Today Rasi Phalalu: నేడు ఈ రాశి వారికి కొత్త అవకాశాలు, పదోన్నతులు.. ఇలా పూజిస్తే మాత్రం సమస్యలన్నీ తీరుతాయి
Today Rasi Phalalu: నేటి రాశి ఫలాలు (దిన ఫలాలు) తేదీ 28.12.2024 శనివారం కోసం పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ అందించారు. మేషరాశి నుంచి మీన రాశి వరకు 12 రాశుల దిన ఫలాలు ఇక్కడ తెలుసుకోండి.
రాశిఫలాలు (దిన ఫలాలు) : 28.12.2024
ఆయనము: దక్షిణాయనం, సంవత్సరం: శ్రీ క్రోధినామ
మాసం: మార్గశిరం, వారం : శనివారం, తిథి : కృ. త్రయోదశి, నక్షత్రం : అనురాధ
మేషం
పనులు నెమ్మదిగా సాగుతాయి. ఆకస్మిక ప్రయాణాలు ఉంటాయి. దేవాలయ దర్శనాలు, నిరుద్యోగుల కృషి ఫలించదు. మానసిక ఆందోళన చెందుతారు. రావలసిన సొమ్ము అందక ఇబ్బంది పడతారు. రుణదాతల నుంచి ఒత్తిళ్లు తప్పవు. కుటుంబంలో అందరి శ్రేయస్సు కోసం తీసుకునే నిర్ణయాలకు వ్యతిరేకత ఎదురుకాగలదు. కుటుంబ సభ్యుల నుంచి విమర్శలు తప్పవు.
ఆరోగ్యం కొంత ఇబ్బంది కలిగించినా ఉపశమనం లభిస్తుంది. వ్యాపారాలలో కొద్దిపాటి లాభాలు కలుగుతాయి. ఉద్యోగులు కొంత శ్రమపడాల్సిన సమయం. అనుకున్న పదోన్నతులు ఆలస్యం. పారిశ్రామికవేత్తలకు విదేశీ పర్యటనలలో మార్పులు చోటు చేసుకుంటాయి. మహిళలకు మానసిక అశాంతి. దేవీస్తుతి మంచిది.
వృషభం
ముఖ్య వ్యవహారాలు సంతృప్తికరంగా సాగుతాయి. ఆశ్చర్యకరమైన విషయాలు తెలుసుకుంటారు. సంఘంలో పరపతి పెరుగుతుంది. సన్నిహితుల నుంచి ఒక ముఖ్య సమాచారం అందుతుంది. ఆస్తి విషయాలలో గందరగోళం తొలగుతుంది. ఆలయాలు సందర్శిస్తారు. చిరకాల ప్రత్యర్థులు మిత్రులుగా మారి సహకరిస్తారు. రావలసిన డబ్బు అంది అవసరాలు తీరతాయి.
రుణాలు సైతం తీరతాయి. కుటుంబంలోని అందరితోనూ ఉత్సాహంగా గడుపుతారు. ఆరోగ్యం గతం కంటే మెరుగుపడుతుంది. ఉద్యోగులు విధి నిర్వహణలో మీ సేవలకు గుర్తింపు పొందుతారు. వ్యాపారాలలో అశించిన విధంగా పెట్టుబడులు అందుతాయి. వ్యాపార విస్తరణ యత్నాలు కలసివస్తాయి. రాజకీయవర్గాలు సన్మానాలు, సత్యారాలతో బిజీగా గడుపుతారు. మహిళలకు కుటుంబసభ్యుల నుంచి ప్రోత్సాహం. పంచముఖ ఆంజనేయస్వామిని పూజించండి.
మిధునం
సన్నిహితులు, స్నేహితులతో వివాదాల పరిష్కారం. శుభకార్యాలలో పాల్గొంటారు. ఊహించని అరుదైన ఆహ్వానాలు రాగలవు. సేవాకార్యక్రమాలలో పాల్గొంటారు. నిరుద్యోగులు సత్తా చాటుకుని ముందుకు సాగుతారు. ఎంతోకాలంగా రావలసిన డబ్బు చేతికందుతుంది. కుటుంబంలో మీపై నమ్మకం మరింత పెరుగుతుంది. ఆశ్చర్యకరమైన సంఘటనలు ఎదురుకాగలవు. శుభకార్యాలు నిర్వహిస్తారు. కొన్ని రుగ్మతలు బాధించినా క్రమేపీ ఉపశమనం లభిస్తుంది.
