Today Rasi phalalu: నేటి రాశి ఫలాలు: ఈ రాశుల వాళ్లకు శుభ ఫలితాలు-today rasi phalalu december 12th check zodiac signs horoscope predictions ,రాశి ఫలాలు న్యూస్
తెలుగు న్యూస్  /  రాశి ఫలాలు  /  Today Rasi Phalalu: నేటి రాశి ఫలాలు: ఈ రాశుల వాళ్లకు శుభ ఫలితాలు

Today Rasi phalalu: నేటి రాశి ఫలాలు: ఈ రాశుల వాళ్లకు శుభ ఫలితాలు

HT Telugu Desk HT Telugu
Dec 10, 2024 07:56 AM IST

Today rasi phalalu: నేటి రాశి ఫలాలు (దిన ఫలాలు) తేదీ 10.12.2024 మంగళవారం కోసం పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ అందించారు. మేషరాశి నుంచి మీన రాశి వరకు 12 రాశుల దిన ఫలాలు ఇక్కడ తెలుసుకోండి.

నేటి రాశి ఫలాలు
నేటి రాశి ఫలాలు

రాశిఫలాలు (దిన ఫలాలు) : 10.12.2024

yearly horoscope entry point

ఆయనము: దక్షిణాయనం, సంవత్సరం: శ్రీ క్రోధినామ

మాసం: మార్గశిరం, వారం : మంగళవారం, తిథి : శు. దశమి, నక్షత్రం : ఉత్తర బాధ్రపద

మేషం:

దూరపు బంధువుల నుంచి శుభవార్తలు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. సమస్యల నుంచి బయటపడి ఊరట చెందుతారు. నిరుద్యోగులకు కొత్త అవకాశాలు వాహనాలు, ఇళ్లు కొనుగోలు చేస్తారు. వివాహయత్నాలు సానుకూలం. వ్యాపారాలలో పురోగతి సాధిస్తారు. ఉద్యోగులకు కొత్త హోదాలు దక్కుతాయి. పారిశ్రామికరంగం వారికి ఉత్సాహవంతమైన కాలం. విదేశీ పర్యటనలు, ఉంటాయి. వారం ప్రారంభంలో ధనవ్యయం, ఎరుపు, ఆడుపచ్చ రంగులు. దత్తాత్రేయస్వామిని స్మరించండి.

వృషభం:

పనులు సజావుగా పూర్తికాగలవు. ఆర్థిక లావాదేవీలు సంతృప్తికరంగా ఉంటాయి. రుణాలు తీరి ఊపిరి పీల్చుకుంటారు. కొన్ని వివాదాలు సునాయాసంగా పరిష్కారమవుతాయి. బంధువుల నుంచి ఆహ్వానాలు, వ్యాపార లావాదేవీలు ఆశాజనకం. ఉద్యోగులకు పదోన్నతులు దక్కవచ్చు. రాజకీయవర్గాలకు సన్మానయోగం. విద్యార్ధులు అనుకున్న లక్ష్యాలు సాధిస్తారు. వారం మధ్యలో అనుకోని ప్రయాణాలు. అనారోగ్యం, గులాబీ, పసుపు రంగులు, నవగ్రహస్తోత్రాలు పఠించండి.

మిధునం:

కొత్త పనులకు శ్రీకారం చుడతారు. ఆర్థిక పరిస్థితి గతం కంటే మెరుగ్గా ఉంటుంది. సన్నిహితుల సాయంతో విజయాలు సాధిస్తారు. విలువైన వస్తువులు సేకరిస్తారు. ఆస్తి విషయాలలో ఒప్పందాలు చేసుకుంటారు. ఇంటి నిర్మాణయత్నాలు సానుకూలమవుతాయి. వ్యాపారాలు పుంజుకుంటాయి. ఉద్యోగాలలో మీ సత్తా చాటుకుని గుర్తింపు పొందుతారు. కళాకారులకు అవార్డులు దక్కవచ్చు. వారం చివరిలో దూరప్రయాణాలు, పసుపు, నేరేడు రంగులు, విష్ణుద్యానం చేయండి.

