నవంబర్ 19 : నేటి రాశి ఫలాలు.. మీరు పనులు పూర్తయ్యేవరకూ బయటకు తెలియనివ్వకండి
Today Rasi Phalalu : నేటి రాశి ఫలాలు తేదీ 19 నవంబరు 2023 ఆదివారం కోసం జ్యోతిష శాస్త్ర నిపుణులు బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ అందించారు. మేష రాశి నుంచి మీన రాశి వరకు నేటి దినఫలాలు ఇక్కడ తెలుసుకోండి.
తెలుగురాశి ఫలితములు (దిన ఫలితము) 19. 11.2023, వారం: ఆదివారం, తిథి : షష్టి నక్షత్రం : శ్రవణం, మాసం : కార్తీకం, సంవత్సరం: శోభకృత్ నామ, అయనం: దక్షిణాయనం
ట్రెండింగ్ వార్తలు
మేష రాశి
మేష రాశి వారికి ఈ రోజు మీకు అనుకూల ఫలితాలున్నాయి. సన్నిహితుల నుండి శుభవార్తలు వింటారు. భాగస్వామ్య వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. రాజకీయ, పారిశ్రామిక రంగాలలోని వారు ప్రభుత్వపరంగా ఆహ్వానాలు అందుకుంటారు. చిన్ననాటి మిత్రులను కలసి ఆనందంగా గడుపుతారు. జీవిత భాగస్వామి సలహాతో నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. ఎంతటి కార్యాన్నైనా పట్టుదలతో సాధిస్తారు. మరింత శుభఫలితాలు పొందాలనుకుంటే ఆదివారం రోజు సూర్యాష్టకం పఠించడం, మహావిష్ణువును పూజించడం వల్ల మరింత శుభ ఫలితాలు కలుగుతాయి.
వృషభ రాశి
వృషభ రాశి వారికి ఈ రోజు మీకు మధ్యస్థంగా ఉన్నది. నూతన వ్యక్తులతో మిత్రత్వం ఏర్పరచుకుంటారు. మీ మాటకారితనంతో మీ పనులను సానుకూలపరచుకుంటారు. మీరు చేసే ప్రతి పనీ వివేకంతో కూడి ఉంటుంది. ఆర్థికంగా లోటు ఉండదు. అనేక విషయాలలో సంయమనం పాటిస్తారు. ఇతరుల ఒత్తిడికి తలొగ్గి మీకు ఇష్టం లేని ఒక పని చేయాల్సి వస్తుంది. ఉద్యోగంలో మీ స్థానం పదిలమవుతుంది. ఆదిత్య హృదయాన్ని పారాయణ చేయడం మంచిది. వృషభరాశివారు ఈరోజు క్రిష్టాష్టకం పఠించడం వల్ల వృషభరాశి వారికి మరింత శుభఫలితాలు కలుగుతాయి.
మిథున రాశి
మిథున రాశి వారికి ఈ రోజు మీకు మధ్యస్థముగా ఉన్నది. మీ మాటలను, అభిప్రాయాలను స్పష్టంగా తెలియచేస్తారు. వివాదాస్పద అంశాలను ప్రాథమిక దశలోనే సర్దుబాటు చేసుకుంటారు. మీకు రావల్సిన బిల్లులు సకాలంలో చేతికందుతాయి. తల్లిదండ్రులపట్ల, సోదర వర్గం పట్ల ప్రేమ కలిగి ఉంటారు. సాహసోపేతమైన పనులపట్ల ఆకర్షితులవుతారు. మిథునరాశివారు మరింత శుభఫలితాలు పొందాలనుకుంటే ఆదివారం రోజు సూర్యాష్టకం పఠించడం, మహావిష్ణువును పూజించడం వల్ల మరింత శుభఫలితాలు కలుగుతాయి.
కర్కాటక రాశి
కర్కాటక రాశి వారికి ఈ రోజు అంత అనుకూలంగా లేదు. వ్యాపార సంస్థలలోనికి వారికి అనుకూల సమయం. ఉద్యోగస్తుల ఉన్నతాధికారులతో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా వ్యవహరించాలి. ఇతరులతో సంభాషించేటప్పుడు స్వయంగా మీ భావాలను వారికి చెప్పండి. రాయబారాలు నడపకండి. మీ మాటలకు వక్రభాష్యాలు చెప్పేవారు ఎక్కువగా వుంటారు కనుక జాగ్రత్తలు పాటించండి. కర్కాటక రాశివారు మరింత శుభఫలితాలు పొందాలనుకుంటే నవగ్రహ పీడాహర స్తోత్రం పఠించాలి. అరుణం పఠించడం లేదా వినడం మంచిది.
