మార్చి 4, నేటి రాశి ఫలాలు.. ఈ రాశుల జాతకులు శివారాధన చేసి, బిల్వాష్టకం పఠించాలి
Today rasi phalalu: నేటి రాశి ఫలాలు (దిన ఫలాలు) తేదీ04.03.2024 సోమవారం కోసం పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ అందించారు. మేషరాశి నుంచి మీన రాశి వరకు12 రాశుల దిన ఫలాలు ఇక్కడ తెలుసుకోండి.
నేటి రాశి ఫలాలు (దిన ఫలాలు) 04.03. 2024
వారం: సోమవారం, తిథి : నవమి
నక్షత్రం : జ్యేష్ట మాసం : మాఘం,
సంవత్సరం: శోభకృత్ నామ, అయనం: ఉత్తరాయణం
మేష రాశి
మేష రాశి వారికి ఈ రోజు మీకు అనుకూలంగా ఉంది. నూతన వస్తువులు కొనుగోలు చేస్తారు. దూరప్రయాణాలు వాయిదాపడతాయి. ఖర్చుల నియంత్రణ అవసరం. ఆరోగ్యం అనుకూలించును. మంచి వ్యక్తులతో పరిచయాలేర్పడతాయి. మీ పలుకుబడితో పనులు నెరవేరుతాయి. మొండి బాకీలు వసూలవుతాయి. సోదరులతో భేదాభిప్రాయాలేర్పడే అవకాశాలున్నాయి. పెద్దల సూచనలు పాటించడం మంచిది. మేష రాశి వారు ఈరోజు మరింత శుభ ఫలితాలు పొందటం కోసం శివపంచాక్షరీ మంత్రంతో శివుడిని అభిషేకించడం, పూజించడం మంచిది.
వృషభ రాశి
వృషభ రాశి వారికి ఈరోజు మీకు అనుకూలంగా ఉంది. కుటుంబముతో ఆనందముగా గడుపుతారు. విద్యార్థులకు మంచి సమయం. పోటీ పరీక్షలో విజయం సాధిస్తారు. వ్యాపారస్తులకు కలసి వచ్చే సయయం. విందు, వినోదాల్లో పాల్గొంటారు. శత్రువులపై విజయం సాధిస్తారు. స్నేహితులతో అభిప్రాయ భేదాలు తలెత్తవచ్చు. విదేశీ విద్య ప్రయత్నాలు ముందుకు సాగుతాయి. చంద్రశేఖర అష్టకం పఠించడం మంచిది. శివాలయాన్ని దర్శించడం వల్ల ప్రశాంతత లభించును.
మిథున రాశి
నేటి రాశి ఫలాల ప్రకారం మిథున రాశి వారికి ఈ రోజు మధ్యస్థ ఫలితాలున్నాయి. వ్యాపారస్తులకు వ్యాపారంలో చికాకులుంటాయి. భాగస్వాములతో విభేదాలు రావచ్చు. ఆరోగ్యం అనుకూలించును. కొన్ని ప్రయత్నాలు తాత్కాలికంగా ఫలిస్తాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. కొత్త దుస్తులు కొనుగోలు చేస్తారు. ఒక శుభవార్త ఆనందాన్నిస్తుంది. ఉద్యోగస్తులకు ఒత్తిడి పెరుగును. మిథున రాశివారు మరింత శుభఫలితాలు పొందటం కోసం శివాలయాన్ని దర్శించి పుణ్యనదీ (గంగ, గోదావరి, కృష్ణ, కావేరీ) జలాలతో అభిషేకం చేయటం మంచిది.
కర్కాటక రాశి
కర్కాటక రాశి వారికి ఈ రోజు మీకు మధ్యస్థ ఫలితాలున్నాయి. ఉద్యోగులకు మంచి అవకాశాలుంటాయి. పలుకుబడితో పనులు నెరవేరతాయి. ఖర్చులుంటాయి. శుభకార్య ప్రయత్నాలు ముందుకు సాగుతాయి. ఉపాధ్యాయ, వైద్య, న్యాయవాద వృత్తిలో ఉన్నవారికి అనుకూలం. దూర ప్రయాణాలు వాయిదా వేసుకోవటం మంచిది. వ్యాపారపరంగా అనుకూలం సమయం. కొత్త పరిచయాలతో కార్యసిద్ధి ఉంటుంది. బిల్వపత్రాలతో శివుడిని పూజించండి. బిల్వాష్టకం పఠించడం మంచిది.
సింహ రాశి
సింహ రాశి వారికి ఈ రోజు మీకు అనుకూలంగా ఉంది. ఉద్యోగులకు పదోన్నతి. సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. పెద్దల సూచనలు పాటించటం మంచిది. వృథా ప్రసంగాలకు దూరంగా ఉండాలి. శుభకార్య ప్రయత్నాలు సాగుతాయి. విద్యార్థులకు మంచి సమయం. సకాలంలో డబ్బు అందుతుంది. ఆరోగ్యపరంగా అనుకూలం. ఆర్థికంగా మంచి కాలం. సింహరాశివారు మరింత శుభఫలితాలు పొందటం కోసం సూర్యనారాయణ మూర్తికి తర్పణాలు వదలండి. లింగాష్టకాన్ని పఠించండి.
కన్యా రాశి
నేటి రాశి ఫలాల ప్రకారం కన్యా రాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉన్నది. రోజువారీ వ్యాపారస్తులకు మధ్యస్థ సమయం. ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. రాజకీయ, కోర్టు వ్యవహారాల్లో అంత అనుకూలంగా లేదు. స్నేహితులు, బంధువులతో సఖ్యత పెరుగుతుంది. వాహనం కొనుగోలు చేస్తారు. రియల్ ఎస్టేట్, నిర్మాణ రంగంలో ఉన్నవారికి మంచి సమయం. విద్యార్థులు మంచి ఫలితాలు సాధిస్తారు. ఆరోగ్యం విషయంలో జాగ్రత్త అవసరం. పంచామృతాలతో శివాభిషేకం చేసుకోవడం మంచిది. శివపురాణం పఠించండి.
