Today Rasi Phalalu: నేడు ఈ రాశి వారి సమస్యలు తీరిపోతాయి.. సంతోషంగా ఉండాలంటే ఏ రాశి వారు ఎలాంటి పరిహారాలు పాటించాలంటే-today rasi phalalu december 26th these rasis problems will go away and do these remedies to be happy and get wealth ,రాశి ఫలాలు న్యూస్
తెలుగు న్యూస్  /  రాశి ఫలాలు  /  Today Rasi Phalalu: నేడు ఈ రాశి వారి సమస్యలు తీరిపోతాయి.. సంతోషంగా ఉండాలంటే ఏ రాశి వారు ఎలాంటి పరిహారాలు పాటించాలంటే

Today Rasi Phalalu: నేడు ఈ రాశి వారి సమస్యలు తీరిపోతాయి.. సంతోషంగా ఉండాలంటే ఏ రాశి వారు ఎలాంటి పరిహారాలు పాటించాలంటే

HT Telugu Desk HT Telugu
Dec 26, 2024 04:00 AM IST

Today Rasi Phalalu: నేటి రాశి ఫలాలు (దిన ఫలాలు) తేదీ 26.12.2024 గురువారం కోసం పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ అందించారు. మేషరాశి నుంచి మీన రాశి వరకు 12 రాశుల దిన ఫలాలు ఇక్కడ తెలుసుకోండి.

Today Rasi Phalalu: నేడు ఈ రాశి వారి సమస్యలు తీరిపోతాయి
Today Rasi Phalalu: నేడు ఈ రాశి వారి సమస్యలు తీరిపోతాయి (freepik )

రాశి ఫలాలు (దిన ఫలాలు) : 26.12.2024

yearly horoscope entry point

ఆయనము: దక్షిణాయనం, సంవత్సరం: శ్రీ క్రోధినామ

మాసం: మార్గశిరం, వారం : గురువారం, తిథి : కృ.ఏకాదశి, నక్షత్రం : స్వాతి

మేష రాశి:

ముఖ్యమైన పనులు నిదానంగా సాగుతాయి. ఆర్థిక వ్యవహారాలు నిరుత్సాహపరుస్తాయి. తీర్థయాత్రలు చేస్తారు. బంధువులతో విభేదాలు ఏర్పడతాయి. గృహ నిర్మాణయత్నాలలో అవాంతరాలు, కుటుంబ ఆరోగ్య సమస్యలు చికాకు పరుస్తాయి. వ్యాపారాలు కొంత ఇబ్బంది కలిగిస్తాయి. ఉద్యోగాలలో ఒత్తిళ్లు, పనిభారం పెరుగుతాయి. పారిశ్రామికవర్గాలకు విదేశీ పర్యటనలు వాయిదా. గులాబీ, లేత ఆకుపచ్చ రంగులు, శివపంచాక్షరి పఠించండి.

వృషభ రాశి

కొత్త పనులకు శ్రీకారం చుడతారు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. ఆస్తి విషయంలో అగ్రిమెంట్లు చేసుకుంటారు. అందరిలోనూ గౌరవం పెరుగుతుంది. కోర్టు కేసులు పరిష్కార దశకు చేరతాయి. వాహన యోగం. విద్యార్థులు అనుకున్న ఫలితాలు సాధిస్తారు. వ్యాపారాలు లాభసాటిగా కొనసాగుతాయి. ఉద్యోగాలలో అనుకూల వాతావరణం. కళారంగం వారికి సత్కారాలు, వారం చివరిలో ధనవ్యయం. ఆకుపచ్చ, నేరేడు రంగులు. కనకధారాస్తోత్రాలు పఠించండి.

