Today Rasi Phalalu: నేటి రాశి ఫలాలు.. ఈ రాశుల వారు ఖర్చులు నియంత్రించుకోవాలి-today rasi phalalu check horoscope predictions in telugu for wednes day may 31 2023 ,రాశి ఫలాలు న్యూస్
తెలుగు న్యూస్  /  రాశి ఫలాలు  /  Today Rasi Phalalu: నేటి రాశి ఫలాలు.. ఈ రాశుల వారు ఖర్చులు నియంత్రించుకోవాలి

Today Rasi Phalalu: నేటి రాశి ఫలాలు.. ఈ రాశుల వారు ఖర్చులు నియంత్రించుకోవాలి

HT Telugu Desk HT Telugu
May 31, 2023 01:01 AM IST

Today Rasi Phalalu: నేటి రాశి ఫలాలు (దిన ఫలితాలు) 31.05. 2023వ తేదీ బుధవారం కోసం పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ అందించారు.

నేటి రాశిఫలాలు
నేటి రాశిఫలాలు

Today Rasi Phalalu: నేటి రాశి ఫలాలు (దిన ఫలితాలు) 31.05. 2023వ తేదీ బుధవారం కోసం పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ అందించారు.

సంవత్సరం: శోభకృత నామ, అయనం: ఉత్తరాయనం, మాసం: జ్యేష్ఠం

వారం: బుధవారం, తిథి: శు. ఏకాదశి నక్షత్రం: చిత్త

మేషరాశి ఈరోజు ఫలాలు

ఈరోజు మేషరాశి ఫలాలు మధ్యస్తంగా ఉన్నవి. ఒత్తిళ్ళు అధికముగా ఉండును. ఉద్యోగస్తులకు, వ్యాపారస్తులకు పని ఒత్తిళ్ళు, రాజకీయ ఒత్తిళ్ళు అధికముగా ఉండును. ఆర్థిక విషయాలు అనుకూలించును. మేషరాశికి జన్మస్థానంలో బుధ, గురు, రాహువులు, వాక్‌ స్థానంలో రవి ప్రభావం చేత గొడవలకు దూరంగా ఉండాలని సూచన. పనుల యందు ఆటంకములు, చికాకులు కలుగును.

ఈరోజు మీరు మరింత శుభఫలితాలు పొందడం కోసం విఘ్నేశ్వరుడిని పూజించాలి. సంకట నాశన గణపతి స్తోత్రాన్ని, విఘ్నేశ్వర అష్టోత్తర శతనామావళిని పఠించాలి. అలాగే ఈ రోజు వినాయకుడికి అరటిపళ్ళు, కొబ్బరికాయ నివేదించాలి. బెల్లము నైవేద్యముగా సమర్చించాలి. తద్వారా మరింత శుభఫలితాలు కలుగుతాయి.

నేటి వృషభరాశి ఫలాలు

ఈ రోజు వృషభ రాశి జాతకులకు మధ్యస్థముగా ఉన్నది. ఖర్చులు నియంత్రించుకోవాలి. ఉద్యోగస్తులకు అనుకూలము. వ్యాపారస్తులకు మధ్యస్థ ఫలితాలు. స్త్రీలు కుటుంబ, ఆరోగ్య విషయాల్లో జాగ్రత్తలు వహించాలి. జన్మరాశి యందు రవి ప్రభావం చేత అనారోగ్య సూచనలు అధికము. వ్యయ స్థానము నందు బుధ, గురు, రాహువుల ప్రభావం చేత ఖర్చులు అధికముగా ఉండును.

ఈరోజు శ్రీకృష్ణున్ని పూజించాలి. కృష్ణాష్టకం పఠించడం వలన శుభఫలితాలు కలుగుతాయి. పాలతో చేసినటువంటి ప్రసాదాల్ని శ్రీకృష్ణునికి నైవేద్యముగా సమర్పించాలి.

మిథునరాశి ఈరోజు ఫలితాలు

మిథున రాశి జాతకులు ఈరోజు అనుకూలముగా ఉన్నది. అనుకున్న పనులు పూర్తి చేసెదరు. ముఖ్యమైన విషయాల కోసం ధనాన్ని సమయాన్ని కేటాయిస్తారు. శుభవార్త వింటారు. మిథున రాశి వారికి జన్మరాశి యందు శుక్రుడు, వాక్‌ స్థానము నందు కుజుని ప్రభావం చేత వివాదాలు ఏర్చడు సూచన. ధనాన్ని కొన్ని ముఖ్యమైన పనుల కోసం ఖర్చు చేసెదరు. బుధ, గురు, రాహువులు లాభములో సంచరించుటచేత మిథునరాశి వారికి కలసివచ్చును.

