాలి. వాగ్దానం నిలబెట్టుకోవడం కొంతవరకు కష్టం అవుతుంది. ధన విషయంలో ఆటంకాలు ఏర్పడతాయి. శక్తికి మించిన ఖర్చులు. కుటుంబంలో మీ ఆధిపత్యం పెరుగుతుంది. వృత్తిపరమైన అధిక శ్రమతో నిద్రలేమి ఇబ్బంది పెడుతుంది. నూతన శక్తితో మనసు ఉత్సాహంగా కొత నిర్ణయాల కొరకు ఆలోచనలు చేస్తుంది. విందు వినోదాల్లో ఖర్చు అధికము. శారీరక శ్రద్ధ, వ్యాయామాలు చేస్తారు. గౌరవము, కీర్తి పెరుగుతుంది. సంఘంలో గుర్తింపు, కుటుంబంతో, మిత్రులతో కలిసి సమయాన్ని సద్వినియోగపరచుకుంటారు. తోబుట్టులతో అభిప్రాయభేదాలు రాకుండా జాగ్రత్తగా వ్యవహరించాలి.
మకర రాశి
పట్టుదలగా వ్యవహరించి మిత్రుల సహకార౦తో, మీ నైపుణ్యమైన కమ్యూనికేషన్తో పనులు సాధించుకుంటారు. దీర్ఘకాలిక అనారోగ్యాల విషయంలో శ్రద్ధ అవసరం. విద్యార్థులకు ఉన్నత విద్య. సంతాన అభివృద్ధి పరంగా ముందుకు వెళుతుంది. సంఘంలో గుర్తింపు గౌరవం. నూతన పరిచయాలు ఏర్పడతాయి. నూతన వృత్తి కొరకు చేయు ప్రయత్నాలు, ఆగిన పనులు ముందుకు వెళతాయి. ఆరోగ్యం బాగుంటుంది. తోబుట్టువులు విషయాలు, వృత్తి సంబంధించిన ఆలోచనలు ప్రశాంతతను తగ్గిస్తాయి. వ్యక్తుల పల్ల అవమానములకు గురి కాకుండా మీ మాటలలో వీలైనంత జాగ్రత్తలు తీసుకోవాలి. అభిప్రాయ భేదాలు రాకుండా జాగ్రత్తగా ఉండాలి.
కుంభ రాశి
భాగస్వామి సంబంధ ఆత్మీయుల రాకపోకలు, సంతాన సంబంధిత నూతన పెట్టుబడులు ఉంటాయి. గృహ సంబంధ ఆదాయాల మీద చర్చలు ఆలోచనలు. భూ సంబంధ విషయాల గురించి పెట్టుబడులు. విందు వినోదాలలో పాల్గొనడం, మానసిక ప్రశాంతత చాలా వరకు తక్కువగా ఉంటుంది. పాత ఆలోచనలు అదేపనిగా గుర్తుకు వస్తూ మనసులో స్థిరత్వం తక్కువ చేస్తుంది. సృజనాత్మకత, సంఘంలో పలుకుబడి కలిగిన వ్యక్తుల సహకారంతో పనులు సాధించుకుంటారు. ఇంతవరకు ఆగిన పనులు అవలీలగా ముందుకు సాగుతాయి. ఆరోగ్యవిషయంలో శ్రద్ధ అవసరము. రోగ నిరోధక శక్తిని పెంచుకోవాలి. పాత రుణములను కొంతవరకు తీరుస్తారు. బాగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి.
మీనరాశి
స్వతంత్రంగా ఆలోచనలు చేస్తారు. సంతాన పరమైన విషయాలలో జనాత్మక అంశాలలో పెట్టుబడికి సంబంధించిన ఆలోచనలలో కొత్త నైపుణ్యాలను ప్రదర్శిస్తారు వ్రాత నైపుణ్యాలు పెరుగుతాయి. పట్టుదలగా అనుకున్న పనులు సాధిస్తారు. వృత్తిపరమైన అభివృద్ధి. ప్రయాణాలు అనుకూలంగా ఉంటాయి. ధైర్య సాహసాలు పెరుగుతాయి. విద్యా వాహన గృహ సౌకర్యాలు అనుకూలంగా ఉంటాయి. విద్యార్థులు పోటీ పరీక్షలలో శ్రమతో విజయాన్ని సాధిస్తారు. గృహ వాహన సంబంధ అంశాల కొనుగోలు కొరకు లాభపరమైన నిర్ణయాలు చేయడం జరుగుతుంది. వృత్తిపరంగా అభివృద్ధి, గౌరవం పెరుగుతుంది. నూతన గృహ సంబంధ వస్తువులకు కొనుగోలు కొరకు ఆలోచనలు చేస్తారు. భాగస్వామి విషయాలు అనుకూలంగా ఉంటాయి.
టాపిక్