సింహ రాశి
సింహ రాశి వారికి ఈరోజు మీకు మధ్యస్థ ఫలితాలున్నాయి. వ్యాపారపరంగా లాభాలున్నాయి. చెల్లింపులను సకాలంలో చెల్లిస్తారు. పని భారం వలన సమయం సరిపోదు. సంతాన విద్యా అవసరాలకు ఖర్చు చేస్తారు. మీ ఆలోచనలు కొంతవరకు కార్యరూపం సంతరించుకుంటాయి. వ్యక్తిగత అభివృద్ధి కోసం ఎక్కువగా శ్రమిస్తారు. సింహరాశివారికి మరింత శుభఫలితాలు పొందాలనుకుంటే ఆదిత్య హృదయాన్ని పారాయణ చేయాలి. నవగ్రహ పీడాహర స్తోత్రం పఠించడం మంచిది.
కన్యా రాశి
కన్యా రాశి వారికి ఈ రోజు మీకు అంత అనుకూలంగా లేదు. ఆర్థికంగా సర్దుబాట్లు చేయడం శక్తికి మించిన పని అవుతుంది. తక్కువ శ్రమతో మంచి ఫలితాలు సాధిస్తారు. మనసు పరిపరి విధాలుగా ఆలోచిస్తుంటుంది. ఈ ఆలోచనలకు మాత్రం తెరపడదు. ఉద్యోగస్తులకు చెప్పుకోదగిన మార్పులేవీ ఉండవు. వ్యాపారంలో మరిన్ని లాభాల కోసం ప్రయత్నిస్తారు. కుటుంబ పరిస్థితులపై దీర్ఘాలోచనలు సాగిస్తారు. మరింత శుభ ఫలితాలు పొందడం కోసం విష్ణు సహస్ర నామ పారాయణ చేయడం, ఆదిత్య హృదయం పారాయణ చేయడం మంచిది.
తులా రాశి
తులా రాశి వారికి ఈ రోజు అనుకూలంగా లేదు. నిర్మోహమాటమైన మీ వైఖరి వల్ల ఎదుటివారి మనస్సు నొచ్చుకుంటుంది. ఆర్థికపరమైన విషయాలలో కచ్చితంగా వ్యవహరిస్తారు. టెండర్లు, జాబ్‌వర్ములు, ఎగుమతి ఆర్డర్లు అనుకూలిస్తాయి. సమాచార సంబంధిత విషయాలను ఇతరులకు అప్పజెప్పనంతవరకు ఎటువంటి ఇబ్బంది ఏర్పడదు. చెక్కులు తీసుకునేటప్పుడు జాగ్రత్తలు వహించండి. అవి బౌన్స్ అయ్యే అవకాశాలున్నాయి. తులారాశివారు మరింత శుభ ఫలితాలు పొందాలనుకుంటే ఆదివారం రోజు నవగ్రహ పీడాహర స్తోత్రం పఠించడం మంచిది. ఆదిత్య హృదయం పారాయణ చేయడం వలన శుభఫలితాలు కలుగుతాయి.
వృశ్చిక రాశి
వృశ్చిక రాశి వారికి ఈ రోజు మీకు అంత అనుకూలంగా లేదు. మనలో తప్పు లేకపోతే ఎవరికీ తలవంచనవసరం ఉండదని భావిస్తారు. ప్రతికూల పరిస్థితులు ఉన్నప్పటికీ ధైర్యంగా ఉంటారు. కోర్టును ఆశ్రయించవలసిన పరిస్థితులు ఎదురవుతాయి. ఉన్న స్థానంలోని వారు మీ పట్ల అన్యాయంగా ప్రవర్తిస్తున్నారని భావిస్తారు. అపోహలు పెనుదుమారం లేపుతాయి. అందువల్ల ఈ విషయంలో జాగ్రత్తలు వహించండి. కార్యాలయాలలో అధికంగా శ్రమిస్తారు. వృశ్చిక రాశి వారు మరింత శుభఫలితాలు పొందాలనుకుంటే ఆదిత్య హృదయాన్ని పఠించడం, నవగ్రహా ఆలయాల్లో పూజలు వంటివి చేయడం వలన మరింత శుభఫలితాలు కలుగుతాయి.
