నవంబర్ 20 : నేటి రాశి ఫలాలు.. వీరు ఫోన్ సందేశాలను పట్టించుకోవద్దు
Today Rasi Phalalu : ఈరోజు రాశి ఫలాలు తేదీ 20 నవంబరు 2023 సోమవారం కోసం జ్యోతిష శాస్త్ర నిపుణులు బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ అందించారు. మేష రాశి నుంచి మీన రాశి వరకు నేటి దినఫలాలు ఇక్కడ తెలుసుకోండి.
తెలుగురాశి ఫలితములు (దిన ఫలితము) 20. 11.2023, వారం: సోమవారం, తిథి : అష్టమి నక్ష్మత్రం : ధనిష్ట, మాసం : కార్తీకం, సంవత్సరం: శోభకృత్ నామ, అయనం: దక్షిణాయనం
మేష రాశి
మేష రాశి వారికి ఈ రోజు మీకు మధ్యస్థ ఫలితాలుంటాయి. అవకాశాలను అందిపుచ్చుకుంటారు. ఒక సమస్య మీకు అనుకూలంగా పరిష్కారమవుతుంది. ఉత్సాహంగా గడుపుతారు. ఖర్చులు అధికం. కొత్త పరిచయాలు ఏర్పడతాయి. వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి. సకాలంలో పనులు పూర్తిచేస్తారు. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. దైవదీక్షలు స్వీకరిస్తారు. మేషరాశివారు ఈరోజు మరింత శుభఫలితాలు పొందాలనుకుంటే శివాష్టకం పఠించడం మంచిది. శివుడికి చెరుకురసంతో అభిషేకం చేయడం వలన ఉన్నత పదవులు మరియు ధనమును పొందెదరు.
వృషభ రాశి
వృషభ రాశి వారికి ఈరోజు మీకు అనుకూలంగా లేదు. ఖర్చులు నియంత్రించుకోవాలని సూచన. పట్టుదలతో ప్రయత్నాలు సాగిస్తారు. పనులు అస్తవ్యస్తంగా సాగుతాయి. వైద్యపరీక్షలు అవసరమవుతాయి. ఆప్తులకోసం విపరీతంగా ఖర్చు చేస్తారు. ఆలోచనల్లో మార్పు వస్తుంది. వేడుకకు హాజరవుతారు. విలువైన వస్తువులు జాగ్రత్త. చెడు వ్యసనాల జోలికి వెళ్లకూడదు. వృషభరాశివారు మరింత శుభఫలితాలు పొందాలనుకుంటే శివుడిని పంచామృతాలతో అభిషేకం చేసుకోవడం మంచిది. పంచాక్షరీ మంత్రంతో 108 సార్లు శివనామస్మరణ చేయడం శుభఫలితాలు కలుగుతాయి.
మిథున రాశి
మిథున రాశి వారికి ఈ రోజు మీకు అనుకూలంగా లేదు. విజ్ఞతను చాటుకుంటారు. ప్రముఖులతో పరిచయాలు బలపడతాయి. సభ్యత్వాలు స్వీకరిస్తారు. వ్యాపకాలు అధికమవుతాయి. బాధ్యతగా మెలగాలి. ప్రత్యర్థులతో జాగ్రత్త. నిదానంగా పనులు పూర్తిచేస్తారు. వివాహ ప్రయత్నాలు తీవ్రంగా సాగిస్తారు. ఆదాయానికి మించి ఖర్చులుంటాయి. ఫోన్ సందేశాలను పట్టించుకోవద్దు. మిథునరాశి వారికి మరింత శుభఫలితాలు కలగాలంటే శివుడిని తేనెతో అభిషేకం చేయడం మంచిది. శివాష్టకం పఠించండి. గోవులకు అరటిపళ్ళు తినిపించండి.