వ్యాపారాల విస్తరణ యత్నాలు ముమ్మరం చేస్తారు. పెట్టుబడులు అప్రయత్నంగా అందుతాయి. భాగస్వాములతో అగ్రిమెంట్లు చేసుకుంటారు. ఉద్యోగుల్లో పదోన్నతి అవకాశాలు కనిపిస్తాయి. మీపై బాధ్యతలు మరిన్ని పడవచ్చు. కళాకారులకు కొన్ని అవకాశాలు దగ్గరకు వచ్చి ఉత్సాహాన్నిస్తాయి. మహిళలకు కుటుంబంలో చికాకులు తొలగుతాయి. శివపంచాక్షరి పఠించండి.
కర్కాటకం
ఆశ్చర్యం కలిగించే సంఘటనలు ఎదురవుతాయి. శ్రమకు తగిన ఫలితం కనిపిస్తుంది. మిత్రులతో మరింత ఆనందంగా గడుపుతారు. దేవాలయ సందర్శనం ఉంటుంది. కోర్టు వ్యవహారాలు కొలిక్కి వస్తాయి. స్థిరాస్తి విషయంలో నూతన అగ్రిమెంట్లు కాంట్రాక్టులు సైతం దక్కుతాయి. ఆర్థికంగా పొదుపు చర్యలు పాటించి ఖర్చులు అదుపు చేసుకుంటారు.
దీర్ఘకాలిక రుణబాధలు తొలగుతాయి. కుటుంబంలోని అందరిలోనూ మీరంటే ప్రేమ, అభిమానం పెరుగుతాయి. వ్యాపారాలలో వ్యూహాలు అమలు చేసి లాభాల వాటాలో పయనిస్తారు. ఉద్యోగాలలో విధి నిర్వహణలో అవాంతరాలు తొలగుతాయి. పదోన్నతులు లభించే సమయం. రాజకీయవర్గాల వారు పట్టుదలతో అనుకున్నది సాధిస్తారు. మహిళలు కొత్త ఆశలతో ముందడుగు వేస్తారు. విష్ణు సహస్రనామ పారాయణ చేయండి.
సింహం
సన్నిహితులు ఎదుర్కొంటున్న సమస్యలు తీరతాయి. ఆలోచనలు కలసివస్తాయి. కొత్త కాంట్రాక్టులు లభిస్తాయి. ఆలయాలు సందర్శిస్తారు. వ్యవహారాలలో విజయం సాధిస్తారు. ఆర్థిక ఇబ్బందులు తొలగి ఊరట చెందుతారు. ఆకస్మిక ధనలబ్ధి. ఆస్తుల క్రయవిక్రయాల ద్వారా లాభాలు ఆర్జిస్తారు. శుభకార్యాల నిర్వహణపై దృష్టి సారిస్తారు. సోదరీలతో ఉత్తర ప్రత్యుత్తరాలు సాగిస్తారు.
వ్యాపారాలలో పెట్టుబడులకు తగిన లాభాలు దక్కించుకుంటారు. ఉద్యోగాలలో ఇంక్రిమెంట్లు లభిస్తాయి. సహోద్యోగులు మీరంటే మరింత ఇష్టపడతారు. కళాకారులు అవార్డులు, రివార్డులు అందుతాయి. మహిళలు పట్టుదలతో కుటుంబ సమస్యలు పరిష్కరించుకుంటారు. దత్తాత్రేయ స్తోత్రాలు పఠించండి.
కన్య
కొత్త పనులకు శ్రీకారం చుడతారు. సంగీతం, సాహిత్యంపై ఆసక్తి కనబరుస్తారు. ఆస్తి వివాదాలు తీరి లబ్ధి పొందుతారు. ఆలోచనలు అమలుచేసి ముందుకు సాగుతారు. వాహనాలు, ఆభరణాలు కొంటారు. పెండింగ్ బాకీలు వసూలవుతాయి. ఆదాయం సంతృప్తినిస్తుంది. రుణబాధల నుంచి విముక్తి.
