నవంబర్ 14 : నేటి రాశి ఫలాలు.. ఈ రాశుల వారు నువ్వుల నూనెతో దీపాలను వెలిగించాలి-today rasi phalalu check your zodiac sign prediction for november 14th 2023 ,రాశి ఫలాలు న్యూస్
తెలుగు న్యూస్  /  రాశి ఫలాలు  /  నవంబర్ 14 : నేటి రాశి ఫలాలు.. ఈ రాశుల వారు నువ్వుల నూనెతో దీపాలను వెలిగించాలి

నవంబర్ 14 : నేటి రాశి ఫలాలు.. ఈ రాశుల వారు నువ్వుల నూనెతో దీపాలను వెలిగించాలి

HT Telugu Desk HT Telugu
Nov 14, 2023 04:05 AM IST

Horoscope Today : ఈరోజు రాశి ఫలాలు తేదీ 14.11.2023 మంగళవారం కోసం జ్యోతిష శాస్త్ర నిపుణులు బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ అందించారు. మేష రాశి నుంచి మీన రాశి వరకు దిన ఫలాలు ఇక్కడ చూడండి.

ఈరోజు రాశి ఫలాలు
ఈరోజు రాశి ఫలాలు (unsplash)

తెలుగురాశి ఫలితములు (దిన ఫలితము) 14. 11.2023, వారం: మంగళవారం, తిథి : పాద్యమి నక్షత్రం : అనూరాధ, మాసం : కార్తీకం, సంవత్సరం: శోభకృత్‌ నామ, అయనం: దక్షిణాయనం

మేష రాశి

మేష రాశి వారికి ఈ రోజు అంత అనుకూలంగా లేదు. కుటుంబ వ్యవహారాలు, ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు వహించాలి. ప్రలోభాలకు గురిచేయు అంశాలుంటాయి. ఏ విషయంలోనూ అనాలోచితంగా వ్యవహరించకండి. సంతానం వలన ఇబ్బందులు ఏర్పడును. కుటుంబ వ్యక్తుల ఆరోగ్యము కోసం జాగ్రత్తలు తీసుకోవాలి. అనవసర వ్యక్తులను దూరంగా ఉంచి ప్రయత్నాలను వేగవంతం చేసుకోండి. సుబ్రహ్మణ్యేశ్వరునికి అభిషేకం చేసుకోవడం మంచిది. సుబ్రహ్మణ్య అష్టకం పఠించండి. సుబ్రహ్మణ్యుని ఆలయంలో నువ్వుల నూనెతో దీపాలను వెలిగించాలి.

వృషభ రాశి

వృషభ రాశి వారికి ఈ రోజు వృత్తి, ఉద్యోగ, వ్యాపారపరంగా అన్ని విధములగా అనుకూలం. వాహన, గృహమార్పులు వంటివి అనుకూలిస్తాయి. చెల్లింపులను పూర్తిచేసుకోగలరు. వ్యక్తిగతమైన బాధ్యతలను ఇతరులకు అప్పగించవద్దు. సంతానయోగం ఉంది. రాహుకాల సమయంలో అమ్మవారి వద్ద నువ్వుల నూనెతో దీపాలను వెలిగించడం మంచిది ఈరోజు అమ్మవారికి కుంకుమార్చన చేయడం మంచిది.

మిథున రాశి

మిథున రాశి వారికి ఈ రోజు మీకు మధ్యస్థముగా ఉన్నది. ఆరోగ్యం అనుకూలించును. ఆదాయపరంగా బాగుంటుంది. సంతాన వ్యవహారాలు కొన్ని చికాకుపరుస్తాయి. వృథా ఖర్చులు నియంత్రించుకోవలి. నూతన వ్యాపారాల్లో ఆచితూచి వ్యవహరించాలి. నూతన ఉద్యోగాలు ఏర్పడతాయి. వాహన, యంత్రాదుల రిపేర్లను చేయవలసివచ్చును. వృత్తి ఉద్యోగ నిపుణులకు పని ఒత్తిడి అధికముగా ఉండును. మరింత శుభఫలితాలు పొందాలంటే సుబ్రహ్మణ్యేశ్వరునికి అభిషేకం చేసుకోవడం మంచిది. సుబ్రహ్మణ్య అష్టకం పఠించండి. సుబ్రహ్మణ్యుని ఆలయంలో నువ్వుల నూనెతో దీపాలను వెలిగించాలి.