కర్కాటకం:

నూతన వ్యక్తుల పరిచయం. ఇంటిలో శుభకార్యాల నిర్వహణపై దృష్టి సారిస్తారు. భూవివాదాలు పరిష్కారమవుతాయి. వాహనాలు. ఆభరణాలు కొంటారు. వ్యాపార విస్తరణలో ముందడుగు వేస్తారు. ఉద్యోగులకు నూతనోత్సాహం. పారిశ్రామిక వర్గాలకు సన్మానాలు, విద్యార్థులకు అరుదైన అవకాశాలు దక్కుతాయి. వారం ప్రారంభంలో రుణయత్నాలు, పసుపు, గోధుమ రంగులు, వృసింహస్తోత్రాలు పఠించండి.

సింహం:

దూరప్రాంతాల నుంచి శుభవార్తలు. రావలసిన సొమ్ము అందుతుంది. దీర్ఘకాలిక సమస్యల నుంచి బయటపడతారు. ఆరోగ్యం కుదుటపడుతుంది. వాహనాలు, గృహం కొనుగోలు యత్నాలు సఫలం ఇంటిలో శుభకార్యాలు నిర్వహిస్తారు. నిరుద్యోగులకు ఊరట కలిగించే ప్రకటన రావచ్చు. వ్యాపారాలు పుంజుకుంటాయి. ఉద్యోగాలలో గందరగోళం తొలగుతుంది. వారం ప్రారంభంలో అనారోగ్యం కుటుంబంలో చికాకులు, గులాబీ, ఆకుపచ్చ రంగులు, శ్రీరామస్తోత్రాలు పఠించండి.

కన్య:

ముఖ్యమైన పనులు సాఫీగా పూర్తి చేస్తారు. కార్యదీక్షాపరులై విజయాలు సాధిస్తారు. సంఘంలో ఎనలేని గౌరవం పొందుతారు. శుభకార్యాలకు డబ్బు వెచ్చిస్తారు. ధవలాభం, ఆస్తి వివాదాలు తీరి లాభం చేకూరుతుంది. వాహన యోగం. వ్యాపారాలలో ఒడిదుడుకులు తొలగుతాయి. ఉద్యోగాలలో పని భారం తగ్గుతుంది. కొందరికి ప్రమోషన్లు సైతం లభిస్తాయి. వారం చివరిలో దూరప్రయాణాలు, గులాబీ, నేరేడు రంగులు. ఆంజనేయ దండకం పఠించండి.

తుల:

పనుల్లో జాప్యం ఆర్థిక పరిస్థితి కొంత నిరాశ కలిగిస్తుంది. వ్యయప్రయాసలు తప్పవు. ఆరోగ్యవరంగా కొద్దిపాటి చికాకులు, అనుకోని ప్రయాణాలు, బాధ్యతలు మరింతగా పెరుగుతాయి. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపారాలలో కొద్దిపాటి చికాకులు, ఉద్యోగులకు ఆకస్మిక మార్పులు. రాజకీయవర్గాలకు నిరుత్సాహమే. నిరుద్యోగుల యత్నాలు కొంతవరకూ సఫలం. వారం మధ్యలో శుభవార్తలు. ధన, వస్తులాభాలు, నీలం, ఆకుపచ్చ రంగులు, ఆదిత్య హృదయం పఠించండి.

వృశ్చికం:

ఆర్థిక వ్యవహారాలలో చికాకులు తొలగుతాయి. వాహన, కుటుంబసౌఖ్యం, జీవితాశయం నెరవేరుతుంది. వివాహ, ఉద్యోగయత్నాలు ఫలిస్తాయి. వ్యాపారాలలో కొత్త పెట్టుబడులు సమకూరతాయి. ఉద్యోగులకు పదోన్నతులు, రాజకీయవర్గాలకు పదవులు లభించవచ్చు. వారం చివరిలో అనుకోని ప్రయాణాలు. ఆరోగ్యభంగం. శ్రమ తప్పదు. గులాబీ, పసుపు రంగులు, సుబ్రహ్మణ్యాష్టకం పఠించండి.

