నవంబర్ 21 : నేటి రాశి ఫలాలు.. ఈ రాశి వారికి సన్నిహితుల నుండి ఊహించని సాయం-today rasi phalalu check your astrological prediction for tuesday november 21st 2023 ,రాశి ఫలాలు న్యూస్
తెలుగు న్యూస్  /  రాశి ఫలాలు  /  నవంబర్ 21 : నేటి రాశి ఫలాలు.. ఈ రాశి వారికి సన్నిహితుల నుండి ఊహించని సాయం

నవంబర్ 21 : నేటి రాశి ఫలాలు.. ఈ రాశి వారికి సన్నిహితుల నుండి ఊహించని సాయం

HT Telugu Desk HT Telugu
Nov 21, 2023 04:05 AM IST

Today Horoscope : నేటి రాశి ఫలాలు తేదీ 21 నవంబరు 2023 మంగళవారం కోసం జ్యోతిష శాస్త్ర నిపుణులు బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ అందించారు. మేష రాశి నుంచి మీన రాశి వరకు నేటి దినఫలాలు ఇక్కడ తెలుసుకోండి.

నేటి రాశి ఫలాలు
నేటి రాశి ఫలాలు

తెలుగురాశి ఫలితములు (దిన ఫలితము) 21.11.2023, వారం: మంగళవారం, తిథి : నవమి నక్షత్రం : శతభిషం, మాసం : కార్తీకం, సంవత్సరం: శోభకృత్‌ నామ, అయనం: దక్షిణాయనం

మేష రాశి

మేష రాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంది. కొన్ని సమస్యలు ఓర్పుతో పరిష్కరించుకుంటారు. ఇంటి నిర్మాణ ప్రయత్నాలు చేస్తారు. ఆస్తుల విషయంలో ఒప్పందాలు చేసుకుంటారు. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. కొత్త భాగస్వాములతో అంగీకారానికి వస్తారు. ఉద్యోగాలలో పదోన్నతులు దక్కుతాయి. పారిశ్రామిక వర్గాలకు అనుకూలంగా ఉంటుంది. స్వల్ప అనారోగ్యం. ఆర్థిక విషయాల్లో గందరగోళం తొలగుతుంది. సుబ్రహ్మణ్యేశ్వరునికి అభిషేకం చేసుకోవడం మంచిది. సుబ్రహ్మణ్య అష్టకం పఠించండి. సుబ్రహ్మణ్యుని ఆలయంలో నువ్వుల నూనెతో దీపాలను వెలిగించాలి.

వృషభ రాశి

వృషభ రాశి వారికి ఈ రోజు అన్ని విధాలుగా అనుకూలంగా ఉన్నది. ఏ పని చేపట్టినా విజయవంతంగా పూర్తి చేస్తారు. ఆర్థిక పరంగా అనుకూలం. దీర్ఘకాలిక రుణబాధలు తొలగుతాయి. స్థిరాస్తి వివాదాలు పరిష్కారదశకు చేరతాయి. వాహనాలు, ఇళ్ళు కొనుగోలు చేస్తారు. వ్యాపారాలు అభివృద్ధి బాటలో సాగుతాయి. ఉద్యోగాలలో పనిభారం తగ్గి ఉత్సాహంగా గడుపుతారు. రాహుకాల సమయంలో అమ్మవారి వద్ద నువ్వుల నూనెతో దీపాలను వెలిగించడం మంచిది ఈరోజు అమ్మవారికి కుంకుమార్చన చేయడం మంచిది.

మిథున రాశి

మిథున రాశి వారికి ఈ రోజు మీకు మధ్యస్థముగా ఉన్నది. వ్యాపారపరంగా లాభదాయకం. కొత్త పనులు చేపట్టి సకాలంలో పూర్తి చేస్తారు. ఆర్థిక పరిస్థితి మెరుగుపడి ఉత్సాహంగా గడుపుతారు. ఒక మిత్రుని ద్వారా అందిన సమాచారం మీలో కొత్త ఆశలు నింపుతుంది. అనారోగ్య సమస్యలు. కుటుంబ సభ్యుల నుండి ఒత్తిడులు. ఉద్యోగాలలో బాధ్యతలు తగ్గుతాయి. రాజకీయవర్గాల వారికి కొన్ని హోదాలు దక్కవచ్చు. మరింత శుభఫలితాలు పొందాలంటే సుబ్రహ్మణ్యేశ్వరునికి అభిషేకం చేసుకోవడం మంచిది. సుబ్రహ్మణ్య అష్టకం పఠించండి. సుబ్రహ్మణ్యుని ఆలయంలో నువ్వుల నూనెతో దీపాలను వెలిగించాలి.

