అక్టోబర్ 20, నేటి రాశి ఫలాలు- అట్లతద్ది రోజు ఏ రాశి వారికి ఎలా గడుస్తుందంటే
Today rasi phalalu: నేటి రాశి ఫలాలు (దిన ఫలాలు) తేదీ20.10.2024 ఆదివారం కోసం పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ అందించారు. మేషరాశి నుంచి మీన రాశి వరకు12 రాశుల దిన ఫలాలు ఇక్కడ తెలుసుకోండి.
నేటి రాశి ఫలాలు (దిన ఫలాలు) 20.10.2024
వారం: ఆదివారం, తిథి : తదియ,
నక్షత్రం: కృతిక, మాసం : అశ్వయుజము,
సంవత్సరం: శ్రీ క్రోధి నామ, ఆయనం: దక్షిణాయనం
మేషం
గ్రహ సంచారాలు ఉపకరిస్తాయి. కొంతమంది వ్యాఖ్యలు నిరుత్సాహదాయకంగా ఉన్నా పట్టుదల చూపి గమ్యమును చేరగలుగుతారు. ఇంటిలో పండుగ వాతావరణం నెలకొంటుంది. ఖర్చులు ఊహించుకున్న దానికంటే ఎక్కువవుతాయి. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలలో ఉత్సాహంగా వ్యవహరించుకుంటారు. విదేశీ ప్రయాణాలు తలపెట్టుకున్నవారి ప్రయత్నములను గోప్యంగా చేపట్టుకోవాలి.
వృషభం
వాగ్విషయాల్లో జాగ్రత్తలు తప్పనిసరి చేస్తూ ప్రయత్నాలను ముమ్మరం చేసుకోవాలి. సంతాన వ్యవహారాల్లో పునరాలోచనలతో ముందుకు సాగాలి. పంతాలకు దూరంగా ఉండాలి. మంచిగా భావించినవి చెడుగా మారగలవు. ఆర్థిక, ఆరోగ్య విషయాలు సాధారణతలు కొనసాగుతాయి. ఇతరుల ఆంతరంగిక వ్యవహారాలకు దూరంగా, హుందాతనంగా వ్యవహరించుకోవాలి.
మిథునం
ఆలోచనలు బాగున్నా అమలు చేయుటలో కాలాతీతములు ఉంటాయి. సహకరించగల వారనుకున్నవారు దూరంగా ఉంటారు. ఆర్థికంగా బాగుండి, స్వల్ప అనారోగ్య భావనలుంటాయి. ఆధ్యాత్మికతలకు ప్రాధాన్యత నిచ్చుకోలేకపోతారు. నూతన వ్యక్తుల పరిచయాల్లో సందేహబుద్ధితో సాగండి. భూ, వాహనాది విషయాల్లో అదనపు ఏర్పడు సూచనలున్నాయి. విద్యార్థులకు ఏకాగ్రత అవసరం.
కర్కాటకం
గ్రహసంచారాలు మిశ్రమ స్థితులతో ఉన్నాయి. కార్య అనుకూలతలకై మౌనంగా వ్యవహరించుకుని పనులను పూర్తి చేసుకుంటారు. బంధు మిత్రులకు దూరంగా ఉంటూ ప్రశాంతతలకై యత్నించుకుంటారు. ఆరోగ్య పరంగా చిన్న చిన్న సమస్యలు ఎదుర్కోవచ్చును. రావలసిన మొత్తములలో కొన్ని చేతికందుతాయి. చిన్నతరహా పెట్టుబడులు ఉంచుగలరు. సంతానం నుండి శుభవార్తలు వింటారు.
సింహం
నేటి రాశి ఫలాల ప్రకారం సింహ రాశి వాళ్ళు అంతర్గతంగా వాదనలకు గురికాగల సూచనలు ఉన్నాయి. పట్టుదలతో సాగి కర్తవ్యాలకు అంకితమవుతారు. పని ఒత్తిడిచే తొందరపాటు తనములు ఉండకుండా జాగ్రత్తలు వహించుకోండి. కుటుంబ అవసరాలకై ఖర్చు లెక్కువ చేయవలసి వుంటుంది. ఆర్థిక ఆరోగ్యాలు పరవాలేనివిగా సాగుతాయి. వృత్తి, ఉపాధులకై చేయుయత్నాల్లో కదలికలు అంతంతమాత్రమైనా నిరాశలు ఏర్పరచుకోకుండా సాగాలి.
కన్య
మనో ధైర్యములు చూపుకోవాలి. ఖర్చులు కొన్ని వద్దనుకున్నా చేయవలసి రావచ్చును. విద్యార్థులకు, నిరుద్యోగులకు వ్యాసంగాల చేత, పోటీ పరీక్షలలో తృప్తి ఏర్పడగలదు. స్థిరాస్తులు, స్పెక్యులేషన్లు వంటి విషయములందు పెట్టుబడులు ఉంచగలరు. యంత్ర, వాహనాలు అమర్చుకోగలరు.
