నవంబర్ 18 : నేటి రాశి ఫలాలు.. వీరికి ఈరోజు అనుకూలంగా లేదు
Today Horoscope Telugu : ఈరోజు రాశి ఫలాలు తేదీ 18 నవంబరు 2023 శనివారం కోసం జ్యోతిష శాస్త్ర నిపుణులు బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ అందించారు. మేష రాశి నుంచి మీన రాశి వరకు నేటి దినఫలాలు ఇక్కడ తెలుసుకోండి.
తెలుగురాశి ఫలితములు (దిన ఫలితము) 18. 11.2023, వారం: శనివారం, తిథి : పంచమి, నక్షత్రం : ఉత్తరాషాఢ, మాసం : కార్తీకం, సంవత్సరం: శోభకృత్ నామ, అయనం: దక్షిణాయనం
ట్రెండింగ్ వార్తలు
మేష రాశి
మేష రాశి వారికి ఈ రోజు మీకు మధ్యస్థముగా ఉన్నది. మీరు చేసే ప్రతి పనిలో వ్యతిరేక ఫలితాలు కలుగకుండా జాగ్రత్త అవసరం. వృత్తిలో ఇబ్బందులు అధిగమిస్తారు. నూతన కార్యాలు ప్రారంభించకుండా ఉంటే మంచిది. ఇతరులకు ఇబ్బందిని కలుగజేసే పనులను మానుకోవాల్సి వస్తుంది. మరింత శుభఫలితాల కోసం నవగ్రహ పీడాహర స్తోత్రాన్ని పఠించండి. వేంకటేశ్వరస్వామిని పూజించడం వేంకటేశ్వరస్వామి సుప్రభాతం వినడం చదవడం వలన శుభఫలితాలు కలుగుతాయి.
వృషభ రాశి
వృషభ రాశి వారికి ఈ రోజు మీకు అనుకూలంగా లేదు. శారీరకంగా బలహీనులవుతారు. విందులు, వినోదాల్లో పాల్గొంటారు. వృథా ప్రయాణాలెక్కువ చేస్తారు. బంధుమిత్రులతో భేదాభిప్రాయములు రాకుండా జాగ్రత్త వహించాలి. గౌరవ మర్యాదలకు లోటు ఉండదు. అనవసర వ్యయ ప్రయాసలుంటాయి. నవగ్రహ ఆలయ ప్రదక్షిణం చేయడం మంచిది. దశరథ ప్రోక్త శని స్తోత్రాన్ని పఠించాలి. శనికి తైలాభిషేకం చేసుకోవడం మంచిది.
మిథున రాశి
మిథున రాశి వారికి ఈ రోజు మీకు అంత అనుకూలంగా లేదు. కోపాన్ని అదుపులో ఉంచుకోవాలని సూచన. కుటుంబ విషయాలు సంతృప్తికరంగా ఉండదు. వృథా ప్రయాణాలెక్కువవుతాయి. ధనవ్యయం తప్పదు. మానసిక ఆందోళనను తొలగించుటకు దైవధ్యానం అవసరం. శారీరక అనారోగ్యంతో బాధపడతారు. శనికి తైలాభిషేకం చేసుకోవడం మంచిది. దశరథ ప్రోక్త శని స్తోత్రాన్ని పఠించాలి. లింగాష్టకాన్ని పఠించండి.
కర్కాటక రాశి
కర్కాటక రాశి వారికి ఈ రోజు మీకు అనుకూల ఫలితాలున్నాయి. ముఖ్యమైన వ్యక్తులను కలుస్తారు. అన్ని రంగాల్లో అద్భుత విజయాలను సాధిస్తారు. నూతన కార్యాలను ప్రారంభిస్తారు. రుణవిముక్తి లభిస్తుంది. మానసికంగా ఆనందముగా ఉంటారు. ఆకస్మిక ధనలాభముంటుంది. నూతన వస్తు, ఆభరణాలు కొనుగోలు చేస్తారు. దశరథ ప్రోక్త శని స్తోత్రాన్ని పఠించాలి. నవగ్రహ ఆలయాలలో శనికి తైలాభిషేకం చేయించి నవగ్రహలకు ప్రదక్షిణం చేయడం వల్ల శుభఫలితాలు కలుగుతాయి.
సింహ రాశి
సింహరాశి వారికి ఈ రోజు మీకు అనుకూలంగా ఉన్నది. సంపూర్ణ ఆరోగ్యవంతులుగా ఉంటారు. ఇతరులకు ఉపకరించే సనులు చేపడతారు. గౌరవమర్యాదలు లభిస్తాయి. శుభవార్తలు వింటారు. రాజకీయ వ్యవహారాల్లో దిగ్విజయం పొందుతారు. మీరు చేసే ప్రతీ పని సత్ఫలితాలనిచ్చును. నవగ్రహ పీడాహర స్తోత్రాన్ని పఠించండి. వేంకటేశ్వరస్వామిని పూజించడం వేంకటేశ్వరస్వామి సుప్రభాతం వినడం చదవడం వలన శుభ ఫలితాలు కలుగుతాయి.