ధనుస్సు:

దూరమైన ఆప్తులు తిరిగి దగ్గరవుతారు. పాతబాకీలు సైతం వసూలై అవసరాలు తీరతాయి, వాహనాలు కొనుగోలు చేస్తారు. చిరకాల ప్రత్యర్ధులు మిత్రులుగా మారవచ్చు, స్థిరాస్తి వివాదాలు పరిష్కారమవుతాయి. నిరుద్యోగులకు ఉద్యోగలాభం. వ్యాపారాలలో అనుకున్న లాభాలు అందుతాయి. ఉద్యోగులకు సంతోషకరమైన వార్తలు, పారిశ్రామిక రంగం వారు ఆశించిన ప్రగతి సాధిస్తారు. వారం ప్రారంభంలో ఆనారోగ్యం, ప్రయాణాలలో ఆటంకాలు. ఆకుపచ్చ, గోధుమ రంగులు. గణేశాష్టకం పఠించండి.

మకరం:

అనుకున్న పనులు సకాలంలో పూర్తి కాగలవు, ఆర్థిక విషయాలు సంతృప్తినిస్తాయి. ఒక సమస్య తీరి ఊరట చెందుతారు. ఆరోగ్యపరంగా చికాకులు తొలగుతాయి. భూములు, వాహనాలు కొంటారు. ఇంతకాలం పడిన శ్రమ కొలిక్కి వస్తుంది. వ్యాపారాలలో అనుకూల పరిస్థితులు, ఉద్యోగులకు కొత్త హోదాలు, కళారంగం వారికి సన్మానాలు, విశేష గౌరవం. వారం చివరిలో ధనవ్యయం. స్వల్ప అనారోగ్యం, కాఫీ, నేరేడు రంగులు, విష్ణుసహస్ర నామ పారాయణ చేయండి.

కుంభం:

ఆర్థిక ఇబ్బందులు తొలగుతాయి. శుభకార్యాలలో పాల్గొంటారు. ఒక ముఖ్య నిర్ణయం తీసుకుంటారు. భూవివాదాలు తీరతాయి. ఆధ్యాత్మిక చింతన, వాహనాలు, ఆభరణాలు కొంటారు. వ్యాపారులకు అనుకున్న లాభాలు తథ్యం. ఉద్యోగులకు కొత్త ఆశలు చిగురిస్తాయి. పారిశ్రామికవర్గాలకు నూతనోత్సాహం. విద్యార్థులకు మంచి ర్యాంకులు. వారం చివరిలో దూరప్రయాణాలు. రుణాలు చేస్తారు. బాధ్యతలు పెరుగుతాయి. నీలం, తెలుపు రంగులు ధరించండి. హనుమాన్ చాలీసా పఠించండి.

మీనం:

వ్యవహారాలు సకాలంలో పూర్తి చేస్తారు. ఆస్తి విషయాలలో ఒప్పందాలు చేసుకుంటారు. సోదరుల నుంచి ధనలాభం. ఆర్థిక విషయాలలో పురోగతి, వాహనాలు, భూములు కొంటారు. విద్యార్థులకు నూతన విద్యావకాశాలు, వ్యాపారాలు ఊపందుకుంటాయి. ఉద్యోగులకు పదోన్నతి అవకాశాలు, రాజకీయ వర్గాలకు పదవీయోగం. వారం ప్రారంభంలో ప్రయాణాలు. కలిసి వచ్చే రంగులు తెలుపు, గులాబీ రంగులు. దత్తాత్రేయ స్తోత్రాలు పఠించండి.

పంచాంగకర్త చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ
పంచాంగకర్త చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ

గమనిక : ఈ కథనంలో మీకు అందించిన సమాచారం, సూచనలు పూర్తిగా నిజమైనది, ఖచ్చితమైనది అని మేము చెప్పలేము. నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోవడం మంచిది.

Whats_app_banner

సంబంధిత కథనం