Today Rasi Phalalu: నేడు ఈ రాశుల వారికి కలిసి వస్తుంది.. ఏ రాశి వారు ఏ దేవుడిని ఆరాధించాలో తెలుసుకోండి
Today Rasi Phalalu: నేటి రాశి ఫలాలు (దిన ఫలాలు) తేదీ 27.12.2024 శుక్రవారం కోసం పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ అందించారు. మేషరాశి నుంచి మీన రాశి వరకు 12 రాశుల దిన ఫలాలు ఇక్కడ తెలుసుకోండి.
రాశి ఫలాలు (దిన ఫలాలు) : 27.12.2024
ఆయనము: దక్షిణాయనం, సంవత్సరం: శ్రీ క్రోధినామ
మాసం: మార్గశిరం, వారం : శుక్రవారం, తిథి : కృ.ద్వాదశి, నక్షత్రం : విశాఖ
మేష రాశి
కీలక వ్యవహారాల్లో విజయం సాధిస్తారు. అందివచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంటారు. నైపుణ్యాలు పెంచుకుంటారు. వ్యాపారంలో కొన్ని సవాళ్లు ఉన్నా, మీదైన పద్దతిలో వాటిని అధిగమిస్తారు. ఆర్థిక లావాదేవీల్లో జాగ్రత్తగా వ్యవహరించాలి. తగినంత విశ్రాంతి అవసరం. ఆరోగ్యం జాగ్రత్త. విష్ణు సహస్రనామం పఠించాలి.
వృషభ రాశి
మనోబలంతో ప్రయత్నాలు ఆరంభించండి. అనుకున్నది సాధిస్తారు. కాకపోతే, పట్టుదల అవసరం. ఉద్యోగంలో పురోగతి లభిస్తుంది. వ్యాపారంలో కొత్త ప్రణాళికలు అమలు చేస్తారు. భాగస్వాముల వల్ల లాభపడతారు. అవరోధాలను అధిగమించడంలో దైవబలం సహకరిస్తుంది. ఏకపక్ష నిర్ణయాలు వద్దు. సూర్య నారాయణమూర్తిని ధ్యానించండి.
మిథున రాశి
అనూహ్యమైన లాభాలను అందుకుంటారు. బుద్ధిబలంతో వ్యాపార వ్యూహాలకు పదును పెట్టుకుంటారు. మీ ప్రయత్నాలు ఫలితాలను ఇస్తాయి. ఆర్ధికంగా ఓ మెట్టు పైకి వెళ్తారు. గృహ, వస్తు, వాహన యోగాలున్నాయి. సమాజంలో మంచి పేరు సంపాదిస్తారు. ఒత్తిళ్లు ఉన్నా, చాకచక్యంతో అధిగమిస్తారు. అర్ధంలేని విమర్శల్ని పట్టించుకోవద్దు. ఇష్టదైవాన్ని పూజించండి.
కర్కాటక రాశి
చేపట్టే ప్రతి పనీ లాభదాయకం అవుతుంది. ఉద్యోగంలో ఉత్తమ ప్రతిభను కనబరుస్తారు. ఉన్నతాధికారుల ప్రశంసలు అందుకుంటారు. భవిష్యత్తుకు పునాదులు వేసుకోడానికి సరైన సమయం. కొన్ని ఆసక్తికర సంఘటనలు చోటు చేసుకుంటాయి. కష్టకాలంలో ఆత్మీయుల సహకారం అందుతుంది. తొందరపాటు చర్యలు వద్దు. విష్ణుమూర్తిని ఉపాసించండి.
సింహ రాశి
మనోబలంతో లక్ష్యాల వైపు అడుగులు వేస్తారు. బుద్ధిబలమే పెట్టుబడిగా కొత్త ప్రణాళికలు రచిస్తారు. మీదైన రంగంలో శక్తిమంతులు అవుతారు. వ్యాపార బంధాలు బలపడతాయి. ఉద్యోగులకు యజమానుల ప్రశంసలు లభిస్తాయి. ఆర్ధిక పరిస్థితిని మెరుగుపరుచుకునే అవకాశాలు ఉన్నాయి. నవగ్రహ స్తోత్రాలను పఠించాలి..