కర్కాటక రాశి

కర్కాటక రాశి వారికి ఈ రోజు మీకు మధ్యస్థ ఫలితాలున్నాయి. వ్యాపారాలు లాభిస్తాయి. విస్తరణ కార్యక్రమాలలో పురోగతి సాధిస్తారు. ఉద్యోగులకు అనూహ్యమైన మార్పులు ఉండవచ్చు. రాజకీయ వర్గాలకు అనుకూలం. బంధువులతో గొడవలు. విద్యార్థులకు శుభవార్తలు. ఇంటి నిర్మాణ ప్రయత్నాలు కలసివస్తాయి. మరింత శుభ ఫలితాలు పొందాలంటే బుణ విమోచన అంగారక స్తోత్రాన్ని పఠించండి. విఘ్నేశ్వరున్ని పూజించండి. రాహుకాల సమయంలో దుర్గాదేవిని పూజించండి.

సింహ రాశి

సింహ రాశి వారికి ఈ రోజు మీకు అన్ని విధాలుగా అనుకూల సమయం. వ్యాపారాలు మరింత లాభిస్తాయి. కొత్త భాగస్వాముల సహాయం అందుతుంది. ఆర్ధిక పరిస్థితి మరింత మెరుగుపడుతుంది. అనుకున్న పనులు అనుకున్న సమయానికి పూర్తి చేస్తారు. యుక్తితో సమస్యల నుండి బయటపడతారు. ఉద్యోగాలలో మీ ఉన్నతిని చాటుకుంటారు. కుటుంబముతో ఒత్తిడులు. ధనవ్యయం. మరింత శుభఫలితాలు పొందాలంటే సుబ్రహ్మణ్యేశ్వరునికి అభిషేకం చేసుకోవడం మంచిది. సుబ్రహ్మణ్య అష్టకం పఠించండి. సుబ్రహ్మణ్యుని ఆలయంలో నువ్వుల నూనెతో దీపాలను వెలిగించాలి.

కన్యా రాశి

కన్యా రాశి వారికి ఈ రోజు మీకు అంత అనుకూలంగా లేదు. స్థిరాస్తి వివాదాలు ఏర్పడి సతమతమవుతారు. గృహం, వాహనాలు కొనుగోలు ప్రయత్నాలు వాయిదా పడతాయి. వ్యాపారాలు మధ్యస్థంగా సాగుతాయి. ఉద్యోగాలలో మీరు ఆశించిన మార్పులు ఉండవచ్చు. స్వల్ప ఆరోగ్య సమస్యలు ఎదురైనా అధిగమిస్తారు. కొత్తగా చేపట్టిన పనులు ముందుకు సాగక ఇబ్బందిపడతారు. మరింత శుభఫలితాలు పొందాలంటే విఘ్నేశ్వరుని పూజించాలి. సంకటనాశన గణపతి స్తోత్రం పఠించాలి. వినాయకుడి ఆలయంలో నువ్వుల నూనెతో దీపాలను వెలిగించడం మంచిది.

తులా రాశి

తులా రాశి వారికి ఈరోజు మీకు అనుకూలంగా ఉన్నది. పట్టుదల, ధైర్యంతో కొన్ని వివాదాల నుంచి బయటపడతారు. నిరుద్యోగులు అనుకున్న ఉద్యోగాలు దక్కించుకుంటారు. శుభకార్యాల రీత్యా ఖర్చులు ఉండవచ్చు. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగాలలో ప్రతిభ చాటుకుంటారు. స్వల్ప అనారోగ్య సూచనలు. గృహ, వాహనయోగాలున్నాయి. మరింత శుభ ఫలితాలు పొందాలంటే బుణ విమోచన అంగారక స్తోత్రాన్ని పఠించండి. విఘ్నేశ్వరున్ని పూజించండి. రాహుకాల సమయంలో దుర్గాదేవిని పూజించండి.

వృశ్చిక రాశి

వృశ్చిక రాశి వారికి ఈ రోజు మీకు అనుకూల ఫలితాలున్నాయి. వాహనాలు, భూములు కొనుగోలు చేస్తారు. శుభకార్యాల గురించి కుటుంబంలో చర్చిస్తారు. విద్యార్థుల ప్రతిభ వెలుగులోకి వస్తుంది. వ్యాపారాలు మరింత వృద్ధి చెందుతాయి. పారిశ్రామిక వర్ణాల ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆరోగ్య సమస్యలు ఇబ్బందిపెట్టును. మరింత శుభఫలితాలు పొందాలంటే బుణ విమోచన అంగారక స్తోత్రాన్ని పఠించండి. విఘ్నేశ్వరున్ని పూజించండి. రాహుకాల సమయంలో దుర్గాదేవిని పూజించండి.