మిధున రాశి

అనుకున్న వ్యవహారాలు సాఫీగా పూర్తి చేస్తారు. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. బంధువుల నుంచి శుభవార్తలు. భూములు, వాహనాలు కొంటారు. కొన్ని వివాదాల నుంచి బయటపడతారు. నిరుద్యోగుల యత్నాలు కొంతమేరకు ఫలిస్తాయి. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగాలలో అనుకూల మార్పులు, పారిశ్రామికవర్గాలకు ఉత్సాహవంతంగా ఉంటుంది. ఎరుపు, గులాబీ రంగులు. ఆదిత్య హృదయం పఠించండి.

కర్కాటక రాశి

కొత్త వ్యక్తుల పరిచయం సంతోషం కలిగిస్తుంది. ఆప్తులు మీ అభివృద్ధిలో కీలకం కాగలరు. ఇంటర్వ్యూలు అందుకుంటారు. ఆస్తి విషయాలలో ఒప్పందాలు చేసుకుంటారు. ఇంటాబయటా మీకు ఎదురులేని పరిస్థితి ఉంటుంది. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. వాహనయోగం. ఉద్యోగాలలో చిక్కులు తొలగుతాయి. వారం చివరిలో ఆరోగ్యసమస్యలు. పసుపు, గులాబీ రంగులు. ఆంజనేయ దండకం పఠించండి.

సింహ రాశి

నూతన ఉద్యోగప్రాప్తి, కొన్ని వివాదాలు తీరి ఊపిరి పీల్చుకుంటారు. పనులు సకాలంలో పూర్తి చేస్తారు. జీవిత భాగస్వామి ద్వారా ఆస్తిలాభ సూచనలు. ఆరోగ్యం కుదుటపడుతుంది. విద్యార్థులకు నూతన విద్యావకాశాలు దక్కుతాయి. వాహనాలు, భూములు కొంటారు. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగాలలో సమర్ధతను నిరూపించుకుంటారు. రాజకీయవర్గాలకు మరింత అనుకూలత. వారం చివరిలో అనుకోని ఖర్చులు. నీలం, నేరేడు రంగులు, హయగ్రీవస్తోత్రాలు పఠించండి.

కన్య రాశి

అనుకున్న విధంగా వ్యవహారాలు చక్కదిద్దుతారు. కొత్త వ్యక్తులు పరిచయమై ఉత్సాహాన్నిస్తారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలపై దృష్టి పెడతారు. పోటీపరీక్షల్లో విజయం సాధిస్తారు. వాహనాలు, గృహం కొనుగోలు యత్నాలు సానుకూలం. వ్యాపారాలలో కొత్త పెట్టుబడులు అందుతాయి. ఉద్యోగాలలో అనుకున్న హోదాలు దక్కించుకుంటారు. వారం ప్రారంభంలో అనారోగ్యం, కుటుంబసమస్యలు. లేత ఆకుపచ్చ, నలుపు రంగులు. హనుమాన్ చాలీసా పఠించండి.

తుల రాశి

ఆర్థికంగా గతం కంటే మెరుగ్గా ఉంటుంది. అనుకున్న పనులు సకాలంలో పూర్తి చేస్తారు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. ఆస్తి వ్యవహారాలు కొలిక్కి వస్తాయి. ఒక కీలకమైన కేసు పరిష్కారమవుతుంది. వివాహ, ఉద్యోగయత్నాలు ఫలిస్తాయి. వ్యాపారాలు మరింతగా లాభిస్తాయి. ఉద్యోగాలలో ఊహించని హోదాలు రావచ్చు. పారిశ్రామికవర్గాలకు ఆకస్మిక విదేశీ పర్యటనలు. వారం ప్రారంభంలో వ్యయప్రయాసలు. గులాబీ, లేత ఎరుపు రంగులు. శ్రీరామరక్షాస్తోత్రాలు పఠించండి.