తుల
ఖర్చులు, ఆరోగ్యం చికాకునిచ్చేవైనా ఉత్సాహంగా వ్యవహరించుకుంటారు. కుటుంబవ్యక్తుల, సహాయకుల కోరికలు పెరుగుతాయి. ప్రయత్నకార్యాలను వేగవంతం చేస్తారు. ప్రభుత్వ తరహా పనులకై, అనుమతులకై చేపట్టుకున్న యత్నాలు పరిశీలన కొచ్చి అనుకూలతలు పొందుతారు. కొన్ని పనులు వాయిదా వేసుకున్నా సంతృప్తికరమైన స్థితులు ఉంటాయి. విద్యార్థులు వ్యాసంగాల పట్ల పట్టుదలలు చూపుకోవాలి.
వృశ్చికం
మిశ్రమంగా సాగుతుంది. వ్యక్తిగత విషయాలలో వృద్ధిని చూస్తారు. ఆరోగ్యం మధ్యమంగా సహకరించగలదు. ఊహించుకున్న వ్యక్తులతో పరిచయాలు ప్రయత్నాలు ముందుకు సాగుతాయి. ఆధ్యాత్మికతలకు ఎక్కువ సమయం కేటాయిస్తారు. ఖర్చులు పెరుగుతున్న ఆదాయాల్ని అదే తీరులో ఉంచుకోగలరు. కుటుంబవ్యక్తుల తోడుచే ముఖ్యమైన పనులను పూర్తిచేసుకుంటారు.
ధనుస్సు
లక్ష్యములు నెరవేర్చుకునేందుకు పట్టుదల చూపుతారు. కృషికి తగిన ప్రయోజనాలు పొందుతారు. ఖర్చుల్ని నియంత్రించుకోగల్గుతారు. ఆరోగ్య, ఆర్థిక విషయాలు బాగుంటాయి. కుటుంబ వ్యక్తులచే సహకారాలు ఏర్పరచు ధనుస్సు కోగలరు. వద్దనుకున్న ఎగ్రిమెంట్లను చేసుకోవలసిరావచ్చును. నిరుద్యోగులకు, ఉద్యోగులకు మంచి అవకాశాలు వస్తాయి. పెట్టుబడులందు ఆలోచనలకు ప్రాధాన్యతనిచ్చుకోవాలి.
మకరం
నేటి రాశి ఫలాల ప్రకారం మకర రాశి వారికి ఆదాయ వ్యయాలు సంతృప్తికరం. కొందరికి స్వస్థాన ప్రాప్తి స్వస్థాన దర్శనాలుంటాయి. ప్రణాళికాబద్ధంగా పనులను పూర్తి చేసుకో గలుగుతారు. పలుకుబడిని ఉపయోగించి పనులను పూర్తి చేసుకోంటారు. గృహప్రవేశ ఆరంభములకై ప్రయత్నాల్ని ముమ్మరం చేయగలరు. కొందరికి పదవీ యోగములు, బాధ్యతల పెంపు ఉంటాయి. వివాహ, ఉద్యోగ కోరికలు తీరుతాయి.
కుంభం
చిన్న ఏదైనా పెద్ద ప్రయత్నంతో చేయవలసి ఉంటుంది. ఆరోగ్యపరంగా జాగ్రత్తలు అవసరం. ఆహారపు అలవాట్లచే చికాకుపరుస్తాయి. కమీషన్ వ్యాపారులకు లాభాలు ఉంటాయి. కోర్టు వాయిదాలు వాయిదా వేసుకోండి. సంతాన వ్యవహారాలకై ఖర్చులు ఎక్కువ చేయవలసి రావచ్చును. కుటుంబ వ్యవహారాలందు సంతృప్తిని పొందగలరు. వీరికి గురు, ఆది, సోమ వారములు అనువైనవి. ఆదిత్య ఆరాధన ఉపకరిస్తుంది.
మీనం
వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో పట్టుదల, మౌనం చూపి వ్యవహరించుకోవాలి. ఊహించని వ్యక్తులచే ప్రయోజనాలు పొందుతారు. తల్లిదండ్రుల ఆరోగ్యంపై శ్రద్ధ వహించవలసి రావచ్చును. రావనుకున్న అవకాశాలు వచ్చి ఉత్సాహాన్ని ఇస్తాయి. నూతన యంత్ర పరికరములు వంటివి కొనుగోలు చేసుకుంటారు.
అందించిన వారు: అధ్యాత్మికవేత్త పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