అక్టోబర్ 27, నేటి రాశి ఫలాలు- భూ వివాదాల నుంచి బయటపడతారు, ఆసక్తికర సమాచారం వింటారు
Today rasi phalalu: నేటి రాశి ఫలాలు (దిన ఫలాలు) తేదీ27.10.2024 ఆదివారం కోసం పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ అందించారు. మేషరాశి నుంచి మీన రాశి వరకు12 రాశుల దిన ఫలాలు ఇక్కడ తెలుసుకోండి.
నేటి రాశి ఫలాలు (దిన ఫలాలు) 27.10.2024
వారం: ఆదివారం, తిథి : ఏకాదశి,
నక్షత్రం: మఖ, మాసం : అశ్వయుజము,
సంవత్సరం: శ్రీ క్రోధి నామ, ఆయనం: దక్షిణాయనం
మేషం
పనుల్లో ఆటంకాలు ఎదురవుతాయి. ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతారు. ఇంటాబయటా ఒత్తిడులు ఎదుర్కొంటారు. ఆత్మవిశ్వాసం, పట్టుదలతో ముందుకు సాగడం మంచిది. ఆరోగ్య సమస్యలు కాస్త చికాకు పరుస్తాయి. విద్యార్థుల యత్నాలు మందగిస్తాయి. వ్యాపారాలు సామాన్యంగానే ఉంటాయి. ఉద్యోగులకు అదనపు బాధ్యతలు. రాజకీయవర్గాలకు నిరుత్సాహం. శుభవార్తా శ్రవణం. ధనలాభం. గులాబీ, లేత ఎరుపు రంగులు, హనుమాన్ చాలీసా పఠించండి.
వృషభం
ఇంటాబయటా మీకు ఎదురుండదు. వివాహాది శుభకార్యాలకు హాజరవుతారు. రాబడి ఆశాజనకంగా ఉంటుంది. ఇతరుల మెప్పు పొందుతారు. కొన్ని నిర్ణయాలకు కుటుంబసభ్యుల ప్రశంసలు అందుతాయి. వస్తు, వాహన లాభాలు. వ్యాపారాలలో ముందడుగు వేస్తారు. ఉద్యోగులకు పదోన్నతులు దక్కే అవకాశం. కళాకారులకు పురస్కారాలు. వ్యయప్రయాసలు. దూర ప్రయాణాలు. ఎరుపు, తెలుపు రంగులు. శివాష్టకం పఠించండి.
మిథునం
ఆర్థిక పరిస్థితి కొంత వరకు అనుకూలిస్తుంది. చేపట్టిన కార్యక్రమాలు పూర్తి చేస్తారు. ప్రముఖులతో పరిచయాలు. చిన్ననాటి మిత్రులతో ఉత్తర ప్రత్యుత్తరాలు. రియల్ఎస్టేట్ వారికి లాభదాయకంగా ఉంటుంది. పోటీపరీక్షల్లో విజయం సాధిస్తారు. ఇంటిలో శుభకార్యాలు నిర్వహిస్తారు. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగులకు కొత్త ఆశలు. పారిశ్రామికవర్గాలకు నూతనోత్సాహం. వృథా ఖర్చులు. అనారోగ్యం. పసుపు, లేత నీలం రంగులు, గణేశాష్టకం పఠించండి.
కర్కాటకం
నేటి రాశి ఫలాల ప్రకారం కర్కాటక రాశి వారికి ఈరోజు ఒక ఆసక్తికర సమాచారం అందుతుంది. పనుల్లో విజయం. కుటుంబ సమస్యల నుండి ఊరట. విద్యార్థులకు అనుకూల ఫలితాలు. భూవివాదాల నుంచి బయటపడతారు. కోర్టు కేసులు కొన్ని పరిష్కారమవుతాయి. ఉద్యోగులకు ఉన్నతహోదాలు. వ్యాపారాలలో కొత్త పెట్టుబడులు అందుతాయి. పారిశ్రామికవర్గాలకు విదేశీ పర్యటనలు. వ్యయ ప్రయాసలు. గులాబీ, లేత పసుపు రంగులు, గణేశ స్తోత్రాలు పఠించండి.
సింహం
రాబడితో సమానంగా ఖర్చులు. పనులు నెమ్మదిగా పూర్తి చేస్తారు. విద్య, ఉద్యోగావకాశాలు దక్కుతాయి. వాహనాలు కొనుగోలు చేస్తారు. ఒక సంఘటన ఆకట్టుకుంటుంది. ఆస్తి వివాదాలు కొంతవరకూ తీరతాయి. వ్యాపారాలలో అనుకున్న లాభాలు అందుతాయి. ఉద్యోగులకు మంచి గుర్తింపు రాగలదు. పారిశ్రామిక వర్గాలకు విదేశీ పర్యటనలు. వృథా ఖర్చులు. ఆరోగ్య సమస్యలు, నీలం, నేరేడు రంగులు, సుబ్రహ్మణ్యేశ్వర స్తోత్రాలు పఠించండి.
