నవంబర్ 15 : నేటి రాశి ఫలాలు.. ఈ రాశివారికి శత్రువులు పెరుగును
Today Horoscope : ఈరోజు రాశి ఫలాలు తేదీ 15.11.2023 బుధవారం కోసం జ్యోతిష శాస్త్ర నిపుణులు బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ అందించారు. మేష రాశి నుంచి మీన రాశి వరకు దిన ఫలాలు ఇక్కడ చూడండి.
తెలుగురాశి ఫలితములు (దిన ఫలితము) 15. 11.2023, వారం: బుధవారం, తిథి : విదియ, నక్షత్రం : జ్యేష్ట, మాసం : కార్తీకం, సంవత్సరం: శోభకృత్ నామ, అయనం: దక్షిణాయనం
మేష రాశి
మేష రాశి వారికి ఈ రోజు మీకు అన్ని విధాలుగా అనుకూలంగా ఉన్నది. గతంలో బాధలు తొలగి వరుస విజయాలు సొంతమవుతాయి. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలలో అభివృద్ధి ఉంటుంది. అయితే అధికారులతో చికాకులు, నిందలు పడవలసి వస్తుంది. కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. వినాయకుడిని పూజించడం, సంకటనాశన గణపతి స్తోత్రాన్ని పఠించడం, విఘ్నేః గర అష్టోత్తర శతనామావళి పఠించడం వంటివి చేయాలి. ఈరోజు వినాయకుడికి అరటిపళ్ళు, కొబ్బరికాయ నివేదించడం, బెల్లమును నైవేద్యముగా సమర్పించడం వలన విఘ్నాలు తొలగి శుభఫలితాలు కలుగుతాయి.
వృషభ రాశి
వృషభ రాశి వారికి ఈరోజు మీకు అనుకూలంగా లేదు. మానసిక అశాంతి, సంతానమునకు, తల్లిదండ్రులకు కష్టమైన కాలము. చేపట్టిన పనులు పూర్తి చేయలేరు. ధనవ్యయం కలుగును. ధనాదాయం బాగుండును. అపనిందలు బాధిస్తాయి. ఆరోగ్య విషయాల్లో జాగ్రత్తలు వహించాలి. భగవద్గీత వినడం, చదవడం వల్ల, కృష్ణాష్టకం పఠించడం వలన శుభఫలితాలు కలుగుతాయి. పాలతో చేసినటువంటి ప్రసాదాల్ని శ్రీకృష్ణునికి నైవేద్యముగా సమర్పించాలి.
మిథున రాశి
మిథున రాశి వారికి ఈ రోజు మీకు అనుకూలంగా లేదు. శారీరక, మానసిక ఇబ్బందులు కలుగను. అనారోగ్య సమస్యలేర్పడును. వస్తు లాభములు కలుగును. విద్యార్థులకు కష్టపడాల్సినటువంటి సమయం. స్త్రీలకు చెడు సమయం. వ్యాపారస్తులకు మధ్యస్థముగా ఉండును. రైతులు, సినీరంగం వారికి మధ్యస్థ ఫలితములు ఉన్నవి. రాజకీయ నాయకులకు ఈ సంవత్సరం అనుకూలముగా లేదు. విష్ణు సహస్రనామపారాయణ చేయడం, విష్ణుమూర్తికి సంబంధించిన ఆలయాల్లో అర్చన వంటివి చేయించుకోవడం వల్ల శుభఫలితాలు కలుగుతాయి. మహావిష్ణువు యొక్క అష్టోత్తర శతనామావళి పఠించండి.
కర్కాటక రాశి
కర్కాటక రాశి వారికి ఈ రోజు అంత అనుకూలంగా లేదు. సోదరులకు, సంతానమునకు చెడు కాలము. ఉత్సాహంతో ముందుకు సాగుతారు. ఆర్థిక విషయాలలో ముందడుగు వేస్తారు. ఆరోగ్య విషయములందు జాగ్రత్త వహించవలెను. వ్యాపారస్తులకు ఈ సంవత్సరం మధ్యస్థముగా ఉండును. వెంకటేశ్వరస్వామిని పూజించాలి. వెంకటేశ్వరస్వామి యొక్క అష్టోత్తర శతనామావళి పఠించండి. శ్రీ వెంకటేశ్వర సుప్రభాతం చదవడం వినడం వల్ల శుభఫలితాలు కలుగుతాయి.
సింహ రాశి
సింహ రాశి వారికి ఈ రోజు మీకు అనుకూలంగా లేదు. బంధుమిత్రులతో గొడవలు, అనవసర ప్రయాణాలు, ధనము, కీర్తి నష్టములు కలుగును. మోసపోతారు. వినాయకుడిని పూజించడం, సంకటనాశన గణపతి స్తోత్రాన్ని పఠించడం, గణపతి అష్టోత్తర శతనామావళి పఠించడం వంటివి చేయడం వలన మరింత శుభఫలితాలు కలుగుతాయి.