మహావిష్ణువును పూజించాలి. విష్ణు సహస్రనామపారాయణ చేయడం వల్ల శుభఫలితాలు కలుగుతాయి. విష్ణుమూర్తికి సంబంధించిన ఆలయాల్లో అర్చన వంటివి చేయించుకోవడం అలాగే ఆలయదర్శనం చేసుకోవడం వల్ల శుభఫలితాలు కలుగుతాయి.

ఈరోజు కర్కాటక రాశి ఫలాలు

ఈరోజు కర్కాటక రాశి వారికి అనుకూలముగా ఉన్నది. ఖర్చులు అధికమగును. జన్మరాశియందు కుజుని ప్రభావంచేత శారీరక శ్రమ అధికముగా ఉండును. అయినప్పటికి లాభస్థానమునందు రవి, దశమ స్థానమునందు బుధ, గురు, రాహువుల ప్రభావంచేత వృత్తి ఉద్యోగ వ్యాపారాలు కలసివచ్చును. ఖర్చులు నియంత్రించుకోవాలని సూచన. అనుకున్న పనులు పూర్తి చేసెదరు. కుటుంబ విషయాల యందు జాగ్రత్త వహించాలి.

శుభ ఫలితాల కోసం వేంకటేశ్వర స్వామిని పూజించాలి. వెంకటేశ్వరస్వామి యొక్క అష్టోత్తర శతనామావళి పఠించండి. శ్రీ వెంకటేశ్వర సుప్రభాతం చదవడం వినడం వల్ల శుభఫలితాలు కలుగుతాయి.

సింహరాశి ఈరోజు ఫలాలు

ఈరోజు మీకు అనుకూలముగా ఉన్నది. ఉద్యోగస్తులకు, వ్యాపారస్తులకు అనుకూలమైన ఫలితాలు ఉన్నాయి. ప్రయాణాలు, కార్యక్రమాలు అనుకూలించును. ఉత్సాహముగా ఉండెదరు. లాభ స్థానములో శుక్రుడు దశమ స్థానములో రవి ప్రభావం చేత భాగ్య స్థానములో బుధ, గురు, రాహువుల ప్రభావం చేత సింహ రాశి వారికి చేసే ప్రతి పని అనుకూలించును. వృత్తి ఉద్యోగ వ్యాపారాలు కలసివచ్చును.

ఈరోజు మీరు మరింత శుభఫలితాలు పొందడం కోసం విఘ్నేశ్వరుని పూజించాలి. వినాయకుడికి అరటిపళ్ళు, కొబ్బరికాయ నివేదించడం, బెల్లమును నైవేద్యముగా సమర్చించడం వలన విఘ్నాలు తొలగి శుభఫలితాలు కలుగుతాయి.

కన్యారాశి నేటి రాశి ఫలాలు

ఈరోజు కన్యా రాశి జాతకులకు అనుకూలించును. వ్యాపారస్తులకు అనుకూలం. అనుకున్న పనులు అనుకున్న విధముగా పూర్తి చేసెదరు. ఖర్చులు నియంత్రించుకోవాలి. కుటుంబ విషయాలు అనుకూలించును. కన్యారాశి వారికి లాభస్థానములో కుజుడు, రాజ్యస్థానములో శుక్రుడు, భాగ్య స్థానములో రవి అనుకూల ప్రభావంచేత ధనలాభము, వస్తు లాభము, కీర్తి కలుగును.

ఈరోజు శ్రీకృష్ణున్ని పూజించాలి. పాలతో చేసినటువంటి ప్రసాదాల్ని శ్రీకృష్ణునికి నైవేద్యముగా సమర్చించాలి.

ఈరోజు తులారాశి రాశి ఫలితాలు

ఈరోజు మీకు మధ్యస్థము నుండి అనుకూల ప్రభావాలు ఉన్నాయి. రాజకీయ ప్రభావము ఉద్యోగస్తుల మీద అధికముగా ఉండును. వ్యాపారస్తులకు అనుకూల ఫలితములు. కళత్ర స్థానము నందు బుధ, గురు, రాహువుల ప్రభావం చేత కుటుంబము నందు సమస్యలు, వాదనలు అధికమగును. గొడవలకు దూరంగా ఉండాలని సూచన. ఉద్యోగంలో శ్రమ అధికముగా ఉండును. అష్టమ రవి ప్రభావం చేత ఉద్యోగంలో శ్రమ అధికముగా ఉండును. దశమంలో కుజుడు, భాగ్యములో శుక్రుని అనుకూల ప్రభావం చేత సమస్యలు అధిగమించి ముందుకు వెళతారు. స్త్రీలకు ఈరోజు మధ్యస్థ ఫలితాలున్నాయి.