కర్కాటక రాశి

కర్కాటక రాశి వారికి ఈ రోజు మీకు మధ్యస్థ ఫలితాలున్నాయి. బ్యాంకు బ్యాలన్స్‌లు పెంచుతారు. కొన్ని ప్రయాణాలను తప్పనిసరిగా చేయవలసిరావచ్చును. కుటుంబ వ్యవహారాలలో అదనపు బాధ్యతలు స్వీకరించవలసివచ్చును. విదేశీ వస్తువులు ఏర్పరచుకుంటారు. ఆధ్యాత్మికతలకు ఎక్కువ ప్రాధాన్యతనిస్తారు. అనారోగ్య సమస్యలు ఇబ్బందిపెట్టును. ఉత్సాహంగా వ్యవహరిస్తారు. మరింత శుభ ఫలితాలు పొందాలంటే బుణ విమోచన అంగారక స్తోత్రాన్ని పఠించండి. విఘ్నేశ్వరున్ని పూజించండి. రాహుకాల సమయంలో దుర్గాదేవిని పూజించండి.

సింహ రాశి

సింహరాశి వారికి ఈ రోజు మీకు అంత అనుకూలంగా లేదు. ఆరోగ్యం అనుకూలించును. కుటుంబ సభ్యులతో ఉత్సాహముగా గడుపుతారు. వృత్తి ఉద్యోగాల్లో ఒత్తిడులు ఏర్పడును. వ్యాపారాల్లో స్వల్ప ఇబ్బందులుంటాయి. చెడు అలవాట్లు, స్నేహాలు ఆకర్షించగలవు. జాగ్రత్తలు అవసరం. సోదరుల మధ్య విభేదాలేర్పడు సూచనలు. కొన్ని ముఖ్యమైన పనులు వాయిదా వేస్తారు. మరింత శుభఫలితాలు పొందాలంటే సుబ్రహ్మణ్యేశ్వరునికి అభిషేకం చేసుకోవడం మంచిది. సుబ్రహ్మణ్య అష్టకం పఠించండి. సుబ్రహ్మణ్యుని ఆలయంలో నువ్వుల నూనెతో దీపాలను వెలిగించాలి.

కన్యా రాశి

కన్యారాశి వారికి ఈ రోజు మీకు మధ్యస్థ సమయం. వ్యక్తిగతంగా అన్నిటియందు జాగ్రత్తగా వ్యవహరించుకోవాలి. పట్టుదలతో వ్యవహరిస్తారు. సొంత నిర్ణయాల్లో ఆచితూచి వ్యవహరించాలి. ఎవరికీ హామీలు, పూచీకత్తులు ఇవ్వకూడదు. ఆత్మీయులైనా ఇచ్చిపుచ్చుకొను తరహాలు పాటించుట మంచిది. వృత్తి, ఉద్యోగాల్లో అదనపు బాధ్యతలు మీదపడినా ఉత్సాహంగా స్వీకరించండి. పెట్టుబడులకు దూరంగా ఉండటం మంచిది. మరింత శుభఫలితాలు పొందాలంటే విఘ్నేశ్వరుని పూజించాలి. సంకటనాశన గణపతి స్తోత్రం పఠించాలి. వినాయకుడి ఆలయంలో నువ్వుల నూనెతో దీపాలను వెలిగించడం మంచిది.

తులా రాశి

తులా రాశి వారికి ఈరోజు మీకు మధ్యస్థ ఫలితాలున్నాయి. యంత్ర, వాహనాదుల ఉపయోగాల్లో జాగ్రత్తలు తప్పనిసరి. కీలకమైన వ్యవహారాలకు సంబంధించి సమాచారమును స్వీకరించగలుగుతారు. అదనపు బాధ్యతలు తీసుకోవడం తప్పకపోవచ్చును. మరింత శుభ ఫలితాలు పొందాలంటే బుణ విమోచన అంగారక స్తోత్రాన్ని పఠించండి. విఘ్నేశ్వరున్ని పూజించండి. రాహుకాల సమయంలో దుర్గాదేవిని పూజించండి.

వృశ్చిక రాశి

వృశ్చిక రాశి వారికి ఈ రోజు మీకు ఆర్థికపరంగా అనుకూలం. ధనం సర్దుబాటు అవుతుంది. చేపట్టిన పనులు నిదానంగా పూర్తిచేస్తారు. విలువైన వస్తువుల పట్ల జాగ్రత్తలతు పాటించండి. కుటుంబంలో కొన్ని వివాదాలు ఉన్నా ఉత్సాహంగా వ్యవహరిస్తారు. గౌరవ మర్యాదల కోసం చూడకుండా కర్తవ్యాలను చేపట్టండి. మరింత శుభఫలితాలు పొందాలంటే బుణ విమోచన అంగారక స్తోత్రాన్ని పఠించండి. విఘ్నేశ్వరున్ని పూజించండి. రాహుకాల సమయంలో దుర్గాదేవిని పూజించండి.