కన్యా రాశి
కన్యారాశి వారికి ఈ రోజు మీకు అనుకూలంగా లేదు. సంఘంలో అప్రతిష్ట రాకుండా జాగ్రత్తపడుట మంచిది. నూతన వ్యక్తులను నమ్మి మోసపోరాదు. ప్రయత్న కార్యాలకు ఆటంకాలెదురవడంతో ఇబ్బందిపడతారు. దైవదర్శనానికి ప్రయత్నిస్తారు. రుణ ప్రయత్నాలు ఆలస్యంగా ఫలిస్తాయి. సోదర వైరం కలిగే అవకాశం ఉంటుంది. నవగ్రహ ఆలయ ప్రదక్షిణం చేయడం మంచిది. దశరథ ప్రోక్త శని స్తోత్రాన్ని పఠించాలి. శనికి తైలాభిషేకం చేసుకోవడం మంచిది.
తులా రాశి
తులా రాశి వారికి ఈరోజు మీకు అనుకూలంగా ఉన్నది. కుటుంబముతో ఆనందముగా, ఆహ్లాదముగా గడుపుతారు. విద్యార్థులు విజయాన్ని సాధిస్తారు. మీరు చేసే ప్రతి పని కలసివచ్చును. గృహంలో జరిగే మార్పులు సంతృప్తినిస్తాయి. బంధు, మిత్రులతో కలుస్తారు. ప్రయాణాలు లాభదాయకంగా ఉంటాయి. శనికి తైలాభిషేకం చేసుకోవడం మంచిది. దశరథ ప్రోక్త శని స్తోత్రాన్ని పఠించాలి. లింగాష్టకాన్ని పఠించండి.
వృశ్చిక రాశి
వృశ్చిక రాశికి ఈ రోజు మీకు మధ్యస్థంగా ఉన్నది. వృథా ప్రయాణాలెక్కువ చేస్తారు. వ్యాపారరంగంలో లాభాలుంటాయి. రుణప్రయత్నాలు చేయవలసి వస్తుంది. నూతన కార్యాలకు శ్రీకారం చుడతారు. బంధుమిత్రుల సహకారం ఆలస్యంగా లభిస్తుంది. దశరథ ప్రోక్త శని స్తోత్రాన్ని పఠించాలి. నవగ్రహ ఆలయాలలో శనికి తైలాభిషేకం చేయించి నవగ్రహలకు ప్రదక్షిణం చేయడం వల్ల శుభఫలితాలు కలుగుతాయి.
ధనూ రాశి
ధనూ రాశి వారికి ఈరోజు మీకు అనుకూలంగా లేదు. ఆకస్మిక ధననష్టమేర్పడే అవకాశం ఉంటుంది. బంధుమిత్రులతో భేదాభిప్రాయములు కలుగకుండా జాగ్రత్త వహించాలి. అనారోగ్య బాధలు అధికమవుతాయి. విదేశీయాన ప్రయత్నాలు అనుకూలిస్తాయి. అనవసర వ్యయప్రయాసలుంటాయి. ప్రయాణాలెక్కువ చేస్తారు. వేంకటేశ్వరస్వామిని పూజించడం వేంకటేశ్వరస్వామి సుప్రభాతం వినడం చదవడం వలన శుభఫలితాలు కలుగుతాయి.
మకర రాశి
మకర రాశి వారికి ఈ రోజు మీకు అనుకూలంగా లేదు. అనారోగ్య బాధలను అధిగమిస్తారు. బంధు, మిత్రులతో వివాదాలేర్పడు సూచనలున్నాయి జాగ్రత్త. మానసికాందోళన అధికం అవుతుంది. అనవసర నిందలతో అపకీర్తి వస్తుంది. స్థిరమైన నిర్ణయాలు తీసుకోలేరు. నూతన కార్యాలకు ప్రణాళికలు వేస్తారు. నవగ్రహ ఆలయ ప్రదక్షిణం చేయడం మంచిది. దశరథ ప్రోక్త శని స్తోత్రాన్ని పఠించాలి. శనికి తైలాభిషేకం చేసుకోవడం మంచిది.
కుంభ రాశి
కుంభ రాశి వారికి ఈ రోజు మీకు అనుకూలంగా ఉంది. నూతన వస్తు, ఆభరణాలను ఖరీదు చేస్తారు. స్నేహితులను కలుస్తారు. ఇతరులకు మంచి సలహాలు, సూచనలు ఇస్తారు. సంఘంలో గౌరవం పెరుగుతుంది. ధైర్యసాహసాలతో కొన్ని పనులు పూర్తి చేస్తారు. శుభవార్తలు వింటారు. ఆర్థిక ఇబ్బందులు ఉండవు. శనికి తైలాభిషేకం చేసుకోవడం మంచిది. దశరథ ప్రోక్త శని స్తోత్రాన్ని పఠించాలి. లింగాష్టకాన్ని పఠించండి.
మీన రాశి
మీన రాశి వారికి ఈ రోజు మీకు అనుకూలంగా లేదు. స్త్రీలు చేసే వ్యవహారాల్లో సమస్యలెదురవుతాయి. ఆకస్మిక ధననష్టం ఏర్పడే అవకాశముంటుంది. రహస్య శత్రువులపట్ల జాగ్రత్తగా ఉండటం మంచిది. ఏ విషయంలోనూ నిరుత్సాహం పనికిరాదు. వృత్తిరీత్యా ఇబ్బందులను అధిగమిస్తారు. నవగ్రహ ఆలయాలలో శనికి తైలాభిషేకం చేయించి నవగ్రహలకు ప్రదక్షిణం చేయడం వల్ల శుభఫలితాలు కలుగుతాయి.