ధనూ రాశి
ధనూ రాశి వారికి ఈరోజు అన్ని రంగాల్లోనివారు ఎంతో కొంత లబ్ధి పొందుతారు. పెద్దరికాన్ని కలిగి ఉంటారు. ప్రత్యర్థుల వ్యూహాన్ని తిప్పికొట్టగలుగుతారు. ప్రయాణాలు, సమాలోచనలు, శుభకార్య నిర్వహణ మొదలైన వ్యవహారాలను అనుకున్న విధంగా నిర్వహిస్తారు. ఆర్థిక స్థితిగతులు మెరుగ్గా ఉంటాయి. పనులు పూర్తి అయ్యేంతవరకు మీ మాటకు బయటకు వెళ్ళనివ్వకండి. సాంప్రదాయ కార్యక్రమాలను నిర్వహించడంతో ప్రత్యేకతను కనబరుస్తారు. ధనూరాశివారు మరింత శుభఫలితాలు పొందాలనుకుంటే సూర్యాష్టకాన్ని పఠించాలి. నవధాన్యాలను దానం ఇవ్వడం మంచిది. క్షీరాన్నాన్ని ఆలయాల్లో ప్రసాదంగా పంచడం మంచిది.
మకర రాశి
మకర రాశి వారికి ఈ రోజు మీకు మధ్యస్థంగా ఉన్నది. ఒకరికిచ్చిన మాటను నిలబెట్టుకుంటారు. రుణాలకు కొంతవరకు తీరుస్తారు. ఉన్నత విద్యా, ఉద్యోగ వ్యవహారాలు ఓ కొలిక్కి వస్తాయి. కోర్టు కేసులు వాయిదాలలో ఉంటాయి. మనస్సుకు సంతోషం కలిగించే విధంగా ఓ సంఘటన చోటు చేసుకుంటుంది. సెటిల్‌మెంట్ కార్యక్రమాలను నిర్వహిస్తారు. వ్యక్తిగత పురోభివృద్ధికి ఉపకరించే నిర్ణయాలు తీసుకుంటారు. ముఖ్యమైన పనులు సానుకూలపడతాయి. మకరరాశివారు మరింత శుభఫలితాలు పొందాలనుకుంటే నవగ్రహశాంతి చేసుకోవడం మంచిది. ఈ రోజు నవగ్రహ ఆలయాలను దర్శించడం మంచిది. సూర్యాష్టకాన్ని పఠించండి.
కుంభ రాశి
కుంభ రాశి వారికి ఈ రోజు మీకు మధ్యస్థ ఫలితాలున్నాయి. నూతన వ్యాపారాలు ప్రారంభిస్తారు. భాగస్వాములు, సన్నిహితులు తమ వంతు సహాయ సహకారాలు అందిస్తారు. విద్యా, సాహిత్య, కళారంగాల్లోని వారికి అనుకూలం. తక్కువ కాలంలో సాగే తాత్కాలిక వ్యాపారాలు లాభాల బాటలో ఉంటాయి. కీర్తిప్రతిష్టలు పెరుగుతాయి. నిర్మాణాత్మక కార్యక్రమాల్లో పురోభివృద్ధి గోచరిస్తుంది. మరింత శుభఫలితాలు పొందాలనుకుంటే ఆదిత్య హృదయాన్ని పారాయణం చేయాలి. నవగ్రహ పీడాహర స్తోత్రాన్ని పఠించండి. నువ్వులతో చేసిన ప్రసాదాన్ని ఆలయాల్లో పంచి పెట్టండి.
మీన రాశి
మీన రాశి వారికి ఈ రోజు మీకు అనుకూలంగా ఉన్నది. నూతన వస్తు, వస్తాభరణాలు కొనుగోలు చేస్తారు. బంధుత్వాలు మరింత బలపడతాయి. వృత్తి, ఉద్యోగాలపరంగా అనుకూలంగా ఉంటుంది. ఆర్థిక స్థితిగతులు మెరుగ్గా ఉంటాయి. మీ అభిరుచికి తగిన విధంగా గృహం కొనుగోలు చేస్తారు. ప్రయాణాల వల్ల అలసిపోతారు. రాజకీయరంగాల్లోని వారికి అనుకూలం. ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా వల్ల లాభపడతారు. నవగ్రహ స్తోత్రం పారాయణ చేయండి. విష్ణుసహస్రనామ పారాయణ చేయడం వలన శుభఫలితాలు కలుగును.