కన్య రాశి
అదృష్టయోగం ఉంది. పెట్టుబడులు లాభాలను అందిస్తాయి. ప్రత్యర్థులను తేలిగ్గా తీసుకోవద్దు. వ్యాపారంలో చిన్నపాటి వ్యతిరేక ఫలితాలు ఉన్నా, సమర్థంగా అధిగమిస్తారు. మీరు నమ్మిన విలువలే మిమ్మల్ని కాపాడతాయి. ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి. ప్రశాంత జీవనానికి ప్రాధాన్యం ఇవ్వాలి. పరమేశ్వరుడిని ఆరాధించాలి.
తుల రాశి
ఆశయాలు నెరవేరే సమయం. వ్యాపారంలో ముందస్తు ప్రణాళికలు అవసరం. ఉద్యోగులు ఉత్తమ ఫలితాలు సాధిస్తారు. బుద్ధిబలంతో విఘ్నాలను అధిగమిస్తారు. ఆదాయం పెంచుకుంటారు. భూ, గృహ, వాహన యోగాలున్నాయి. అన్ని రంగాల్లోనూ కొత్త ప్రయత్నాలకు ప్రోత్సాహం లభిస్తుంది. స్థిరమైన నిర్ణయాలు తీసుకోవాలి. లక్ష్మీదేవిని ధ్యానించండి.
వృశ్చిక రాశి
ఆర్ధిక పురోగతి సాధిస్తారు. సూర్యబలం తగ్గడం వల్ల ఆత్మవిశ్వాసం లోపించే ఆస్కారం ఉంది. సాధనతో ఆధ్యాత్మిక సంపత్తిని పెంచుకోవాలి. ఉద్యోగులు మరింత జాగ్రత్తగా వ్యవహరించాలి. అందివచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలి. పొదుపుగా మాట్లాడాలి. చిన్నపాటి సమస్యలు ఎదురైనా, ఒత్తిడికి గురికావద్దు. విష్ణు సహస్రనామం పఠించాలి.
ధనుస్సు రాశి
ఆర్థికంగా మేలు జరుగుతుంది. పెట్టుబడులు లాభాలను కురిపిస్తాయి. నైపుణ్యాన్ని పెంచుకుంటారు. క్రమశిక్షణతో ఒత్తిడిని అధిగమిస్తారు. అర్ధంలేని విమర్శల్ని మనసులోకి తీసుకోకండి. కొత్త వ్యాపార ప్రయత్నాలు వద్దు. కుటుంబ సభ్యుల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోండి. సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఉపాసించండి.
మకర రాశి
భాగస్వామ్య వ్యాపారం కలిసొస్తుంది. దీర్ఘకాలిక ఆశయాలు నెరవేరతాయి. ప్రశాంత చిత్తంతో నిర్ణయాలు తీసుకోవాలి. కొత్త ప్రయత్నాలు కొలిక్కి వస్తాయి. మీ ఆలోచనలను దారితప్పించే ప్రయత్నం జరుగుతుంది. ఆ వలలో పడిపోకుండా, కాలాన్ని సద్వినియోగం చేసుకోండి. ఇష్టదైవాన్ని పూజించండి.
కుంభ రాశి
ఉద్యోగులకు శుభకాలం. ఆశించిన స్థానాన్ని అందుకుంటారు. సాహసోపేతమైన నిర్ణయాలు లాభాలను అందిస్తాయి. మిత్రుల సలహాలు పాటించండి. సత్కార్యాలకు డబ్బు ఖర్చు చేస్తారు. పొదుపు- మదుపు వైపు దృష్టి సారించాలి. ముందస్తు ప్రణాళికతో వృత్తిపరమైన అవరోధాలను అధిగమిస్తారు. వారాంతంలో ఓ శుభవార్త వింటారు. శ్రీవేంకటేశ్వరుడిని ప్రార్ధించండి.
మీన రాశి
ప్రయత్నాలు సఫలం అవుతాయి. ఉద్యోగులకు అనుకూలమైన వారం. అధికారుల ప్రశంసలు అందుతాయి. కీర్తి పెరుగుతుంది. ప్రస్తుత నిర్ణయాలపైనే భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది. ఏకాదశ శుక్రయోగం అదృష్టాన్ని ఇస్తుంది. ధనధాన్య లాభాలున్నాయి. పరిస్థితులకు తగినట్టు ఆలోచనా విధానాన్ని మార్చుకోవాలి. ఏదైనా పుణ్యక్షేత్రాన్ని సందర్శించండి.
గమనిక : ఈ కథనంలో మీకు అందించిన సమాచారం, సూచనలు పూర్తిగా నిజమైనది, ఖచ్చితమైనది అని మేము చెప్పలేము. నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోవడం మంచిది.
టాపిక్