వ్యాపారాలలో అనుకున్న లాభాలు అందుతాయి. కొత్త పెట్టుబడులతో ఉత్సాహంగా అడుగువేస్తారు. ఉద్యోగాలలో విధి నిర్వహణ ప్రశాంతంగా ఉంటుంది. సమస్యలు తీరతాయి. రాజకీయవర్గాలకు కొత్త పదవులు లభించి సన్మానాలు పొందుతారు. మహిళలు ఆరోగ్య సమస్యల నుంచి బయటపడతారు. గణేశస్తోత్రాలు పఠించండి.
తుల
అనుకున్న పనుల్లో కొద్దిపాటి ఆటంకాలు ఎదురైనా అవలీలగా అధిగమిస్తారు. చిరకాల ప్రత్యర్థులు మిత్రులుగా మారతారు. ఆలోచనలు అమలు చేస్తారు. వాహనాలు, స్థలాలు కొంటారు. విద్యార్థులకు అనుకూల ఫలితాలు, కొంత సొమ్ము అంది అవసరాలు తీరతాయి. దీర్ఘకాలిక రుణ బాధలు తీరతాయి. బంధువర్గం నుంచి సైతం సాయం అందుతుంది.
భూముల క్రయవిక్రయాలపై కుటుంబసభ్యులతో చర్చిస్తారు. ఆరోగ్యం కొంత ఇబ్బంది కలిగించినా తక్షణం ఉపశమనం పొందుతారు. వ్యాపారాలలో అనూహ్యమైన రీతిలో భాగస్వాములు చేరి పెట్టుబడులు పెంచుతారు. లాభాల బాటలో పయనిస్తారు. ఉద్యోగాలలో పైస్థాయి అధికారుల మెప్పు పొందుతారు. విధుల్లో ఎక్కడా రాజీపడరు. పారిశ్రామికవేత్తలు, కళాకారులకు ఉత్సాహవంతంగా ఉంటుంది. మహిళలకు మానసిక ప్రశాంతత, తులసీదాస శ్రీగణేశ స్తుతి చేయండి.
వృశ్చికం
కొన్ని వివాదాల నుంచి విముక్తి లభిస్తుంది. స్నేహితులతో నెలకొన్న తగాదాలు పరిష్కారం. కాంట్రాక్టులు సైతం దక్కుతాయి. సంఘంలో మీ మాటకు ఎదురుండదు. వాహనాలు, భూములు కొనుగోలు చేస్తారు. ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడతారు. ఇతరుల నుంచి సైతం రావలసిన డబ్బు అందుతుంది. ఆస్తుల విక్రయాల ద్వారా లబ్ది చేకూరుతుంది.
సోదరులతో ఉత్సాహంగా గడుపుతారు. వివాహాది వేడుకల నిర్వహణపై దృష్టి పెడతారు. ఆరోగ్యపరంగా గతం నుంచి వేధిస్తున్న సమస్యలు తీరతాయి. వ్యాపారాలలో లాభాలు దక్కుతాయి. కొత్త పెట్టుబడులు కూడా అందుతాయి. ఉద్యోగాలలో మీపై వచ్చిన నిందలు సమసిపోతాయి. పదోన్నతులు దక్కే అవకాశం. రాజకీయవేత్తలకు కొత్త అవకాశాలు మహిళలకు ఆస్తి లాభ సూచనలు, శ్రీదక్షిణామూర్తి ప్రార్ధన మంచిది.
ధనుస్సు
ముఖ్యమైన వ్యవహారాలు సాఫీగా సాగుతాయి. చిరకాల మిత్రులను కలుసుకుంటారు. ఆలయాలు సందర్శిస్తారు. సొమ్ము సకాలంలో అందుతుంది. కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం నెలకొంటుంది. వేడుకలు, ధార్మిక కార్యక్రమాలు చేపడతారు. పెద్దల సలహాలు పాటిస్తూ ముందడుగు వేస్తారు.