కన్య
కుటుంబసభ్యులతో వివాదాలు నెలకొనే అవకాశం. పనులు కొంత నెమ్మదిగా పూర్తి చేస్తారు. ఆర్థిక వ్యవహారాలలో ఒడిదుడుకులు కాస్త తొలగుతాయి. విద్యార్థులు, నిరుద్యోగుల కృషి ఫలిస్తుంది. ఆశ్చర్యకరమైన విషయాలు తెలుస్తాయి. ఆరోగ్యంపై కొంత శ్రద్ధ చూపండి. వ్యాపారాలలో లాభనష్టాలు సమానంగా ఉంటాయి. ఉద్యోగులకు గుర్తింపు రాగలదు. కళాకారులకు శుభవార్తలు. మానసిక ఆందోళన. నీలం, ఆకుపచ్చ రంగులు, లక్ష్మీ స్తోత్రాలు పఠించండి.
తుల
అనుకున్న పనులు సజావుగా పూర్తి కాగలవు. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. ఎంతోకాలంగా ఉక్కిరిబిక్కిరి చేస్తున్న బాధ్యతల నుంచి విముక్తి. ఆర్థిక లావాదేవీలు సంతృప్తికరంగా ఉంటాయి. వాహన, గృహయోగాలు. వ్యాపారాలు లాభసాటిగా కొనసాగుతాయి. ఉద్యోగులకు సంతోషకరమైన సమాచారం. పారిశ్రామికవర్గాలకు ప్రభుత్వపరంగా సాయం అందుతుంది. వివాదాలు తలెత్తే అవకాశం ఉంది. ధనవ్యయం. పసుపు, ఆకుపచ్చ రంగులు, విష్ణు సహస్రనామ పారాయణ చేయండి.
వృశ్చికం
ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. పాతమిత్రులను కలుసుకుంటారు. ఆస్తి వివాదాలు తీరి ఊపిరి పీల్చుకుంటారు. సన్నిహితుల నుంచి సహాయం అందుతుంది. విద్యార్థుల యత్నాలు సఫలం. ఇంటి నిర్మాణయత్నాలు కార్యరూపం దాలుస్తాయి. వ్యాపార లావాదేవీలు ఆశాజనకంగా ఉంటాయి. ఉద్యోగులకు అనుకూల మార్పులు. రాజకీయ వర్గాలకు విదేశీ పర్యటనలు. అనుకోని ఖర్చులు. ఆకుపచ్చ, నేరేడు రంగులు, దేవీ స్తోత్రాలు పఠించండి.
ధనుస్సు
ఇంటాబయటా అనుకూల పరిస్థితి ఉంటుంది. సన్నిహితుల నుంచి అందిన సమాచారం ఉత్సాహాన్నిస్తుంది. ప్రముఖులతో పరిచయాలు. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. కోర్టు వ్యవహారాలలో విజయం సాధిస్తారు. ఆదాయం ఆశాజనకంగా ఉంటుంది. వ్యాపారాలలో పెట్టుబడులు సమకూరతాయి. ఉద్యోగులకు ఇంక్రిమెంట్లు రాగలవు. పారిశ్రామిక వర్గాలకు అరుదైన ఆహ్వానాలు రాగలవు. ధనవ్యయం. గులాబీ, లేత పసుపు రంగులు, మీనాక్షీస్తుతి మంచిది.
మకరం
కొన్ని ఇబ్బందులు ఎదురైనా పనులు సకాలంలో పూర్తి చేస్తారు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. కొన్ని వివాదాలు నేర్పుగా పరిష్కరించుకుంటారు. ప్రతిభకు తగిన గుర్తింపు. వాహనాలు, గృహం కొనుగోలు యత్నాలు కలసివస్తాయి. వ్యాపారాలు లాభాలబాటలో సాగుతాయి. ఉద్యోగులకు గతం నుంచి వేధిస్తున్న సమస్యలు తీరతాయి. వ్యయప్రయాసలు. ఎరుపు, నేరేడు రంగులు, హయగ్రీవస్తోత్రాలు పఠించండి.
కుంభం
ప్రముఖ వ్యక్తుల నుంచి ఆహ్వానాలు. వ్యవహారాలలో ఆటంకాలు తొలగుతాయి. విమర్శించిన వారే ప్రశంసిస్తారు. భూవివాదాలు కొలిక్కి వస్తాయి. ఆశ్చర్యకరమైన విషయాలు తెలుస్తాయి. తీర్థయాత్రలు చేస్తారు. అనుకున్న విధంగా ఆదాయం సమకూరుతుంది. వ్యాపారాలలో అభివృద్ధి. ఉద్యోగులకు పదోన్నతులు. కళాకారులకు ప్రయత్నాలు అనుకూలిస్తాయి. అనారోగ్యం. వృథా ఖర్చులు. నీలం, ఆకుపచ్చ రంగులు, దత్తాత్రేయ స్వామిని పూజించండి.
మీనం
నేటి రాశి ఫలాల ప్రకారం మీన రాశి వారికి ఆర్థిక వ్యవహారాలలో చిక్కులు తొలగుతాయి. ఆత్మీయుల నుంచి సహాయ సహకారాలు అందుతాయి. వివాహ, ఉద్యోగయత్నాలు కలసివస్తాయి. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. విద్యార్థుల ఆశలు ఫలిస్తాయి. వాహనయోగం. వ్యాపారాలలో ఆశించిన లాభాలు. ఉద్యోగులకు నూతనోత్సాహం. రాజకీయ వర్గాలకు పదవులు దగ్గరకు వస్తాయి. స్వల్ప అనారోగ్యం. దూర ప్రయాణాలు. పసుపు, నేరేడు రంగులు. గణేశాష్టకం పఠించండి.