ధనూ రాశి

ధనూ రాశి వారికి ఈ రోజు మీకు అనుకూల ఫలితాలున్నాయి. వృత్తి, వ్యాపార, ఉద్యోగపరంగా ఉత్సాహంగా సాగుతాయి. ప్రయత్న కార్యాలు అనుకూలం. వస్తు, వాహనాలు కొనుగోలు చేసుకుంటారు. గతంలో ఏర్పడిన చిక్కుల్ని తొలగించుకోగలరు. పలుకుబడి కలిగిన వ్యక్తులతో పరిచయాలు ఎక్కువవుతాయి. ఉద్యోగ, వివాహ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. స్థిరాస్తులు ఏర్పరచుకోవాలనే ఊహల్ని నిజం చేస్తారు. మరింత శుభఫలితాలు పొందాలంటే సుబ్రహ్మణ్యేశ్వరునికి అభిషేకం చేసుకోవడం మంచిది. సుబ్రహ్మణ్య అష్టకం పఠించండి. సుబ్రహ్మణ్యుని ఆలయంలో నువ్వుల నూనెతో దీపాలను వెలిగించాలి.

మకర రాశి

మకర రాశి వారికి ఈ రోజు మీకు అనుకూలంగా లేదు. కొన్ని ఆకస్మిక నిర్ణయాలు తీసుకుంటారు. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలేర్పడతాయి. బాధ్యతాయుతంగా వ్యవహరిస్తారు. ఆరోగ్య విషయంలో మార్పులు చూస్తారు. ఇతరులకు బాధ్యతలు అప్పగించేటప్పుడు జాగ్రత్తలు అవసరం. వాహన, గృహ సంబంధమైన వస్తువులను ఏర్పరచుకుంటారు. రాహు కాల సమయంలో అమ్మవారి వద్ద నువ్వుల నూనెతో దీపాలను వెలిగించడం మంచిది ఈరోజు అమ్మవారికి కుంకుమార్చన చేయడం మంచిది.

కుంభ రాశి

కుంభరాశి వారికి ఈ రోజు మీకు మధ్యస్థ ఫలితాలున్నాయి. సన్నిహితులతో ఉత్సాహంగా గడుపుతారు. కొన్ని పనులు అప్రయత్నంగా పూర్తికాగలవు. వృత్తి ఉద్యోగాల్లో గత సమస్యలు పరిష్కారాలు దొరుకుతాయి. కుటుంబంలో సంయమనం అవసరం. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలేర్పడతాయి. ఆర్థిక అవసరాలపట్ల ముందు జాగ్రత్తలు తప్పనిసరి. మరింత శుభఫలితాలు పొందాలంటే విఘ్నేశ్వరుని పూజించాలి. సంకట నాశన గణపతి స్తోత్రం పఠించాలి. వినాయకుడి ఆలయంలో నువ్వులతో నూనెతో దీపాలను వెలిగించడం మంచిది.

మీన రాశి

మీన రాశి వారికి ఈ రోజు మీకు చెడు ఫలితాలు అధికముగా ఉన్నాయి. వ్యక్తిగత, వృత్తిపర జీవితంలో సమంగా వ్యవహరించాలి. బంధుమిత్రులు, అధికారులు అసంతృప్తిగా ఉండు సూచనలున్నాయి. కుటుంబవ్యక్తుల సహకారము లభిస్తుంది. ఆర్థికంగా ముందు జాగ్రత్తలు తప్పనిసరి. ఆరోగ్యపరంగా జాగ్రత్తలు వహించాలి. అజాగ్రత్త వైఖరి లేకుండా జాగ్రత్తపడండి. మీనరాశి వారు మరింత శుభ ఫలితాలు పొందడం కోసం గురువారం దక్షిణామూర్తిని, దత్తాత్రేయుని పూజించడం మంచిది. బుణ విమోచన అంగారక స్తోత్రాన్ని పఠించండి. విఘ్నేశ్వరున్ని పూజించండి. రాహుకాల సమయంలో దుర్గాదేవిని పూజించండి.

బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ

మొబైల్‌ : 9494981000