కన్యా రాశి
కన్యా రాశి వారికి ఈ రోజు మీకు మధ్యస్థ ఫలితములు ఉన్నవి. దూర ప్రయాణములు, అకాల భోజనములు, పరస్త్రీ సంగమము. ధన నష్టము కలుగును. ధనప్రాప్తి, బంధు వైరములు కలుగును. శ్రీకృష్ణుడిని పూజించాలి. కృష్ణాష్టకం పఠించాలి. పాలతో చేసినటువంటి ప్రసాదాల్ని శ్రీకృష్ణునికి నైవేద్యముగా సమర్పించాలి. భగవద్గీత వినడం చదవడం వల్ల శుభఫలితాలు కలుగుతాయి.
తులా రాశి
తులా రాశి వారికి ఈ రోజు మీకు అనుకూలంగా లేదు. అనుకున్న పనులు జరగవు. కుటుంబము నందు చికాకులు, అకాల భోజనములు, మిత్రులతో విరోధము. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలందు ప్రతికూలముగా ఉండును. విష్ణు సహస్రనామపారాయణ చేయడం, విష్ణుమూర్తికి సంబంధించిన ఆలయాల్లో అర్చన వంటివి చేయించుకోవడం అలాగే ఆలయదర్శనం చేసుకోవడం వల్ల శుభఫలితాలు కలుగుతాయి. మహావిష్ణువు యొక్క అష్టోత్తర శతనామావళి పఠించండి.
వృశ్చిక రాశి
వృశ్చిక రాశి వారికి ఈరోజు మీకు ఇంటినందు విందులు, శుభకార్యములు, కుటుంబమునందు శాంతి కలుగును. సంతానం కారణంగా సంతోషము. వృత్తి ఉద్యోగ, వ్యాపారములయందు అభివృద్ధి కలుగును. వెంకటేశ్వరస్వామి యొక్క అష్టోత్తర శతనామావళి పఠించండి. శ్రీ వెంకటేశ్వర సుప్రభాతం చదవడం వినడం వల్ల శుభఫలితాలు కలుగుతాయి.
ధనూ రాశి
ధనూ రాశి వారికి ఈరోజు మీకు అనుకూల ఫలితాలుంటాయి. బంధుమిత్రులతో కలిసి ఉంటారు. ఆర్థిక లాభములు ఉండును. చేయు పనులు పూర్తియగును. నూతన, వస్తు, వస్త, ధన, ధాన్య లాభములు కలుగును. వినాయకుని పూజించడం, సంకటనాశన గణపతి స్తోత్రాన్ని పఠించడం, వినాయక అష్టోత్తర శతనామావళి పఠించడం వంటివి చేయడం వలన మరింత శుభఫలితాలు కలుగుతాయి.
మకర రాశి
మకర రాశి వారికి ఈరోజు మీకు అనుకూలంగా లేదు. కీర్తి ప్రతిష్టలు దెబ్బతింటాయి. పెద్దల దీవెనలు పొందితే చికాకులు తొలగును. బంధు వియోగము. శత్రువులు పెరుగును. పాలతో చేసినటువంటి ప్రసాదాల్ని శ్రీకృష్ణునికి నైవేద్యముగా సమర్పించాలి. భగవద్గీత వినడం చదవడం వల్ల శుభఫలితాలు కలుగుతాయి.
కుంభ రాశి
కుంభ రాశి వారికి ఈరోజు మీకు మధ్యస్థముగా ఉన్నది. కష్టాలు తొలగి కోరికలు నెరవేరుతాయి. బంధుమిత్రులు సహాయ సహకారాలు అందిస్తారు. సంతాన మూలంగా చికాకులు. ఆర్థికాభివృద్ధి కలుగును. విష్ణు సహస్రనామ పారాయణ చేయడం, విష్ణుమూర్తికి సంబంధించిన ఆలయాల్లో అర్చన వంటివి చేయించుకోవడం అలాగే ఆలయదర్శనం చేసుకోవడం వల్ల శుభఫలితాలు కలుగుతాయి. మహావిష్ణువు యొక్క అష్టోత్తర శతనామావళి పఠించండి.
మీన రాశి
మీన రాశి వారికి ఈ రోజు మీకు అనుకూలంగా లేదు. గృహమునందు శుభకార్యములు జరుగును, పనులకు ఆటంకములు కలుగును. తీవ్ర కష్టనష్టాలకు లోనవుతారు. వెంకటేశ్వరస్వామిని పూజించాలి. వెంకటేశ్వరస్వామి యొక్క అష్టోత్తర శతనామావళి పఠించండి. శ్రీ వెంకటేశ్వర సుప్రభాతం చదవడం వినడం వల్ల శుభఫలితాలు కలుగుతాయి.