మహా విష్ణువును పూజించాలి. విష్ణు సహస్రనామ పారాయణ చేయడం వల్ల శుభఫలితాలు కలుగుతాయి.

వృశ్చికరాశి ఈరోజు ఫలితాలు

వృశ్చిక రాశి వారికి ఈరోజు అంత అనుకూలముగా లేదు. పని ఒత్తిడి రాజకీయ ఒత్తిడి అధికముగా ఉండును. ఆరోగ్య విషయాల యందు కుటుంబ విషయాల యందు జాగ్రత్త వహించాలి. అష్టమ స్థానము నందు శుక్రుడు, కళత్ర స్థానమందు రవి ప్రభావంచేత ఆరోగ్య విషయాలయందు జాగ్రత్తలు వహించాలి.

వేంకటేశ్వరస్వామిని పూజించాలి. వెంకటేశ్వర స్వామి యొక్క అష్టోత్తర శతనామావళి పఠించండి. శ్రీ వెంకటేశ్వర సుప్రభాతం చదవడం వినడం వల్ల శుభఫలితాలు కలుగుతాయి.

నేటి ధనూరాశి ఫలాలు

ఈరోజు ధను రాశి జాతకులకు మధ్యస్థము నుండి చెడు ఫలితాలు ఉన్నాయి. ఉద్యోగస్తులకు మధ్యస్థ ఫలితము. వ్యాపారస్తులకు చెడు ఫలితముగా ఉన్నది. ధనూరాశి స్త్రీలు కుటుంబ వ్యవహారాల యందు జాగ్రత్తలు వహించాలి. విద్యార్థులకు ఈరోజు అనుకూలించును. ఈరోజు మీరు మరింత శుభఫలితాలు పొందడం కోసం విఘ్నేశ్వరుని పూజించాలి.

మకరరాశి నేటి రాశి ఫలాలు

ఈరోజు మకర రాశి వారికి మధ్యస్థము నుండి చెడు ఫలితాలు అధికముగా ఉన్నాయి. రాజకీయ ఒత్తిళ్ళు అధికముగా ఉండును. ఉద్యోగస్తులకు పని ఒత్తిడి అధికము. స్రీలు కుటుంబ విషయాల యందు జాగ్రత్తలు వహించాలి. అష్టమ కుజుని ప్రభావంచేత కుటుంబములో అనుకున్న పనులు పూర్తి చేసెదరు. ఈరోజు కృష్ణున్ని పూజించాలి. కృష్ణాష్టకం పఠించడం వలన శుభఫలితాలు కలుగుతాయి.

కుంభరాశి ఈరోజు రాశి ఫలాలు

ఈరోజు కుంభ రాశి జాతకులకు మధ్యస్థ ఫలితాలున్నాయి. ఉద్యోగస్తులకు అనుకూలించును. వ్యాపారస్తులకు మధ్యస్థ ఫలము. స్త్రీలకు ఈరోజు అనుకూలముగా ఉన్నది. విద్యార్థులకు మధ్యస్థ ఫలితాలున్నాయి. ఆరో స్థానము నందు కుజుడు, ఐదో స్థానము నందు శుక్రుడు, తృతీయ స్థానము నందు రాహువు అనుకూల స్థితి వలన అనుకున్న ప్రతీ పని అనుకున్న విధంగా పూర్తి చేసెదరు. మహావిష్ణువును పూజించాలి.

మీనరాశి నేటి రాశి ఫలాలు

మీన రాశి వారికి ఈరోజు అంత అనుకూలముగా లేదు. ఉద్యోగంలో పని ఒత్తిళ్ళు వ్యాపారంలో సమస్యలు అధికముగా ఉందును. స్త్రీలు ఈరోజు కుటుంబ విషయాల యందు జాగ్రత్తలు వహించాలి. ఏలినాటి శని ప్రభావం, వాక్‌ స్థానము నందు బుధ, గురు, రాహువుల ప్రభావంచేత వాదనలకు దూరంగా ఉండాలి. కుటుంబ సభ్యులతో ఉద్యోగ వ్యాపారాలయందు చర్చలకు, వివాదాలకు దూరంగా ఉండటం మంచిది. విద్యార్థులకు ఈరోజు మధ్యస్థ సమయము. వేెంకటేశ్వరస్వామిని పూజించాలి.

- బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ

మొబైల్‌ 9494981000