తులా రాశి
తులా రాశి వారికి ఈ రోజు మీకు అనుకూలంగా లేదు. సమయానికి ధనం అందకపోవటం వల్ల సమస్యలు ఎదురవుతాయి. కోర్టు పనులు కలసివస్తాయి. రాజకీయ వ్యవహారాల్లో ఇబ్బందులుంటాయి. ఉద్యోగులకు ప్రభుత్వ గుర్తింపు లభిస్తుంది. నిరుద్యోగులకు మధ్యస్థం. శుభకార్య ప్రయత్నాలు ఫలిస్తాయి. తీర్థయాత్రలు చేస్తారు. ఆరోగ్యం అనుకూలించును. తులా రాశి వారు మరింత శుభఫలితాలు పొందటం కోసం శివాష్టకం పఠించండి. శివాలయంలో ప్రదక్షిణలు చేయటం, శివారాధన మంచిది.
వృశ్చిక రాశి
వృశ్చిక రాశి వారికి ఈరోజు మీకు అనుకూలంగా లేదు. పలుకుబడి కలిగిన వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి. విలువైన వస్తువుల విషయంలో జాగ్రత్త అవసరం. కుటుంబ సభ్యులతో అభిప్రాయ భేదాలు రావచ్చు. ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు అవసరం. శుభవార్త వింటారు. శుభకార్య ప్రయత్నాల్లో ఆటంకాలు ఎదురవుతాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటారు. రోజువారీ పనులు ఆలస్యంగా సాగుతాయి. అన్ని విషయాల్లో సహనం అవసరం. వృశ్చికరాశివారు మరింత శుభఫలితాలు పొందటం కోసం పంచాక్షరీ మంత్రం 108 సార్లు శివనామస్మరణ చేయాలి. శివ అష్టోత్తర శతనామావళి పఠించండి.
ధనూ రాశి
ధనూ రాశి వారికి ఈరోజు మీకు మధ్యస్థ ఫలితాలున్నాయి. ఉద్యోగస్తుల ప్రయత్నాలు ఫలిస్తాయి. వ్యాపారస్తులకు కలసి వచ్చే సమయం. భాగస్వాములతో సఖ్యత ఏర్పడుతుంది. శ్రమకు మించిన ఫలితాలు అందుతాయి. మంచి వ్యక్తులతో పరిచయం ఏర్పడుతుంది. మానసికంగా ప్రశాంతంగా ఉంటారు. కళాకారులకు కొత్త అవకాశాలొస్తాయి. ఆర్థిక సమస్యలు దూరమవుతాయి. ధనూ రాశి వారు మరింత శుభఫలితాలు పొందటం కోసం శివారాధన చేయాలి. బిల్వాష్టకము పఠించటం మంచిది.
మకర రాశి
మకర రాశి వారికి ఈరోజు మీకు మధ్యస్థ ఫలితాలుంటాయి. కుటుంబముతో ఆనందముగా గడుపుతారు. ప్రయాణాలు వాయిదా వేసుకోవటం మంచిది. ఉత్సాహంగా ఉంటారు. డబ్బు చేతికి అందుతుది. రోజువారీ పనులు సవ్యంగా సాగుతాయి. నిర్మాణ రంగంలో ఉన్నవారికి కలసి వస్తుంది. నలుగురికి ఉపయోగపడే పనులు చేస్తారు. ఖర్చుల నియంత్రణ అవసరం. తలపెట్టిన పనుల్లో ఆటంకాలు ఎదురవుతాయి. పనిభారం ఉటుంది. పంచామృతాలతో శివుడిని అభిషేకం చేసుకోవడం మంచిది. శివ అష్టోతర శతనామావళి పఠించండి.
కుంభ రాశి
కుంభ రాశి వారికి ఈరోజు మీకు అనుకూలంగా లేదు. పనిభారంతో అలసట పెరుగుతుంది. ఉత్సాహంతో పనులు చేస్తారు. కొత్త వ్యక్తుల పరిచయాలతో ఖర్చులు పెరుగుతాయి. అనుకోని ఖర్చులు ముందుకు వస్తాయి. సమాజంలో గుర్తింపు లభిస్తుంది. పలుకుబడితో కొన్ని పనులు నెరవేరతాయి. వ్యాపారం లాభసాటిగా ఉంటుంది. పెద్దల సహకారం లభిస్తుంది. ఆరోగ్యంగా ఉంటారు. భక్తి పెరుగుతుంది. బిల్వాష్టకం పఠించండి. శివారాధన చేయండి.
మీన రాశి
మీన రాశి వారికి ఈ రోజు మీకు అనుకూలంగా లేదు. వ్యాపార విస్తరణపై దృష్టి పెడతారు. కొత్త వస్తువులు కొనుగోలు చేస్తారు. కోర్టు కేసులలో అనుకూల ఫలితాలుంటాయి. గృహ నిర్మాణం చేపడతారు. తొందరపాటు నిర్ణయాలతో పనులలో ఆలస్యం జరగవచ్చు. కుటుంబంలో వాతావరణం అనుకూలంగా ఉంటుంది. వివాదాలకు దూరంగా ఉండండి. ప్రయాణాలు కలసివస్తాయి. బిల్వ పత్రాలతో శివ అష్టోత్తర శతనామావళితో ఈశ్వరుడిని పూజించండి. విశ్వనాథాష్టకం పఠించండి.
బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ
మొబైల్ : 9494981000