కొద్దిపాటి రుగ్మతలు బాధించినా వెనువెంటనే ఉపశమనం లభిస్తుంది. వ్యాపారాలలో మరింత లాభాల కోసం యత్నిస్తారు. పొరపాట్లు, సరిదిద్దుకుని భాగస్వాములతో సర్దుబాట్లు చేసుకుంటారు. ఉద్యోగాలలో కోరుకున్న పదోన్నతులు దక్కుతాయి. అందరిలోనూ గుర్తింపు రాగలదు. పారిశ్రామికవేత్తలకు ఆహ్వానాలు అందుతాయి. మహిళలకు ఉత్సాహవంతంగా ఉంటుంది. సుబ్రహ్మణ్యేశ్వరుని పూజించండి.
మకరం
ముఖ్యమైన కార్యక్రమాలు విజయవంతంగా సాగుతాయి. ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. కాంట్రాక్టర్లకు శుభవార్తలు అందుతాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడతారు. భార్యాభర్తల మధ్య సఖ్యత నెలకొంటుంది. శుభకార్యాలకు విశేషంగా ఖర్చు చేస్తారు. మీరు చెప్పిందే వేదంగా ఉంటుంది. అందరూ మీకు విధేయులై మసలుతారు. మెరుగైన జీవనం సాగిస్తారు.
ఔషధ సేవనం నుంచి విముక్తి. వ్యాపారాలలో అనుకున్న లాభాలు దక్కి ఉత్సాహంగా ముందుకు సాగుతారు. నూతన పెట్టుబడులు సమకూరతాయి. ఉద్యోగాలలో మీపై ఉంచిన బాధ్యతలు సమర్థవంతంగా నిర్వహిస్తారు. రాజకీయవేత్తలు, కళాకారులకు ఆహ్వానాలు అందుతాయి. మహిళలకు మనశ్శాంతి చేకూరుతుంది. శ్రీమహావిష్ణుధ్యానం మంచిది..
కుంభం
అంతటా ఎదురుండదు. అనుకున్న కార్యక్రమాలు సకాలంలో పూర్తి చేసి ఊపిరి పీల్చుకుంటారు. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. ప్రత్యర్థులను మీ దారికి తెచ్చుకుంటారు. ఇంటి నిర్మాణాలకు శ్రీకారం చుడతారు. దేవాలయాలు సందర్శిస్తారు. ఆర్థిక ఇబ్బందులు చాలావరకూ తీరతాయి. రుణాలు తీరి ఊరట లభిస్తుంది. కుటుంబంలో ఆహ్లాదకరమైన వాతావరణంలో గడుపుతారు. బంధువుల రాక మరింత ఉత్సాహాన్నిస్తుంది.
ఆరోగ్యం కొంత ఇబ్బంది కలిగించినా ఉపశమనం పొందుతారు. వ్యాపారాలలో ఊహించని లాభాలు అందుతాయి. కొత్త పెట్టుబడులు అందుతాయి. ఉద్యోగాలలో కోరుకున్న మార్పులు తథ్యం. పైస్థాయి అధికారుల ప్రశంసలు సైతం అందుకుంటారు. కళాకారులకు మంచి గుర్తింపు, సత్కారాలు అందుతాయి. మహిళలకు ఆస్తిలాభ సూచనలు, శ్రీవేంకటేశ్వర స్తుతి మంచిది.
మీనం
కొత్త కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. విద్యార్థుల ప్రతిభ వెలుగులోకి వస్తుంది. ఉద్యోగ యత్నాలు సానుకూలమవుతాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. ఊహించిన విధంగానే డబ్బు అందుతుంది. అవసరాలకు లోటు ఉండరు. ఇతరుల వద్ద నిలిచిపోయిన బాకీలు చాలా వరకూ వసూలవుతాయి. కుటుంబంలోని అందర్నీ మెప్పించడంలో విజయం సాధిస్తారు.
మీ ఆత్మీయత, ప్రేమ చూపుతూ ఆకట్టుకుంటారు. ఆరోగ్యం కొంత మెరుగుపడుతుంది. వ్యాపారాలు లాభాల బాటలో సాగుతాయి. ఉద్యోగాలలో ఇంక్రిమెంట్లు రాగలవు. రాజకీయవేత్తలు, కళాకారులకు ఆహ్వానాలు అందుతాయి. విదేశీయానం, మహిళలకు భూ, ఉద్యోగ లాభాలు, శ్రీ నృసింహ స్వామి ధ్యానం మంచిది.