కర్కాటక రాశి
కర్కాటక రాశి వారికి ఈ రోజు మీకు అనుకూలంగా లేదు. వాయిదాపడిన పనులు పూర్తిచేస్తారు. ఆదాయం బాగుంటుంది. కొంత మొత్తం పొదుపు చేస్తారు. ఒక సమాచారం ఉత్సాహాన్నిస్తుంది. పత్రాలు, ఆహ్వానం అందుకుంటారు. మీ అభిప్రాయాలను స్పష్టంగా తెలియచేయండి. సంప్రదింపులకు అనుకూల సమయం. విశ్రాంతి లేకుండా శ్రమిస్తారు. ప్రముఖులతో పరిచయాలు బలపడతాయి. వస్తు యోగం, వాహన యోగం ఉన్నాయి. కర్కాటకరాశివారికి వారికి మరింత శుభఫలితాలు కలగాలంటే పాలతో శివుడిని అభిషేకం చేసుకోవడం మంచిది. శివారాధన మరియు పంచాక్షరీ జపం వలన శుభఫలితాలు కలుగుతాయి.
సింహ రాశి
సింహ రాశి వారికి ఈ రోజు మీకు అనుకూలంగా ఉంటుంది. మీ కష్టం వృథా కాదు. అవకాశాలను దక్కించుకుంటారు. పరిచయాలు ఉన్నతికి తోడ్పడతాయి. ఖర్చులు విపరీతంగా ఉంటాయి. పనులు చురుకుగా సాగుతాయి. ఆలోచనల్లో మార్పు వస్తుంది. సందర్భానికి తగ్గట్టుగా వ్యవహరిస్తారు. కుటుంబీకుల మధ్య కొత్త విషయాలు చర్చకు వస్తాయి. వేడుకకు సన్నాహాలు సాగిస్తారు. యోగ, ధార్మిక విషయాలపై ఆసక్తి పెరుగుతుంది. సింహరాశివారు మరింత శుభఫలితాలు పొందడానికి చెరుకురసంతో శివుడికి అభిషేకం చేసుకోవడం మంచిది.
కన్యా రాశి
కన్యా రాశి వారికి ఈ రోజు మీకు అనుకూలంగా లేదు. ధనలాభం, వాహనసౌఖ్యం ఉన్నాయి. పరిచయస్తుల రాకపోకలు అధికమవుతాయి. పరిచయం లేనివారితో జాగ్రత్త. వాగ్వివాదాలకు దిగవద్దు. ప్రణాళికాబద్దంగా పనులు పూర్తిచేస్తారు. మీదైన రంగంలో రాణిస్తారు. ప్రియతముల కలయిక ఉత్సాహాన్నిస్తుంది. దైవ, 'సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. కన్యారాశి వారికి మరింత శుభఫలితాలు కలగాలంటే పంచామృతాలతో శివుడిని అభిషేకం చేయాలి. శివ అష్టోత్తర శతనామావళి పఠించండి.
తులా రాశి
తులా రాశి వారికి ఈ రోజు మీకు అనుకూలంగా లేదు. ప్రతీ విషయంలో ఆచితూచి వ్యవహరించాలి. వ్యాపకాలు సృష్టించుకోవడం శ్రేయస్కరం. కుటుంబీకులు మిమ్మల్ని అర్థం చేసుకుంటారు. సంతాన విషయంలో శుభం జరుగుతుంది. ఆత్మీయులతో సంభాషిస్తారు. విలువైన వస్తువులు జాగ్రత్త. ఆకస్మిక ఖర్చులు చికాకు కలిగిస్తాయి. చిన్న విషయానికే ఆందోళన చెందుతారు. తులారాశి వారికి మరింత శుభఫలితాలు కలగాలంటే శివాష్టకం పఠించండి. ఈశ్వరుణ్ణి పళ్ళ రసాలతో అభిషేకం చేయడం మంచిది.