వృశ్చిక రాశి

ఆర్థిక లావాదేవీలు ఆశాజనకంగా ఉండి రుణాలు కూడా తీరుస్తారు. ముఖ్యమైన పనులు విజయవంతంగా సాగుతాయి. వాహనాలు, గృహం కొనుగోలు, వ్యాపారాలు అనుకున్నంతగా లాభిస్తాయి. ఉద్యోగాలలో ఒడిదుడుకుల నుంచి బయటపడతారు. పారిశ్రామికవర్గాల వారికి మరింత ఉత్సాహవంతంగా ఉంటుంది. బంధువిరోధాలు. నీలం, నేరేడు రంగులు ధరించాలి. విష్ణుసహస్రనామ పారాయణ చేయండి.

ధనుస్సు రాశి

ముఖ్యమైన పనుల్లో విజయం. శుభవార్తలు, స్థిరాస్తి వివాదాలు పరిష్కారదశకు చేరతాయి. విద్య, ఉద్యోగావకాశాలు దక్కించుకుంటారు. గృహ నిర్మాణయత్నాలు కలసివస్తాయి. వ్యాపారాలు ఉత్సాహవంతంగా సాగుతాయి. ఉద్యోగాలలో అనుకూల మార్పులు. పారిశ్రామికవర్గాలకు కొత్త అనుమతులు లభిస్తాయి.. వారం చివరిలో ధనవ్యయం. అనారోగ్యం. ఎరుపు, లేత ఆకుపచ్చ రంగులు, గణేశాష్టకం పఠించండి.

మకర రాశి

కొత్త పనులు చేపట్టి సకాలంలో పూర్తి చేస్తారు. ఆత్మీయుల నుంచి శుభవార్తలు. స్థిరాస్తి వివాదాలు పరిష్కారమవుతాయి. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. వాహనాల కొనుగోలు. ప్రముఖులు పరిచయమవుతారు. నిరుద్యోగులకు ఇంటర్వ్యూలు అందుతాయి. వ్యాపారాలు సజావుగా సాగుతాయి. ఉద్యోగాలలో ఇబ్బందులు, చికాకులు తొలగుతాయి. పారిశ్రామికవర్గాలకు ఊహించని విదేశీ పర్యటనలు ఉంటాయి. వారం ప్రారంభంలో ధనవ్యయం. గులాబీ, నేరేడు శివాష్టకం పఠించండి.

కుంభ రాశి

విద్యార్థులకు నూతన అవకాశాలు దక్కుతాయి. కొత్త పనులు చేపట్టి సకాలంలో పూర్తి చేస్తారు. ఆర్థిక వ్యవహారాలు గతం కంటే మెరుగుపడతాయి. పాతమిత్రులను కలుసుకుని ఉత్సాహంగా గడుపుతారు. వాహనాల కొనుగోలు, వ్యాపారాల విస్తరణలో అవాంతరాలు తొలగుతాయి. ఉద్యోగాలలో మరింత గుర్తింపు రాగలదు. రాజకీయవర్గాలకు శుభవార్తలు అందుతాయి. వారం ప్రారంభంలో వ్యయప్రయాసలు, గులాబీ, ఆకుపచ్చ రంగులు. దక్షిణామూర్తి స్తోత్రాలు పఠించండి.

మీన రాశి

ముఖ్యమైన పనుల్లో విజయం. ప్రముఖుల నుంచి కీలక సమాచారం అందుతుంది. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. నిరుద్యోగులకు భవిష్యత్తుపై భరోసా ఏర్పడుతుంది. వ్యాపారాలు విస్తరిస్తారు. కొత్త పెట్టుబడులు అందుతాయి. ఉద్యోగాలలో చిక్కులు తొలగుతాయి. కళారంగం వారికి ఆకస్మిక విదేశీ పర్యటనలు. వారం మధ్యలో ధనవ్యయం. కుటుంబంలో చికాకులు. ఎరుపు, నేరేడు రంగులు. రాఘవేంద్రస్తుతి మంచిది.

బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ, మొబైల్‌ : 9494981000
బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ, మొబైల్‌ : 9494981000
Whats_app_banner