ధనూ రాశి

ధనూ రాశి వారికి ఈ రోజు మీకు అనుకూల ఫలితాలున్నాయి. కొత్త పనులు ప్రారంభిస్తారు. వాహనాలు కొనుగోలు చేస్తారు. విద్యార్థులు అనుకున్నది పట్టుదలతో సాధిస్తారు. ఆలయ దర్శనాలు చేసుకుంటారు. వ్యాపారాలు లాభదాయకంగా సాగుతాయి. ఉద్యోగాలలో మీ సమర్ధతను గుర్తిస్తారు. రాజకీయవర్గాలకు కొన్ని పదవులు లభించవచ్చు. అనార్యోగం కలుగును. మరింత శుభఫలితాలు పొందాలంటే సుబ్రహ్మణ్యేశ్వరునికి అభిషేకం చేసుకోవడం మంచిది. సుబ్రహ్మణ్య అష్టకం పఠించండి. సుబ్రహ్మణ్యుని ఆలయంలో నువ్వుల నూనెతో దీపాలను వెలిగించాలి.

మకర రాశి

మకర రాశివారికి ఈ రోజు మీకు మధ్యస్థం నుండి అనుకూల సమయం. సన్నిహితుల నుండి ఊహించని సాయం అందుతుంది. కొన్ని వివాదాల పరిష్కారానికి చొరవ తీసుకుంటారు. వ్యాపారాలలో అనుకున్న ప్రగతి కనిపిస్తుంది. ఉద్యోగాలలో ఒడిదుడుకులు, ఒత్తిడులు తొలగుతాయి. ముఖ్యమైన పనులు అనుకున్న సమయానికి పూర్తి చేస్తారు. పారిశ్రామికవర్గాలకు గతం కంటె మెరుగ్గా ఉంటుంది. ఆరోగ్య సమస్యలు. రాహు కాల సమయంలో అమ్మవారి వద్ద నువ్వుల నూనెతో దీపాలను వెలిగించడం మంచిది ఈరోజు అమ్మవారికి కుంకుమార్చన చేయడం మంచిది.

కుంభ రాశి

కుంభరాశి వారికి ఈ రోజు మీకు మధ్యస్థ ఫలితాలున్నాయి. సన్నిహితుల నుండి శుభవార్తలు వింటారు. వాహన, గృహ యోగాలు కలిగే సూచనలున్నాయి. విద్యార్థులు ఇంతకాలం పడిన శ్రమ ఫలిస్తుంది. నూతన ఉద్యోగ ప్రాప్తి. ఒక దీర్ఘకాలిక సమస్య పరిష్కారం. ఉద్యోగాలలో చికాకులు తొలగుతాయి. కళారంగం వారికి ఆశలు కొన్ని ఫలిస్తాయి. కొత్త రుణ ప్రయత్నాలు చేస్తారు. బంధువులతో సత్సంబంధాలు నెలకొంటాయి. మరింత శుభఫలితాలు పొందాలంటే విఘ్నేశ్వరుడిని పూజించాలి. సంకట నాశన గణపతి స్తోత్రం పఠించాలి. వినాయకుడి ఆలయంలో నువ్వుల నూనెతో దీపాలను వెలిగించడం మంచిది.

మీన రాశి

మీన రాశి వారికి ఈ రోజు మీకు మధ్యస్థముగా ఉన్నది. నిరుద్యోగులు, విద్యార్థులు ఉత్సాహంగా ముందడుగు వేస్తారు. ఇంటి నిర్మాణ ప్రయత్నాలలో అవాంతరాలు అధిగమిస్తారు. ఉద్యోగాలలో ఎటువంటి బాధ్యతనైనా పూర్తి చేస్తారు. వ్యవహారాలలో విజయం సాధిస్తారు. పారిశ్రామికవర్గాలకు కొత్త అనుమతులు లభించే వీలుంది. అనుకోని ధన వ్యయముండును. మీనరాశి వారు మరింత శుభ ఫలితాలు పొందడం కోసం గురువారం దక్షిణామూర్తిని, దత్తాత్రేయుని పూజించడం మంచిది. బుణ విమోచన అంగారక స్తోత్రాన్ని పఠించండి. విఘ్నేశ్వరున్ని పూజించండి. రాహుకాల సమయంలో దుర్గాదేవిని పూజించండి.

బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ, మొబైల్‌ : 9494981000
బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ, మొబైల్‌ : 9494981000