వృశ్చిక రాశి
వృశ్చిక రాశి వారికి ఈరోజు మీకు అంత అనుకూలంగా లేదు. పట్టుదలతో ప్రయత్నాలు సాగించండి. అవకాశాలు చేజారినా నిరుత్సాహపడవద్దు. మీ కృషి నిదానంగా ఫలిస్తుంది. ఖర్చులు అదుపులో ఉండవు. రాబడిపై దృష్టి పెడతారు. ఆప్తుల కలయిక ఉత్తేజాన్నిస్తుంది. కొత్త పనులకు శ్రీకారం చుడతారు. కీలకపత్రాలు అందుతాయి. పెద్దల ఆరోగ్యం ఆందోళన కలిగిస్తుంది. వృశ్చికరాశి వారికి మరింత శుభఫలితాలు కలగాలంటే పంచాక్షరీ మంత్రంతో 18 సార్లు శివనామస్మరణ చేయాలి. శివ అష్టోత్తర శతనామావళి పఠించండి.
ధనూ రాశి
ధనూ రాశి వారికి ఈరోజు మీకు అనుకూలించును. ఆప్తుల సాయంతో ఒక సమస్వ సద్దుమణుగుతుంది. ఆధ్యాత్మికత పెరుగుతంది. దైవదీక్షలు స్వీకరిస్తారు. మీ సమర్థతను చాటుకుంటారు. వాహనయోగం ఉంది. పనులు సకాలంలో పూర్తిచేస్తారు. పరిచయాలు బలపడతాయి. ఆర్భాటాలకు విపరీతంగా ఖర్చుచేస్తారు. ధనూరాశివారికి మరింత శుభఫలితాలు కలగాలంటే శివాష్టకాన్ని పఠించండి. బిల్వాష్టకము పఠించి శివారాధన చేయడం మంచిది.
మకర రాశి
మకర రాశి వారికి ఈరోజు మీకు అనుకూలంగా లేదు. వాయిదాపడిన పనులు పూర్తిచేస్తారు. మీ విషయాల్లో ఇతరుల జోక్యానికి తావివ్వరాదు. బంధుమిత్రుల రాకపోకలు అధికమవుతాయి. విలువైన వస్తువులు జాగ్రత్త. ఆరోగ్య విషయంలో జాగ్రత్త వహించాలి. గౌరవ ప్రతిష్టలు లభిస్తాయి. ఆర్థికంగా బాగుంటుంది. ఖర్చులు అధికమగును. మకరరాశివారు మరింత శుభఫలితాలు పొందాలనుకుంటే పంచామృతాలతో శివుడిని అభిషేకం చేసుకోవడం మంచిది. శివ అష్టోతర శతనామావళి పఠించండి.
కుంభ రాశి
కుంభ రాశి వారికి ఈరోజు మీకు మధ్యస్థ ఫలితాలున్నాయి. పనులు పూర్తిచేస్తారు. రావలసిన ధనం అందుతుంది. మానసికంగా అనందముగా గడుపుతారు. ఎవరినీ అతిగా నమ్మవద్దు. వివాదాలు పరిష్కరించుకుంటారు. ఇంటి విషయాలు పట్టించుకుంటారు. దైవ కార్యక్రమాల్లో పాల్గొంటారు. కుంభరాశి వారికి మరింత శుభఫలితాలు కలగాలంటే బిల్వాష్టకం పఠించండి. విశ్వనాథాష్టకం పఠించండి. పంచామృతాలతో శివుడిని అభిషేకం చేసుకోవడం వలన శుభఫలితాలు కలుగుతాయి.
మీన రాశి
మీన రాశి వారికి ఈ రోజు మీకు అనుకూల ఫలితాలున్నాయి. ఇతరుల విషయాల్లో జోక్యం వద్దు. కొత్త ప్రయత్నాలకు శ్రీకారం చుడతారు. ధనలాభం, వస్తప్రాప్తి ఉన్నాయి. ప్రతీ పనిలో విజయం సాధిస్తారు. పుణ్యక్షేత్రాలు దర్శిస్తారు. మీనరాశివారు మరింత శుభఫలితాలు పొందడానికి బిల్వ పత్రాలతో శివ అష్టోత్తర శతనామావళితో ఈశ్వరుణ్ణి పూజించండి. విశ్వనాథాష్టకం పఠించండి.